>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
Showing posts with label e message. Show all posts
Showing posts with label e message. Show all posts

అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా??
మరి మందిరంలో ప్రవేశించి సామగ్రి అంతా  సైన్యం పట్టుకు పోయినప్పుడు అక్కడ ఎవరూ చనిపోలేదు ఎందుకు??

 *🎯యెహేజ్కేలు 10:4* యెహోవా మహిమ కెరూబులపైనుండి *ఆరోహణమై మందిరపు గడపదగ్గర దిగి నిలిచెను మరియు మందిరము మేఘముతో నిండెను, ఆవరణమును యెహోవా తేజో మహిమతో నిండిన దాయెను.*

*🎯యెహేజ్కేలు 10:5 దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమువరకు వినబడెను.*

*🎯యెహేజ్కేలు 10:13 నేను వినుచుండగా తిరుగుడని చక్రములకు ఆజ్ఞ యియ్యబడెను.*

*🎯యెహేజ్కేలు 10:14*
కెరూబులలో ఒక్కొకదానికి నాలుగు ముఖము లుండెను; *మొదటిది కెరూబుముఖము*, రెండవది మానవముఖము, మూడవది సింహముఖము, నాల్గవది పక్షిరాజు ముఖము.

💁‍♀️👆🏻 *ఈ నాలుగు ముఖాల్లో ఒక ముఖం  ఎద్దు*
                             *ముఖం కదా??*

  💁‍♀️ *కానీ 10:14 లో ఎద్దు స్థానం లో కెరూబు*
                    *వచ్చి చేరింది ఎందుకో* 🤔

*🎯యెహేజ్కేలు 10:15 ఈ కెరూబులు పైకెక్కెను. కెబారు నది దగ్గర నాకు కనబడిన జంతువు ఇదే*.

💁‍♀️ 👆🏻 *అంటే యెహేజ్కేలు మొదట్లో చూసిన*
       *దర్శనంలో వున్న జంతువు ఇదే అన్న మాట.*

*🎯యెహేజ్కేలు 1:10*
ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. *యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి.* నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.

💁‍♀️ *మరి ఒక ముఖము మారిపోయింది ఎందుకో??*

*🎯యెహేజ్కేలు 10:18*
*యెహోవా మహిమ  మందిరపు గడపదగ్గరనుండి బయలుదేరి కెరూబులకు పైతట్టున నిలువగా*

*🎯యెహేజ్కేలు 10:19*
*కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని  మహిమ వాటికిపైగా నిలిచెను.*

          *👆🏻దేవుని మహిమ వెళ్ళిపోయింది*

*🎯యెహేజ్కేలు 10:20  కెబారు నదిదగ్గర ఇశ్రాయేలు దేవుని క్రింద నాకు కనబడిన జీవి ఇదే; అవి కెరూబులని నేను గుర్తుపట్టితిని.*

                     *కానీ కొద్దిమార్పు వుంది*

*🎯యెహేజ్కేలు 10:22*
*మరియు వాటి ముఖరూపములు కెబారు నదిదగ్గర నాకు కనబడిన ముఖరూపములవలె ఉండెను; అవియు వాటి రూపములును అదేవిధముగా ఉండెను; ఇవియన్నియు ఆయా ముఖములవైపుగా జరుగుచుండెను.*

                🎯 *ఎద్దు దేనికి సారూప్యం??*

💁‍♀️ *దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల అలాంటి సేవా*
       *భావం వున్న మనసును తీసి వేసుకున్నాడు.*

                        *ఎందుకు ⁉️⁉️*

💁‍♀️ *వారు దేవుని పట్ల నమ్మకంగా లేరు. దేవునిచే*
         *ప్రత్యేకింపబడిన వారు విగ్రహారాధన అనే*
                     *వ్యభిచారంలో పడిపోయారు.*

            🎯 *తెగే వరకు లాగితే మరి అంతే.*
               *ఎంత చెప్పినా విననొల్లని జనం*

💁‍♀️ *కాబట్టి ఆ ముఖాలలో యెద్దు ముఖం లేదు.  ముఖ స్థానాలలో కూడా మార్పులు జరిగాయి. కేరూబు ముఖం వచ్చి చేరింది. దేవుని మహిమ*
                  *మందిరంనుండి వెళ్లి పోయింది.*

💁‍♀️ *అతి పరిశుద్ధ స్థలంలో కి పాప ప్రాయశ్చిత్తం చేయకుండా వెళ్తే, యాజకుడైన సరే చనిపోతాడు కదా?? మందిరంలో ఉన్నటువంటి సామగ్రి అంతా కూడా  సైన్యం పట్టుకు పోయినప్పుడు అక్కడ*
                 *ఎవరూ చనిపోలేదు ఎందుకు??*
    
             *🎯దేవుడు అక్కడ లేడు కాబట్టి.*   
               *ఆయన వెళ్ళిపోయాడు కదా.*
             *ఆయన సన్నిధి మరి అక్కడ లేదు*

              👉 *మరి మన సంగతి ఏమిటి??*

                        *🎯నీ దేహమనే*   
           *దేవాలయంలో దేవుడు ఉన్నాడా?? .*

🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔

💁‍♀️ *ఆచార క్రైస్తవునిగా, వేషధారిగా వున్నావేమో*
                    *నిన్ను నువ్వు పరీక్షించుకో.*

                      🙏 *దేవునికి స్తోత్రం* 🙏

 

 

o
Share/Bookmark

ఎవరు ధన్యులు ..... ?

Posted by Veeranna Devarasetti Saturday, August 20, 2022 0 comments

 


💥ప్రియ సహోదరి సహోదరుడా....

📖 *పరిశుద్ధ గ్రంధంలో ధన్యుడు అని ఎక్కడెక్కడ ఉందో సంక్షిప్త సమాహారం మీకోసం.*

👉యోబు 5:17
దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు.

👉కీర్తన 1:2 
దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.

👉కీర్తన 2:2
ఆయనను *ఆశ్రయించు వారందరు ధన్యులు*.

👉కీర్తన 32:1
పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.

👉కీర్తన 33:12
ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు.

▪కీర్తన 34:8
ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు.

▪కీర్తన 40:4
యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు.

▪కీర్తన 41:1
బీదలను కటాక్షించు వాడు ధన్యుడు.

▪కీర్తన 72:17 
అతడు ధన్యుడని చెప్పుకొందురు.

▪కీర్తన 84:4
నీ మందిర మందు నివసించు వారు ధన్యులు.

⏺ కీర్తన 84:5
నీవలన బలము నొందు మనుష్యులు ధన్యులు.

⏺కీర్తన 89:15
శృంగ ధ్వనుల నెరుగు జనులు ధన్యులు.

⏺కీర్తన 94:12
నీ ధర్మశాస్త్రమును బట్టి భోదించువాడు ధన్యుడు.

⏺కీర్తన 106:3
నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.

⏺కీర్తన 112:1
ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించు వాడు ధన్యుడు.

👁‍🗨కీర్తన 119:1
*ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగ నడుచుకొనువారు ధన్యులు.*

👁‍🗨కీర్తన 127:5
తన అంబులపొదిని నింపుకొనువాడు ధన్యుడు.

👁‍🗨కీర్తన 128:1
ఆయన త్రోవలయందు నడుచు కొనువారు ధన్యులు.

👁‍🗨కీర్తన 128:2
నీవు ధన్యుడవు.

👁‍🗨కీర్తన 144:15
ఇట్టి స్థితి గలవారు ధన్యులు.

▶కీర్తన 146:5
*యెహోవా మీద ఆశపెట్టు కొనువాడు ధన్యుడు.*

▶సామెతలు 3:18
దాని పట్టుకొనువారందరు ధన్యులు.

▶సామెతలు 8:32
నా మార్గములను అనుసరించువారందరు ధన్యులు.

▶సామెతలు 8:34
నా ఉపదేశము వినువారు ధన్యులు.

▶సామెతలు 20:7
నీతిమంతుని పిల్లలు....ధన్యులగుదురు.

▶సామెతలు 28:18
ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు.

❇యెషయా 30:18
ఆయన నిమిత్తము కనిపెట్టుకొంవారందరు ధన్యులు.

❇యెషయా 32:20
మీరు ధన్యులు.

❇యెషయా 52:2
కీడు చేయకుండా తన చేతిని బిగబట్టు వాడు ధన్యుడు.

❇యిర్మీయా 17:7
యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు.

దానియేలు 12:12
ధన్యుడు.

❇మలాకీ 3:12
మిమ్మును ధన్యులందురు.

💎మత్తయి సువార్త 5:3,4,5,6,7,8,9,10,11

3.ఆత్మవిషయమై దీనులైనవారు ధన్యులు.
4.దుఃఖపడువారు ధన్యులు.
5.సాత్వికులు ధన్యులు.
6.నీతికొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు.
7.కనికరముగలవారు ధన్యులు.
8.హృదయశుద్ధిగలవారు ధన్యులు.
9.సమాధానపరచువారు ధన్యులు.
10.నీతినిమిత్తము హింసింపబడువారు ధన్యులు.
11.నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీమీద అబద్ధముగా చెడ్డమాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు. 

🔥మత్తయి 11:6
నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు.

మత్తయి 16:17
నీవు ధన్యుడవు.

మత్తయి 24:46
ఆ దాసుడు ధన్యుడు.

🔥లూకా 7:23
నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు.

లూకా 11:28
దేవుని వాక్యము విని దానిని గైకొనువారు ధన్యులు.

లూకా 12:43
ఆ దాసుడు ధన్యుడు.

లూకా 14:14
నీవు ధన్యుడవగుదువు.

🔥లూకా 14:15
దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు.

📍యోహాను 13:17
వీటిని చేసిన యెడల మీరు ధన్యులగుదురు.

యోహాను 20:29
చూడక నమ్మిన వారు ధన్యులు.

🎚రోమా 4:6
*దేవుడు ఎవనిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు.*

🎚రోమా 4:8
ప్రభువు చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.

రోమా 14:22
సమ్మతించిన విషయములో ... తీర్పు తీర్చుకొను వాడు ధన్యుడు.

🛐యాకోబు 1:12
*శోధన సహించు వాడు ధన్యుడు.*

యాకోబు 5:11
సహించిన వారు ధన్యులు.

✝1పేతురు 3:14
*నీతి నిమిత్తము శ్రమ పడువారు ధన్యులు.*

🤝 ప్రకటన 1:3
వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు.

ప్రకటన 14:13
ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు.

▪ప్రకటన 16:16
తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు.

ప్రకటన 20:6
మొదటి పునరుద్దనములో పాలుగలవారు ధన్యులు.

👉 ప్రకటన 22:7
ఈ గ్రంధములోని ప్రవచన వాక్యములను గైకోను వాడు ధన్యుడు.
*ఆమేన్! ఆమేన్! ఆమేన్!!*
o
Share/Bookmark

 

✝️ *దేహమే దేవుని ఆలయం*💒



_(1కొరి 6:19  మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని  మీరెరుగరా?)_
✳️ *ఉపోద్ఘాతము:* దేవుని ఆరాధనకు, స్తుతికి నీ శరీరం అనే ఆలయం ప్రత్యేకించ బడింది. ఒక విశ్వాసికి తన శరీరం తన స్వంతమైనట్టు దాన్ని ఉపయోగించే హక్కు లేదు. క్రీస్తులో విశ్వాసులకున్న స్వేచ్ఛకు ఇది స్పష్టమైన నిర్బంధం. తమలో నివసించే దేవుని ఆత్మకు ఆనందం, ఘనత కలిగించే పనులే వారు చెయ్యాలి. (1 కొరి 3:16  మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరెరుగరా?)
 దీని గురించి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం.
✳️ *1. నీ దేహమే దేవుడు సంచరించు దేవాలయం:*  (1కొరి 6:19  మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని  మీరెరుగరా?)
నీ శరీరం దేవాలయం అయినప్పుడు అది నీకు చెందినది కాదు గదా! అది దేవునికి చెందుతుంది. కొన్ని కోట్ల రూపాయలతో మందిరాలు కట్టినా, దేవుడు వాటిలో నివసించుటకు ఇష్టపడడం లేదుగాని మన శరీరంలో మన హృదయంలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఇదే సత్యాన్ని సోలోమోను మహారాజు గ్రహించాడు. ఎంతో ఖరీదైన మందిరం సోలోమోను కట్టించినా అది దేవుని పట్టజాలవని గ్రహించాడు. (2దిన 6:18  మనుష్యులతో కలిసి దేవుడు భూమియందు నివాసము చేయునా? ఆకాశ మును మహాకాశమును నిన్ను పట్టచాలవే; నేను కట్టిన యీ మందిరము నిన్ను పట్టునా?)
అటువంటి మహోన్నతుడైన దేవుడు నివసించుటకు సరిగ్గా సరిపోయే సరైన దేవాలయం మన శరీరమే. హల్లెలూయా!
దేవుని ఆత్మ నివసించు నీ శరీరమనే ఆలయాన్ని నీవు పాడు చేస్తే, దేవుడు సహించగలడా? (1కొరి 3:17  ఎవడైనను దేవుని ఆలయమును పాడుచేసిన యెడల దేవుడు వానిని పాడుచేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై యున్నది; మీరు ఆ ఆలయమై యున్నారు.)
దేవునికి ఆలయమైన మన శరీరాన్ని మనం పాడు చేస్తే, దేవుని ఉగ్రత మన మీదకు ఖచ్చితంగా రాగలదు. దేవుడు కోరుకునేది పవిత్రమైన ఆలయాన్ని. అది మందిరమైనా లేదా మన శరీరమనే ఆలయమైనా.
నీ ఇంటికి ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి వస్తే నీ ఇంటిని నీవు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటావు. మరి అటువంటిది పరిశుద్ధాత్మ దేవుడే నీ శరీరంలో నివసించడానికి వచ్చినప్పుడు మరి ఇంకెంత జాగ్రత్తగా మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచాలో ఆలోచించండి.
✳️ *2. నీ ఆలయంలో సరైన ఆరాధన జరిగితే నీవు ఆత్మచేత బలపరచ బడగలవు:*  ఎవరి శరీరంమనే ఆలయంలో సరైన ఆరాధన జరుగుచున్నదో అప్పుడు వారికి పరిశుద్దాత్మునికి చక్కటి అవినాభావసంబంధం ఉండగలదు. అప్పుడు ఆత్మవలన మీరు బలపరచబడగలరు. (ఎఫేస్సి 3:15 మీరు అంతరంగ పురుషునియందు శక్తికలిగి ఆయన ఆత్మ వలన *బలపరచబడునట్లుగాను.*)
✳️ *3. నీ శరీరమనే ఆలయంలో సరైన ఆరాధన జరిగితే దేవుని ఆత్మనిన్ను జీవింపజేయును:* ఒక విశ్వాసి శరీరం అతని ఆత్మ జీవించే ఇల్లు మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నివసించు స్థలం.
ఆత్మ దేవుని ముందు మనలను మనము వెల్లడి చేసుకునే అతి ప్రాముఖ్యమైన సాధనం మన శరీరం. ఆవిధంగా మనం శరీరం దేవునికి ఆలయంగా ఉండినప్పుడు మన శరీరం చివరికి మరణం నుంచి *సజీవంగా* లేచి క్రీస్తు దేహం లాగా దివ్య శరీరం అవుతుంది (ఫిలిప్పీ 3:21సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.) లేకపోతే అగ్ని ఆరదు శరీరం చావదు.
✳️ *4. నీ శరీరమనే ఆలయంలో సరైన ఆరాధన జరిగినప్పుడే నీవు దేవుని దత్తపుత్రుడవు కాగలవు:* క్రైస్తవుని జీవితంలో ఆత్మ ఉనికి యొక్క విశిష్టత ఏమిటంటే, నీ హృదయంలో ఆయనకు ఆరాధన సరిగా జరగాలని దేవుడే యేసు యొక్క ఆత్మను మనం హృదయంలోనికి పంపెను.
(గల 4:5-7  మనము దత్త పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను మరియు మీరు కుమారులై యున్నందున నాయనా తండ్రీ, అని మొఱ్ఱపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయముల లోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవే. కుమారుడవైతే దేవునిద్వారా వారసుడవు.)
✳️ *5. దేవునికి సమర్పించబడిన శరీరమనే ఆలయంలో ప్రార్ధన ఖచితంగా జరగాలి:* మరి నీ శరీరమనే ఆలయంలో ప్రార్ధన జరుగుచున్నదా? దేవుని మందిరానికి మరియొక పేరు ప్రార్ధనా మందిరం. ఆలయంలో ప్రార్ధన జరగనప్పుడు అది దేవునికి మందిరం ఎలా అవుతుంది?  (మత్తయి 21:13  నా మందిరము ప్రార్థన మందిరమనబడును అని వ్రాయబడియున్నది)
చాలా విచారించదగిన విషయమేమంటే, చాలామంది శరీరమనే ఆలయాలలో ప్రార్ధన అనేది అసలు జరగడమే లేదు. ఏ ఆలయంలో అయితే ప్రార్ధన జరుగుతుందో దేవుని దృష్టి రాత్రిం బగళ్లు ఆ ఆలయంపై ఉండగలదు. (2దిన 6:19-20 దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి, నీ సేవకుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొఱ్ఱను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకైనా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న యీ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రిం బగళ్లు నిలుచునుగాక.)

 

మరి నీ శరీరం అనే ఆలయంలో ప్రార్ధన జరుగుచున్నదా? దేవుని కృప సమృధ్ధిగ నీకు లభించాలంటే నీ శరీరంమనే ఆలయంలో ప్రార్ధన ఖచ్చితంగా జరుగవలసి యున్నది.
✳ *6. నీ ఆలయాన్ని దొంగల గుహాగా చేయు శరీర కార్యాలు:* చాలామంది శరీరమనే ఆలయంలో దేవునికి ఆరాధన జరుగ కుండా ఈ సాతాను ఆరాధన జరుగు చున్నది.
శరీర కార్యాలవలన ఆలయం పాడగుచున్నది. శరీర కార్యాలు ఏమిటో గల 5:19-21లో స్పష్టంగా వ్రాయబడి యున్నవి. (కొలస్సి 3:5 కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపి వేయుడి. 8 ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.)
శరీర స్వభావం గలవారుగా ఉండకుండా ఆత్మ స్వభావం గలవారుగా ఉన్నపుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సంతొషించగలడు.
(రోమా 8:8 కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. 9 దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు.)
శరీరం లైంగిక అవినీతికోసం కాదు గాని ప్రభువుకోసమే. ప్రభువు శరీరం కోసం. కొందరైతే భయంకరమైన జారత్వంతో తమ శరీరాలను అపవిత్రం చేస్తున్నారు.
అదేమంటే మన కడుపుకు ఇష్టమైనది మనం స్వేచ్చగా ఎలాగు తింటున్నామో అలానే మన శరీరానికి ఇష్టమైన లైంగిక పాపం కూడా చేయడానికి స్వేఛ్చ ఉందని కొరింతి సంఘస్తులు ఎలాగు పొరపాటుపడి శరీరమనే ఆలయాన్ని నాశనం చేసుకున్నట్లే ఈ దినాలలో అనేకులు ఇలాగు ఉంటున్నారు.
✳ *7. శరీరమనే దేవాలయాన్ని పాడు చేసే ఇతర విషయాలు అందం మీద శ్రద్ధ, ధనాశ, ఈ లోక సుఖాలు మొదలగునవి:* ఇవన్ని కూడా మన శరీరంలో నిజమైన ఆరాధన జరుగకుండా మనలను తప్పిస్తాయి. మన శరీరంలో దేవునికి నిజమైన సేవ జరుగకుండా అడ్డుకుంటాయి. మరియు మన శరీరంలో ఉన్న దేవునికి సేవచేసే సామర్ధ్యాన్ని అడ్డుకుంటాయి. అటువంటి వారి ఆలయంలో సేవ అణిచి వేయబడుతుంది.
(లూకా 8:14 ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచినకొలది యీ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగములచేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు.)
పైకి మాత్రం ఆధ్యాత్మిక విషయాల గురించి వారెంతగా మాట్లాడినప్పటికీ కూడా వారి ఆశలు వాటిపై లేవు. గతించిపోతున్న లౌకిక విషయాల మీదే ఉన్నాయి (1 యోహాను 2:16 లోకములో ఉన్నదంతయు, అనగా శరీ రాశయు నేత్రాశయు జీవపుడంబమును తండ్రివలన పుట్టినవి కావు; అవి లోకసంబంధమైనవే).
డబ్బు, ఆస్తి, ప్రతిష్ఠ, పేరు ప్రఖ్యాతులు, శరీరాశలను తృప్తిపరచుకోవడం వీటిమీదే వారికి అభిలాష, ప్రీతి నాశనానికి విశాల మార్గం ఇదే.
✳ *ముగింపు* కొంతమంది దేవునికి దేవాలయంగా ఉన్న శరీరంలో దేవునికి బదులుగా కడుపును ఆరాధించు వారిగా ఉన్నారు. కారణం వారి కడుపే వారికి దేవుడు. తమ కడుపు నిండడమే వారికి కావలసింది, తమ అంతరంగం పరిశుద్దాత్మతో నిండి ఉండడం కాదు. (ఫిలిప్పి 3:19 నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడు చున్నారు, భూసంబంధమైన వాటియందే మనస్సు నుంచుచున్నారు.)
ప్రియదేవుని బిడ్డలారా! మన శరీరమనే దేవాలయాలు యేసు నివసించే పరిశుద్దమైన ప్రదేశంగా ఉండి దేవునికి మహిమను ఘనతను తీసుకొని వచ్చు విధంగా చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమృద్ధిగా సహాయం చేయును గాక! ఆమెన్
దైవాశ్శీసులు.

 https://t.me/telugubible

 

 

 

o
Share/Bookmark

ప్రభు బల్ల

Posted by Veeranna Devarasetti Sunday, June 5, 2022 0 comments

 

 


 *....ప్రభు బల్ల.....*

👉 *1. ప్రభు బల్ల అంటే ఏంటి?*
👉 *2.ఎందుకు తీసుకోవాలి?*
👉 *3. దేనికోసం తీసుకోకూడదు?*

అనే ఈ మూడు అంశాలు ధ్యానిద్దాము.

👉 మనకు చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది శనివారం తీసుకుంటారు. కొంతమంది మొదటి ఆదివారము & చివరి ఆదివారము తీసుకుంటారు.
*1కోరింథీయులకు 11: 23 - 32*

*నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి దానిని విరిచియిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను.  ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.*


*ప్రభు బల్ల అంటే ఏమిటి?*


*యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను - పస్కాపశువును వధించి, హిస్సోపు కుంచె తీసుకొని, రక్తములో ముంచి, ద్వార బంధపు పైకమ్మికిని, రెండు నిలువ కమ్మిలకు ఆ రక్తము రాయవలెను. ఐగుప్తీయులను సంహరించుటకు వచ్చినపుడు ఈ రక్తము చూసి సంహరకుడు లోపలికి రాడు. దీనిని కట్టడగా ఆచరించవలెను*
 (నిర్గమ 12:21-25).

*పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా, యేసు పేతురును, యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను*
(లూకా 22:7-8).

👉ఆ రోజు దేవుడు పస్కా బలికి సాదృశ్యముగా,
*బలి పశువుకి సరూప్యముగా రొట్టెను,*
 
*బలి పశువు రక్తానికి సరూప్యముగా ద్రాక్షరసాన్ని ఇచ్చెను*
 (లూకా 22:17-20).
👉ఇకనుంచి ఆ రొట్టెను యేసు శరీరమునకు సాదృశ్యముగా,
👉 దరాక్షరసాన్ని యేసు రక్తానికి సారూప్యముముగా మనము తీసుకుంటున్నాము.
*ఈ ప్రక్రియనే ప్రభుబల్ల అంటాము.*
*ఎందుకు ప్రభుబల్ల తీసుకోవాలి?*

 *మనము దీవుంచు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట,  క్రీస్తు_రక్తములోనిది త్రాగుటయే గదా?* (1కోరింథి10:16).

*ప్రభుబల్లలో పాలు పొందునపుడు అయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోనుచున్నాము.*
(1కోరింథి 11:24)

👉ఈ కార్యము ఆది సంఘం దినదినము,
ప్రతి ఇంట కుడుకొనుచు ఆచరించేవారు. (అపో. 2:42)

👉దనిని ప్రభువువచ్చు వరకు ఆచరించెదము.
(1కోరింథి 11:26)
👉 అయన మరణము ప్రచురించు చున్నాము.
(1కోరింథి 10:16-17)

👉 దనిలో పాలు పొందునపుడెల్ల మనలను మనము పరీక్షించుకుంటాము. (1కోరింథి11:28)
 

*ప్రభుబల్ల దేనికోసం తీసుకోకూడదు?*

 *పాపాలు క్షమింపబడుటకు కాదు.*

👉పపాలు కేవలం మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందితేనే పాపాలు క్షమింపబడతాయి.

*శరీర ఆరోగ్యంకోసం కాదు.*

👉పరభుబల్ల వలన శరీర ఆరోగ్యము రాదు, నిత్య జీవము కలుగును.
(యోహాను 6:53-59)

*ఇది దేవుని శరీరం రక్తం అని కాకుండా అయోగ్యముగా స్వీకరిస్తే బలహీనులము రోగులము అవుతాము*
 (1కోరింథి 11:30)

👉తలియక కొందరు రక్షణ, ఆశీర్వాదము,
👉రగ విముక్తి కొరకు,
👉 సమస్యల పరిష్కారము కొరకు,
👉ఫలహారం కొరకు ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు.
 *అలా కాకుండా నిర్దోషమైన చేతులతో ప్రభు బల్లలో పాలు పంచుకుందము.*

 *అయోగ్యులముగా కాక ప్రభుబల్లకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని, యోగ్యులగా  ప్రభుబల్ల_సమీపిద్దాము.*

👉 అప్పుడే నిత్యజీవ పాత్రులము అవుతాము. అటువంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*

👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*


👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*

 

o
Share/Bookmark

✍️ *మట్టల ఆదివారం ప్రత్యేక అంశం: విమోచన* ✍️





👉       "మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. (మత్తయి 21:2-3)"

👉 ఈ వచనములో గొప్ప విషయాలు దాగివున్నవి.
ఒలివ కొండ యెరూషలేము నకు తూర్పువైపున ఉంది. ఆ కొండ పైనుంచి దిగువన ఉన్న నగరాన్ని చూడవచ్చు. అక్కడ నుండి వేరే చోట ఏం జరుగుతున్నదో తెలుసుకో గలిగిన శక్తి క్రీస్తు నకు ఉంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ( జెకర్యా 9:9). రాజు తన రాజ నగరంలోకి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇది అహంభావం లేని సాధుశీలికి తగిన నగర ప్రవేశం (11:29). “సీయోను కుమారి” అంటే జెరుసలం. యేసు తన ఇద్దరి శిష్యులను ఆ గ్రామమునకు పంపాడు.  ఏమేం జరుగుతున్నదో తెలిసి, ఏం చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజును సేవించే అవకాశం, అధిక్యత క్రైస్తవులది. వారు చేయవలసినదల్లా విధేయత చూపడమే.

👉         ఇక్కడ శిష్యులు విధేయత చూపించారు, గాడిద యజమాని, గాడిద ఇలా అందరూ విధేయత చూపించుట మనం చూడగలం. శిష్యులు ఆ గ్రామమములోకి వెళ్లి కట్టబడిన గాడిద కట్లు విప్పి యేసు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అందరూ తమ పై వస్త్రాలు పరిచి యేసుని గాడిద మీద ఎక్కించి, 2 రాజులు 9:13 లో చూపిన సాదృశ్యము వలె
" వెంటనే వాళ్ళంతా వాళ్ళ పైవస్త్రాలను తీసి యెహూక్రింద మెట్లమీద పరిచారు. వాళ్ళు పొట్టేలు కొమ్ము బూర• ఊది “యెహూ రాజయ్యాడు” అని ప్రకటించారు." ( 2 రాజులు 9:13) యేసుని గాడిద మీద ఎక్కించి, చెట్ల కొమ్మలు నరికి, తమ వస్త్రాలు రోడ్ల మీద పరిచి, ఆ నగరం అంతా తిప్పుతూ దావీదు రాజుకు జయము అని స్తుతించారు.  
“జయం”– ఇది హీబ్రూ పదం “హోసన్నా” నుంచి తర్జుమా చేయబడింది. పూర్వం దీనికి అర్థం “రక్షించు” అని చేసే ప్రార్థన. కాలక్రమేణ అది సంస్తుతులను వెల్లడి చేసే మాట అయింది. ఇది రక్షించగలిగినవాడు ఇక్కడే ఉన్నాడని సూచిస్తూ ఆయన్ను స్తుతించే పదం.  కొందరు యేసును అభిషిక్తుడుగా, దేవుడు నియమించిన రాజుగా అంగీకరించేందుకు సిద్ధమయ్యారు.

👉  ఈ మట్టల ఆదివారం సందేశం ద్వార మనం విమోచన / విడుదల అనే అంశాన్ని ధ్యానించాలి

👉   గడిద తన కట్లు విప్పబడుట వలన యేసునే తన మీద ఎక్కించుకొని మోసే ఘనత పొందింది. యెరూషలేమునకు దూరముగా కట్టబడిన గాడిద విప్పబడిన తరువాతే దేవుని మోసుకొని పోయింది, ఘనత పొందింది. విప్పబడక పోతే స్వాతంత్ర్యము లేదు, విమోచన లేదు.

♻️  *● విమోచన గూర్చి ఇంకొన్ని బైబిల్ సత్యాలు ●*

👉 *◆  మనకు మరణము నుండి విడుదల అవసరం:*
                ఎఫెసీయులకు 2:1 లో "మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను." ఆజ్ఞను మీరి పాపం చేసిన సంతానము మనం. మరణమే మన పితరులు మనకిచ్చిన స్వాస్థ్యము. దానినే మనం అనుభవిస్తున్నాము. కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు మరణము జయించి తిరిగి లేచి మరణము నుండి మనలను విడిపించి మనలను తిరిగి జీవింప చేసెను.

👉  *◆  మరణ బలము గలవాని నుండి విడుదల అవసరం:*
              హెబ్రీయులకు 2:14,15 లో "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను." ఈ లోక అధికారులు మన ప్రభువైన యేసును ఘోరమైన సిలువ వేసి చంపియున్నాము అని సంతోషించిరి. సమాధికి ముద్ర వేసి కావలి ఉంచారు. కానీ మరణపు ముళ్ళు విరిచి వేయగల సమర్ధుడు అని అంచనా వేయలేకపోయిరి. మొదటి కొరింథీయులకు 2:8 లో "అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు."

👉 *◆  దర్మసంబంధమైన శాపము నుండి విడుదల అవసరం:*
               గలతీయులకు 4:4,5 లో "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను." ధర్మశాస్త్రం పాపము గూర్చి భోధించింది కాని పాపము తీయలేకపోయింది. మన ప్రభువైన యేసు సిలువలో బలియాగము ద్వార శాపము నుండి విడుదల చేసి ధర్మశాస్త్రం నెరవేర్చాడు.

👉 *◆  దుర్నీతి నుండి విడుదల అవసరం:*
           తీతుకు 2:14 లో "ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను." గనుక పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు దుర్నీతిని విడిచి మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.


👉 *◆  బంధకములనుండి విడుదల అవసరం:*
             ఇశ్రాయేలీయులు ఐగుప్తు లో 430 సంవత్సరములు బానిసలుగా బాధలను అనుభవించుచున్నపుడు వారు పెట్టిన మొఱ్ఱ కృప కలిగిన దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు మోషే ను పంపించాడు. యూదా జనాంగము బబులోనులో చేరలోనుండుటకు కొనిపోబడిన 70 సంవత్సరముల తరువాత వారిని బంధకముల నుండి విడిపించాడు.

♻️ *● విమోచనకై మార్గాలు ●*

👉 *◆  విమోచించగలవాడు దేవుడొక్కడే:*
              "కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని." (నిర్గమ 3: 8,9).

👉 *◆  విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి:*
          "కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. (నిర్గమ 3:10)."  ఇశ్రాయేలీయులు తమ కష్టకాలంలో దేవునికి మొఱ్ఱపెట్టగా మొదట మోషేను, ఒకసారి ఒత్నియేలును, ఒకసారి ఏ హుదును, ఒకసారి గిద్యోనును ( న్యాయాధిపతులు 3:9,15; 6:14) వారికి రక్షకులుగా పంపితివి. మనం పాపులుముగా ఉండగా యేసే స్వయముగా రక్షకునిగా (మత్త 1:21) వచ్చియున్నాడు.

👉 *◆  విమోచించుటకు రక్తం అవసరం:*
             "మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు." (నిర్గమ 12:13). ఇశ్రాయేలీయుల పస్కా పశువు రక్తమును తమ ఇంటి ద్వారము యొక్క కమ్మీ మీద చిలకరించుట ద్వార దేవుని ఆజ్ఞ నెరవేర్చి మరణము నుండి తప్పింపబడి యున్నారు. మానమింక పాపులమై యుండగా పస్కా పశువుగా యేసే విధింప బడి ఆ రక్తము ద్వార మనం రక్షింపబడియున్నాము. "అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యెహను 1:7)".

👉◆  విమోచించుటకు బ *హువు (ఒక శక్తి ) అవసరం:*
             "కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించెదను (నిర్గమ 6:6)."
"నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు. (యెషయా 51:5)"
ఉగ్రత నుండి తప్పించుకొనుటకు, విమోచింపబడుటకు యేసు యొక్క బహువు అవసరం.

👉 *◆  విమోచించడానికి ఒక దినం అవసరం:*
          ఇశ్రాయేలీయులు 450 సంవత్సరములు గడిచిన తరువాతే యెహోవా సేనలు ఐగుప్తు నుండి బయలుదేరి పోయెను. ఆనాడే పస్కా (15th of Bisan). ఇది దైవ నిర్ణయం. ఇది ఆదిలో అబ్రాహామును పిలిచిన దినమున దేవుడు బయలుపరచాడు (ఆది 15:14). ఆ మహా దేవుని ప్రణాళిక ఎంత సుధీర్ఘమైనది? మరి మన విషయమైతే ప్రతి వ్యక్తి రక్షణ  (విమోచన) గూర్చి ఒక దినము నిర్ణయించాడు (హెబ్రీ 4:7),  ఇదిగో ఇదియే రక్షణ దినము (2కోరింది 6:2). కాబట్టి రక్షణ పొందుటకు ఆలస్యము చేయకు. మంచి రోజు అని చూడకు. ఎందుకంటే రేపు నీది కాదేమో!
             ప్రియమైన సహోదరుడా, సహోదరీ నీవు మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, సాతాను బంధకముల నుండి విడుదల పొందితివా? అవును అంటే దేవునికి వందనములు. ఇంకా లేదు అంటే నేడే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఎందుకనగా నీకు నీవు విడిపించుకోలేవు సుమా! విమోచింపబడిన ఇశ్రాయేలు వలె ఎఱ్ఱసముద్రం దాటి, యెర్ధను దాటి కనాను చేరాలి. విమోచింపబడిన గాడిద వలె ప్రభువుని కలిగి యెరూషలేము చేరాలి. అలా చేరుటకు ఆ ప్రభువు సహాయం చేయును గాక! ఆమెన్!!!







 

o
Share/Bookmark

 


 

✳️  *ఒక మంచి తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?*....✍️

కీర్తనలు 128: 3

*నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.*

👉 అస్తవ్యస్తంగా పెరిగిన చెట్టును చూచి దీనిని మొక్కగా ఉన్నప్పుడే క్రమపరచివుంటే బాగుండేది అనుకునే వ్యవసాయదారులు,
👉కరమంలేని పిల్లలను చూసి చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో పెంచుంటే బాగుండేది అనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.

👉తల్లిదండ్రులకి పూర్ణవిధేయులైన పిల్లలు కనిపించటమే అరుదు అయితే....
👉అలాంటిది *తల్లిదండ్రుల భక్తిని కూడా నేర్చుకున్న పిల్లలు మనకి కనిపించటం ఇంకా అరుదు... ఇస్సాకు, యోసేపులకు ప్రతిరుపాలుగా ఎప్పుడోగాని, ఎక్కడోగాని వీరు కనిపించరు.*
📖 128వ కీర్తనలోని ఈ ఆశీర్వధములు అన్ని కీర్తనాకారుడు తనకోసమో లేక ఇశ్రాయేలీయులకు మాత్రమే వ్రాసియుంచలేదు కానీ 128వ కీర్తనలో *“వారందరికి”* అన్న మాట చేర్చటం ద్వారా *ప్రతిఒక్కరికి ఈ ఆశీర్వధముల ద్వారము తెరచే ఉంది....*
▪️అవును నువ్వు ధన్యుడవు....
▪️న కష్టార్జితం నిలిచి ఉంటుంది....
▪️న మార్గాలు మేలుకరమైనవిగా మారతాయి....
▪️న ఇంటి భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది,
▪️ న భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె ఉంటారు....
*“అందరికి”* ఈ ఆశీర్వధాలు.... కానీ

❇️  *ఈ “అందరు” ఎవరో తెలుసా.... ?*
👉ఈ అందరే.... *“యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడచు వారందరు”*
 128వ కీర్తనలో ఈ మాట మళ్ళి మళ్ళి వ్రాయబడియుండటం మనం చూడవచ్చు.
👉ఈ ఆశీర్వధాలు అందరికి అయినా *“యెహోవా యందు భయభక్తులు కలిగి అయన త్రోవలలో నడచు వారందరికి” మాత్రమే.*

👉మనం పిల్లలను కనగలం కానీ వారి రాతను కనలేము అని కొందరు పెద్దలు చెబుతూఉంటారు....

*కానీ గాలిలో దీపం పెట్టకుండా, మనలో ఏమయినా కొద్దిపాటి భక్తి ఉంటె అది మన రాబోవు తరాలకు కాపుదలగా, కావలిగా తప్పక ఉంటుంది.*

*భార్యభర్తలు ఇరువురు పిల్లల ఎదుట తమ ధైర్యాన్ని నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఉండాలి.*

పిల్లల పెంపకం అనేది ఒక కష్టమైన మరియు సవాలు కలిగిన వెంచర్, కాని అదే సమయంలో అది మనము చేయకలిగిన చాలా ఫలవంతమైన మరియు పరిపూర్ణమైన పని.

*ప్రత్యక్ష బోధన ద్వారా మన పిల్లలు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకొనినప్పటికీ, వారు మనలను చూచుట ద్వారా మరింతగా నేర్చుకొనును.*

*చాలామంది స్త్రీలకు తల్లిగా ఉండు చాలా ప్రాముఖ్య పాత్రను దేవుడు ఇచ్చుటకు ఎంపిక చేసికొనెను.*

👉ఒక క్రైస్తవ తల్లి ఆమె పిల్లలను ప్రేమించవలెనని చెప్పబడెను (తీతు 2:4-5). ఎందుకనగా ఆమె కలిగియున్న ప్రభువును మరియు రక్షకుని నామమునకు నింద కలుగనీయదు.

*గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమ*ే (కీర్తనలు 127:3-5). తీతు 2:4 లో,
👉గరీకు పదమైన philoteknos తల్లులు వారి పిల్లలను ప్రేమించుతాను సూచించుటలో కనబడును.
👉 ఈ పదము ప్రత్యేకమైన  *“తల్లి ప్రేమ”* ను ప్రదర్శించును. ఈ పదములో నుండి వచ్చే ఆలోచన ఏమనగా
▪️మన పిల్లల కొరకు జాగ్రత్త వహించుట,
▪️వరిని పోషించుట,
▪️ఆప్యాయంగా హత్తుకొనుట,
▪️వరి అవసరాలను తీర్చుట,
▪️ పరతి ఒక్కరిని సున్నితముగా స్నేహముగా దేవుని చేతినుండి వచ్చిన అపూర్వ బహుమానముగా చూచుట.

*దేవుని వాక్యములో క్రైస్తవ తల్లులకు చాలా విషయాలు ఆజ్ఞాపింపబడినవి:*

1⃣ అందుబాటు - ఉదయము, మధ్యాహ్నం, మరియు రాత్రి (ద్వితీ 6:6-7)

2⃣ పరమేయం – పరస్పర అభిప్రాయాలు, చర్చించుట, ఆలోచించుట, మరియు జీవితమును కలిసి ఒక విధానములో ఉంచుట (ఎఫెసీ 6:4)

3⃣ బధించుట – లేఖనములు మరియు బైబిలు సంబంధమైన ప్రపంచ చిత్రము (కీర్తనలు 78:5-6; ద్వితీ. 4:10; ఎఫెసీ. 6:4)

4⃣ శక్షణ – ఒక పిల్లవానికి తన నిపుణతలను అభివృద్ధి చేయుటకు సహాయపడి మరియు అతని/ఆమె బలములను కనుగొనుట (సామెతలు 22:6) మరియు ఆత్మీయ ఫలములు (రోమా. 12:3-8 మరియు 1 కొరింథీ. 12)

5⃣ కరమశిక్షణ – దేవుని భయమును బోధించుట, నిలకడగా నియంత్రణలో ఉంచుట, ప్రేమగా, స్థిరముగా (ఎఫెసీ. 6:4; హెబ్రీ. 12:5-11; సామెతలు 13:24; 19:18; 22:15; 23:13-14; 29:15-17)

6⃣ పషణ – స్థిరమైన మాట సహాయ వాతావరణమును అందించుట, ఓడిపోవుటకు స్వేచ్చ, అంగీకారము, ఆప్యాయత, షరతులులేని ప్రేమ (తీతు 2:4; 2 తిమోతి 1:7; ఎఫెసీ. 4:29-32; 5:1-2; గలతీ. 5:22; 1 పేతురు 3:8-9)

7⃣ సమగ్రతకు ప్రతిరూపము – నీవు చెప్పేది జీవించడం, ఒక ప్రతిరూపముగా వుంటూ దేనినుండైతే ఒక పిల్లవాడు *“పట్టుకొని”* నేర్చుకొంటాడో అలాంటి దైవభక్తిగల జీవితమును జీవించడం ద్వారా (ద్వితీ. 4:9, 15, 23; సామెతలు 10:9; 11:3; కీర్తనలు 37:18, 37).

👉 *పరిశుద్ధ గ్రంథము ప్రతి స్త్రీ ఒక తల్లి అయివుండాలని ఎన్నడూ ప్రకటించలేదు.*
 అయితే,
 *ప్రభువు ఎవరినైతే తల్లులుగా ఆశీర్వదించాడో వారు ఆ బాధ్యతను తీవ్రముగా పరిగణించాలి అని చెప్పెను.*

 👉తల్లులకు వారి పిల్లల జీవితములో ఏకైక మరియు కీలకమైన పాత్ర ఉండును. మాతృత్వము అనేది తప్పక చేయాల్సిన లేక అసహ్యకరమైన విధి కాదు.
🔹 ఎలాగైతే ఒక తల్లి ఒక పిల్లవానిని గర్భములో భరించునో,
🔹మరియు ఎలాగైతే ఒక తల్లి ఒక పిల్లవానిని అతని బాల్యములో పోషించి మరియు జాగ్రత్త తీసుకొనునో,
🔹 అలాగే తల్లులు వారి పిల్లల జీవితాలలో కొనసాగుతూ ఉండే పాత్రను,
*వారు కౌమారదశ లోనైనా, యువకులైనా, యవ్వనంలోనైనా, లేక వారికి స్వంతముగా పిల్లలున్న పెద్దవారైనా పోషించును.*

👉మతృత్వము యొక్క పాత్ర మారి మరియు అభివృద్ధి చెందుచుండగా,
🔹ఒక తల్లి ఇచ్చే ప్రేమ,
🔹 ఆదరణ,
🔹పషణ,
🔹 పరోత్సాహం ఎన్నడూ ఆపుచేయకూడదు.

*వివాహము జరిగిన తరువాత వారు కోరుకొనేది ఒక పండంటి బిడ్డను. ఎందుకంటే బిడ్డలే తల్లితండ్రులకు ఘనత. సంతానం దేవుడిచ్చు బహుమతి. పోషించే స్థోమత లేకున్నా వారి సంతానమే వారి ఆస్తిగా భావిస్తారు.*

👉ఒకవేళ మీకు సంతానము లేదా?
👉కృంగిపోవద్దు స్నేహితుడా/ సోదరి. అబ్రామునకు 100 ఏళ్ళ ప్రాయములో సంతానము కలిగింది. ఇస్సాకునకు 65 ఏండ్ల కాలములో సంతానము కలిగినది.

👉గడ్రాలుగా ఉన్న

▪️సమూయేలు తల్లి హన్నా,
▪️ సంసోను తల్లి,
▪️ సరెపతు ఘనురాలు,
▪️ యహాను తల్లి ఎలీసబెతు దేవుని మీద విశ్వాసముతో సంతానము పొందారు.

🎯 అబ్రహమునకు ఇస్సాకును ఇచ్చితిని (యెహో24:3) అని దేవుడు చెప్పాడు.
🎯 యకోబు - వీరు దేవుడు దయచేసిన పిల్లలు (ఆది 33:5) అని,
🎯 యసేపు - వీరిని దేవుడు నాకు అనుగ్రహించాడు (ఆది 48:9) అని,
🎯 యషయా - నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను (యెషయా 8:18) అని అంటున్నాడు.

*మనం కూడా నా పిల్లలు అని కాకుండా దేవుని కృపను బట్టి ఇంత మంది పిల్లలు అని చెప్ప గలిగితే సంతోషం.*

❇️ *తల్లితండ్రులకు విధేయులై ఆశీర్వాధిపబడ్డారు.*
 
పాత నిభంధనలో ఇస్సాకు, యోసేపు,   సమూయేలు, దావీదు, ఎస్తేరు ; క్రొత్త నిబంధనలో యేసు, తిమోతి తల్లితండ్రులకు విధేయులై ఆశీర్వాధిపపడ్డారు.

❇️ *తల్లితండ్రులకు అవిధేయులై తమ్మును తాము నష్టపరుచుకున్నారు.*
 
ఏశావు, ఏలీ కుమారులు, అబ్షాలోము,  సమూయేలు కుమారులు,యాకోబు 10 మంది కుమారులు వారి తల్లితండ్రులకు తలవంపులు తెచ్చారు. తమ్మును తాము నష్టపరుచుకున్నారు.

*అందుకే బిడ్డలను బాల్యదశ నుండే దేవుని సన్నిధిలో పెంచాలి. వారికీ అన్ని విషయాలలో మనమే మార్గ దర్శకముగా ఉండాలి.*

 👉 *"తల్లి చెనులో మేస్తే దూడ గట్టున మేయదు"అనే సామెత మనకు తెలుసు కదా!*

 *"మొక్కయి వంగనిది మ్రానయి వంగునా?"*
 అనే సామెత ప్రకారం, వంకర మొక్కని ప్రక్కన ఒక కర్ర పెట్టి కట్టితే అది కొంచెం నిటారుగా పెరుగును లేదా వంకర ఎక్కువై పడిపోవును.

👉 *కాబట్టి చిన్న తనములోనే మంచి క్రమశిక్షణలో మీ పిల్లలిని పెంచండి. నన్ను మా అమ్మ చిన్న తనము నుండే దేవుని భయ భక్తులతో పెంచింది కాబట్టే ఇప్పుడు ఇలా గొప్ప దేవుని సేవ చేయగలుగుతున్నాను.*

❇️ *పిల్లల గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఇలా ఉంది:-*

1. దుష్టుని సంబంధులు (మత్తయి13:38).

2. వెలుగు సంబంధులు (యెహాను 12:36).

3. శరీర సంబంధులు (రోమా 9:8).

4. అవిధేయులు (ఎఫెసి 2:2, 5:6, కొలా 3:6).

5. ఉగ్రత పాత్రులు ( ఎఫెసి 2:2).

6. అపవాది సంబంధులు (1యెహాను 3:8-10).

7. వాగ్దాన పుత్రులు (ఎఫెసి 2:2).

8. తల్లిదండ్రులను అనుకరించేవారు
(1రాజులు 15:11,26).

9. వివిధ స్వభావము గలవారు (ఆది25:27).

10. మొండి వైఖరి గలవారు (ద్వితీ 21:18-21).

11. అల్లరి, ఆటపాటలు గలవారు (మత్తయి 11:16-19).

12. మూఢత్వము గలవారు (సామెతలు 22:15).

❇️ *భార్య భర్తలు కలిసి పిల్లల పెంపకం విషయంలో తగిన శ్రద్ధ చూపించాలి. పిల్లల ద్వారా భార్య భర్తల బంధం ఇంకా బలపరచబడాలి కాని బలహీనపడరాదు.*

👉 పల్లలు లేరని, పిల్లల కోసం మరొక పెళ్లి చేసుకోవడం క్రైస్తవ వివాహ బంధానికి విరుద్ధం. అది లోకందృష్టిలో తప్పులేనిదిగా ఎంచబడవచ్చు కాని క్రైస్తవులైన మనకు కాదు.

🔹 *మన జీవన విధానం బట్టి మన కుమారులు మన వైఖరి బట్టి నడుచుకుంటాడు.*

👉తల్లిదండ్రులు తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఒక క్రమము లేని వారిమైతె మన కుమారులు కూడా దేశాదిమ్మరులు, చోరులు, వ్యభిచారులు అవుతారు,

🔹అప్పుడు కుటుంబ వ్యవస్థ సర్వ నాశనం అవుతాది.
👉చల మంది యవ్వనస్థులు ఈ వ్యాసం చదువుతున్నారు.
 
*ఇందులో వివాహము అయినవారు ఉన్నారు.త్వరలో వివాహము చేసుకోవాలి అనుకొనేవారు ఉన్నారు.*

👉 కబట్టి ఇప్పుడే మనం ముందు మన ప్రవర్తన సరిచేసుకుందాం. అప్పుడు మన కుటుంబం సరిగా ఉంటాది.

👉 *మొదటి ఆదాము దంపతులు ధైవజ్ఞ మీరిన కారణాన వారి కుమారుడైన కయీను నరహంతకుడు అయ్యాడు.*

👉 *లోతు లోకాశ వల్ల తన కుటుంబాన్ని సొదొమ గొమొఱ్ఱ కు నడిపించి బ్రష్ట సంతానానికి కారణం అయ్యాడు.*

👉  *ఆకాను ధైవజ్ఞ మీరి శపితమైన దానిలో కొంత దొంగిలించుట వల్ల తన కుటుంబం రాళ్ళతో కొట్టబడింది.*

👉 *కోరాహు దేవునికి విరోధముగా మోషే, ఆహారోనులను ఎదురించుట వలన తన సమూహం అంత అగ్ని చేత కాల్చబడింది.*

👉 *దావీదు బాత్సెబాతో పాపము చేసి, తన భర్తను యుద్ధములో చంపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత పశ్చాత్తాప పడిన శిక్ష అనుభవించాడు.*

 *కాబట్టి మన పాపము మన కుటుంబాలను పాడు చేస్తాది.*

 👉 దవుడు శిక్షింపక మానడు. కాబట్టి మన జీవితాలు దేవుని యెదుట యధార్ధముగా కనపరుచుకొనునట్లు పాటుపడుదాం.

*దేవుడు మన కుటుంబాలను, మన పిల్లలను ముఖ్యంగా పవిత్ర క్ రైస్తవ వివాహ బంధాలను, పటిష్ఠ పరచి ఆయన కృపలో మనలను భద్రపరచును గాక.*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*

➖➖➖➖➖➖➖➖➖➖


 

o
Share/Bookmark

 


 ✳️ *ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్లాడు….?*
 *లాజరు పరలోకానికి ఎందుకు వెళ్లాడు…?....✍️*

👉ధనవంతుడు చేసిన తప్పు ఏంటి ?
👉లజరు చేసిన మంచి ఏంటి ?
(లుకా 16:19-31) వరకు మనం గమనిస్తే ధనవంతుడు బీధ లాజారు ఉపమానం మనకు కనిపిస్తుంది.

👉అందులో వారి ఇద్ధరి జీవన శైలి మాత్రమే కనబడుతుంది తప్ప
🔺వరి యొక్క ప్రార్ధనా జీవితం ,
🔺వశ్వాస జీవితం,
🔺దవునిలో ఎదుగుదల, *ఇలాంటి విషయాలు మనకు కనబడవు.*

👉 వరి జీవితాలలో మనం గమనించవల్సిన విషయం *అస్సలు వారు అన్యులా...?* లేక
*దేవుని ఎరిగిన వారా....?*

♻️ లజరు దేవుని ఎరిగిన వ్యక్తి, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవించిన వ్యక్తి
*కాబట్టే పరలోకంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం సులువుగా అర్ధం చేసుకోగలం.*

👉ధనవంతుడు కూడా దేవుని ఎరిగిన వ్యక్తే .
*ఎలా చెప్పగలం ?*
🔹 *“తండ్రివైన అబ్రాహామా”* అని రెండు సార్లు
🔹 *“తండ్రీ”* అని ఒక సారి అబ్రాహాముని పిలవడం ఈ ఉపమానంలో మనం చూడగలం.
*విశ్వాసులకు తండ్రి అబ్రహము గనుక అతడు తండ్రి అని పిలుస్తున్నాడు.*

👉 ధనవంతుడు కూడా విశ్వాసే….!

👉వశ్వాసి ఆయి కూడా నరకంలో ఉన్నాడంటే ఏదో పాపం చేసాడని అర్ధం చేసుకోవచ్చు

1యోహాను 3:4 ప్రకారం *“పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.”*

👉ధనవంతుడు మీరిన ఆజ్ఞ ఏంటో పరిశీలిస్తే……
*మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలన్ని 613+,*

👉  *ఈ ఆజ్ఞలన్నిటిని యేసుక్రీస్తుప్రభువుల వారు రెండుగా  చేశారు*
 అవి ఏంటంటే..
మార్కు 12:29
1⃣ *అందుకు యేసు  ప్రధానమైనది ఏదనగా "ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.*

2⃣ *నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను."*

🔺ధనవంతుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహమును గుర్తించాడు అంటే
*విశ్వాస జీవితంలో కొనసాగుతూ మొదటి ఆజ్ఞను ఎరిగి ఉన్నాడని అర్ధం చేసుకోవచ్చు.*

🔺 రండవ ఆజ్ఞ విషయానికి వస్తే
*తన పొరుగు వాడైన లాజారును ప్రేమించలేదని స్పష్టంగా గ్రహించవచ్చు.*

👉 ఏలాగంటే బహుగా సుఖపడుతూ,ఉదా రంగు వస్త్రాలు ధరిస్తూ కూడా ఒక్క వస్త్రం కూడా లాజారుకు ఇచ్చి ఉండి ఉండడు.

 అందువల్లనే *“కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను”* అని వ్రాయబడి ఉంది…

👉 ఆకలితో ఉంటే ఒక్క రొట్టె ముక్క కూడా ఇవ్వకుండా కుక్కలతో సమానంగా చూసాడు….

*తన పొరుగువానిని ప్రేమించలేదు కాబట్టే ధనవంతుడు నరకానికి వెళ్ళ వలసి వచ్చింది ….*

♻️ సధరా..! సొధరీ..!

👉నన్నువలె నీ పొరుగువానిని ప్రేమించడం అంటే నిన్ను నువ్వు ఎలా గౌరవిస్తావో,
👉నకు సంబందించిన అన్ని విషయాలలో జాగ్రత్తలు చూసుకుంటావో ,
*అదే జాగ్రత్త నీ పొరుగు వారి విషయంలో నీకు ఉందా ?*

👉పతాళములో వేదనపడుచున్న *"ధనవంతుడు "*కన్నులెత్తి
తండ్రి అయినా అబ్రాహాముతో  ఏమన్నాడో తెలుసా ?

👉అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.
 వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నా ననెను      *లూకా సువార్త అధ్యాయం 16:27*

👉ఈ వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే ఆ ధనవంతుడు తాను పడుచున్న వేదన
*తన ఇంటివారు పడకూడదని వేడుకుంటున్నాడని గ్రహించండి*

*తండ్రి అయినా అబ్రాహాము ఏమన్నాడో తెలుసా ?*

 అందుకు అబ్రాహాము-- *వారియొద్ద మోషేయు ప్రవక్త లును ఉన్నారు;వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా*
(లూకా సువార్త అధ్యాయం 16:29)

👉ఈ వాక్యాన్ని గమనించినట్లయితే వారి యొద్ద మోషేయు ,ప్రవక్తల మాటలు అనగా దేవుని  వాక్యము ఉన్నదని చెప్పాడు అంటే
*వారు ఒక వేళా దేవుని మాటలు వినిన యడల వారు పాతాళమును తప్పించబడును అని చెప్పెను*  

మల్లి ధనవంతుడు మృతులలో ఒకడిని వారియొద్దకు పంపమని వేడుకుంటాడు కానీ అబ్రహం ప్రవక్తలమాటలు "వినని" వారు  మృతుడు వెళ్లి చెప్పిన ఎలా నమ్ముతాడు అని చెప్పెను

👉మత్తానికి మీకేమి అర్ధమయ్యింది ప్రవక్తల మాటలు అనగా
*"దేవుని మాటలు "*
👉మనము వినిన యడల పాతాళం నుండి తప్పించబడతాము అని అర్ధం

అంటే ధనవంతుడు ప్రవక్తలమాటలు అనగా *"దేవుని వాక్యం విని ఆచరించలేదు ఆలా చేసినట్లయితే పేదవాడైన లాజరు ను "తన వాలే " ప్రేమించే వాడు అందుకే పాతాళానికి వెళ్ళాడు.*

👉నువ్వు నరకానికి వెళ్తవా. . . .?
లేక
👉పరలోకానికి వెళ్తవా. . . ?

 *క్రైస్తవులకు ఉన్న ధరిధ్రం ఏమిటంటే బైబిల్ చేతిలో ఉండి అందులో ఏముందో తెలియక పోవడం ..*

బైబిల్లో *“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను”* అని ఉంది కదా. .

👉ఆయనతో పోల్చుకుంటే నువ్వు, నేను ఎంత ?

🔸 న జీవితంలో గాని,
🔸 దవుని పనిలో గాని అధికారం కోసమో ,
🔸 గరవం కోసమో,
🔸పరు కోసమో,
🔸హదా చూపించు కోవడం కోసమో
*నీ పొరుగు వారిని చులకనగా చూస్తే, ద్వేషిస్తే నువ్వు నరకానికే వెళ్తావు జాగ్రత్త..!*

 *దేవుని చిత్తమును జరిగించు.. దేవుని ఘనపరచు.. దీవించబడుదువు...!*

*మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను మనలను రెండవ రాకడకు సిద్దాపరచును గాక !*

నా ప్రియ స్నేహితులారా....
👉 జగ్రతగా చదివారుగా. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి.
👉మరు నేర్చుకోండి అనేక మందికి నేర్పించండి....

*“ మనం కలసి చదువుదాము....*

 *కలసి నేర్చుకుందాము....*

 *కలసి జీవములోకి అడుగులు వేద్దాము....”*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*


👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*

 

o
Share/Bookmark


సాతానును ఎదిరించి ఓడించే శక్తినిచ్చే ప్రార్థన....


*సాతాను దేవునికీ, మానవునికీ ప్రధాన శత్రువు. వాడు ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు.*
1 పేతురు 5:8

👉ఈ లోకంలో నున్న ప్రతీ పాపమునకు వెనుక నిలువబడి వ్యూహాన్ని రచించేది సాతానుడే.

👉వడి రాజ్యంలో పరలోకంలో నుండి పడద్రోయబడి దయ్యాలుగా మారిన దూతలూ, పాపులైన మానవులూ ఉన్నారు.
*వాడు అనునిత్యమూ దేవుని పిల్లలను ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.*
👉 వడి పేరే *"అపొల్లుయోను"* అంటే? *'నాశనము చేయువాడు'*
ప్రకటన 9:11

👉సతాను దయ్యాలు అనబడే అపవిత్రాత్మల సేనకు నాయకత్వం వహిస్తూ వారితో కలసి పనిచేస్తుంటాడు.
*ఈ అపవిత్రాత్మలు మానవులలో ప్రవేశించి వారిని హింసించేందుకు శక్తి కలిగి వున్నాయి.*

ఇక సాతానుడైతే ప్రకృతి శక్తులపై అధికారాన్ని కలిగివుంటూ తన దయ్యపు *'సూచక్రియల'* ద్వారా
(2 థెస్స 2:9,10) దేవుని పనినే గలిబిలి చేస్తుంటాయి.

 *ప్రధాన దూత అయిన మిఖాయేలే దేవునికి మొరపెట్టునంతగా వాడు దుష్ట శక్తులను, అధికారాన్ని కలిగివున్నాడు*
 (యూదా 9).

 అయితే,
 *వాడిని ఎట్లా ఎదిరించాలి?*

👉 *మెలకువగా వుండి, ప్రార్ధించుట ద్వారా వాడిపై విజయం సాధించ వచ్చు.* (మత్తయి 26:41)

👉 మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి.
*"అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును"*
యాకోబు 4:7

👉 *ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం.*

 *ప్రార్ధన క్రీస్తు సన్నిధిని మన మధ్యకు తీసుకొని వస్తుంది.*
 *ప్రార్ధన దేవుని దూతలను మన సహాయార్ధం భూమి మీదకు తీసుకొని వస్తుంది.*
(2 రాజులు 6:15-17; హెబ్రీ 1:14)

 *సాతానును జయించి, వానిని సమూల నాశనం చెయ్యడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం "ప్రార్ధన".*

*ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.*
 ఎఫెసీ 6:18

కానీ,
మనం లోకం మత్తులోపడి, ప్రార్ధనా హీనులయ్యాము.
 ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం.
👉 *ఫలితంగా సాతానును ఓడించాల్సిన మనం, వాడి విజయానికి పరోక్షంగా సహాయ పడుతున్నాము.*

వద్దు!
*వాడిని ఓడించే శక్తివంత మైన ప్రార్ధనా ఆయుధాన్ని సరియైన రీతిలో ఉపయోగించగలిగితే, వాడెంత మాత్రమూ నిలువలేడు.*

ప్రార్ధిద్దాం!
ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాము.

o
Share/Bookmark

 


*క్షామకాలం కొరకు నీకున్న సిద్ధపాటు ఏమిటి?*

*చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.*
సామెతలు 30:25

*చీమలు 🐜*

▫️చమలలో ఏడువేల రకాల జాతులున్నాయట
▫️చమలు ఒకే పుట్టలో నివాసముండి ఐకమత్యాన్ని చాటి చెబుతాయి.
▫️ఇవి క్రమశిక్షణ గలిగిన జీవులు
▫️ఇవి కష్టించి పనిచేస్తాయి.
▫️తన బరువుకంటే 20 రెట్లు బరువుగలిగిన వస్తువులను అవలీలగా మోసుకుపోతాయి.
▫️మనకు తెలిసి ఎర్ర చీమలు, నల్ల చీమలు, చలి చీమలు, ఖండ చీమలు ఇట్లా... సోమరి చీమలు మాత్రం కానరావు.

*🐜 చమలు వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును:*

వర్షాకాలం చీమలు ఎక్కువ రోజులు పుట్టలలోనే గడపాల్సి వస్తుంది? అట్లాంటప్పుడు వాటికి ఆహారమెక్కడది? అందుకే, వేసవికాలమంతా వాటి శక్తికి మించిన పనిచేసి వర్షాకాలం కొరకు, కోతకాలమందు ఆహారాన్ని సమకూర్చుకొని భద్రపరచుకొంటాయి.

మనుష్యులలో కూడా రాబోవు తరాలకు సరిపడే ఆస్తులు కూడగట్టేవారున్నారు. వారు సంపాదించడం తప్పని నేను అనడం లేదుగాని, వారి సంపాదన వారివెంట వస్తుందా? దేనికొరకు వారి ప్రయాస అన్నదే ప్రశ్న? భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. (మత్తయి 6:19)

*అయితే మనము సంపాదించుకోవలసిన ఆస్తి ఏమిటి?*

*రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;* ఆమోసు 8:11, 12

సువార్త ద్వారాలు మూయబడే దినాలు దగ్గర కాబోతున్నాయి. దేవుని వాక్యం దొరకని అత్యంత భయంకరమైన క్షామం మనముందుంది. ఆ దినాలు ఊహలకే అత్యంత భయానకం. ఆ దినాలకొరకు, వాక్యము విరివిగా ప్రకటింపబడుతున్న ఈకాలమందే దానిని సమకూర్చుకొని, హృదయస్థం చేసుకోవాలి. ఆ దినాన్న నీ చేతిలోనున్న బైబిల్ లాక్కోగలరేమో గాని, నీ హృదయంలో ముద్రింపబడిన వాక్యాన్ని ఎవరు చెరిపివేయగలరు? నీవు సమకూర్చుకోవలసింది పరలోక ధనాన్ని. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. (మత్తయి 6: 20) అయితే, దేవుని వాక్యానికి నీవిచ్చే ప్రాధాన్యత ఎంత? క్షామకాలం కొరకు నీవు సమకూర్చుకున్నదేదైనా ఉన్నదా? తుప్పుపట్టని పరలోకధనం ఏదైనా సమకూర్చుకున్నావా?నిన్ను నీవే పరిశీలన చేసుకో.

🐜 సృష్టిలో అత్యున్నత సృష్టమైన మనిషిని, అత్యంత అల్పజీవులైన చీమలనుండి నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు.

దేవుడు పనిచేసేవారితో కలసి పని చేస్తారు. సాగిపోయేవారితో సాగిపోతారు. కానీ, సోమరిలా కూర్చుండేవారితో మాత్రం కూర్చోడాయన.

రాజు తన రాజ్యంలోనున్న సోమరులనంతా ఒకచోటచేర్చి, పరమ సోమరిని గుర్తించాలని, మీలో పరమ సోమరి ఎవరో చేతులెత్తండి అంటే అందరూ చేతులెత్తారట. ఒక్కడుతప్ప. అంటే, వాడు చెయ్యి కూడా ఎత్తలేనంత బద్దకస్తుడన్నమాట. వాడే పరమ సోమరి కిరీటాన్ని దక్కించుకున్నాడు. అవును!
సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు. (సామెతలు 19:24) వాడికి నమలడం బద్దకమని, జ్యూస్ చేసి నోట్లో పోసినాగాని, మ్రింగడానికి కూడా వానికి కష్టమే.

అందుకే దేవుడు, వారిని భూమిమీద అత్యంత అల్పజీవులైన చీమలయొద్దకు వెళ్లి బుద్ధి తెచ్చుకోమని హెచ్చరిస్తున్నారు.

సోమరీ,
▫️చీమలయొద్దకు వెళ్లు
▫️వటి నడతలు కనిపెట్టు
▫️జఞానము తెచ్చుకో
▫️వటికి న్యాయాధిపతి లేడు
▫️ప విచారణకర్త లేడు
▫️అధిపతి లేడు
▫️అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును
▫️కతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
సామెతలు 6 : 6-8

సోమరివానికి నిద్ర అంటే ప్రాణం. ఎంతసేపూ, ఇంకా కొంచెం కునకాలి, ఇంకా నిద్రపోవాలి అదే ధ్యాసతప్ప, మంచాన్ని విడచి పెట్టడం వానికసలు ఇష్టముండదు. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? (సామె 6:9) సరే సోమరి సంగతి ప్రక్కనబెడదాం. ప్రార్ధించడానికి ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకొని, రింగ్ అవుతుంటే టక్ ని ఆపేసి, కొంచెం సేపాగి లేద్దామని, ఉదయం వరకూ లేవని నిన్ను ఏమనాలి? నిద్రను ప్రేమించి, ప్రార్ధనను నిర్లక్ష్యం చేసే నిన్నేమనాలి? రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, బాప్తీస్మం వాయిదా వేస్తూ, దేవుని పని చెయ్యడానికి తప్పించుకొని తిరుగుతూ, ఆధ్యాత్మిక మత్తులో జోగుతున్న నిన్నేమనాలి? నేను ఏదైనా అంటే, నీకు కోపం రావొచ్చు. నీవేంటో, నీవే తేల్చుకో.

సోమరితనాన్ని విడచిపెట్టి, ప్రభువుతో నిత్యమూ జీవించే ఆ సమయం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

 

o
Share/Bookmark

*విశ్వాసాన్ని పెంపొందించే అనుదిన ధ్యానములు - సెప్టెంబర్ 1*

╭ ┅┅═══➖➖➖➖═══┅┅╮
        ⭐️ *ఎడారిలో  సెలయేర్లు* ⭐️
╰┅┅═══  ➖➖➖➖═══┅┅╯



*నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును*_ (యెషయా 54:11).

గోడలో ఉన్న రాళ్ళు అంటున్నాయి *“మేము ఎక్కడో పర్వతాల్లో ఉండేవాళ్ళం. కఠినంగా, కర్కశంగా ఉండే కొండ చరియల్లో ఉండేవాళ్ళం. వేడిమి, వర్షం కొన్ని వేల సంవత్సరాలుగా మమ్మల్ని ఆకారాల్లేని బండరాళ్ళుగా మలిచాయి. అయితే మానవ హస్తాలు మమ్మల్ని నివాసాలుగా కట్టాయి.*

👉 మతో నిర్మితమైన నివాసాల్లో మానవులు పుడుతున్నారు, బాధలు పడుతున్నారు, పండుగలు చేసుకుంటున్నారు, విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళనూ, మమ్మల్ని చేసి న సృష్టికర్త నియమించిన పాఠాలను నేర్చుకుంటున్నారు.

*మేము ఇలా ఆశ్రయమిచ్చే రాళ్ళుగా రూపు దిద్దుకోవడానికి ముందు మేము చాలా శ్రమలను అనుభవించాం. తుపాకి మందు మా గుండెల్ని చీల్చింది. పెద్ద పెద్ద సుత్తులు మమ్మల్ని పగలగొట్టాయి. ఆ దెబ్బలకు అర్థం లేనట్టు అనిపించింది. ఎందుకు కొడుతున్నారో మాకు తెలిసేది కాదు. చాలాకాలం వికృతమైన రూపాలతో చెల్లాచెదురుగా పడి ఉన్నాం. కొంతకాలానికి మమ్మల్ని ఈ ఆకారంలోనికి తెచ్చారు. సున్నితమైన పరికరాలతో మమ్మల్ని నునుపు చేశారు. ఇప్పుడు మాకు ఆకారం ఉంది, మా ఉపయోగం తెలిసింది. ఇప్పుడు మనుషులకు మేము ఉపయోగపడుతున్నాం.*

“ ఓ మనిషీ! ఇప్పుడు నువ్వు ఆకారం లేకుండా క్వారీలో పడి ఉన్నావు. మాకు ఒకప్పుడు అనిపించినట్టే ఇప్పుడు నీకు ఇదంతా ఎందుకో అర్థం కాదు. కాని ఉన్నత సౌధాన్ని కట్టేందుకు నువ్వు ఉపయోగపడనున్నావు. కొంతకాలానికి దైవహస్తాలు నిన్ను నీ స్థానంలో ఉంచుతాయి. పరలోకపు దేవాలయంలో సజీవమైన రాయిగా నువ్వు కలకాలం ఉంటావు.”

*నిశ్చల నిశీధిలో నిశ్శబ్ద సంగీతం చెక్కని పాలరాతిలో దాక్కున్న సౌందర్యం సంగీతం వినబడాలన్నా సౌందర్యం కనబడాలన్నా కళాకారుడు కావాలి, శిల్పి రావాలి*

*దివ్య సంగీత విద్వాంసుడా, నాలోని సంగీతం మూగవోకుండా నీ చేతులతో జీవం పొయ్యి ఓ పరమ శిల్పీ, నీ సుత్తితో, ఉలితో చెక్కి నాలోని సౌందర్యాన్ని వెలికి తియ్యి*

*దైవాశ్శీసులు!!!*

 ▪️ *సంకలనం-  చార్లెస్ ఇ. కౌమన్*
 ▪️ *అనువాదం - డా. జోబ్ సుదర్శన్*



G
M
T
Y
Text-to-speech function is limited to 200 characters
o
Share/Bookmark

 


 

అబద్దికుడు గురించి బైబిల్ ఎం చెబుతుంది


*ఎవరు అబద్దికుడు*

1️⃣.అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్దికుడు (సామెత 10:18)
2️⃣.నాశనకరమైన మాటలకు చెవి యొగ్గువాడు అబద్దికుడు (సామెత 17:4)
3️⃣.ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్దికుడు (2యోహాను 2:4)
4️⃣.సహోదరుని ద్వేషించువాడు అబద్దికుడు (1యోహాను 4:20)


*అబద్దికులు ఎవరి సంబందులు*

1️⃣.అపవాది సంబందులు (యోహాను 8:44)


*అబద్దికుని స్థితి*

1️⃣.అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు (సామెత 12:22)
2️⃣.అబద్దమాడు పెదవులు మూయబడును (కీర్తన 31:18)
3️⃣.అబద్ధికుని కంటే దరిద్రుడు మేలు (సామెత 19:22)
4️⃣.అబద్దమాడువాడు నశించును (సామెత 19:9)
5️⃣.అబద్దమాడువాడు తప్పించుకొనడు (సామేత 19:5)
6️⃣.అబద్దమాడి ధనమును సంపాదించువాడు మరణమును కోరును (సామెత 21:6)


*అబద్దమాడి శాపం తెచుకున్నవారు*

1️⃣.గెహాజి కుష్ఠురోగం (2రాజులు 5:25-27)
2️⃣.అననీయ, సప్పిరా మరణం (అపో.కా 5:4-10)

*అబద్దమాడువారి అంతం*

1️⃣.అగ్ని గందకములో మండు గుండములో పాలుపొందుడు (ప్రకట 21:8)

Note: అబద్ధం అనేది చిన్న తప్పుగా మనం పరిగణిస్తాం కానీ బైబిల్ గ్రంధం దానిని కూడా పాపాముగా పరిగణించింది ఎందుకంటే అబద్ధమునకు జనకుడు అపవాది కాబట్టి, మనం దీనిని గ్రహించి దేవుని ఎదుట మనం ఒప్పుకుంటే ఆయన మనలను క్షమిస్తాడు (1యోహాను 1:9)
(సామెత 30:8) ఆయన కుమారునిగా స్వీకరిస్తాడు ఒకవేళ ఎవరు చూడటం లేదుకదా, చిన్న అబద్ధమే కదా అని నువ్వు నీ జీవితాన్ని మార్చుకోక పోతే చివరికి అంతం నిత్య నరకం జాగ్రత్త దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు ఒక్కసారి ఆలోచించు.....

 

 

 

o
Share/Bookmark

బైబిల్ లో ఉన్న కపటోపాయములు

Posted by Veeranna Devarasetti Saturday, August 28, 2021 0 comments



 బైబిల్ లో ఉన్న కపటోపాయములు

1. *హేబేలుకు వ్యతిరేకముగా కయీను యొక్క కపటోపాయము* - కయీను తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడుతున్నట్లు మభ్యపెట్టి పొలములో అతని మీద పడి అసూయతో అతనిని చంపెను - *ఆది 4:8*

2. *యాకోబు మరియు ఏశావులకు వ్యతిరేకముగా ఇస్సాకు మరియు రిబ్కాల కపటోపాయము* - తండ్రియైన ఇస్సాకు యొక్క ఆశీర్వాదములు పొందుటకు యాకోబే ఏశావు అని అతనిని మోసగించిరి - *ఆది 27 అధ్యాయం*

3. *షేకెమునకు వ్యతిరేకంగా షిమ్యోను మరియు లేవీల కపటోపాయము* - తమ సహోదరియైన దీనాను షేకెము చెరచినందున వీరు ప్రతీకారం తీర్చుకొనుటకు పొంచి ఉండి, షేకెమును అతని గోత్రపు వారును సున్నతి చేసుకోనుడి అని మభ్యపెట్టి వారు సున్నతి పొందిన తర్వాత ఎవరికీ తెలియకుండా ఊరిమీద పడి షేకెమును, అతని తండ్రిని మరియు అతని గోత్రపు ప్రతి పురుషుని చంపిరి - *ఆది 34 అధ్యాయం*

4. *యోసేపునకు వ్యతిరేకముగా అతని సహోదరుల యొక్క కపటోపాయము* - వీరు తమ తమ్ముడైన యోసేపుపై అసూయతో అతనిని ఐగుప్తు బానిసత్వమునకు అమ్మివేసి, క్రూరమృగము యోసేపును తినివేసినదని తమ తండ్రికి అబద్ధము చెప్పిరి - *ఆది 37:12-36*

5. *యూదాకు వ్యతిరేకముగా తామారు యొక్క కపటోపాయము* - ఈమె సహజమైన వేశ్యవలె యూదాను ప్రలోభ పెట్టి అతని ద్వారా గర్భవతి అగుటకు అతనిని తన గుడారమునకు తీసుకునిపోయెను - *ఆది 38 అధ్యాయం*

6. *యోసేపునకు వ్యతిరేకముగా పోతీఫరు భార్య యొక్క కపటోపాయము* - తనతో శయనించుటకు యోసేపు నిరాకరించినందున, యోసేపే తనను బలవంతముగా చెరుచుటకు ప్రయత్నించాడని అబద్ధం చెప్పెను - *ఆది 39:13-19*

7. *మోషేకు వ్యతిరేకముగా కోరాహు యొక్క కపటోపాయము* - ఇతడు మోషేవలే ఇశ్రాయేలీయులపై అత్యున్నత స్థానము పొందవలెనని దురాలోచనతో మోషేను వ్యతిరేకించెను - *సంఖ్యా 16:1-3*

8. *యెహోషువాకు వ్యతిరేకముగా గిబియోనీయుల యొక్క కపటోపాయము* - వీరు దురాలోచనతో రాయబారులమని మారువేషంతో మభ్యపెట్టుటకు తమ గాడిదలకు పాత గోనెలు కట్టి, పాతగిలి చినిగి కుట్టబడియున్న ద్రాక్షరసం సిద్దెలు తీసుకొని, పాదములకు మాసికలు వేయబడిన చెప్పులు తొడుక్కుని, పాత బట్టలు కట్టుకుని వచ్చిరి - *యేహో 9 అధ్యాయం*

9. *సంసోనుకు వ్యతిరేకముగా దెలీలా యొక్క కపటోపాయము* - సంసోను యొక్క గొప్ప శక్తికి మరియు బలమునకు గల రహస్య కారణమును తనకు చెప్పి తన యెడల అతనికి గల ప్రేమను నిరూపించుకొనమని సంసోనును బలవంతము చేసినది. ఈ కార్య సాధనములో ఆమె సఫలీకృతురాలై అతనిని ఫిలిష్తీయులకు అప్పగించినది - *న్యాయ 16:4-20*


 ఈ విలువైన వర్తమానాన్ని మీ మిత్రులకు షేర్ చేసి మీవంతు దేవుని పని చేయండి.



o
Share/Bookmark

 

 


ఇతరుల దేవుళ్లను దూషించడం వలన పాపులారిటీ వస్తుంది తప్ప దైవికంగా ఒరిగేది పూర్తిగా ఏమి లేదు.

👉 వారి దేవుళ్ళ గురించి వారి పుస్తకాల్లో ఏముందో చెప్పడం వలన ఎవరు మారరు, మారినా ఒకరో ఇద్దరో అంతే వీరి కోసం ఇంత అల్లరి రచ్చ అనవసరం అయినా అవి వాళ్లకు తెలీని విషయాలు కావు అన్ని తెలుసని మనకు వారి వీడియోల ద్వారా తెలిసిపోతుంది. *వారి పుస్తకాల్లో ఉన్నవి చెప్పడం ద్వారా లాభమేంటని ఆలోచిస్తే బోధకులు  బైబిల్ నే కాదు ఇతర గ్రంధాల్లో కూడా చదవగలరని, క్రైస్తవులలో కొందరి మెప్పు పొందటం వారిని సంతోషపెట్టడం తప్ప ఇందులో ఆత్మల రక్షణ లేదని నేను గ్రహించాను ఈ విషయం మీ మనసాక్షి కూడా అవుననే అంటుంది.*

👉 నిజం చెప్పాలంటే కొన్ని సార్లు మన మిత్రులు బంధువులు కూడా వారి దేవుళ్ళ గురించి మాట్లాడితే నొచ్చుకొని గొడవ పడి మనకు దూరం అవుతారు కావాలంటే ట్రై చేసి చూడండి. మన మిత్రులు బందువులే అంగీకరించి ఒప్పుకోరు బయటవాడు నువ్వు చెప్పగానే ఒప్పుకుంటాడా? ఇద్దరి మధ్య వాగ్వాదం లక్షల మందితో ముడి వేసుకునేలా అవుతుంది మతాల మధ్య చిచ్చు రేపుతుంది అంతే. *దేవుడి సేవ అనుకుంటూనే మనకు తెలీకుండానే మనం ఉన్మాదుల్లా మారిపోతున్నాము.*  ఇది దేవుడి కోసం పోరాటం అనేవాడు సరిగా వాక్య జ్ఞానం లేదని అనుకోవొచ్చు.

వాక్యం తెలినివాడు కామెంట్ పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ పోస్ట్ లో సత్యం ఉంటే స్పందించండి లేకుంటే లేఖనాలు చూపండి. ఈ నిజాలు మీకు నచ్చక బాదేస్తే నేనేం చేయలేను.
ఎదుటివాడు మన దేవున్ని దూషించాడు కాబట్టి మనం వాళ్ళ దేవున్ని దూషించాలి అందుకే మనది తప్పు కాదు. వాళ్లకి నచ్చినట్టు హేళన చేసి అవమానించి దూషించినందుకు, మనకు నచ్చినట్టు రెచ్చిపోయి ఇతరుల దేవుళ్లను కించపరిచి, వారి మనోభావాలు దెబ్బతీసేలా వారిని ఉద్రేకపరిచి మనకు శత్రువులుగా చేసుకోడం మంచిదేనా?
 సుమారు 13 కోట్ల తెలుగు ప్రజలల్లో  మహా అయితే ఒక లక్ష నుండి 5 లక్షల మంది వారిని అనుకరిచే వాళ్లు ఉంటారు,వీరిలో మహా ఐతే ఓ 10 నుండి 20 వెల మంది  పనిపాట లెనోళ్లు కొంచెం ఆక్టివ్ గా ఉంటారు, విరిలో ఓ 500 నుండి 1000 మంది ఏదో అరుస్తుంటారు సోషల్ మీడియాలో, అందులో ఓ ఐదో పదో మంది సోషల్ మీడియాలో మాట్లాడి ఏదో అన్నంత మాత్రాన వచ్చే నష్టమే లేదు మనము సమాధానం చెప్పుకుంటూ పోవాల్సిందే తప్పా వారిలా ప్రవర్తిస్తే అంతే., మూడు కోట్ల మైనారిటీలను పక్కన పెట్టినా మిగితా 10 కోట్ల మందికి ఈ విషయాలు ఏమి పట్టవు వారి పనిలో వాళ్ళు ఉంటారు అయినా వీరి మనోభావాలు దెబ్బ తీయడం మనకు అవసరమా అనిపిస్తుంది. స్వల్ప సంఖ్యలో ఉన్న విద్వేషం రేపే వాళ్ళ కోసం మనం ఇంకాస్త ఉద్రేకత ఎక్కువ మందిలో సృష్టించడం సరికాదు.
 

పౌలు గారిని ఆలోచిస్తే ఆయన అర్తెమీ దేవిని దూషించినట్టుగా కానీ ఎఫెసియుల దేవతలను దూషించడం కానీ జరగలేదు అయినా అక్కడ అల్లరి జరిగింది ఆ అల్లరిలో ఆయన పట్టుబడ్డప్పుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఆయన వారి దేవిదేవతలను దూషించలేదు అనే మాటలు చదవగలము.
 

మనం ఎందుకు ఇక్కడ దేవుళ్ళ గురించి హడావిడి చేస్తున్నాము? పౌలుగారిగా నిష్కపటులుగా ఉండండి.
Acts(అపొస్తలుల కార్యములు) 19:37 మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు_గుడి_దోచినవారుకారు,  మన_దేవతను_దూషింపను_లేదు.


👉 *ఎదుటివాడు దూషణ చేసాడు కాబట్టి మనము కూడా దూషణ చేస్తే  చట్ట సభల్లో మనం మన నిర్దోషత్వాని నిరూపించుకోగలమా అనేది నా ప్రశ్న?*

 అధికారులు ఎవరిని నిర్బంధిస్తారు? వాళ్లకు అనుకూలంగా లేని వర్గాన్ని మాత్రమే నిర్బంధిస్తారు లేదా ఫిర్యాదుల బట్టి వారికున్న ఆధారాలతో నిర్బంధిస్తారు.

*ఈ నిర్బందన అక్రమము అని మనం అన్నట్టే చట్టం ముందు నిరూపణ చేయగలమా? వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను నన్ను మాత్రమే ఎందుకు నిర్బంధించారు లేక మా వాన్ని ఎందుకు నిర్బంధించారు అనే మాటలు అక్కడ చెల్లవు కేవలం నీ నిర్దోషత్వాని నిరూపించుకోవాలి లేని పక్షంలో నీవు దోషివే అవుతావు.*

👉 మన సమస్య ఏంటి అంటే మన వాడిని నిర్బంధిస్తే ఎదుటి వాడిని ఎందుకు చేయలేదు కానీ చట్టం సమస్య ఎదుటివాడిని ఎందుకు నిర్బంధించలేదు అనేది కాదు నిర్బంధంలోకి వచ్చిన నీవు నీ నిర్దోషత్వాని నిలుపుకోగలవ అంటుంది. నిలుపుకొని పక్షంలో నీవు దోషివే అవుతావు. *అందుకే పౌలు గారిని న్యాయసభలకు తీసుకొని వెళ్ళినపుడు ఆయన తన నిర్దోషత్వాని నిలుపుకున్నాడు బయటకీ వచ్చాడు.*

Acts(అపొస్తలుల కార్యములు) 19:38,39 దేమేత్రికిని అతనితో కూడ నున్న కమసాలులకును #ఎవని_మీదనైనను_వ్యవహారమేదైన_ఉన్నయెడల_న్యాయసభలు_జరుగుచున్నవి, #అధిపతులు_ఉన్నారు గనుక వారు #ఒకరితో_ఒకరు_వ్యాజ్యెమాడవచ్చును. అయితే మీరు #ఇతర_సంగతులను_గూర్చియేమైనను_విచారణ_చేయవలెననియుంటే #అది_క్రమమైన_సభలో_పరిష్కారమగును.

 

 తోడేళ్ల మధ్యలోకి గొఱ్ఱెలను పంపినట్టు ఆయన పంపితే విల్లు మాత్రం తోడేళ్ల మధ్యలోకి తోడేళ్ళుగా వెళుతున్నారు, తోడేలు మాస్క్ తీసి గొఱ్ఱె మాస్క్ వేసుకొని వెళ్లయ్యా బోధకా అంటే ఏ నీకు రోషం లేదా దమ్ములేదా అంటారు. నీ రోషం నీ దమ్ము తగలెట్టా ఆ యేసుకు తెలీదా నీకు దమ్ము రోషం ఎక్కించి తోడేళ్ల మధ్యకు పంపాలని? మనకు అనుకూలమైన బోధలకు మారులుకొల్పబడి వాటిని కాపాడుకోడానికి మనకు నచ్చిన మాటలు మాట్లాడుతాము.
Matthew(మత్తయి సువార్త) 10:16 *ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.*
Romans(రోమీయులకు) 16:19 *మీవిధేయత_అందరికిని_ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును,* *కీడు_విషయమై_నిష్కపటులునైయుండవలెనని_కోరుచున్నాను.*
Philippians(ఫిలిప్పీయులకు) 2:14 *మీరు_మూర్ఖమైన_వక్రజనము_మధ్య,* *నిరపరాధులును_నిష్కళంకులును_అనింద్యులునైన_దేవుని_కుమారులగునట్లు,*

మూర్ఖులు మధ్యలో మీరు అనిందులుగా ఉండాలి, నింద లేనివారిగా ఉంటేనే చట్ట సభల్లో న్యాయం జరుగుతుంది తప్ప లేకుంటే కఠిన శిక్షలు ఎదుర్కొంటారు.

బైబిల్ పక్కన పెట్టి మేము మా వ్యక్తిగతంగా వెల్లుతాము అంటే వారి గ్రంధాలు ముట్టినప్పుడు వాటిలో ఉన్నవే చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నదానికి మసాలా హేళన దూషణ కలిపి వారిని అవమానించకండి.

 సినిమా రచయితలు డైరెక్టర్లు నిర్మాతలు దేవుళ్ళ మీద తీసిన సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో వాళ్లేమో అసభ్య కరంగా చిత్రీకరించలేదు కానీ ఉన్నది ఉన్నట్టు తీసి ప్రజలకు లోపాలు చూపించారు అది మనకు తెలుసు. ఎదుటివాడు తొడ కోసుకున్నాడని మనం పీక కోసుకుంటే మనకే ప్రమాదం. వాడు ఏదో తీస్తే దానికి కౌంటర్ గా మనం ఏదో తీసి అల్లరికి కర్తలు అవడం అలవాటు అయిపోయింది. పైగా దీనికి దేవుని పక్షాన పోరాటం అనే ఒక పెరు పెట్టడం మాకు తెలీదు మరి ఏది దేవుడి పక్షాన పొరటమో?

 ఇంత రోషం పౌరుషం గల ఈ బోధకులు పల్లెల్లోకి విధుల్లోకి వెళ్లి సువార్త చెప్పగలరా? చెప్పలేరు కానీ రోషం పౌరుషం వాళ్ళకే ఉన్నట్టు మాట్లాడుతారు.

*హాని జాన్సన్ గారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఆయన వచ్చాక మరలా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీయకుండా ఉండాలని ఆశిస్తున్నాను, ఆయనే కాదు అలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీసే ప్రతి ఒక్కరు ఇలాంటివి మానుకోవాలి. సాధ్యమైతే సమాధానాలు చెప్పి వదిలేయండి.*


 ఈరోజు పల్లెల్లో ఊర్లల్లో పట్టణాల్లో సువార్త చెప్పకుండా మనమే చేసుకుంటున్నాము.

ఈ పోస్ట్ ఎంత మంది వెతిరేకిస్తారో నేను లెక్క చేయను వెతిరేకించే ప్రతివాడు లేఖనాలతో వెతిరేకించండి స్వాగతిస్తాను, సంతోషిస్తాను. కొందరికి చదవగానే బాధగా కోపంగా ఉండొచ్చు దానికి నేను కారణము కాదు లేఖనం అలా చెప్పుతుంది కాబట్టి మీ కోపం ఆ లేఖనాలు రాయించినవాడి మీద చూపిస్తే నేను ఇంకా స్వాగతిస్తాను.  దూషించే వాడు వాడి పనే అది కాబట్టి వాడిని ఏమి చేయలేము.
 

Biblical Thinker

 


o
Share/Bookmark

సమరయ స్త్రీ

Posted by Veeranna Devarasetti Tuesday, July 27, 2021 0 comments

 

 

 


 


యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది.
👉అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, అంటరానివారుగా పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.

👉 *సమరయ అనగా Watch Tower (కాపలా కోట). అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది.*

ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకోనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు.
*ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.*(2రాజులు 17: 24-41).

👉ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18).

👉 అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యేశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు.

👉అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు.
*ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది.* ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.

👉 *అయితే ఇటువంటి అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు.*

ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం!
ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!

*ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా?*

*అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా?*

*నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా?*

*నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా?*

👉 భయపడొద్దు!
*పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు.*

ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.

*ఆయనకి నీవుకావాలి!*
👉 *ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు.*

👉ఆయన వద్దకు వస్తావా?
*వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు.*

*హల్లెలూయ...*

 (రెండవ బాగము)

ప్రియ సహోదరీ/సహోదరులారా! మధ్యాహ్నం ఇంచుమించు 12గంటల సమయంలో యేసుప్రభులవారు సమరయ ప్రాంతంలో సుఖారు గ్రామ పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసియున్న రీతినే కూర్చోన్నట్లు చదువుకొన్నాం.

యోహాను 4: 6,7 వచనాలు. *అప్పుడు సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు రాగా యేసు- దాహమునకిమ్మని ఆమెనడిగెను.*


*ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయస్త్రీ నీరుకోసం బావిదగ్గరకు వచ్చింది.*

పల్లెటూర్లలో (పూర్వకాలం) స్త్రీలు వేకువఝామున లేచి మంచినీరుకోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఉదయం 7గంటల తర్వాత ఎవరు బావికి రారు. ఆ సమయానికి ఆ రోజుకి సరిపడే నీళ్ళు తెచ్చేసుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు.

👉కాని ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి?

1. తెచ్చుకొన్న నీరు అయిపోయిందా?
*తర్వాత వచనాలు ప్రకారం ఎంతమాత్రము కాదు.*

2. Privacy కోసమా? ఒంటరితనం కోసమా? ఏమో తెలియదు. ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన?

3. ఆ సమయంలో ఎవరూ బావి దగ్గర ఉండరని తెలిసా? ఏం ఎందువల్ల?

4. తన పాపపు జీవితం కొనసాగించడానికి అదే మంచి సమయమనా? ఏమో! మనకి తెలియదు.

5. *లేక తనజీవితాన్ని ఎరిగియున్న ఊరిజనం తనని సూటిపోటి మాటలతో భాదిస్తున్నందువలన వారిని తప్పించుకోడానికి ఆ సమయంలో వచ్చిందా?* మనకి తెలియదు.

*పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాటిరేవు(బావి)దగ్గర చెబితే కొంతసేపటకి ఊరంతా ప్రాకిపోతుంది, ఉన్నదానికి ఇంకొంచెం కలిపి చెప్పేవారు!! ఈమె గూర్చి కూడా అలా చెప్పుకోన్నారేమో!!*

6. లేక ప్రజలకి తన జీవితం ఎలాంటిదో తెలియక పోయినా తన అంతరాత్మ గద్దింపుతో ప్రజలకి తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో!!

👉 ఒకవేళ ప్రియ చదువరీ! నీవుకూడా అదే పరిస్తితిలో నున్నావా? చింతపడకు!

*ఇలాంటి స్తితిలో నున్న ఒక స్త్రీని రక్షించడానికి యేసయ్య అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆస్త్రీతో మాట్లాడారు.*

ఈలోకంలో ఎవరికీ మనజీవిత రహష్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు.

*ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే యేసయ్య అక్కడికి వెళ్లి రక్షణను అందించారు.*

*నాయీను గ్రామంలో* విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడచి (కపెర్నహూము నుండి నాయీను కి సుమారు 32 కి.మీ.) ఉదయాన్నే ఆ గ్రామం చేరుకొని ఆ విధవరాలి కుమారున్ని బ్రతికించి ఇచ్చారు.

*యేసయ్యని చూడాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య* కోసం ఆ ఊరు వచ్చి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్న జక్కయ్యను పేరుపెట్టి మరీ పిలచి అంటున్నారు – జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బసచేయవలసి ఉంది.

👉 *మనం చేసే ప్రతీ ఆక్రందన ప్రతీ ప్రార్ధన ఆయనకు వినబడుతుంది.*

👉 *నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను.*

*నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య,జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య, నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.*

👉 అయితే గమనించ వలసినది ఏమిటంటే

*“దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.”*

👉 దురదృష్టవశాత్తూ మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాము. కాని దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా మరల వస్తుంది.

*అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారం.*

👉కాబట్టి బెదరిపోకు!
👉 అలసిపోకు!
👉 సోలసిపోకు!
*దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు.*

*సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేల కలసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నారు.*

*సమరయ స్త్రీ ఒకతె నీల్లుచేదుకొనుటకు అక్కడికి రాగా యేసు- నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.*
యోహాను 4:7
👉ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి.

1⃣ *యేసుప్రభులవారు దైవమానవుడు*.
ఆయన సశరీరుడుగాఈలోకంలో జన్మించినందువలన *రెండుసార్లు ఆయన దప్పిగొనినట్లు బైబిల్ గ్రంధంలో చూస్తాం.*

ఒకసారి యాకోబు బావి దగ్గర, రెండవసారి సిలువలో వ్రేలాడుచున్నప్పుడు లేఖనం నేరవేర్పుకై. ఆయన నీలా నాలా దప్పిగొన్నారు.

*మనం నిజంగా పరిశీలిస్తే ఆయన నిజమైన దాహం ఆకలి ఏమిటి?*

👉 ఇదే అధ్యాయంలో వ్రాయబడింది
*నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించడమే ఆయన దాహం, ఆకలి!!!*

👉క్రీస్తులో రక్షించబడి వెలిగించబడిన ప్రియ చదువరీ!
*నీకు ఆ దాహముందా??! లేకపోతె ఇప్పుడే పొందుకో!*

2⃣ *సమరయ స్త్రీ యొక్క ఇతరులను గౌరవించే/ మర్యాద నిచ్చే లక్షణం*:
క్రింది వచనాలు చూసుకొంటే ఎప్పుడైతే యేసయ్య దాహమునకిమ్మని ఆమెనడిగారో, వెంటనే ఆమె అశ్చ్యర్యపోయింది.

మొదటి బాగంలో చెప్పిన విధముగా అనేక వందలాది సంవత్సరాలునుండి యూదులకు, సమరయులకు వైరం, శత్రుత్వం.
*అయితే ఇక్కడ శత్రువు మొట్టమొదటగా కనబడి ఏమైనా సహాయం అడిగితే- శత్రువు మీద ప్రతీకారం చేయకుండా, సూటిపోటి మాటలాడకుండా ఎంతో నమ్రతతో అడుగుతుంది*

యేసయ్యను- యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహనమునకిమ్మని ఎలాగు అడుగుచున్నావు?

ఎందుకంటే మనం యూదులు తాము గొప్పవారమని- సమరయులు పాపులని, అంటరానివారని పరిగనిస్తున్నట్లుగా చదువుకొన్నాం కదా! అందుకే ఆమె అలా అడిగింది.

మరో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ సంభాషణ అంతటిలో
*ఆమె యేసయ్యని – అయ్యా! అని సంభోదిస్తుంది.*

యేసయ్య జాతిప్రకారం ఆమెకు శత్రువైనా ఎంతో గౌరవం ఇస్తుంది.

*ప్రియ చదువరీ! నీలో నాలో అటువంటి మంచి లక్షణం ఉందా?*

👉 ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసయ్య కి నీరు/దాహమునకివ్వడానికి సిద్దపడింది.

👉అయితే ఇక్కడ మరో చిక్కు.
*సమరయుల నీటిని ఆహారాన్ని యూదులు సేవించరు!*
సరికదా వారి వస్తువులను కూడా తాకరు. అందుకే మరోసారి అడుగుతుంది

🔺 అయ్యా! మీరు మా వస్తువులు ముట్టుకోరు కదా! మీకు నీరు చేదుకోడానికి చేద/బొక్కెన లేదు కదా! మరి నాకు ఎలా జీవజలం ఇస్తారు అని!

🔺 ఇక్కడ ఆమెకు యేసయ్య జవాబిచ్చారు
*తన నిజమైన దాహం ప్రజలకు నిత్యజీవం ఇవ్వడం, నిత్యరక్షణ, నిత్యరాజ్యం ఇవ్వడమే తన దాహం అని చెప్పారు!*

3⃣ *సమరయ స్త్రీకున్న లేఖనాల మీద అవగాహన- చరిత్రమీద అవగాహన*:

ఈ 4వ అధ్యాయం పూర్తిగా చదివితే ఈ సమరయస్త్రీ కి లేఖనాలమీద ఎటువంటి పట్టు ఉందొ తెలుస్తుంది.

1).12వ వచనం ప్రకారం ఆబావి తానును తనకుమాల్లును ఈ బావి నీళ్ళు త్రాగి, మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటే నీవు గొప్పవాడివా? అని అడిగింది.
ఇక్కడ అది యాకోబు బావి అని మొత్తమందరికీ తెలుసు.

👉అయితే ఆమె యేసయ్యతో ఏమంటుంది?
*మనతండ్రియైన యాకోబు. అంటే యూదులకు సమరయులకు అందరికీ తండ్రి యాకోబు.*

🔺 పరోక్షంగా చెబుతుంది నీవు నేను అందరం ఒకే తండ్రి బిడ్డలం. ఒకే దేవుని బిడ్డలం. అయితే మీరు మమ్మల్ని అంటరానివారుగా చూస్తున్నారు.

👉 ప్రియ చదువరీ! *ఇదేమాట సమరయస్త్రీ నిన్ను నన్ను అడుగుతుంది నీలో నాలో కూడా ఇంకా అంటరానితనం అనే దుర్ఘుణంఉందా?*

🔺ఈలోకంలో ఎవరూ అంటరానివారు లేరు!
🔺అందరినీ దేవుడు ఒకేలాగా ప్రేమిస్తున్నారు.
*చెడ్డవారిని చూసి వ్యసనపడకుము* అని లేఖనం సెలవిస్తుంది కీర్తనలు 37:1 లో.

2) 20వ వచనం ప్రకారం
*తనకు చరిత్ర తెలుసు.* ఇంతకముందు చెప్పినట్లుగా సమరయులు *మొదట గెరీజీము కొండపై* ఒక మందిరాన్ని కట్టుకొంటే ఒక యూదు రాజు దానిని పడగొట్టేశాడు.

అప్పుడు సమరయులు షెకెము కొండమీద మందిరం కట్టుకొని ఆరాధిస్తున్నారు, అదే విషయం ఆమె చెబుతుంది. యేసయ్య అన్నారు.
*కొండమీద కాదు , ఆయనని ఆరాదించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించాలి అని.*
3) 25వ వచనం ప్రకారం
*క్రీస్తు అనబడే మెస్సీయ వచ్చునని నాకు తెలుసు.* ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేయును.

ఈవచనం ప్రకారం మనకు క్షుణ్ణంగా అర్ధమయ్యేదేమిటంటే
👉 *తన జీవితం ఎలాంటిదైనా గాని ఆమెకు దైవభక్తి, లేఖనాలు చదివే అలవాటుంది.*

👉మెస్సీయా వస్తాడనే నిరీక్షణ ఉంది. అందుకే మొట్టమొదటగా
*బైబిల్ లో ఆమెతోనే చెప్పారు యేసయ్య – ఆ మెస్సీయను నేనే అని!!!*

ఇంతవరకు సమరయస్త్రీ ఒక వ్యభిచారని, కేరెక్టర్ లేని వ్యక్తి అని విని ఉండొచ్చు!

*ప్రియ చదువరీ! ఆమెలో ఉన్న మంచి లక్షణాలను చూడు. ఆ మంచి లక్షణాలు నీకున్నాయా?*

🔹 శత్రువుని ప్రేమించే లక్షణం,
🔹 గౌరవం ఇచ్చే లక్షణం,
🔹 ప్రతీకారం చేయకుండా క్షమించే లక్షణం,
🔹లేఖనాలు చదివే లక్షణం నీకున్నాయా?
*పరీక్షించుకో! లేకపోతె ఇప్పుడే అలవరుచుకో!!!!*

*హల్లెలూయ...*


♻️ *సమరయస్త్రీ-గొంగళిపురుగు...✍️*
       
        మనం కొన్నిరోజులనుండి సమరయస్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం.

*“దుష్టులు మరణము  నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా ? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము: ఇదే ప్రభువగు యెహోవా వాక్కు”* యెహెజ్కేలు 18:23


👉 చలా తరచుగా కొందరు ఇలా అంటారు

*“నాకు దేవుడు బాగా అర్ధం అయ్యారు కానీ,ఈ దేవుని వాక్యమే అర్ధం కావటం లేదు”* అని....
👉 మరికొందరు
*“నాకు దేవుని వాక్యం చాలా బాగా అర్ధం అవుతుంది కానీ; ఆ దేవుడే సరిగ్గా అర్ధం కారు”*
 అని.
ఈ వైఖరి ముమ్మాటికి తప్పు. ఎందుకంటే....
👉దవుడు, దేవుని వాక్యం ఎప్పుడూ సమాంతరంగానే ఉంటాయి.

మనం పూర్తిగా దేవునిని తెలుసుకోవటానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రధానమైన ఆధారం *“ఈ దేవుని వాక్యం”.*

*దేవుని గుణలక్షణాలను గురించి తెలుసుకోవాలా..?*
📔దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని ప్రేమ యొక్క పరిధి ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
 *దేవుని కోపం యొక్క తీవ్రత ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
 *దేవుని కృప యొక్క వైశాల్యం ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని శక్తీ యొక్క సామర్ధ్యం ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని నమ్మకత్వం యొక్క దృఢత్వం ఎంతో తెలుసుకోవాలా..?*
 📔దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని జ్ఞానం యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని పరిశుద్ధత యొక్క ఉన్నతి ఎంతో తెలుసుకోవాలా....?*
 📔 దవుని వాక్యం చెబుతుంది.

👉దవుని గురించి మీరు ఏం తెలుసుకోవాలన్న సరే; సరిగ్గా, సులువుగా, అద్భుతంగా, ఉన్నది ఉన్నట్లుగా
ఈ *“బైబిల్“* ఈ పరిశుద్ధగ్రంధం తప్ప ఇంక ఏదియు చెప్పనేలేదు.

*మోషే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నపుడు*
👉 ఆ దేవాధి దేవుడిని చూడాలి అని మనవిచేసి కోరినప్పుడు,
👉ఆ దేవుడు మోషేకి తననుతాను బయలుపరచుకున్నారు..
 *దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యేక్తిగా మోషే మారిన సందర్బం అది....*
 అది ఒక అద్భుతం.
👉 దవుడు తన ముఖాన్ని మోషేకి చూపించలేదు కానీ....
🔺 తన మంచితన్నాన్ని మోషేకి చూపించారు.
🔺తన మహిమను మోషేకి చూపించారు.
🔺తన నామమునకు ఉన్న విశిష్టతను మోషేకు ప్రకటించారు.
*పూర్తిగా తన గుణలక్షణాలను మోషేకు వివరించారు.*
 నిర్గామ 33:18-23

*మోషే దేవుని గుణలక్షణాలలోనుండి దేవుని పూర్తిగా తెలుసుకోగలిగారు అందుకే దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యక్తిగా మోషే మారాడు.* ద్వితియో 34:12

👉దవుని గుణలక్షణాలు అనేవి దేవునిని మనం తెలుసుకోటానికి ఉపయోగపడతాయి.
ఇప్పుడు ఇది ఈ *"బైబిల్ "* ద్వారా మాత్రమే... సాధ్యం.

అలాటి దేవుని గుణలక్షణాలలో
ఒ క లక్షణం
*“దుష్టులు తమ దుష్టత్వంలోనే మరణించటం, పాపి తన పాపంలోనే మరణించటం ఆ దేవాధి దేవునికి ఇష్టంలేదు”*

👉 దవుడు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని కాదు....
👉 దవుడు పాపాన్ని చంపుతారు కానీ, మారిన పాపిని కాదు....
🔹సర్వసమాజంలో పాపంపట్ల భయం కలుగునిమిత్తం,
🔹 మరణభయం వల్ల ప్రజలు పాపం నుండి దూరంగా వెళ్ళటం కోసం పాత నిబంధనలో దేవుడు కొన్ని మరణాలను అనుమతించారు.
👉 కనీ *అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు దేవుని ఉద్దేశం పాపి మారాలని మరుమనస్సు పొందాలని అంతేకాని ఒక పాపి ఆ పాపంలోనే మరణించాలని కాదు.*

 యేసుప్రభులవారు  పాపియైన సమరయస్త్రీని రక్షించిన విధానం మనం ధ్యానిస్తున్నాం.
యోహాను 4: 7-9

👉 *నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను.*

*నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య,జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య, నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.*

👉   అయితే గమనించ వలసినది ఏమిటంటే

*“దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.”*



*సమరయస్త్రీని బైబిల్ పండితులు గొంగళిపురుగుతో పోలుస్తారు. గొంగళిపురుగులాగానే మార్చబడిన జీవితం సమరయస్త్రీది.*

👉 *మొదటగా మనం గొంగళిపురుగు పురుగుకోసం చూద్దాం!*

👉ఇది ఎవరికీ ఇష్టం లేని ఒక అసహ్యమైన పురుగు. ఒంటినిండా ముళ్ళు, ముట్టుకొంటే చాలు గుచ్చుకోపోతాయి. చూస్తేనేచాలు చంపాలి అనిపిస్తుంది. పిల్లలు దానిని చూస్తే జడుసుకొంటారు. చివరకి పక్షులుకూడా వాటిని తినడానికి ఇష్టపడవు.

 అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని, త్వరత్వరగా ఎదుగుతాయి. అలుపులేకుండా ఆహారం కోసం తిరిగి పచ్చదనాన్ని ఖాళీచేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలసి చెట్టు కాండానికి పట్టి, మొదటగా చెట్టుబెరడును, తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి. ఈరకంగా మొక్కలను పాడుచేసే ఒకరకమైన చీడపురుగు!
 ఇంతవరకూ వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు!   

అయితే గొంగళిపురుగు పెద్దదైన తర్వాత దానికి ఒకరకమైన భయంకరమైన నిద్రముంచుకొస్తుంది. దానికోసం అనువైన ప్రాంతంకోసం ఎత్తైన,ఎవరూ తన నిద్రను భంగం కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని, అక్కడ తన నోటినుండి లాలాజలంతో తనచుట్టూ ఒక గూడు కట్టుకొంటుంది. ఒకసారి గూడులోనికి వెళ్ళిన తర్వాత ఆహారం, లోకాన్ని మరచిపోయి సుదీర్ఘమైన నిద్రపోతుంది.
*ఆ నిద్రలో తనకి రూపాంతరం జరుగుతుంది.*

 *నవజీవనం కలుగుతుంది. గొంగళిపురుగుగా చనిపోయి అందమైన సీతాకోకచిలుకగా బయటికి వస్తుంది.*

 *నేలమీద, చెట్లుమీద ప్రాకే పురుగు ఇప్పుడు ఆకాశంలో రెక్కలతో ఎగురుతుంది.*

 *ఒకరోజు అందరూ తనని చూసి అసహ్యించుకొన్న గొంగళిపురుగు, మరల మరల చూడాలనిపించేటట్లుగా మారిపోతుంది.*

 *పిల్లలు చూసి జడుసుకొనే పురుగు, పిల్లలు తన వెంటపడే విధంగా మారిపోయింది.అయితే అది అలా మారడానికి చాలాశ్రమ పడింది.*

 👉 *ఇక సమరయస్త్రీ జీవితంలో కూడా ఇదే జరిగింది.*
 
▫️ఒకరోజు ప్రజలతో వ్యభిచారిగా,
▫️కరెక్టర్ లేని స్త్రీగా,
▫️ బజారుమనిషిగా,
▫️ అంటరానిదానిగా,
▫️ వలివేయబడిన దానిగా ఎంచబడ్డ సమరయస్త్రీ-

 *బావిదగ్గర యేసయ్య దగ్గర రక్షణ పొందింది. తనపాపపు కుండను అక్కడే వదలివేసింది. భయంకరమైన వ్యభిచారం, అబద్దాలు, ఎందరినో తన కంటిచూపుతో ఆకర్షించిన తన మొహపుచూపు అన్నీ వదలివేసింది.*

👉 గంగళిపురుగుకుండే ముళ్ళు పోయి రెక్కలు వచ్చి ఎగరడం ఎలా ప్రారంభించిదో, అలానే *పాపపు జీవితాన్ని విడచిన సమరయస్త్రీ- సాక్ష్యార్ధమైన బ్రతుకు కలిగింది.*

 👉అందరూ చీదరించుకొన్న సమరయస్త్రీని ఇప్పుడు అందరూ కావాలని కోరుకోనేలా మారిపోయింది. *గ్రామానికి ఒక Role Model గా,ఒక వెన్నెముకుగా మారిపోయింది.*

*ఎప్పుడూ?*

*యేసయ్యని ఆహ్వానిచినప్పుడు!*

*పాపాన్ని విడచిపెట్టినప్పుడు!*

*తన పాపపుజీవితాన్ని సిగ్గువిడచి అందరికీ చెప్పినప్పుడు!*

  👉  సమరయస్త్రీని మార్చిన దేవుడు నిన్నుకూడా మార్చగలరు.
నీ జీవితంలో కూడా గొప్ప అధ్బుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

*అయితే ఆయనకీ నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి!*

  *గొంగళిపురుగులా ఆ గూడులో సమాధి అయిపోవాలి.*

 *నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని, దానిని భాప్తిస్మం ద్వారా సమాదిచేయాలి!*

 *అప్పుడు క్రీస్తులోనికి భాప్తిస్మం పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు!*
*పునరుత్థానం పొందుతావు.*
(రోమా 6:3-9)

👉అప్పుడు నీజీవితం సీతాకోకచిలుకలా మారిపోతుంది.
▫️నభాష,
▫️న ప్రవర్తన,
▫️న అలవాట్లు అన్నీ మారిపోతాయి.

*ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయంత్నిచిన సమరయస్త్రీ రక్షించబడి,*

 *ఎలా ప్రజలకి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిందో,*

👉 అలాగే నీ జీవితంలో కూడా పాపం, అబద్దాలు, త్రాగుడు, చెడు అలవాట్లు అన్నీ పోయి గొంగళిపురుగు- సీతాకోకచిలుకలా పరివర్తన చెందినట్లు,
*పాపివైన నీవు కూడా నూతనసృష్టిగా మారిపోతావు!*

👉   *ఆమార్పు నీకు కావాలా?*

👉 *అయితే నేడే యేసునొద్దకు రా!*
 
*నీ జీవితాన్ని ప్రభుకివ్వు!*

 *ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో!*
 *దేవుడు నీ జీవితంలో అధ్బుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు!*

👉ఈ సమరయస్త్రీ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారని ఆశిస్తున్నాను.
సమరయస్త్రీ పొందుకొన్న భాగ్యం మనందరికీ మెండుగా కలుగును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


 

o
Share/Bookmark

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures