>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..


   నీ మాట నా పాటగా - అనుక్షణం పాడనీ
    లోకాన నిను చాటగా - నా స్వరం వాడనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    
    1. ఏ చోట గళమెత్తినా - నీ ప్రేమ ధ్వనియించనీ
    పాడేటి ప్రతి పాటలో - నీ రూపు కనిపించనీ = 2
    వినిపించుచున్నప్పుడే - ఉద్రేకమును రేపక
    స్థిరమైన ఉజ్జీవము - లోలోన రగిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
     
    2. నీ దివ్య గానామృతం - జలధారలుగా పొంగనీ
    తాకేటి ప్రతి వారినీ - ఫలవంతముగా మార్చనీ = 2
    శృతిలయలు లోపించక - విసిగింపు కలిగించక
    నిజమైన ఉల్లాసమై - నిలువెల్లా కదిలించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..
    
    3. ఆత్మీయ గీతాలతో - తనువంతా పులకించనీ
    సంగీతమే భోధయై - కనువిప్పు కలిగించనీ = 2
    కాలక్షేపం కోసమే - పరిమితము కాకుండగా
    హృదయాల్లో నివసించుచూ - కార్యాలు జరిగించనీ
    నా గీతం.. ఆత్మలను - నీవైపే ఆకర్షించనీ
    ఆదరణ.. కలిగించి - నీలోనే ప్రహర్షించనీ..

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels