ఇది నిజమా? అది నిజమా? pdf Download
బైబిల్ గ్రంధంలో దానియేలు 3:14 వచనములు చూసినట్లయితే
అంతట నెబుకద్నెజరు .. వారితో ఇట్లనెను షద్రకూ, మేషాకూ, అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది. అది నిజమా?
ప్రియమైనవారులారా పైన ఉన్న లేఖనము మనము ఎన్నోసార్లు చదినాము, ఎంతో మంది భక్తులు తమ ప్రసంగాల ద్వారా మనకు బోధించారు. ఈ కథను మనం ఎన్నోసార్లు విని ఉంటాము.. సారీ! ఇది కథ కాదు.. జరిగిన వాస్తవం. అయినా ఈరోజు దీని గురించి తెలుసుకుందాం
తెలిసిన విషయాన్ని, మళ్లీ తెలిసిన వాళ్ళకి చెప్పడం కొద్దిగా కష్టం. అదే తెలియని విషయం అయితే దానిని అందంగా చెప్పవచ్చు, కానీ ఎదుటి వ్యక్తికి ఆ విషయం ముందే తెలిస్తే, ఆ విషయం గురించి మనం చెప్పడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది.
కానీ… ఆశ్చర్యం ఏంటంటే. బైబిల్ అనేది, ఎన్నిసార్లు చదివినా అందులో నుంచి, ఇంకా కొత్త విషయాలు బయటకు వస్తాయి. చదువుతున్న కొద్ది, కొత్త మర్మాలు తెలుసుకుంటాము. అదే కొన్ని పుస్తకాలు చదివితే, ఒకటి రెండు సార్లు, మరొకసారి మనం ఆ పుస్తకాలను చదవలేం, కానీ బైబిల్ అంటారా అలాంటి పుస్తకం కాదు. అది పరిశుద్ధ గ్రంథం, పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతాడు. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన గ్రంథం ఏమిటంటే అది బైబిల్, అది మన దగ్గర ఉంది. అది జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది, అది మనం రోజు క్రమంగా చదివినట్లయితే మనం ధన్యులం.
సరే విషయానికి వద్దాం.
నెబుకద్నెజరు .. సంఘటన! మీకు తెలుసు నేను ఆ సందర్భం గురించి ఇక్కడ ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. కానీ నెబుకద్నెజరు .. ఒక మాట అంటున్నాడు అది నిజమా? అని. ఈ మాట మనము ఎక్కడో విన్నట్టు ఉంది కదా! ఆదికాండము మూడో అధ్యాయం మొదటి వచనంలో ఇది నిజమా? అని సర్పము, హవ్వతో అన్నమాట.
ఇది నిజమా? అది నిజమా? pdf Download
Tags: ఇది నిజమా? అది నిజమా? - దేవరశేట్టి జాన్ పీటర్, ఇది నిజమా? అది నిజమా?.

0 comments