*....ప్రభు బల్ల.....*
👉 *1. ప్రభు బల్ల అంటే ఏంటి?*
👉 *2.ఎందుకు తీసుకోవాలి?*
👉 *3. దేనికోసం తీసుకోకూడదు?*
అనే ఈ మూడు అంశాలు ధ్యానిద్దాము.
👉 మనకు చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది శనివారం తీసుకుంటారు. కొంతమంది మొదటి ఆదివారము & చివరి ఆదివారము తీసుకుంటారు.
*1కోరింథీయులకు 11: 23 - 32*
*నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి దానిని విరిచియిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.*
*ప్రభు బల్ల అంటే ఏమిటి?*
*యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను - పస్కాపశువును వధించి, హిస్సోపు కుంచె తీసుకొని, రక్తములో ముంచి, ద్వార బంధపు పైకమ్మికిని, రెండు నిలువ కమ్మిలకు ఆ రక్తము రాయవలెను. ఐగుప్తీయులను సంహరించుటకు వచ్చినపుడు ఈ రక్తము చూసి సంహరకుడు లోపలికి రాడు. దీనిని కట్టడగా ఆచరించవలెను*
(నిర్గమ 12:21-25).
*పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా, యేసు పేతురును, యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను*
(లూకా 22:7-8).
👉ఆ రోజు దేవుడు పస్కా బలికి సాదృశ్యముగా,
*బలి పశువుకి సరూప్యముగా రొట్టెను,*
*బలి పశువు రక్తానికి సరూప్యముగా ద్రాక్షరసాన్ని ఇచ్చెను*
(లూకా 22:17-20).
👉ఇకనుంచి ఆ రొట్టెను యేసు శరీరమునకు సాదృశ్యముగా,
👉 దరాక్షరసాన్ని యేసు రక్తానికి సారూప్యముముగా మనము తీసుకుంటున్నాము.
*ఈ ప్రక్రియనే ప్రభుబల్ల అంటాము.*
*ఎందుకు ప్రభుబల్ల తీసుకోవాలి?*
*మనము దీవుంచు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు_రక్తములోనిది త్రాగుటయే గదా?* (1కోరింథి10:16).
*ప్రభుబల్లలో పాలు పొందునపుడు అయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోనుచున్నాము.*
(1కోరింథి 11:24)
👉ఈ కార్యము ఆది సంఘం దినదినము,
ప్రతి ఇంట కుడుకొనుచు ఆచరించేవారు. (అపో. 2:42)
👉దనిని ప్రభువువచ్చు వరకు ఆచరించెదము.
(1కోరింథి 11:26)
👉 అయన మరణము ప్రచురించు చున్నాము.
(1కోరింథి 10:16-17)
👉 దనిలో పాలు పొందునపుడెల్ల మనలను మనము పరీక్షించుకుంటాము. (1కోరింథి11:28)
*ప్రభుబల్ల దేనికోసం తీసుకోకూడదు?*
*పాపాలు క్షమింపబడుటకు కాదు.*
👉పపాలు కేవలం మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందితేనే పాపాలు క్షమింపబడతాయి.
*శరీర ఆరోగ్యంకోసం కాదు.*
👉పరభుబల్ల వలన శరీర ఆరోగ్యము రాదు, నిత్య జీవము కలుగును.
(యోహాను 6:53-59)
*ఇది దేవుని శరీరం రక్తం అని కాకుండా అయోగ్యముగా స్వీకరిస్తే బలహీనులము రోగులము అవుతాము*
(1కోరింథి 11:30)
👉తలియక కొందరు రక్షణ, ఆశీర్వాదము,
👉రగ విముక్తి కొరకు,
👉 సమస్యల పరిష్కారము కొరకు,
👉ఫలహారం కొరకు ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు.
*అలా కాకుండా నిర్దోషమైన చేతులతో ప్రభు బల్లలో పాలు పంచుకుందము.*
*అయోగ్యులముగా కాక ప్రభుబల్లకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని, యోగ్యులగా ప్రభుబల్ల_సమీపిద్దాము.*
👉 అప్పుడే నిత్యజీవ పాత్రులము అవుతాము. అటువంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*
o

ప్రభు బల్ల
✝️పరభు మరణము,యొక్క ఉద్దేశము ఏమిటి? మన కొరకు యేసు ఎందుకు మరణించవలసి వచ్చెను?
పారిపాలించే నాయకులు
దైవదూషణ నిమిత్తం –తాను దేవుడని చెప్పినందుకు—యేసును సిలువవేసారు. అందు నిమిత్తం వారు ఆయనను హతమార్చారు. కాని, వారు నిజముగా దానికి అధిపతులుగా ఉన్నారా?
*✝️సలువ వేయబడుటకు* ముందు, అనేక సార్లు యేసు, తాను సిలువవేయ బడుదునని శిష్యులకు చెప్పాడు. వారి పాపముల క్షమాపణ నిమిత్తం ఆయన దానిని ఇష్టపూర్వకంగా చేస్తున్నానని ఆయన అన్నాడు.
*ఒక మెస్సీయ, రక్షకుడు* వస్తాడని ప్రవక్తలు ప్రకటించారు. ఆయను గూర్చి (యెషయా53:5)లో ఇలా వ్రాసాడు:
*మన* *యతిక్రమక్రియలనుబట్టి* అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యెహోవా మన యందరి దోషమును అతనిమీద మోపెను.
*(యెషయా53:6)*
*వారి పాపములకు* తాత్కాలిక ప్రాయశ్చిత్తం నిమిత్తం ప్రతి సంవత్సరం యూదులు ఒక గొర్రె పిల్లను బలిగా అర్పించేవారు.
*యేసు వచ్చినప్పుడు,* బాప్తిస్మమిచ్చు యోహాను ఆయనను గూర్చి సరిగా చెప్పాడు
*👉“యోహాను 1:29*
ఇదిగో లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల.
*”యేసు మన* పాపములను తీసుకొని మన స్థానంలో వాటి కొరకు మరణించాడు. మన కొరకు మన శిక్షను ఆయన తీసుకున్నాడు.
*అయితే, యేసుప్రభు*
కేవలం మానవాళికి ప్రాతినిథ్యం వహించిన ఒక ప్రవక్త మాత్రమే కాదు.
*యేసు తన దైవత్వమును* గూర్చి స్పష్టముగా మాట్లాడెను. ఆయన *సృష్టికి ముందు ఉన్నానని,* పాపములను క్షమించుటకు,
*ప్రార్థనలకు* జవాబిచ్చుటకు మరియు నిత్యజీవమును ఇచ్చుటకు తనకు శక్తి ఉందని యేసు చెప్పాడు.
*మరలా, తాను దేవుడని* చెప్పినందున మాత్రమే యూదుల అధికారులు ఆయనను సిలువవేసారు.
*అయినను*
యేసు ఒక రుజువును చూపించాడు. కేవలం యేసు సిలువవేయబడుటకు కొన్ని వారముల ముందే,
*యేసు స్నేహితుడైన* లాజరు మరణించాడు. ఆయన మరణించి నాలుగు దినములైన తరువాత, యేసు బహిరంగంగా ఆయనను *మరణము నుండి* లేపాడు. ప్రతి నగరములో, యేసు ప్రతి రోగమును, ప్రతి అనారోగ్యమును స్వస్థపరచెను. ఆయన సిలువవేయబడుటకు ముందే అధికారులు ఈ విధంగా చెప్పారు, “ఇదిగో లోకము ఆయనవెంట పోయినది” మరియు “మనమాయనను ఈలాగు చూచుచు ఊరకుండినయెడల అందరు ఆయనయందు విశ్వాస ముంచెదరు.”
*(యోహాను 11:48)*
ఆయనకు అద్భుత శక్తి ఉన్నదని యేసు రుజువుచేసాడు.
*ఈ విషయం యొక్క* *వెలుగులో, కొరడా* *దెబ్బలు, తలలో ముళ్ళు,*కాళ్ళ చేతులలో*మేకులు* ఆయనను చంపలేదు. సిలువపై కలిగిన దీర్ఘ వేదన కూడా చంపలేదు. యేసు సిలువపై నుండి ఏ క్షణమైనా దిగివచ్చియుండవచ్చు.
*ఇది ఒకరు క్రిందికి*
వంగి తమ తల నీటిలో పెట్టి, ఏ క్షణమైనా తల లేపే శక్తి ఉన్నప్పటికీ కావాలని మునిగిపోవాలని ఎన్నుకొనే వానిని పోలియుంది. *యేసు మరణించాలని* *నిర్ణయించుకున్నాడు.*
ఆయన దీనిని గూర్చి స్పష్టముగా ఉన్నాడు.
*తన ప్రాణము పెట్టుటకు ఆయన నిర్ణయించుకున్నాడని* *యేసు చెప్పాడు.*
మన కొరకు. “తన స్నేహితులకొరకు తన ప్రాణము పెట్టువానికంటె ఎక్కువైన ప్రేమగలవాడెవడును లేడు”అని యేసు చెప్పాడు. కాని ఎందుకు?
*ఎందుకంటే ఆయన* మన హృదయాలను, మన క్రియలను చూచి, మనం రోగముతో, అవసరతతో, బలహీనంగా, పాపముతో నశించి ఉన్నామని గుర్తించాడు. ఇది మన గూర్చి యేసు చెప్పిన ఆలోచన, మరియు ఇది మనకు నచ్చదు. అయితే దీనిని గూర్చి ఆయన క్రియలు కూడా మనం చూడాలి. అది ఒక దూరం నుండి ఇచ్చే తీర్పు లేక శిక్ష కాదు. అది పాలుపంపులులేనిది, లేక జాలి లేనిదీ కాదు. మీరు ఆయనతో సమ్మతించినా లేకపోయినా,
*మనం గొప్ప అవసరతలో ఉన్నట్లు ఆయన చూశాడు.* మన జీవితాలు సరిగా పనిచేయకుండుట ఆయన చూశాడు. సంపూర్ణంగా లేక అయన మన కొరకు సృష్టించిన మంచితనంలో జీవించలేకపోవుట.
*మరియు, నిత్యత్వంలో* ఆయనకు వేరుగా మనం మరణించే ప్రమాదమును ఆయన చూశాడు
*నిత్య జీవమును ఎన్నడు అనుభవించకుండా. మన పాపము ద్వారా ఆయనకు దూరమగుట ఆయన చూశాడు.* మరియు మన అవసరతను తీర్చాలని ఆయన కోరాడు.
*మనం* కృతజ్ఞులమైనప్పటికీ, లేక కానప్పటికీ. మనం దాని అవసరతను చూచినప్పటికీ, చూడనప్పటికీ. మనము పొందవలసిన మరణ శిక్షను ఆయన తనపై వేసుకున్నాడు. ఇవి శ్రద్ధ చూపనివాని యొక్క క్రియలు కావు.
*మనం రక్షించబడాలని,* క్షమించబడాలని నమ్మి, ఆయన మన కొరకు గొప్ప శ్రమను అనుభవించాడు. సిలువపై యేసు, ప్రేమకు చిహ్నంగా మాత్రమే శ్రమపొంది మరణించలేదు. ఆయన ఆలోచన ప్రకారం, అది చాలా అవసరమైయుంది. మనమైనా మరణించాలి-మన పాపము వలన ఆయనకు నిత్యము దూరమై-లేక ఆయన మరణించాలి, మనం మరణించకుండా ఉండుటకు.
మనం క్షమించబడుటకు. మనం ఆయనను నిత్యత్వములో తెలుసుకొనుటకు.
*చెబుతుంది,*👇 మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును. అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను
*(రోమీ 5:8)*
*ఆయన మరణమునకు* కొన్ని గంటల ముందు, రానున్న సిలువ మరియు
*పునరుత్థానమును గూర్చి* పూర్తిగా తెలుసుకొనియుండి, తండ్రితో మాట్లాడుతూ యేసు తన ఆలోచనను చెప్పాడు. “నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.
*ఇది ఒక ముఖ్యమైన* ప్రశ్నకు దారితీస్తుంది: *మనం రక్షించబడవలసిన అవసరం ఉందా?* మనలో మనం చూడలేనిది *యేసు ఏమి చూశాడు?* ఆయన మన కొరకు సిలువలోనికి వెళ్లి, హింసించబడి, మరణించుటకు నిర్ణయించుకున్నాడు. ఇది ఎందుకు అవసరమైనది?
*మనం ఎక్కడ?* బలహీనంగా ఉన్నామో ఆయన చూసియుండవచ్చు. మన కోపం, ద్వేషం. మన అసహనం, మరియు గాయపరచు మాటలు మరియు క్రియలు. మనం ఇతరులకు విరోధంగా పాపము చేస్తాము, మరియు కొన్ని సార్లు మనకు విరోధంగా పాపం చేస్తారు. దేవుడు మనలను సృష్టించిన మంచితనమును చేయుటలో మనం విఫలమవుతాము. ఆయన విషయం మర్చిపొండి, మనం మన సొంత స్థాయినే అందుకోలేకపోతాము. నిజాయితీగా ఉన్నప్పుడు, మనమంటే మనకే అసహ్యం పుడుతుంది. కాబట్టి పరిపూర్ణమైన పరిశుద్ధ దేవుడు ఏమి చూస్తాడు?
*ఆయన మన నుండి* ఎందుకు వెళ్లిపోలేదు? ఆయన ఎందుకు వెనుకకు తిరగలేదు?
*మన పాపముల యొక్క* పరిణామాలను ఎదుర్కొనుటకు మనలను విడిచిపెట్టుటకు బదులుగా, ఆయన మన యొద్దకు వచ్చాడు.
*ఆయన మన లోకములోనికి వచ్చాడు.* ఆయన మన పాపముల యొక్క శిక్షను తీసుకొని స్వయంగా మన మరణమును అనుభవించాడు.
*అయినను దేవుడు* కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీసు కృపచేత మీరు రక్షింపబడియున్నారు.
*ఆయన మన పాపములను* చూడకుండా, దానిని ఒక మాటతో క్షమించే అవకాశం లేదా? అది మనకు సాధ్యముగా అనిపించవచ్చు, కాని మన పాపము ఆ విధంగా కొట్టివేయుటకు చాలా ఘోరమైనది. మన పాపం యొక్క తీవ్రత మరియు మన పట్ల ఆయన ప్రేమ వలన ఈ కార్యం జరిగింది.
*ఒకరిని క్షమించుట నుండి* వచ్చు బాధ మనమంతా అనుభవిస్తాము. మనకు విరోధంగా ఒక వ్యక్తి యొక్క పాపం ఎంత గొప్పదైతే, అంతగా ఆ వ్యక్తిని క్షమించుట కష్టమవుతుంది. యేసు మనలను నిత్యత్వములో ప్రేమించాలని ఆశించుచున్నాడు. మనం సంపూర్ణంగా, పూర్తిగా క్షమించబడాలని ఆయన కోరుతున్నాడు. ఆయన మనలను పూర్తిగా అంగీకరిస్తాడని మరియు మన పాపం ఇక మన మధ్య గోడగా ఉండవలసిన అవసరం లేదని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. "ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము."
*(రోమీ 6:23)*
*ఆయన మన పాపము* నిమిత్తం శ్రమపొంది మరణించాడు, దానిని పూర్తిగా అధిగమించి *మూడు రోజుల తరువాత మరణం నుండి తిరిగిలేచాడు.*
పాపం లేక మరణం ఆయనను ఆపలేదు. మరియు ఆయనలో మనం దానినే అనుభవించాలని ఆయన కోరుతున్నాడు. ఆయన అందించు క్షమాపణను అంగీకరించి, ఆయన వైపుకు నడచి, మనలను క్షమించి మన జీవితాలలోనికి ప్రవేశించమని ఆయనను అడుగుట మన సొంత నిర్ణయం.
*యోహాను" దీనిని బైబిల్* లో చక్కగా వర్ణిస్తున్నాడు, "మనయెడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగినవారమై దాని నమ్ముకొనియున్నాము; దేవుడు ప్రేమాస్వరూపియై యున్నాడు, ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు, దేవుడు వానియందు నిలిచియున్నాడు. తీర్పుదినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి యున్నది; ఏలయనగా *ఆయన ఎట్టివాడై యున్నాడో మనముకూడ* ఈ లోకములో అట్టివారమై యున్నాము."
మరణమునకు ముందు
*👉యేసు ప్రభు చేసిన* *ప్రార్థన/యోహాను17:25*👇
*నీతి స్వరూపుడవగు* తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగియున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.
*"యేసు, నా*
*నా పాపమును క్షమించి.*
*నా కొరకు సిలువలో మరణించినందుకు వందనాలు.🙏*
*నీ ఇష్ట ప్రకారం నా* జీవితాన్ని నడిపించు. నా జీవితములోనికి వచ్చి నీతో ఒక బంధమును ఇచ్చినందుకు వందనాలు. *ఆమెన్.”*
*ఆమెన్.”ఆమెన్.”*
*✍️మసహోదరుడు*
*ప్రభుదాస్.సంగిశెట్టి*
*మిర్యాలగూడ*
*Dist)నల్లగొండ*

యేసుక్రీస్తు మరణము, యొక్క ఉద్దేశము ఏమిటి?
ఎందుకు అంటే ఆయన సర్వశక్తి గలిగిన ,మహా దేవుడు కాబట్టి
క్రీస్తు" వారు కూడా తన శిష్యుల పాదములు కడిగిన సందర్భము మీరు చూడగలరు గొప్పవాడైన ఆయన అల్పులైన,ఎన్నికలేని వారీగా శిష్యులుగా ఎన్నుకొని వారి పాదాలు ఆయన ఎందుకు కడిగారు? తుడిచారు? ఆలోచించండి
అక్కడ మీరు గమనించవలసినది "తగ్గింపు " కలిగియుండుట అనేది మనకు నేర్పి మాదిరి చూపించారు
ఆయన వలె ప్రేమ తగ్గింపు, కరుణ ,దయ, జాలి, వివేకం, వినయం, ఓర్పు క్షమించేగుణం అన్ని మనము నేర్చుకోవాలని అని
👉 1.అందుకు యేసు నేను నిన్ను కడుగనియెడల నాతో నీకు పాలు లేదనెను
(యోహాను సువార్త 13:8)
👉 ఈ వాక్యము మీరు అర్ధం చేసుకోండి ఆయన ఎంత తగ్గించుకొని ప్రవర్తించారో అదే మాదిరి కరముగా క్రీస్తుని పోలి మనము కూడా తగ్గింపు ప్రవర్తన కలిగియుండాలని గ్రహిచండి
👉 2.కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన యెడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే.
(యోహాను సువార్త 13:14)
👉 ఈ వాక్యమును బట్టి మీరు అర్ధం చేసుకోండి ఒకరి యెడల ఒకరు తగ్గింపుకలిగి క్రీస్తును పోలి జీవించాలి అని గ్రహించండి
👉 ఏ వాక్యాలలో అయినా అనేక గూడార్ధాలు దాగి ఉంటాయి ఎవరికీ ఎలా అర్ధమయ్యేవిధముగా మాట్లాడాలో దేవుడు అలానే మాట్లాడతాడు కాబట్టి వాక్యం చదవండి"క్రీస్తును" పోలి ప్రతివిషయములోనడుచుకోండి ఏమంటారు ?

"క్రీస్తు" వారు తన "శిష్యుల పాదములు" కడుగుటకు గల కారణమేమిటో ?
1 పై ప్రశ్నను తెరపై తీసుకొచ్చింది హేతువాదులే కానీ క్రైస్తవులు కాదు. ప్రపంచములో ఎక్కువ శాతం మంది దేవునిని నమ్మేవారు ఉన్నారు అలానే దేవునిని నమ్మని వారు కూడ ఉన్నారు. నమ్మని వారిని నాస్తికులుగా, హేతువాదులుగా పిలువబడుచున్నారు. ఆత్మ అనేది లేదని, దయ్యము-దేవుడు అనేది మనుష్యులు కల్పించినవి అని వారి ఉద్దేశ్యము. చక్కగాసుఖించి అనుభవించవలసిన ఈ జీవితములో దేవుడని,ఆత్మని లేని పోని ఉహాలను కల్పించుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నది వీరి వాదన. లేని దేవునిని సృష్టించి , ఆ దేవుని పేరట మనుష్యులు వర్గాలుగా వీడిపోయి మత ఘర్షణలకు దిగి నరజాతిని నాశనం చేసుకుంటున్నారని వీరి అభిప్రాయము.
2 ఈ ప్రపంచాన్ని నాస్తికత్వంతో, హేతువాదంతో ఉద్దరించాలనే ప్రయత్నంలో దేవుడు లేడనే భావనను సమాజ ప్రజల మధ్యకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఏ గ్రంధాలను బట్టి వారు దేవుడిగా నమ్ముతున్నారో ఆ గ్రంధాలను తప్పని నిరూపిస్తే సులువుగా దేవుడు లేడని నిరూపించి నమ్మించవచ్చనే ఆలోచనలు కలిగియున్నారు. ఆ కారణముతో బైబిల్ చదువుట మొదలుపెట్టారు. బైబిల్లో తప్పులు ఉన్నాయని నిరూపిస్తే ఆ దేవుడు తప్పు అని సులువుగా నిరూపించవచ్చని వారి ప్రయాస. ఆ ప్రయాసలో వీరికి కనబడిన ప్రశ్నయే “ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు వేసినట్లు”
3 ఇకఈ అంశముపై వీరి ప్రశ్నలు చూస్తే దేవుడు ఆదాము-హవ్వలకు పండు తినవద్దని చెప్పడం దేనికి ? తిన్న తర్వాత ఇరువురిని పాపులుగా నిర్ధారించి బయటకు నెట్టడం దేనికి? ఆదాము పండు తీనుటకు కారణం చెట్టు ఉండుట వలనే కదా మరి ఒక వేళ చెట్టు లేకపోతే ఆదాము పండు ఎలా తినగలిగేవాడు? కనుక చెట్టు వేసింది దేవుడేనని, చెట్టు వేసి పండు తినడానికి ఆవకాశం ఇచ్చి, పండు తిన్నాడని నేరస్తుడని తీర్పు తీరుస్తుంది దేవుడే కదా? కనుక తప్పు ఆదాముది కాదు కానీ చెట్టు వేసి, పండు తినడానికి ఆవకాశం ఇచ్చి, పాపం చేయడానికి ప్రేరేపించిన దేవునిదే తప్పు అని ఇలా ప్రశ్నిస్తు అనేకమందిని సందేహములో నేట్టివేస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే చెట్టు వేసి మొదట దేవుడే తప్పు చేశాడని వీరి వాదన.
4 వాస్తవముగా క్రైస్తవులైన మనకు ఈ సందేహం ఉండి ఉంటుంది. అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు. ఒక ప్రక్క సందేహాన్ని మనస్సులో కప్పిపెట్టుకుని దేవునిని నమ్మాము అను చెప్పుకోవడం వేషదారణ అవుతుంది. కనుక మన విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలి అంటే బైబిల్లో ముందు మనకు ఏ సందేహాలు ఉండకూడదు. మనం సంపూర్ణముగా దేవునిని విశ్వసించుటకైనా దేవుడు ఎందుకు చెట్టు వేసాడో తెలుసుకోవాలి.
5 గలతీ 5:13-మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, గలతీ 5:1-ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి,క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు, 1 పేతురు 2:16-స్వతంత్రులై యుండియు,,,,, &యోహాను 8:36- కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. పై వచనాలలోని భావాన్ని ఆలోచిస్తే తన పిల్లలమైన మనకు స్వాతంత్రము ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దేవుడు మనకు స్వాతంత్రముఇవ్వకుంటే అప్పుడు మనం స్వాతంత్రులమా లేక బానిసలమా??? ఆలోచించండి.
6 ఆదికాండ 2:15 నుంచి-మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకు,దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా –ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నీరభ్యoతరముగా తినవచ్చును . అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు . నీవు వాటిని తిను దినమున నిర్చయముగా చచ్చేదవని నరునికి అజ్ఞాపించెను.... చెట్టు వేసింది దేవుడే. చెట్టు ఎందుకు వేసాడో, చెట్టు వేసాక దేవుడు తీనమన్నాడా లేక వద్దు అన్నాడా అని ఆలోచించాలి. చెట్టు వేసిన దేవునిని నిందించుటకు ముందు మనిషి తినుటకు ఎలాగు అధికారము కలిగియున్నాడో అలానే మాని వేయుటకు అంతే అధికారము కలిగియున్నాడని ఇక్కడ మనం గ్రహించవలెను. తినడానికి ముందు వచ్చు ఇతని జ్ఞానము తినకుండా ఉండుటకు ఎందుకు ముందు రాలేదు??
7 పరలోకమందున్న దేవుడు మనకు తండ్రి అని తెలుసు. ఈ లోకపు తల్లితండ్రులు వారి పిల్లల పట్ల తప్పుడు నిర్ణయం తీసుకోరనే సంగతి మనకు తెలుసు. వారి పిల్లల మంచి కొరకు తీసుకొను నిర్ణయాలు వాళ్ళకు అర్థం అయ్యిన లేక కాకపోయినా చివరికి అపార్ధం చేసుకున్న తల్లితండ్రులు ఎప్పుడు సరియైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రీతిగా పిల్లలకు వారి తల్లితండ్రులు తీసుకొను నిర్ణయాలు ఎలాఅర్థంకావో అలానే దేవుని నిర్ణయాలు వెంటనే మనకు అర్థం కావు. అయితే మన యెడల దేవుడు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎలా చెప్పగలము?
8 1 తిమోతి 3:10- మరియు వారు మొదట పరీక్షింపబడవలెను.తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.... సంఘములో పెద్దల నియామకం జరుగుతున్న సందర్భాన్ని గురించి ఇక్కడ పౌలు చెబుతున్నాడు.నియామకంకు మొదట పరీక్షి జరగాలి అని అర్థమవుతుంది. ఈ ప్రపంచములోని ఏ రంగంలోనైన ఉద్యోగం నిచ్చుట ముందు పరిక్ష పెడుతారు.
నేను నెల్లూరుకూ కలెక్టరవుతాను అంటే ప్రభుత్వం చేస్తుందా? చెయ్యదు. మొదట అర్హుడవో కాదో అని పరిక్ష పెడుతారు. ఒక వేళ పరిక్షనే లేకపోతే అర్హత లేని ప్రతి వాడు మందుకు వస్తాడు. పరిక్ష పెట్టి అందులో అర్హులుగా ఎంపికైన వారిని ఉద్యోగస్తులుగా ప్రభుత్వం ఎన్నుకుంటుంది. అలానే అదేను తోటలో దేవుడు ఆదాము-హవ్వాలను పరిక్ష పెట్టుట కొరకు చెట్టు వేసాడు.
9 ఎఫేసి 1:4,5-మనము తన యెదుట పరిశుద్దులమును ,నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయన క్రిస్తులో మనలను ఏర్పరచుకొనెను. .. పరలోకములో ఉన్న దేవుడు పరిశుద్దుడని, నిర్దోషుడని మనకు తెలుసు.రాబోవుతున్న తన పిల్లలమైన మనకు ఇలాంటి లక్షణాలు ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ఆశపడ్డాడు. పరలోకం వెళ్ళేవారు పైన చెప్పబడిన లక్షణాలు ఉండాలని దేవుడు ఆశ పడ్డాడు. కనుకపరలోకమునకుఎన్నుకొనుట కొరకు ప్రతి మనిషిని ఈ భూమి మీదకు పంపించాడు. ఒకవేళ ఇలా కాకపోతే తన పిల్లలమైన మనల్ని పరలోకంలో పుట్టించి అక్కడే పెట్టుచు కదా ? ఈ భూమి పై నీకు 60,70 ఏళ్ళ జీవిత కాలమును ఇస్తాను. బ్రతుకు కాలమంతయు నాలా పరిశుద్దుడిగా ,పవిత్రుడిగా బ్రతికితే అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడవు అని దేవుని ఆలోచన...
10 నిజముగా ఈ భూమి మీద మనకున్న జీవిత కాలం ఒక పరిక్ష కాలమే. ఆదాము పరలోకానికి అర్హుడా కాదా అని తెలుసుకోవడానికి పరిక్ష పెట్టాడు. ఆదాము గొప్పవాడని దేవుడు చెబితే మనం నమ్ముతామా? మనం నమ్మిన సాతాను మాత్రం నమ్మడు. ఆదాము గొప్పవాడని పరలోకమును దేవుడు ఇస్తే వెనువెంటనే సాతాను అనే మాట “ నీ కొడుకు గొప్పవాడని నువ్వు ఎలా నిర్దారిస్తావు? పరిక్ష పెట్టి నిరూపించు అంటాడు. కనుక ఆదాముకు దేవుడు చెట్టు వేసి పరిక్ష పెట్టాడు. చివరికి తినొద్దు అని చెప్పిన ,వద్దున్నది తినీ దేవుడు పెట్టిన పరీక్షలో విఫలమయ్యాడు. వాస్తవముగా పరీక్షలో తప్పాడంటే తప్పువిద్యార్ధినా లేక పరిక్ష పెట్టిన మాస్టర్ తప్పా? ఖచ్చితముగా విద్యార్ధి తప్పు అవ్వుతుంది.
11 పాపము చేయుటకు అవకాశమే లేనప్పుడు పాపము చేయని వాడు గొప్పవాడా లేక పాపము చేయుటకు అవకాశము ఉండి పాపం చేయని వాడు గొప్పవాడా? పై ఇరువురిలో ఎవ్వరు గొప్పవారని మీరు తలంచుచున్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము కనబడినప్పుడు,తినుటకు అవకాశము ఉన్నప్పుడు, ఆదాము తినకుండా ఉండినప్పుడు గొప్పవాడా లేక ఏదేను వనములో అస్సలు ఆ వృక్షమే లేనప్పుడు నేను తినలేదని ఆదాము చెప్పినప్పుడు గొప్పవాడా?? పాపం చేసే అవకాశం ఉండి పాపం చెయ్యకపోతే అప్పుడు వాడు గొప్పవాడు. గొప్పవాడో కాదో తెలియాలి అంటే పాపం చేసే అవకాశం ఇవ్వాలి. దేవుడు ఆదే చేసాడు. వారి గొప్పతనాన్ని నిరూపించుకోమని దేవుడు ఆదాముకు ఎదేనులో చెట్టు వేస్తే తన గొప్పతనాన్ని నిరూపించుకునే ఆవకశామును పోగొట్టుకున్నాడు.
12 సమాజములో ఎవరైనా నేను గోప్పవాడనని చెప్పుకొనినప్పుడు ఈ మాటను విన్న ప్రజలు ఇతను ఎందుకు గొప్పవాడు అని, ఏందులో గొప్పవాడనే ప్రశ్నను లేవదీస్తారు. ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు ఉన్నప్పటికీ వాటిని తినకుండా నిలువబడిన వాడే గొప్పవాడుకాగలడు. నిర్మానుష్య ప్రదేశములో ఒక స్త్రీ ఒంటరిగా పురుషునితో పాపము జరిగించుటకు ఆహ్వానించగా దానిని నిరాకరించువాడు ఎంత ఉత్తముడో అలానే తినుటకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములున్న వాటిని ముట్టని వాడు అంతటి వాడే..
13 దేవుడు తన కుమారులను తనంతటి వారిగా చూడాలని తలంచి ఎదేనులో ఈ పరిక్షను పెట్టియున్నాడు. రాబోయే మహాలోకమైన పరలోకంలో తంత్రములేరిగిన వారు తన పిల్లలు కాకూడదనే ఆలోచనతోదేవుడు తన పిల్లలలో ఉత్తములైన వారిని తన యొద్దకు చేర్చుకొనుటకు లోకమందు చెట్టును, అపవాదిని ఉండనిచ్చాడు. దేవుడు చెట్టు వేయటం తప్పు కాదు కానీ ఆ పండు తినడం అదము- హవ్వల తప్పు. దేవుడు పరిక్ష పెట్టడం తప్పు కాదు కానీ ఆ పరీక్షలో పాస్ అవ్వకపోవడం అదము- హవ్వల తప్పు. మంచి వాడిగా నిరూపించబడి పరలోకం వెళ్ళాలని చెట్టు వేసాడు.
14 యోబు 2:3 నుంచి గల సందర్భములో సాతాను యోబును శోదించాలని & దేవుడు పరీక్షించాలనుకున్నాడు.చివరికి ఆపరిక్షలో యోబు విజయం పొందాడు. యోబు 42:12- యెహోవా యోబును మొదట ఆశిర్వదించినంతకంటే మరి అధికముగా ఆశిర్వదించెను. ... చివరిగా పరీక్షకు నిలబడి సాదించినవాడు లోకమందు ఎలాగు గొప్పవాడు కాగలడో అలానే ఏదేను నందు చెట్టు ఉన్న ,ఆది తినకూడదని నిబంధన వానిపైన రుద్దబడిన,పట్టుదలతో సాదించినవాడే యోగ్యుడైన దేవుని కుమారుడిగా లోకమందు కనబడెను. కనుక ఏదేను వనము నందు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఉండుట న్యాయమే...........

ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు వేసినట్లు?
♻ గురియొద్దకే పరుగెత్తుచున్నామా..? 🏃
ఫిలిప్పీయులకు 3:14
క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, "గురి యొద్దకే పరుగెత్తుచున్నాను".
🏵ఉపోద్ఘాతం: 2020 సంవత్సరం చివరకు వచ్చాం. ఈ సంవత్సరంలో మన ఆత్మీయ పరుగులో అనగా ఆత్మీయ జీవితంలో ఏమైనా పరిపూర్ణత సాధించామా? చాలామంది ఆత్మీయ పరుగు ఆగిపోయింది మరికొంతమంది పరుగు ఆగిపోయే పరిస్థితిలో ఉన్నది. మరి మన ఆత్మీయ పరుగు ఎలా ఉన్నది? ఆత్మీయ జీవితంలో సంపూర్ణత లోనికి ఎదిగామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం.
కొంతమంది “మేము ఆత్మీయ జీవితంలో పరిపూర్ణస్థితికి వచ్చేశాము” అని మాట్లాడుతారు. కాని ప్రియదేవుని బిడ్డలారా! గొప్ప రాయబారి పౌలుకే పరిపూర్ణత లేనప్పుడు, మనలో లేదనుకోవడానికి సంశయం ఏముంది? క్రీస్తు తనను రక్షించి పిలిచినప్పుడు తాను ఎలా ఉండాలని ఆయన కోరాడో పూర్తిగా ఆ విధంగా అయిపోవాలని పౌలు ఆశ.
క్రొత్త సంవత్సరం సిద్ధపాటు కొరకు ఏడు సూత్రాలు: (ఫిలిప్పీ 3:12-16 నుండి ధ్యానం)
🏵1. ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని అనుకోవద్దు: ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సాధించవలసినది చాలా ఉంది చాలామంది విశ్వాసులు ఈ సంవత్సరం తమ క్రైస్తవ నడకతో సంతృప్తి చెందామని అనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఇతర క్రైస్తవులతో తమను తాము పోల్చి చూస్తున్నారు. కాని పౌలు అయితే ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తు ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నాడు.
(ఫిలిప్పి 3:12 ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని యైనను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.)
🏵2. ఇంకా సాధించాలనే ఆసక్తి యుండాలి: దేవుని విషయంలో మనలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చయతతో శ్రద్ధాసక్తులు చివరిదాకా చూపాలనీ పౌలు కోరిక. (హెబ్రీ 6:11-12 మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.)
క్రైస్తవ జీవితంలో ఇంకా అధ్బుతంగా ముందుకు సాగాలన్న యథార్థమైన బలమైన కోరిక మనలో లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనుకకు జారిపోతాము. ఈ లోకంలో మన జీవితాంతం క్రీస్తులో నమ్మకం ఉంచుతూ, ఆయనకు సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయం.
🏵3. వెనుకున్నవి మర్చిపోవాలి: గతంకన్నా భవిష్యత్తే ముఖ్యం కనుక వెనుకున్నవి మర్చిపోవాలి. అంటే అన్ని మరచిపోమ్మని కాదు. పౌలు తన పాత జీవితం మీద తన ఆలోచనలను ఉంచుకోలేదని దీని అర్థం. పాత జీవితం తనను వశపరచుకోకూడదని అతని ఉద్దేశం. అతనికి గతం కన్న భవిష్యత్తే ముఖ్యం. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలను కుంటున్నాడు.
(ఫిలిప్పి 3:13 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి)
"వెనుక ఉన్న వైఫల్యాలను మర్చిపోవాలి, లేకపోతే వెనుకున్న అపజయాలు రాబోయే సంవత్సరంలో మనం సాధించబోయే విజయాలను నియంత్రిస్తాయి. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలను కుంటున్నాడు పౌలు.
🏵4. ఈ సంవత్సరం సాధించిన విజయాలపై గర్వం వద్దు: తన విజయాలపై సంతృప్తి చెంది గర్వించి ఏమరుపాటుగా ఉండేలా చెయ్యడానికీ పౌలు అనుమతించడం లేదు. గర్వం మన ఆత్మీయ పరుగును నిదానింపజేసి ఆపివేస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును (సామెతలు 16:18)
ఈ గర్వము మరియు అహంకారమైన మనస్సు మనలను నాశనమునకు తెసుకెల్తుంది. బైబిల్ చూస్తే, గోలియతు, హామాను, నెబుకద్నెజరు, బెల్షస్సరువంటి వారు వారి గర్వము బట్టి పతనానికి వెళ్లిపోయారు. గర్వము ఆత్మకు, మనసుకు, శరీరమునకు విషం మాదిరిగా ఉన్నది. ఈ గర్వము వలన మనము ఎవరిని కూడా ప్రేమించలేము. సామెతలు 29:23 " ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును “
🏵5. ముందున్న గురిని మర్చిపోవద్దు: పౌలు దృష్టి ఎల్లపుడు దేవుడిచ్చు బహుమతిపైనే ఉన్నట్లుగా మనం కూడా ఎన్ని సంవత్సరాలు గతించి పోతున్నా మన పరుగు ఆపకూడదు మనం పోరాటం ఆగకూడదు.
(ఫిలిప్పీయులకు3:13,14 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి (లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.
సాతాను మన దృష్టి ప్రక్కకు మరల్చడానికి చూస్తాడు. పరుగు పందెంలో పరుగెత్తే వారంతా పరుగెత్తుతారు గానీ బహుమతి లభించేది ఒకరికే అని తెలిసికొని ఆ బహుమతి మనకే లభించేలా గురివైపు పరుగెత్తాలి. క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకొంటాడు. (1 కొరి 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.)
🏵6. క్రీస్తువలె ఉండుటకు క్రీస్తు స్వరూపంలోనికి ఇంకా ఎదగాలి: కొలస్సి 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించు చున్నాము.
మనము పరిపూర్ణతలో ఇంకా పైకి ఎదగాలి. ఎన్ని అలలు వచ్చినా, గాలికి కొట్టుకొని పోకుండా, క్రీస్తు స్వరూపమునకు ఎదగాలి. ఫిలిప్పి 1:9 మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,
ఈ 2019 సంవత్సరంలో మనం ఎంతో పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం జీవించినా అది ఇంకా చాలదు. రాబోయే 2020 సంవత్సరంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి. పౌలు అంతటివాడే తనలో పాపమేమీ లేకుండా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండే పరిపూర్ణ స్థితి తనకున్నదని అనలేదు. కానీ తానొక పరిపక్వత చెందిన విశ్వాసిననీ, క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎదిగినవాడిననీ అతనికి తెలుసు. ఇంకా పైకి పరిపూర్ణతలోనికి పౌలువలె మనం కూడా ఎదగవలసి యున్నది. ఫిలిప్పీ 3:15 కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము.
ఎఫేస్సి 4:14-15 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశామునకు కొట్టుకొని పోవుచు అలలచే ఎగుర గొట్టబడిన వారమైనట్లుండక ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.
🏵7. ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి యుండాలి: There must be discipline in our Christian lives. క్రమమైన జీవితంలో నడవమని పౌలు చెప్పుచున్నాడు. ఎన్ని ప్రేరేపణలు కలిగినా యోసేపువలె క్రమశిక్షణ గలిగి విశ్వాసులు వారికున్న జ్ఞానం మేరకు నడుచుకోవాలి. మనం అలా క్రమశిక్షణలో జీవిస్తే, దేవుడు మనకు సత్యాన్ని గురించి మరింత గ్రహింపును ఇస్తాడు.
(ఫిలిప్పి 3:16 అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. హెబ్రీ 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా).
క్రైస్తవ క్రమశిక్షణను మనలను సరిచేస్తుంది. మనలను సరియైన మార్గములో నడిపిస్తుంది. మనలను మార్చుకొనుటకు సహాయ పడుతుంది. (సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.)
🏵ముగింపు: యేసుతో జీవితం మనకు సంతృప్తిగానే ఉంది గాని మన ఆత్మీయ పరుగులో ఆత్మీయ జీవితంలో సంతృప్తి అనేదే ఉండకూడదు. పౌలు కూడా ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తును గురించిన పరిపూర్ణత ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తు పరుగెడుతున్నాడు.
అదే రీతిగా ఈ 2020 సంవత్సరాంతంలో ఉన్న మనం పరిశీలన చేసుకొని మన తప్పులను సరిచేసుకొని రానున్న 2021 సంవత్సరంలో మరింత ఆత్మీయంగా పరుగెత్తుటకును ఎదుగుటకును ఆత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక!! ఆమెన్!!
దైవాశ్శీసులు!
- పాస్టర్ జ్యోతిరాజు వేముల ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి
నిడుబ్రోలు
o
గురియొద్దకే పరుగెత్తుచున్నామా .....?
ఆపదలు,శ్రమలు, శోధనలు, కష్టాలు ... ఈ మాటలు అంటేనే మనకు భయం. వీటిని యిష్టపడేవారుగాని, కోరుకొనేవారుగాని ఎవ్వరూ వుండరు. వీటిని మనం యిష్టపడడంలేదని మనవెంట రాకుండా వుంటాయా అంటే, ఎంత వద్దనుకున్నా వెంటబడి తరుముతూనే ఉంటాయి.
ఆధ్యాత్మిక దృష్టితో మనము ఆలోచించగలిగితే, ఆపదలే, శ్రమలే మనలను మన నిత్యమైన గమ్యానికి చేర్చేమార్గాలు.
ప్రభువుకు మనము మరింతగా సన్నిహితమయ్యే సమయం ఏదైనా వుందంటే? అది ఆపత్కాలమే.
ఆపద సమయాన్ని సరియైన రీతిలో ఉపయోగించుకోగలిగితే, శ్రమలయందునూ ఆనందించగలము. శ్రమలయందే అతిశయించగలము. శ్రమలలో సహితం ఆనందించగలగడం దేవుని పిల్లలకుమాత్రమే సాధ్యం.
కష్టాల కడలిలో తీరం తెలియని పయనంలా సాగిపోతుందా జీవితం?
ప్రభువు వైపు మాత్రమే నీవు చూడగలిగితే, ఆయనపైన మాత్రమే ఆధారపడగలిగితే కృంగిపోవాల్సిన పని ఎంతమాత్రమూ లేదు. యిక ఆయన పర్ణశాల ఎంతోదూరంలో లేదు.
ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. (కీర్తనలు 27:5)
🏠 ఆయన పర్ణ శాలలో ఎప్పుడు అడుగు పెట్టగలమంటే? ఆపత్కాలంలోనే!
మనము ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలు ప్రభునకు మరింత దగ్గరచేసేవిగా వుండగలగాలి. శోధనలద్వారా మనము క్రీస్తుయొక్క సమరూపంలోనికి మారగలగాలి.
ఎప్పుడైతే ఆయన పర్ణశాలలో అడుగుపెట్టామో?
🔸ప్రభువు మన కన్నీటిని ప్రేమతో తుడుస్తాడు.
🔸మన దుఃఖదినాలు సమాప్తమవుతాయి.
🔸మన కన్నీరు నాట్యముగా
మార్చబడుతుంది.
🏡 ఆయన గుడారము చాటున ఎప్పుడు దాగి యుండగలమంటే? ఆపత్కాలంలోనే!
యెహోవా! నీ ప్రసన్నతను చూచేటట్లు, నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటట్లు, నా జీవితమంతా నీసన్నిధిలో నివసించాలి.
ఇట్లాంటి ఆశను కలిగి యుండి, దానిని వెదికే వారముగా మనముంటే? ఆపత్కాల సమయంలో ఆయన గుడారంలో మనలను దాస్తాడు.
నీవు ఎదుర్కొంటున్న ఆపదలు, శోధనలు, శ్రమలు... యివన్నీ ఆయన గుడారాములోనికి నిన్ను చేర్చగలిగితేనే వాటివలన నీ జీవితానికి క్షేమం.
👉 అట్లా కాకుండా నీవెదుర్కొంటున్న పరిస్థితులు దేవునినుండి నిన్ను దూరముగా నెట్టుతూవుంటే, అత్యంత ప్రమాదకరమైన స్థితిలో నీవున్నట్లే. ఆపత్కాలమే ఆయన గుడారములో ప్రవేశించే సమయమని నీవు గ్రహించగలిగితే జీవితం ధన్యమయినట్లే.
ఆయన గుడారంలో నీవుంటే? ఇక శత్రువు నిన్నేమి చెయ్యగలడు?
సాతాను సంధించే ఎట్లాంటి అగ్నిబాణాలైనా సరే, ఆయన గుడారాన్ని చేధించగలవా? ఛేదించడం కాదుకదా, దాని దరిదాపుల్లోనికి కూడా చేరలేవు.
🏔 ఎతైన ఆశ్రయ కొండ మీద మనలను ఎక్కించి కాపాడతాడు.
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
ద్వితి 32:4
◾ఆయనే నీ ఆశ్రయ దుర్గము.
◾ఆయన కార్యములు సంపూర్ణము.
◾ఆయన ఏది చేసినా న్యాయమే.
◾ఆయన ఏ దోషం లేని వాడు.
◾ఆపత్కాలంలో నమ్మదగిన వాడు.
◾ఆయన నీతిపరుడు
◾ఆయన యదార్ధవంతుడు.
నీ ప్రతీ పరిస్థితిని ఆయనకు అప్పగించు.నీ సమస్యలనుండి విడిపించి, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు.
ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం!
అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
ఆమెన్! ఆమెన్! ఆమెన్!

ఆపత్కాలములోనున్నావా?. బైబిల్ స్టడీస్
I సమూయేలు -బైబిల్ స్టడీస్
పరిచయం
రచయిత: - తెలియదు.
వ్రాసిన కాలం:
మొదటిలో 1,2 సమూయేలు పుస్తకాలు ఒకటిగా ఉండేవి. పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించినప్పుడు అనువాదకులు ఈ పుస్తకాన్ని రెండుగా విభజించారు.
1 సమూ 27:6లో రచయిత విడిపోయిన రాజ్యాన్ని సూచించగల యూదా రాజులను గురించి వ్రాస్తున్నాడు కాబట్టి, అతడు ఈ పుస్తకాలను సొలొమోను మరణించిన తరువాతనే వ్రాసి ఉండాలి అని చెప్పవచ్చు. సొలొమోను కుమారుడు రెహబాం కాలంవరకు రాజ్యం విడిపోలేదు.
ముఖ్యాంశాలు:
1) న్యాయాధిపతులలో లేక నాయకులలో సమూయేలు అత్యంత ఘనుడు.
1 సమూయేలులో అతని పుట్టుక, జీవితం, అతడు చేసినపని ఒక ముఖ్యాంశంగా ఉంది.
2) మరొక ముఖ్యాంశం
👉 ఇస్రాయేల్‌వారు తమకు దేవుడు రాజుగా ఉండడానికి ఒప్పుకోకుండా ఒకతణ్ణి రాజుగా నియమించుకోవడం.
3) మరో ముఖ్యాంశం:
👉 దావీదు జీవితంలోని ఆరంభ దశను మొదలుకొని సౌలు మరణించేంతవరకు జరిగిన సంగతులు. బైబిలులోని మిగతా భాగాలలాగే ఈ పుస్తకంలో నుండి కూడా ఇప్పటి విశ్వాసులు గ్రహించవలసిన ఆత్మసంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి (2 తిమోతి 3:16-17).
విషయసూచిక: -
సమూయేలు తల్లి హన్నా 1:1-20
సమూయేలు పుట్టుక, బాల్యం 1:20-28
హన్నా గీతం 2:1-10
భక్తిహీనులైన ఏలీ కుమారులు 2:12-17
ఏలీ ఇంటిమీద దేవుని కోపం 2:27-36
దేవుడు సమూయేలును పిలవడం 3:1-21
దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుపోవడం 4:1-11
ఏలీ మరణం, ఇకాబోద్ పుట్టుక 4:12-22
దేవుని మందసం ఫిలిష్తీయ పట్టణాల మీదికి తెచ్చి పెట్టిన చేటు 5:1-12
మందసాన్ని ఇస్రాయేల్‌కు తిరిగి ఇచ్చివేయడం 6:1—7:1
మిస్పావద్ద ప్రజలు తిరిగి ప్రతిష్ఠించుకోవడం, ఫిలిష్తీయవారి ఓటమి 7:2-13
రాజుకోసం ప్రజల కోరిక 8:1-22
సౌలు, సమూయేలు 9:1-27
సమూయేలు సౌలును అభిషేకించడం 10:1-8
సౌలు రాజు కావడం 10:9-27
సౌలు అమ్మోనువారిని ఓడించడం 11:1-15
సమూయేలు చివరి ఉపదేశం 12:1-25
సౌలు ఒక హోమబలిని అర్పించడం, సమూయేలు అతణ్ణి ఖండించడం 13:1-15
కత్తులు, ఈటెలు లేని సైనికులు 13:16-22
యోనాతాను సాహసకార్యం 14:1-14
ఫిలిష్తీయవారిమీద విజయం 14:15-23
సౌలు తీర్మానం, యోనాతానుకు అపాయం 14:24-45
శత్రువులమీద సౌలు సాధించిన విజయాలు 14:46-52
అమాలేకువాళ్ళ పై యుద్ధం 15:1-33
సౌలు అవిధేయత 15:1-9
సమూయేలుద్వారా సౌలుకు దేవుని సందేశం,
సౌలును రాజుగా దేవుడు తిరస్కరించడం 15:8-35
సమూయేలు దావీదును అభిషేకించడం 16:1-13
సౌలు ఇంటిలో దావీదు 16:14-23
దావీదు గొల్యాతు 17:1-58
దావీదు మీద సౌలుకు అసూయ, భయం 18:1-16
సౌలు దావీదు చావును కోరడం 18:17-25
దావీదు సౌలు కూతురు మీకాల్‌ను పెండ్లాడడం 18:26-27
దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం 19:1-11
దావీదు తప్పించుకుపోవడానికి మీకాల్ సహాయం 19:12-17
సౌలు, అతని మనుషులు పరవశులై ప్రకటించడం 19:19-24
దావీదు, యోనాతానుల మధ్య అమోఘమైన స్నేహం 20:1-42
దావీదు నోబుకు తప్పించుకుపోవడం, అక్కడ ఒక యాజకుడు దావీదుకు
ప్రతిష్ఠితమైన రొట్టెను, గొల్యాతు ఖడ్గాన్ని ఇవ్వడం 21:1-9
గాతులో దావీదు పిచ్చివానిలాగా నటించడం 21:10-15
అదుల్లాం, మిస్పాకు దావీదు పారిపోవడం 22:1-5
నోబులో యాజులను సౌలు చంపడం 22:6-23
కెయీలా పట్టణాన్ని దావీదు కాపాడడం 23:1-13
జీఫువారు దావీదును మోసగించడం 23:14-29
దావీదు సౌలును ప్రాణంతో వదలడం 24:1-22
దావీదు, నాబాలు, అబీగేల్ 25:1-44
దావీదు సౌలు రెండోసారి ప్రాణంతో వదలడం 26:1-25
దావీదు, ఫిలిష్తీయవారి దగ్గరకు తిరిగి వెళ్ళడం 27:1-12
ఏన్‌దోరులో పూనకం వచ్చి పలికే స్త్రీని సౌలు దర్శించడం 28:1-25
ఫిలిష్తీయవారు దావీదును సిక్లగుకు తిరిగి పంపడం 29:1-11
దావీదు దేవునిలో ఆదరణను పొందడం 30:1-8
దావీదు అంతటిని తిరిగి చేకూర్చుకోవడం 30:9-31
గిల్బోవా కొండమీద సౌలు, యోనాతానుల మరణం 31:1-13

I సమూయేలు- బైబిల్ స్టడీస్
Tags: Telugu Christian Songs lyrics telugu christian songs lyrics pdf telugu christmas songs lyrics telugu christian songs lyrics in english andhra kristhava keerthanalu lyrics yesanna songs lyrics jesus songs in telugu list telugu christian songs lyrics and chords telugu christian songs lyrics in powerpoint, Telugu Christian Songs lyrics telugu christian songs lyrics pdf telugu christmas songs lyrics telugu christian songs lyrics in english andhra kristhava keerthanalu lyrics yesanna songs lyrics jesus songs in telugu list telugu christian songs lyrics and chords telugu christian songs lyrics in powerpoint, Telugu Christian Songs lyrics telugu christian songs lyrics pdf telugu christmas songs lyrics telugu christian songs lyrics in english andhra kristhava keerthanalu lyrics yesanna songs lyrics jesus songs in telugu list telugu christian songs lyrics and chords telugu christian songs lyrics in powerpoint,Telugu Christian Songs lyrics telugu christian songs lyrics pdf telugu christmas songs lyrics telugu christian songs lyrics in english andhra kristhava keerthanalu lyrics yesanna songs lyrics jesus songs in telugu list telugu christian songs lyrics and chords telugu christian songs lyrics in powerpoint 2017, Telugu Christian Songs lyrics telugu christian songs lyrics pdf telugu christmas songs lyrics telugu christian songs lyrics in english andhra kristhava keerthanalu lyrics yesanna songs lyrics jesus songs in telugu list telugu christian songs lyrics and chords telugu christian songs lyrics in powerpoint

Telugu Christan Songs lyrics