✍️ *మట్టల ఆదివారం ప్రత్యేక అంశం: విమోచన* ✍️
👉 "మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. (మత్తయి 21:2-3)"
👉 ఈ వచనములో గొప్ప విషయాలు దాగివున్నవి.
ఒలివ కొండ యెరూషలేము నకు తూర్పువైపున ఉంది. ఆ కొండ పైనుంచి దిగువన ఉన్న నగరాన్ని చూడవచ్చు. అక్కడ నుండి వేరే చోట ఏం జరుగుతున్నదో తెలుసుకో గలిగిన శక్తి క్రీస్తు నకు ఉంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ( జెకర్యా 9:9). రాజు తన రాజ నగరంలోకి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇది అహంభావం లేని సాధుశీలికి తగిన నగర ప్రవేశం (11:29). “సీయోను కుమారి” అంటే జెరుసలం. యేసు తన ఇద్దరి శిష్యులను ఆ గ్రామమునకు పంపాడు. ఏమేం జరుగుతున్నదో తెలిసి, ఏం చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజును సేవించే అవకాశం, అధిక్యత క్రైస్తవులది. వారు చేయవలసినదల్లా విధేయత చూపడమే.
👉 ఇక్కడ శిష్యులు విధేయత చూపించారు, గాడిద యజమాని, గాడిద ఇలా అందరూ విధేయత చూపించుట మనం చూడగలం. శిష్యులు ఆ గ్రామమములోకి వెళ్లి కట్టబడిన గాడిద కట్లు విప్పి యేసు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అందరూ తమ పై వస్త్రాలు పరిచి యేసుని గాడిద మీద ఎక్కించి, 2 రాజులు 9:13 లో చూపిన సాదృశ్యము వలె
" వెంటనే వాళ్ళంతా వాళ్ళ పైవస్త్రాలను తీసి యెహూక్రింద మెట్లమీద పరిచారు. వాళ్ళు పొట్టేలు కొమ్ము బూర• ఊది “యెహూ రాజయ్యాడు” అని ప్రకటించారు." ( 2 రాజులు 9:13) యేసుని గాడిద మీద ఎక్కించి, చెట్ల కొమ్మలు నరికి, తమ వస్త్రాలు రోడ్ల మీద పరిచి, ఆ నగరం అంతా తిప్పుతూ దావీదు రాజుకు జయము అని స్తుతించారు.
“జయం”– ఇది హీబ్రూ పదం “హోసన్నా” నుంచి తర్జుమా చేయబడింది. పూర్వం దీనికి అర్థం “రక్షించు” అని చేసే ప్రార్థన. కాలక్రమేణ అది సంస్తుతులను వెల్లడి చేసే మాట అయింది. ఇది రక్షించగలిగినవాడు ఇక్కడే ఉన్నాడని సూచిస్తూ ఆయన్ను స్తుతించే పదం. కొందరు యేసును అభిషిక్తుడుగా, దేవుడు నియమించిన రాజుగా అంగీకరించేందుకు సిద్ధమయ్యారు.
👉 ఈ మట్టల ఆదివారం సందేశం ద్వార మనం విమోచన / విడుదల అనే అంశాన్ని ధ్యానించాలి
👉 గడిద తన కట్లు విప్పబడుట వలన యేసునే తన మీద ఎక్కించుకొని మోసే ఘనత పొందింది. యెరూషలేమునకు దూరముగా కట్టబడిన గాడిద విప్పబడిన తరువాతే దేవుని మోసుకొని పోయింది, ఘనత పొందింది. విప్పబడక పోతే స్వాతంత్ర్యము లేదు, విమోచన లేదు.
♻️ *● విమోచన గూర్చి ఇంకొన్ని బైబిల్ సత్యాలు ●*
👉 *◆ మనకు మరణము నుండి విడుదల అవసరం:*
ఎఫెసీయులకు 2:1 లో "మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను." ఆజ్ఞను మీరి పాపం చేసిన సంతానము మనం. మరణమే మన పితరులు మనకిచ్చిన స్వాస్థ్యము. దానినే మనం అనుభవిస్తున్నాము. కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు మరణము జయించి తిరిగి లేచి మరణము నుండి మనలను విడిపించి మనలను తిరిగి జీవింప చేసెను.
👉 *◆ మరణ బలము గలవాని నుండి విడుదల అవసరం:*
హెబ్రీయులకు 2:14,15 లో "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను." ఈ లోక అధికారులు మన ప్రభువైన యేసును ఘోరమైన సిలువ వేసి చంపియున్నాము అని సంతోషించిరి. సమాధికి ముద్ర వేసి కావలి ఉంచారు. కానీ మరణపు ముళ్ళు విరిచి వేయగల సమర్ధుడు అని అంచనా వేయలేకపోయిరి. మొదటి కొరింథీయులకు 2:8 లో "అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు."
👉 *◆ దర్మసంబంధమైన శాపము నుండి విడుదల అవసరం:*
గలతీయులకు 4:4,5 లో "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను." ధర్మశాస్త్రం పాపము గూర్చి భోధించింది కాని పాపము తీయలేకపోయింది. మన ప్రభువైన యేసు సిలువలో బలియాగము ద్వార శాపము నుండి విడుదల చేసి ధర్మశాస్త్రం నెరవేర్చాడు.
👉 *◆ దుర్నీతి నుండి విడుదల అవసరం:*
తీతుకు 2:14 లో "ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను." గనుక పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు దుర్నీతిని విడిచి మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.
👉 *◆ బంధకములనుండి విడుదల అవసరం:*
ఇశ్రాయేలీయులు ఐగుప్తు లో 430 సంవత్సరములు బానిసలుగా బాధలను అనుభవించుచున్నపుడు వారు పెట్టిన మొఱ్ఱ కృప కలిగిన దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు మోషే ను పంపించాడు. యూదా జనాంగము బబులోనులో చేరలోనుండుటకు కొనిపోబడిన 70 సంవత్సరముల తరువాత వారిని బంధకముల నుండి విడిపించాడు.
♻️ *● విమోచనకై మార్గాలు ●*
👉 *◆ విమోచించగలవాడు దేవుడొక్కడే:*
"కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని." (నిర్గమ 3: 8,9).
👉 *◆ విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి:*
"కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. (నిర్గమ 3:10)." ఇశ్రాయేలీయులు తమ కష్టకాలంలో దేవునికి మొఱ్ఱపెట్టగా మొదట మోషేను, ఒకసారి ఒత్నియేలును, ఒకసారి ఏ హుదును, ఒకసారి గిద్యోనును ( న్యాయాధిపతులు 3:9,15; 6:14) వారికి రక్షకులుగా పంపితివి. మనం పాపులుముగా ఉండగా యేసే స్వయముగా రక్షకునిగా (మత్త 1:21) వచ్చియున్నాడు.
👉 *◆ విమోచించుటకు రక్తం అవసరం:*
"మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు." (నిర్గమ 12:13). ఇశ్రాయేలీయుల పస్కా పశువు రక్తమును తమ ఇంటి ద్వారము యొక్క కమ్మీ మీద చిలకరించుట ద్వార దేవుని ఆజ్ఞ నెరవేర్చి మరణము నుండి తప్పింపబడి యున్నారు. మానమింక పాపులమై యుండగా పస్కా పశువుగా యేసే విధింప బడి ఆ రక్తము ద్వార మనం రక్షింపబడియున్నాము. "అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యెహను 1:7)".
👉◆ విమోచించుటకు బ *హువు (ఒక శక్తి ) అవసరం:*
"కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించెదను (నిర్గమ 6:6)."
"నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు. (యెషయా 51:5)"
ఉగ్రత నుండి తప్పించుకొనుటకు, విమోచింపబడుటకు యేసు యొక్క బహువు అవసరం.
👉 *◆ విమోచించడానికి ఒక దినం అవసరం:*
ఇశ్రాయేలీయులు 450 సంవత్సరములు గడిచిన తరువాతే యెహోవా సేనలు ఐగుప్తు నుండి బయలుదేరి పోయెను. ఆనాడే పస్కా (15th of Bisan). ఇది దైవ నిర్ణయం. ఇది ఆదిలో అబ్రాహామును పిలిచిన దినమున దేవుడు బయలుపరచాడు (ఆది 15:14). ఆ మహా దేవుని ప్రణాళిక ఎంత సుధీర్ఘమైనది? మరి మన విషయమైతే ప్రతి వ్యక్తి రక్షణ (విమోచన) గూర్చి ఒక దినము నిర్ణయించాడు (హెబ్రీ 4:7), ఇదిగో ఇదియే రక్షణ దినము (2కోరింది 6:2). కాబట్టి రక్షణ పొందుటకు ఆలస్యము చేయకు. మంచి రోజు అని చూడకు. ఎందుకంటే రేపు నీది కాదేమో!
ప్రియమైన సహోదరుడా, సహోదరీ నీవు మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, సాతాను బంధకముల నుండి విడుదల పొందితివా? అవును అంటే దేవునికి వందనములు. ఇంకా లేదు అంటే నేడే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఎందుకనగా నీకు నీవు విడిపించుకోలేవు సుమా! విమోచింపబడిన ఇశ్రాయేలు వలె ఎఱ్ఱసముద్రం దాటి, యెర్ధను దాటి కనాను చేరాలి. విమోచింపబడిన గాడిద వలె ప్రభువుని కలిగి యెరూషలేము చేరాలి. అలా చేరుటకు ఆ ప్రభువు సహాయం చేయును గాక! ఆమెన్!!!
మట్టల ఆదివారం ప్రత్యేక అంశం: విమోచన
✳️ *ఒక మంచి తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?*....✍️
కీర్తనలు 128: 3
*నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లివలె నుండును నీ భోజనపు బల్లచుట్టు నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె నుందురు.*
👉 అస్తవ్యస్తంగా పెరిగిన చెట్టును చూచి దీనిని మొక్కగా ఉన్నప్పుడే క్రమపరచివుంటే బాగుండేది అనుకునే వ్యవసాయదారులు,
👉కరమంలేని పిల్లలను చూసి చిన్నప్పటి నుండే క్రమశిక్షణతో పెంచుంటే బాగుండేది అనుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు.
👉తల్లిదండ్రులకి పూర్ణవిధేయులైన పిల్లలు కనిపించటమే అరుదు అయితే....
👉అలాంటిది *తల్లిదండ్రుల భక్తిని కూడా నేర్చుకున్న పిల్లలు మనకి కనిపించటం ఇంకా అరుదు... ఇస్సాకు, యోసేపులకు ప్రతిరుపాలుగా ఎప్పుడోగాని, ఎక్కడోగాని వీరు కనిపించరు.*
📖 128వ కీర్తనలోని ఈ ఆశీర్వధములు అన్ని కీర్తనాకారుడు తనకోసమో లేక ఇశ్రాయేలీయులకు మాత్రమే వ్రాసియుంచలేదు కానీ 128వ కీర్తనలో *“వారందరికి”* అన్న మాట చేర్చటం ద్వారా *ప్రతిఒక్కరికి ఈ ఆశీర్వధముల ద్వారము తెరచే ఉంది....*
▪️అవును నువ్వు ధన్యుడవు....
▪️న కష్టార్జితం నిలిచి ఉంటుంది....
▪️న మార్గాలు మేలుకరమైనవిగా మారతాయి....
▪️న ఇంటి భార్య ఫలించే ద్రాక్షవల్లిగా ఉంటుంది,
▪️ న భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలవలె ఉంటారు....
*“అందరికి”* ఈ ఆశీర్వధాలు.... కానీ
❇️ *ఈ “అందరు” ఎవరో తెలుసా.... ?*
👉ఈ అందరే.... *“యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడచు వారందరు”*
128వ కీర్తనలో ఈ మాట మళ్ళి మళ్ళి వ్రాయబడియుండటం మనం చూడవచ్చు.
👉ఈ ఆశీర్వధాలు అందరికి అయినా *“యెహోవా యందు భయభక్తులు కలిగి అయన త్రోవలలో నడచు వారందరికి” మాత్రమే.*
👉మనం పిల్లలను కనగలం కానీ వారి రాతను కనలేము అని కొందరు పెద్దలు చెబుతూఉంటారు....
*కానీ గాలిలో దీపం పెట్టకుండా, మనలో ఏమయినా కొద్దిపాటి భక్తి ఉంటె అది మన రాబోవు తరాలకు కాపుదలగా, కావలిగా తప్పక ఉంటుంది.*
*భార్యభర్తలు ఇరువురు పిల్లల ఎదుట తమ ధైర్యాన్ని నైపుణ్యతను ప్రదర్శిస్తూ ఉండాలి.*
పిల్లల పెంపకం అనేది ఒక కష్టమైన మరియు సవాలు కలిగిన వెంచర్, కాని అదే సమయంలో అది మనము చేయకలిగిన చాలా ఫలవంతమైన మరియు పరిపూర్ణమైన పని.
*ప్రత్యక్ష బోధన ద్వారా మన పిల్లలు ఒక గొప్ప విషయాన్ని నేర్చుకొనినప్పటికీ, వారు మనలను చూచుట ద్వారా మరింతగా నేర్చుకొనును.*
*చాలామంది స్త్రీలకు తల్లిగా ఉండు చాలా ప్రాముఖ్య పాత్రను దేవుడు ఇచ్చుటకు ఎంపిక చేసికొనెను.*
👉ఒక క్రైస్తవ తల్లి ఆమె పిల్లలను ప్రేమించవలెనని చెప్పబడెను (తీతు 2:4-5). ఎందుకనగా ఆమె కలిగియున్న ప్రభువును మరియు రక్షకుని నామమునకు నింద కలుగనీయదు.
*గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమ*ే (కీర్తనలు 127:3-5). తీతు 2:4 లో,
👉గరీకు పదమైన philoteknos తల్లులు వారి పిల్లలను ప్రేమించుతాను సూచించుటలో కనబడును.
👉 ఈ పదము ప్రత్యేకమైన *“తల్లి ప్రేమ”* ను ప్రదర్శించును. ఈ పదములో నుండి వచ్చే ఆలోచన ఏమనగా
▪️మన పిల్లల కొరకు జాగ్రత్త వహించుట,
▪️వరిని పోషించుట,
▪️ఆప్యాయంగా హత్తుకొనుట,
▪️వరి అవసరాలను తీర్చుట,
▪️ పరతి ఒక్కరిని సున్నితముగా స్నేహముగా దేవుని చేతినుండి వచ్చిన అపూర్వ బహుమానముగా చూచుట.
*దేవుని వాక్యములో క్రైస్తవ తల్లులకు చాలా విషయాలు ఆజ్ఞాపింపబడినవి:*
1⃣ అందుబాటు - ఉదయము, మధ్యాహ్నం, మరియు రాత్రి (ద్వితీ 6:6-7)
2⃣ పరమేయం – పరస్పర అభిప్రాయాలు, చర్చించుట, ఆలోచించుట, మరియు జీవితమును కలిసి ఒక విధానములో ఉంచుట (ఎఫెసీ 6:4)
3⃣ బధించుట – లేఖనములు మరియు బైబిలు సంబంధమైన ప్రపంచ చిత్రము (కీర్తనలు 78:5-6; ద్వితీ. 4:10; ఎఫెసీ. 6:4)
4⃣ శక్షణ – ఒక పిల్లవానికి తన నిపుణతలను అభివృద్ధి చేయుటకు సహాయపడి మరియు అతని/ఆమె బలములను కనుగొనుట (సామెతలు 22:6) మరియు ఆత్మీయ ఫలములు (రోమా. 12:3-8 మరియు 1 కొరింథీ. 12)
5⃣ కరమశిక్షణ – దేవుని భయమును బోధించుట, నిలకడగా నియంత్రణలో ఉంచుట, ప్రేమగా, స్థిరముగా (ఎఫెసీ. 6:4; హెబ్రీ. 12:5-11; సామెతలు 13:24; 19:18; 22:15; 23:13-14; 29:15-17)
6⃣ పషణ – స్థిరమైన మాట సహాయ వాతావరణమును అందించుట, ఓడిపోవుటకు స్వేచ్చ, అంగీకారము, ఆప్యాయత, షరతులులేని ప్రేమ (తీతు 2:4; 2 తిమోతి 1:7; ఎఫెసీ. 4:29-32; 5:1-2; గలతీ. 5:22; 1 పేతురు 3:8-9)
7⃣ సమగ్రతకు ప్రతిరూపము – నీవు చెప్పేది జీవించడం, ఒక ప్రతిరూపముగా వుంటూ దేనినుండైతే ఒక పిల్లవాడు *“పట్టుకొని”* నేర్చుకొంటాడో అలాంటి దైవభక్తిగల జీవితమును జీవించడం ద్వారా (ద్వితీ. 4:9, 15, 23; సామెతలు 10:9; 11:3; కీర్తనలు 37:18, 37).
👉 *పరిశుద్ధ గ్రంథము ప్రతి స్త్రీ ఒక తల్లి అయివుండాలని ఎన్నడూ ప్రకటించలేదు.*
అయితే,
*ప్రభువు ఎవరినైతే తల్లులుగా ఆశీర్వదించాడో వారు ఆ బాధ్యతను తీవ్రముగా పరిగణించాలి అని చెప్పెను.*
👉తల్లులకు వారి పిల్లల జీవితములో ఏకైక మరియు కీలకమైన పాత్ర ఉండును. మాతృత్వము అనేది తప్పక చేయాల్సిన లేక అసహ్యకరమైన విధి కాదు.
🔹 ఎలాగైతే ఒక తల్లి ఒక పిల్లవానిని గర్భములో భరించునో,
🔹మరియు ఎలాగైతే ఒక తల్లి ఒక పిల్లవానిని అతని బాల్యములో పోషించి మరియు జాగ్రత్త తీసుకొనునో,
🔹 అలాగే తల్లులు వారి పిల్లల జీవితాలలో కొనసాగుతూ ఉండే పాత్రను,
*వారు కౌమారదశ లోనైనా, యువకులైనా, యవ్వనంలోనైనా, లేక వారికి స్వంతముగా పిల్లలున్న పెద్దవారైనా పోషించును.*
👉మతృత్వము యొక్క పాత్ర మారి మరియు అభివృద్ధి చెందుచుండగా,
🔹ఒక తల్లి ఇచ్చే ప్రేమ,
🔹 ఆదరణ,
🔹పషణ,
🔹 పరోత్సాహం ఎన్నడూ ఆపుచేయకూడదు.
*వివాహము జరిగిన తరువాత వారు కోరుకొనేది ఒక పండంటి బిడ్డను. ఎందుకంటే బిడ్డలే తల్లితండ్రులకు ఘనత. సంతానం దేవుడిచ్చు బహుమతి. పోషించే స్థోమత లేకున్నా వారి సంతానమే వారి ఆస్తిగా భావిస్తారు.*
👉ఒకవేళ మీకు సంతానము లేదా?
👉కృంగిపోవద్దు స్నేహితుడా/ సోదరి. అబ్రామునకు 100 ఏళ్ళ ప్రాయములో సంతానము కలిగింది. ఇస్సాకునకు 65 ఏండ్ల కాలములో సంతానము కలిగినది.
👉గడ్రాలుగా ఉన్న
▪️సమూయేలు తల్లి హన్నా,
▪️ సంసోను తల్లి,
▪️ సరెపతు ఘనురాలు,
▪️ యహాను తల్లి ఎలీసబెతు దేవుని మీద విశ్వాసముతో సంతానము పొందారు.
🎯 అబ్రహమునకు ఇస్సాకును ఇచ్చితిని (యెహో24:3) అని దేవుడు చెప్పాడు.
🎯 యకోబు - వీరు దేవుడు దయచేసిన పిల్లలు (ఆది 33:5) అని,
🎯 యసేపు - వీరిని దేవుడు నాకు అనుగ్రహించాడు (ఆది 48:9) అని,
🎯 యషయా - నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను (యెషయా 8:18) అని అంటున్నాడు.
*మనం కూడా నా పిల్లలు అని కాకుండా దేవుని కృపను బట్టి ఇంత మంది పిల్లలు అని చెప్ప గలిగితే సంతోషం.*
❇️ *తల్లితండ్రులకు విధేయులై ఆశీర్వాధిపబడ్డారు.*
పాత నిభంధనలో ఇస్సాకు, యోసేపు, సమూయేలు, దావీదు, ఎస్తేరు ; క్రొత్త నిబంధనలో యేసు, తిమోతి తల్లితండ్రులకు విధేయులై ఆశీర్వాధిపపడ్డారు.
❇️ *తల్లితండ్రులకు అవిధేయులై తమ్మును తాము నష్టపరుచుకున్నారు.*
ఏశావు, ఏలీ కుమారులు, అబ్షాలోము, సమూయేలు కుమారులు,యాకోబు 10 మంది కుమారులు వారి తల్లితండ్రులకు తలవంపులు తెచ్చారు. తమ్మును తాము నష్టపరుచుకున్నారు.
*అందుకే బిడ్డలను బాల్యదశ నుండే దేవుని సన్నిధిలో పెంచాలి. వారికీ అన్ని విషయాలలో మనమే మార్గ దర్శకముగా ఉండాలి.*
👉 *"తల్లి చెనులో మేస్తే దూడ గట్టున మేయదు"అనే సామెత మనకు తెలుసు కదా!*
*"మొక్కయి వంగనిది మ్రానయి వంగునా?"*
అనే సామెత ప్రకారం, వంకర మొక్కని ప్రక్కన ఒక కర్ర పెట్టి కట్టితే అది కొంచెం నిటారుగా పెరుగును లేదా వంకర ఎక్కువై పడిపోవును.
👉 *కాబట్టి చిన్న తనములోనే మంచి క్రమశిక్షణలో మీ పిల్లలిని పెంచండి. నన్ను మా అమ్మ చిన్న తనము నుండే దేవుని భయ భక్తులతో పెంచింది కాబట్టే ఇప్పుడు ఇలా గొప్ప దేవుని సేవ చేయగలుగుతున్నాను.*
❇️ *పిల్లల గూర్చి పరిశుద్ధ గ్రంథములో ఇలా ఉంది:-*
1. దుష్టుని సంబంధులు (మత్తయి13:38).
2. వెలుగు సంబంధులు (యెహాను 12:36).
3. శరీర సంబంధులు (రోమా 9:8).
4. అవిధేయులు (ఎఫెసి 2:2, 5:6, కొలా 3:6).
5. ఉగ్రత పాత్రులు ( ఎఫెసి 2:2).
6. అపవాది సంబంధులు (1యెహాను 3:8-10).
7. వాగ్దాన పుత్రులు (ఎఫెసి 2:2).
8. తల్లిదండ్రులను అనుకరించేవారు
(1రాజులు 15:11,26).
9. వివిధ స్వభావము గలవారు (ఆది25:27).
10. మొండి వైఖరి గలవారు (ద్వితీ 21:18-21).
11. అల్లరి, ఆటపాటలు గలవారు (మత్తయి 11:16-19).
12. మూఢత్వము గలవారు (సామెతలు 22:15).
❇️ *భార్య భర్తలు కలిసి పిల్లల పెంపకం విషయంలో తగిన శ్రద్ధ చూపించాలి. పిల్లల ద్వారా భార్య భర్తల బంధం ఇంకా బలపరచబడాలి కాని బలహీనపడరాదు.*
👉 పల్లలు లేరని, పిల్లల కోసం మరొక పెళ్లి చేసుకోవడం క్రైస్తవ వివాహ బంధానికి విరుద్ధం. అది లోకందృష్టిలో తప్పులేనిదిగా ఎంచబడవచ్చు కాని క్రైస్తవులైన మనకు కాదు.
🔹 *మన జీవన విధానం బట్టి మన కుమారులు మన వైఖరి బట్టి నడుచుకుంటాడు.*
👉తల్లిదండ్రులు తిండిబోతులు, తాగుబోతులు, తిరుగుబోతులు, ఒక క్రమము లేని వారిమైతె మన కుమారులు కూడా దేశాదిమ్మరులు, చోరులు, వ్యభిచారులు అవుతారు,
🔹అప్పుడు కుటుంబ వ్యవస్థ సర్వ నాశనం అవుతాది.
👉చల మంది యవ్వనస్థులు ఈ వ్యాసం చదువుతున్నారు.
*ఇందులో వివాహము అయినవారు ఉన్నారు.త్వరలో వివాహము చేసుకోవాలి అనుకొనేవారు ఉన్నారు.*
👉 కబట్టి ఇప్పుడే మనం ముందు మన ప్రవర్తన సరిచేసుకుందాం. అప్పుడు మన కుటుంబం సరిగా ఉంటాది.
👉 *మొదటి ఆదాము దంపతులు ధైవజ్ఞ మీరిన కారణాన వారి కుమారుడైన కయీను నరహంతకుడు అయ్యాడు.*
👉 *లోతు లోకాశ వల్ల తన కుటుంబాన్ని సొదొమ గొమొఱ్ఱ కు నడిపించి బ్రష్ట సంతానానికి కారణం అయ్యాడు.*
👉 *ఆకాను ధైవజ్ఞ మీరి శపితమైన దానిలో కొంత దొంగిలించుట వల్ల తన కుటుంబం రాళ్ళతో కొట్టబడింది.*
👉 *కోరాహు దేవునికి విరోధముగా మోషే, ఆహారోనులను ఎదురించుట వలన తన సమూహం అంత అగ్ని చేత కాల్చబడింది.*
👉 *దావీదు బాత్సెబాతో పాపము చేసి, తన భర్తను యుద్ధములో చంపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తరువాత పశ్చాత్తాప పడిన శిక్ష అనుభవించాడు.*
*కాబట్టి మన పాపము మన కుటుంబాలను పాడు చేస్తాది.*
👉 దవుడు శిక్షింపక మానడు. కాబట్టి మన జీవితాలు దేవుని యెదుట యధార్ధముగా కనపరుచుకొనునట్లు పాటుపడుదాం.
*దేవుడు మన కుటుంబాలను, మన పిల్లలను ముఖ్యంగా పవిత్ర క్ రైస్తవ వివాహ బంధాలను, పటిష్ఠ పరచి ఆయన కృపలో మనలను భద్రపరచును గాక.*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
o
ఒక మంచి తల్లిగా ఉండుట గూర్చి బైబిలు ఏమి చెప్తుంది?
✳️ *ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్లాడు….?*
*లాజరు పరలోకానికి ఎందుకు వెళ్లాడు…?....✍️*
👉ధనవంతుడు చేసిన తప్పు ఏంటి ?
👉లజరు చేసిన మంచి ఏంటి ?
(లుకా 16:19-31) వరకు మనం గమనిస్తే ధనవంతుడు బీధ లాజారు ఉపమానం మనకు కనిపిస్తుంది.
👉అందులో వారి ఇద్ధరి జీవన శైలి మాత్రమే కనబడుతుంది తప్ప
🔺వరి యొక్క ప్రార్ధనా జీవితం ,
🔺వశ్వాస జీవితం,
🔺దవునిలో ఎదుగుదల, *ఇలాంటి విషయాలు మనకు కనబడవు.*
👉 వరి జీవితాలలో మనం గమనించవల్సిన విషయం *అస్సలు వారు అన్యులా...?* లేక
*దేవుని ఎరిగిన వారా....?*
♻️ లజరు దేవుని ఎరిగిన వ్యక్తి, ఆయన ఆజ్ఞలను కట్టడలను అనుసరించి జీవించిన వ్యక్తి
*కాబట్టే పరలోకంలో ఉన్నాడు అనే విషయాన్ని మనం సులువుగా అర్ధం చేసుకోగలం.*
👉ధనవంతుడు కూడా దేవుని ఎరిగిన వ్యక్తే .
*ఎలా చెప్పగలం ?*
🔹 *“తండ్రివైన అబ్రాహామా”* అని రెండు సార్లు
🔹 *“తండ్రీ”* అని ఒక సారి అబ్రాహాముని పిలవడం ఈ ఉపమానంలో మనం చూడగలం.
*విశ్వాసులకు తండ్రి అబ్రహము గనుక అతడు తండ్రి అని పిలుస్తున్నాడు.*
👉 ధనవంతుడు కూడా విశ్వాసే….!
👉వశ్వాసి ఆయి కూడా నరకంలో ఉన్నాడంటే ఏదో పాపం చేసాడని అర్ధం చేసుకోవచ్చు
1యోహాను 3:4 ప్రకారం *“పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము.”*
👉ధనవంతుడు మీరిన ఆజ్ఞ ఏంటో పరిశీలిస్తే……
*మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఆజ్ఞలన్ని 613+,*
👉 *ఈ ఆజ్ఞలన్నిటిని యేసుక్రీస్తుప్రభువుల వారు రెండుగా చేశారు*
అవి ఏంటంటే..
మార్కు 12:29
1⃣ *అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా "ఓ ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ.*
2⃣ *నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ; వీటికంటె ముఖ్యమైన ఆజ్ఞ మరేదియు లేదని అతనితో చెప్పెను."*
🔺ధనవంతుడు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహమును గుర్తించాడు అంటే
*విశ్వాస జీవితంలో కొనసాగుతూ మొదటి ఆజ్ఞను ఎరిగి ఉన్నాడని అర్ధం చేసుకోవచ్చు.*
🔺 రండవ ఆజ్ఞ విషయానికి వస్తే
*తన పొరుగు వాడైన లాజారును ప్రేమించలేదని స్పష్టంగా గ్రహించవచ్చు.*
👉 ఏలాగంటే బహుగా సుఖపడుతూ,ఉదా రంగు వస్త్రాలు ధరిస్తూ కూడా ఒక్క వస్త్రం కూడా లాజారుకు ఇచ్చి ఉండి ఉండడు.
అందువల్లనే *“కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను”* అని వ్రాయబడి ఉంది…
👉 ఆకలితో ఉంటే ఒక్క రొట్టె ముక్క కూడా ఇవ్వకుండా కుక్కలతో సమానంగా చూసాడు….
*తన పొరుగువానిని ప్రేమించలేదు కాబట్టే ధనవంతుడు నరకానికి వెళ్ళ వలసి వచ్చింది ….*
♻️ సధరా..! సొధరీ..!
👉నన్నువలె నీ పొరుగువానిని ప్రేమించడం అంటే నిన్ను నువ్వు ఎలా గౌరవిస్తావో,
👉నకు సంబందించిన అన్ని విషయాలలో జాగ్రత్తలు చూసుకుంటావో ,
*అదే జాగ్రత్త నీ పొరుగు వారి విషయంలో నీకు ఉందా ?*
👉పతాళములో వేదనపడుచున్న *"ధనవంతుడు "*కన్నులెత్తి
తండ్రి అయినా అబ్రాహాముతో ఏమన్నాడో తెలుసా ?
👉అప్పుడతడు తండ్రీ, ఆలాగైతే నా కయిదుగురు సహోదరులున్నారు.
వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండ వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి యింటికి వాని పంపవలెనని నిన్ను వేడుకొనుచున్నా ననెను *లూకా సువార్త అధ్యాయం 16:27*
👉ఈ వాక్యాన్ని మనము పరిశీలించినట్లయితే ఆ ధనవంతుడు తాను పడుచున్న వేదన
*తన ఇంటివారు పడకూడదని వేడుకుంటున్నాడని గ్రహించండి*
*తండ్రి అయినా అబ్రాహాము ఏమన్నాడో తెలుసా ?*
అందుకు అబ్రాహాము-- *వారియొద్ద మోషేయు ప్రవక్త లును ఉన్నారు;వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా*
(లూకా సువార్త అధ్యాయం 16:29)
👉ఈ వాక్యాన్ని గమనించినట్లయితే వారి యొద్ద మోషేయు ,ప్రవక్తల మాటలు అనగా దేవుని వాక్యము ఉన్నదని చెప్పాడు అంటే
*వారు ఒక వేళా దేవుని మాటలు వినిన యడల వారు పాతాళమును తప్పించబడును అని చెప్పెను*
మల్లి ధనవంతుడు మృతులలో ఒకడిని వారియొద్దకు పంపమని వేడుకుంటాడు కానీ అబ్రహం ప్రవక్తలమాటలు "వినని" వారు మృతుడు వెళ్లి చెప్పిన ఎలా నమ్ముతాడు అని చెప్పెను
👉మత్తానికి మీకేమి అర్ధమయ్యింది ప్రవక్తల మాటలు అనగా
*"దేవుని మాటలు "*
👉మనము వినిన యడల పాతాళం నుండి తప్పించబడతాము అని అర్ధం
అంటే ధనవంతుడు ప్రవక్తలమాటలు అనగా *"దేవుని వాక్యం విని ఆచరించలేదు ఆలా చేసినట్లయితే పేదవాడైన లాజరు ను "తన వాలే " ప్రేమించే వాడు అందుకే పాతాళానికి వెళ్ళాడు.*
👉నువ్వు నరకానికి వెళ్తవా. . . .?
లేక
👉పరలోకానికి వెళ్తవా. . . ?
*క్రైస్తవులకు ఉన్న ధరిధ్రం ఏమిటంటే బైబిల్ చేతిలో ఉండి అందులో ఏముందో తెలియక పోవడం ..*
బైబిల్లో *“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను”* అని ఉంది కదా. .
👉ఆయనతో పోల్చుకుంటే నువ్వు, నేను ఎంత ?
🔸 న జీవితంలో గాని,
🔸 దవుని పనిలో గాని అధికారం కోసమో ,
🔸 గరవం కోసమో,
🔸పరు కోసమో,
🔸హదా చూపించు కోవడం కోసమో
*నీ పొరుగు వారిని చులకనగా చూస్తే, ద్వేషిస్తే నువ్వు నరకానికే వెళ్తావు జాగ్రత్త..!*
*దేవుని చిత్తమును జరిగించు.. దేవుని ఘనపరచు.. దీవించబడుదువు...!*
*మన రక్షకుడైన యేసుక్రీస్తును గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను మనలను రెండవ రాకడకు సిద్దాపరచును గాక !*
నా ప్రియ స్నేహితులారా....
👉 జగ్రతగా చదివారుగా. మీరు కూడా వాక్యాన్ని ధ్యానించండి.
👉మరు నేర్చుకోండి అనేక మందికి నేర్పించండి....
*“ మనం కలసి చదువుదాము....*
*కలసి నేర్చుకుందాము....*
*కలసి జీవములోకి అడుగులు వేద్దాము....”*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*
👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*
o
ధనవంతుడు నరకానికి ఎందుకు వెళ్లాడు..? లాజరు పరలోకానికి ఎందుకు వెళ్లాడు…?
*సాతాను దేవునికీ, మానవునికీ ప్రధాన శత్రువు. వాడు ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుతున్నాడు.*
1 పేతురు 5:8
👉ఈ లోకంలో నున్న ప్రతీ పాపమునకు వెనుక నిలువబడి వ్యూహాన్ని రచించేది సాతానుడే.
👉వడి రాజ్యంలో పరలోకంలో నుండి పడద్రోయబడి దయ్యాలుగా మారిన దూతలూ, పాపులైన మానవులూ ఉన్నారు.
*వాడు అనునిత్యమూ దేవుని పిల్లలను ఓడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు.*
👉 వడి పేరే *"అపొల్లుయోను"* అంటే? *'నాశనము చేయువాడు'*
ప్రకటన 9:11
👉సతాను దయ్యాలు అనబడే అపవిత్రాత్మల సేనకు నాయకత్వం వహిస్తూ వారితో కలసి పనిచేస్తుంటాడు.
*ఈ అపవిత్రాత్మలు మానవులలో ప్రవేశించి వారిని హింసించేందుకు శక్తి కలిగి వున్నాయి.*
ఇక సాతానుడైతే ప్రకృతి శక్తులపై అధికారాన్ని కలిగివుంటూ తన దయ్యపు *'సూచక్రియల'* ద్వారా
(2 థెస్స 2:9,10) దేవుని పనినే గలిబిలి చేస్తుంటాయి.
*ప్రధాన దూత అయిన మిఖాయేలే దేవునికి మొరపెట్టునంతగా వాడు దుష్ట శక్తులను, అధికారాన్ని కలిగివున్నాడు*
(యూదా 9).
అయితే,
*వాడిని ఎట్లా ఎదిరించాలి?*
👉 *మెలకువగా వుండి, ప్రార్ధించుట ద్వారా వాడిపై విజయం సాధించ వచ్చు.* (మత్తయి 26:41)
👉 మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి.
*"అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును"*
యాకోబు 4:7
👉 *ప్రార్ధన అత్యంత శక్తివంతమైన ఆయుధం.*
*ప్రార్ధన క్రీస్తు సన్నిధిని మన మధ్యకు తీసుకొని వస్తుంది.*
*ప్రార్ధన దేవుని దూతలను మన సహాయార్ధం భూమి మీదకు తీసుకొని వస్తుంది.*
(2 రాజులు 6:15-17; హెబ్రీ 1:14)
*సాతానును జయించి, వానిని సమూల నాశనం చెయ్యడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆయుధం "ప్రార్ధన".*
*ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.*
ఎఫెసీ 6:18
కానీ,
మనం లోకం మత్తులోపడి, ప్రార్ధనా హీనులయ్యాము.
ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం.
👉 *ఫలితంగా సాతానును ఓడించాల్సిన మనం, వాడి విజయానికి పరోక్షంగా సహాయ పడుతున్నాము.*
వద్దు!
*వాడిని ఓడించే శక్తివంత మైన ప్రార్ధనా ఆయుధాన్ని సరియైన రీతిలో ఉపయోగించగలిగితే, వాడెంత మాత్రమూ నిలువలేడు.*
ప్రార్ధిద్దాం!
ప్రార్ధనా ఫలాలు అనుభవిద్దాము.
సాతానును ఎదిరించి ఓడించే శక్తినిచ్చే ప్రార్థన....
*క్షామకాలం కొరకు నీకున్న సిద్ధపాటు ఏమిటి?*
*చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.*
సామెతలు 30:25
*చీమలు 🐜*
▫️చమలలో ఏడువేల రకాల జాతులున్నాయట
▫️చమలు ఒకే పుట్టలో నివాసముండి ఐకమత్యాన్ని చాటి చెబుతాయి.
▫️ఇవి క్రమశిక్షణ గలిగిన జీవులు
▫️ఇవి కష్టించి పనిచేస్తాయి.
▫️తన బరువుకంటే 20 రెట్లు బరువుగలిగిన వస్తువులను అవలీలగా మోసుకుపోతాయి.
▫️మనకు తెలిసి ఎర్ర చీమలు, నల్ల చీమలు, చలి చీమలు, ఖండ చీమలు ఇట్లా... సోమరి చీమలు మాత్రం కానరావు.
*🐜 చమలు వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును:*
వర్షాకాలం చీమలు ఎక్కువ రోజులు పుట్టలలోనే గడపాల్సి వస్తుంది? అట్లాంటప్పుడు వాటికి ఆహారమెక్కడది? అందుకే, వేసవికాలమంతా వాటి శక్తికి మించిన పనిచేసి వర్షాకాలం కొరకు, కోతకాలమందు ఆహారాన్ని సమకూర్చుకొని భద్రపరచుకొంటాయి.
మనుష్యులలో కూడా రాబోవు తరాలకు సరిపడే ఆస్తులు కూడగట్టేవారున్నారు. వారు సంపాదించడం తప్పని నేను అనడం లేదుగాని, వారి సంపాదన వారివెంట వస్తుందా? దేనికొరకు వారి ప్రయాస అన్నదే ప్రశ్న? భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. (మత్తయి 6:19)
*అయితే మనము సంపాదించుకోవలసిన ఆస్తి ఏమిటి?*
*రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;* ఆమోసు 8:11, 12
సువార్త ద్వారాలు మూయబడే దినాలు దగ్గర కాబోతున్నాయి. దేవుని వాక్యం దొరకని అత్యంత భయంకరమైన క్షామం మనముందుంది. ఆ దినాలు ఊహలకే అత్యంత భయానకం. ఆ దినాలకొరకు, వాక్యము విరివిగా ప్రకటింపబడుతున్న ఈకాలమందే దానిని సమకూర్చుకొని, హృదయస్థం చేసుకోవాలి. ఆ దినాన్న నీ చేతిలోనున్న బైబిల్ లాక్కోగలరేమో గాని, నీ హృదయంలో ముద్రింపబడిన వాక్యాన్ని ఎవరు చెరిపివేయగలరు? నీవు సమకూర్చుకోవలసింది పరలోక ధనాన్ని. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. (మత్తయి 6: 20) అయితే, దేవుని వాక్యానికి నీవిచ్చే ప్రాధాన్యత ఎంత? క్షామకాలం కొరకు నీవు సమకూర్చుకున్నదేదైనా ఉన్నదా? తుప్పుపట్టని పరలోకధనం ఏదైనా సమకూర్చుకున్నావా?నిన్ను నీవే పరిశీలన చేసుకో.
🐜 సృష్టిలో అత్యున్నత సృష్టమైన మనిషిని, అత్యంత అల్పజీవులైన చీమలనుండి నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు.
దేవుడు పనిచేసేవారితో కలసి పని చేస్తారు. సాగిపోయేవారితో సాగిపోతారు. కానీ, సోమరిలా కూర్చుండేవారితో మాత్రం కూర్చోడాయన.
రాజు తన రాజ్యంలోనున్న సోమరులనంతా ఒకచోటచేర్చి, పరమ సోమరిని గుర్తించాలని, మీలో పరమ సోమరి ఎవరో చేతులెత్తండి అంటే అందరూ చేతులెత్తారట. ఒక్కడుతప్ప. అంటే, వాడు చెయ్యి కూడా ఎత్తలేనంత బద్దకస్తుడన్నమాట. వాడే పరమ సోమరి కిరీటాన్ని దక్కించుకున్నాడు. అవును!
సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు. (సామెతలు 19:24) వాడికి నమలడం బద్దకమని, జ్యూస్ చేసి నోట్లో పోసినాగాని, మ్రింగడానికి కూడా వానికి కష్టమే.
అందుకే దేవుడు, వారిని భూమిమీద అత్యంత అల్పజీవులైన చీమలయొద్దకు వెళ్లి బుద్ధి తెచ్చుకోమని హెచ్చరిస్తున్నారు.
సోమరీ,
▫️చీమలయొద్దకు వెళ్లు
▫️వటి నడతలు కనిపెట్టు
▫️జఞానము తెచ్చుకో
▫️వటికి న్యాయాధిపతి లేడు
▫️ప విచారణకర్త లేడు
▫️అధిపతి లేడు
▫️అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును
▫️కతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
సామెతలు 6 : 6-8
సోమరివానికి నిద్ర అంటే ప్రాణం. ఎంతసేపూ, ఇంకా కొంచెం కునకాలి, ఇంకా నిద్రపోవాలి అదే ధ్యాసతప్ప, మంచాన్ని విడచి పెట్టడం వానికసలు ఇష్టముండదు. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? (సామె 6:9) సరే సోమరి సంగతి ప్రక్కనబెడదాం. ప్రార్ధించడానికి ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకొని, రింగ్ అవుతుంటే టక్ ని ఆపేసి, కొంచెం సేపాగి లేద్దామని, ఉదయం వరకూ లేవని నిన్ను ఏమనాలి? నిద్రను ప్రేమించి, ప్రార్ధనను నిర్లక్ష్యం చేసే నిన్నేమనాలి? రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, బాప్తీస్మం వాయిదా వేస్తూ, దేవుని పని చెయ్యడానికి తప్పించుకొని తిరుగుతూ, ఆధ్యాత్మిక మత్తులో జోగుతున్న నిన్నేమనాలి? నేను ఏదైనా అంటే, నీకు కోపం రావొచ్చు. నీవేంటో, నీవే తేల్చుకో.
సోమరితనాన్ని విడచిపెట్టి, ప్రభువుతో నిత్యమూ జీవించే ఆ సమయం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
o
క్షామకాలం కొరకు నీకున్న సిద్ధపాటు ఏమిటి? ... చీమలు బలములేని జీవులు..?
ఇంతగా హెచ్చించుటకు నేనేపాటి వాడను..... ?
గొర్రెల వెంబడి తిరుగుతున్న దావీదును, గొర్రెల దొడ్డె లో నుండి తీసి, ఇశ్రాయేలీయులకు రాజును చేశారు దేవుడు. అతడు తరుమబడుతున్నప్పుడు దేవుని కృప ఆయనను వెంటాడింది. అతడు వెళ్ళినచోటనేల్లా దేవుడు అతనికి తోడుగా నున్నారు. దేవుడే శత్రువులను నిర్మూలము చేసి, లోకంలో గొప్ప ఘనతను ఆయనకిచ్చారు.
దేవదారు మ్రానులతో కట్టబడిన భవనం లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న దావీదు రాజుకు, దేవుని మందసం గుడారములో ఉండడం హృదయాన్ని కలచివేసింది. తన హృదయవాంఛను ప్రవక్తయైన నాతాను గారితో పంచుకున్నారు. నీ హృదయంలో ఏముందో దానిని చెయ్యి. దేవుడు నీకు తోడుగా ఉంటారని చెప్పారు. కానీ, దేవుడు దానికి సమ్మతించలేదు. దావీదు చేతులు రక్తాన్ని ఒలికించాయి, అతడు నా మందిరాన్ని కట్టకూడదు. “నీ జీవిత దినములు తీరి నీ పితరులయొద్దకు నీవు చేరునప్పుడు నీ కుమారులవలన కలుగు నీ సంతతిని నేను స్థాపనచేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసెదను. నేను అతనికి తండ్రినైయుందును, అతడు నాకు కుమారుడై యుండును; నీకంటె ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నారాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను, అతని సింహాసనము ఎన్నటికిని స్థిరముగా నుండునని అతనికి తెలియజేయుము”. (1దిన 17:11-14) అని, నాతాను ద్వారా, దావీదుకు తెలియజేసినప్పుడు, అతని హృదయమంతా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు, దేవుని సన్నిధిలో చేరి అతడు చేస్తున్న ప్రార్ధన.
నీవు నన్ను ఇంత హెచ్చు లోనికి తెచ్చుటకు నేను ఎంతటివాడను? (1 దిన 17:16) ప్రభువా నాకున్న అర్హతేమిటి? గొర్రెల దొడ్డె లో జీవితాన్ని గడపాల్సిన నాకు సింహాసనమిచ్చావు. అంతే కాకుండా ఆ సింహాసనాన్ని నా సంతానానికి కూడా నిత్యస్థాపన చేస్తున్నావా? నేనెంతటి వాడను ప్రభువా? అంటూ తన పూర్వ స్థితిని జ్ఞాపకం చేసుకొంటూ, ప్రస్తుత పరిస్థితిని భేరీజు వేసుకొంటూ, పొందబోవు నిత్యమైన వాగ్ధానాన్ని నెమరువేసుకొంటూ, కృతజ్ఞతతో నిండిన హృదయంతో తనను తాను తగ్గించుకొంటూ, దేవునిని హెచ్చించగలుగుతున్నారు.
నీ పూర్వ స్థితిని, ప్రస్తుత పరిస్థితితో నీవెప్పుడైనా సరిపోల్చుకున్నావా? పెంటకుప్పల మీద జీవించాల్సిన నిన్నూ నన్నూ మింటపైన ఘనులతో కూర్చుండబెట్టారాయన. తినడానికి తిండిలేక, ధరించడానికి వస్త్రాలు లేక, నివసించడానికి సరియైన గృహాలు లేక, ఎండకు ఎండుతూ, చలికి వణకుతూ, వర్షానికి తడుస్తూ అన్నట్లు మన పితరులు జీవించిన జీవన పరిస్థితులు, మనము ఏ కోశానా చవిచూడలేదు. పస్తు అంటే ఏమిటో మన బిడ్డలకు తెలియనే తెలియదు. ఇంతగా ప్రభువు నిన్ను హెచ్చిస్తే? ఎప్పుడైనా, ప్రభువా ఇంతగా హెచ్చించడానికి నేను ఏపాటివాడను? అంటూ కృతజ్ఞతతో ఒక్కమాట చెప్పగలిగావా? ఇంతవరకూ మనము భౌతిక సంబంధమైన విషయాలను గూర్చే మాట్లాడుతూ వస్తున్నాము. అంతకుమించి, ఆయన నిన్ను ఎంతగా హెచ్చించారంటే? నిత్యమరణమే మనకు శరణ్యమైనప్పుడు, మనలను హెచ్చించడానికి, దాసునిగా దిగివచ్చి, మనము పొందాల్సిన శిక్షను మనకు బదులుగా ఆయనే అనుభవించి, మనలను విమోచించి, ఆయన కుమారునిగా, కుమార్తెగా మనలను హెచ్చించారు. ప్రభువా! నా కోసం ఇంత చెయ్యడానికి, ఇంతగా నను హెచ్చించడానికి నేనేపాటి వాడను? నేనేపాటి దానను? అంటూ ఎప్పుడైనా కృజ్ఞతతో ఈమాట చెప్పగలిగావా? ఆయన ఎంతగా మనలను హెచ్చించారో మనలోనికి మనము చూడగలిగితే, ఆ మాట చెప్పకుండా ఉండలేము. ఆయన ప్రేమను, కృపను అర్ధం చేసుకొంటూ కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించడానికి మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
By
నిరీక్షణ ద్వారం
@NireekshanaDwaram
ఇంతగా హెచ్చించుటకు నేనేపాటి వాడను..... ?
మద్యపానం - ధూమపానము
ఎవరికి శ్రమ? ఎవరికి దుఃఖము? ఎవరికి జగడములు? ఎవరికి హేతువులేని గాయములు? ద్రాక్షరసంతో ప్రొద్దుపుచ్చు వారికే కదా! . . . పిమ్మట అది సర్పమువలె కరచును. కట్లపాము వలె కాటువేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. వెర్రిమాటలు పలుకుదువు. (సామెతలు 23:29-35).
ప్రియ సహోదరి/సహోదరుడా! నేటి దినాలలో త్రాగుడు మరియు ధూమపానం ఎక్కువైపోయింది. ముఖ్యంగా యవ్వనస్తులు చాలా ఘోరంగా వీటికి బానిసైపోయారు. త్రాగి వాహనాలు నడపడం, యాక్సిడెంటులు అవ్వడం జరుగుతుంది. పట్టణాలలో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ సిటీల్లో యువకులుతో పోటీగా యువతులు కూడా మద్యపానం ధూమపానం చేస్తున్నారు, సాతానుకి బానిసైపోతున్నారు. అయితే విచారం ఏమిటంటే అన్యులతో పాటు దేవుని బిడ్డలు కూడా అదే పాపం చేస్తున్నారు సరికదా ప్రభురాత్రి సంస్కారం కూడా తీసుకొంటున్నారు. దేవుడంటే భయం లేకుండా జీవిస్తున్నారు. ఇప్పుడు నేను వ్రాసేది దేవుని బిడ్డలు కోసమే. ఎదుట వారికి తీర్పు తీర్చడం నాకేల? పౌలుగారు అంటున్నారు " ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైననూ- తిట్టుబోతుగాని, త్రాగుబోతుగాని. . . అయితే అట్టివానితో సాంగత్యము చేయరాదు, కలసి భుజింపరాదు. . . సంఘంలో నుండి వెలివేయమని చెబుతున్నారు (1కొరింథీ 5:11-13). ఎందుకంటే అది దేవునికి అసహ్యమైన క్రియ. మోసపోకుడి! జారులైననూ. . . త్రాగుబోతులైననూ, దూషకులైననూ. . దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు (1కొరింథీ 6:9,10).
నేటి దినాలలో క్రైస్తవ జనాంగము దీనిని మరచిపోతున్నారు. లోకస్తులతో కలసి లోకస్తులు త్రాగుతున్నట్లు త్రాగుతున్నారు. దానివలన ఏమేమి సంభవిస్తాయో సొలొమోనుగారు వివరించారు. మొదటగా శ్రమ. తన దేహాన్ని తనే శ్రమ పెట్టుకొంటున్నాడు. తమ కుటుంబాన్ని కూడా శ్రమపెడుతున్నారు. దానివలన దుఃఖము అశాంతి, కారణం లేని జగడాలు, ఎందుకంటే త్రాగేసి ఏం మాట్లాడుతారో వారికే తెలియదు. ఫుల్ గా త్రాగేసి రోడ్డుమీద పడిపోతారు, పందిలా బురదలో , డ్రైనేజీలో దొర్లుతుంటారు. ఫలితంగా హేతువులేని గాయాలు.
గమనించండి అన్యులుకూడా ఇలా చేస్తారు కాని ఎవరూ పట్టించుకోరు, అదే దేవుని బిడ్డలు చేస్తే పెద్దరాధ్ధాంతం చేస్తారు దేవుని బిడ్డలు రోడ్డుమీద దొర్లుతున్నారు అంటారు. తద్వారా దేవుని నామం అవమానపరచడుతుంది దూషింపబడుతుంది.
ఇంకా ఏమి వస్తాయి? Sugar, BP, Lever పనిచేయదు, ధూమపానం వలన ఊపిరితిత్తుల పాడైపోతాయి, కేన్సర్ ఇంకా అనేక రోగాలు - పిమ్మట అది సర్పము వలె కరచును అంటే ఇదే. కట్లపాము కాటేస్తే వెంటనే చనిపోరు, పక్షవాతము, ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి. ఈ మద్యపానం, ధూమపానం వల్ల కూడా అలాగే ధీర్ఘకాలిక రోగాలు వస్తాయి.
ప్రియ సహోదరుడా! దేవుని పరువు తీస్తున్నావు, నీ ఆరోగ్యం పాడుచేసుకొంటున్నావు. నీ కుటుంబాన్ని కూడా బాధపెడుతున్నావ్. త్రాగుబోతులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని తెలుసుకో!
కొందరంటారు త్రాగకూడదని బైబిలులో ఎక్కడుంది? వారు బైబిల్ చదివితేనే కదా తెలుస్తుంది ఎక్కడ వ్రాయబడిందో తెలుస్తాది. 1కొరింథీ 5:10-13; 6:9,10; 1 పేతురు 4:3; సామెతలు 23:29-35.
ఇంకొందరు అంటారు మరి పౌలుగారు తిమోతిగారికి పత్రిక వ్రాస్తూ నీ కడుపు నొప్పి కోసం ద్రాక్షారసం తీసుకోమని వ్రాశారు కదా అని. ప్రియబిడ్డా! దైవ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, కలిపి చెరపకూడదు. నీకు అనుకూలంగా మలచుకోకూడదు.
1. ఇక్కడ ద్రాక్షారసం (wine) అంటే ద్రాక్షపళ్ళునుండి తీసిన రసం డైరెక్టుగా త్రాగమని అర్థం. దానికి ఈస్ట్ కలిపి, పులియబెట్టిన తర్వాత త్రాగమనికాదు. ప్రస్తుతం చాలామంది (RCM) చేస్తున్న పని ఇదే. బైబిల్ కు వ్యతిరేకంగా చేస్తున్నారు.
2. పూర్వకాలంలో Medicine అభివృద్ధికాని రోజులలో యూరోప్, మధ్య ఆసియా ప్రాంతాలలో ఏదైనా అనారోగ్యం కలిగితే ద్రాక్షరసం, అంజూరపు ఆకులు, ఒలీవ ఆకులు, ఒలీవ నూనె వాడేవారు. (మన దేశంలో నల్లమందు వాడినట్లు 50 సం. ల క్రితం) . ద్రాక్షరసంతో గాయాలు కడిగితే తొందరగా నయమయ్యేది (wine తో కాదు). ఆ ద్రాక్షారసం త్రాగితే కడుపు నొప్పి లాంటివి తగ్గేవి. ఆ ఉద్దేశంతోనే పౌలుగారు చెప్పారు గాని ఈస్ట్ కలిపిన wine త్రాగమని చెప్పలేదు.
ధూమపానం
కొంతమంది సిగరెట్లు త్రాగకూడదు అని బైబిలులో లేదుకదా, త్రాగితే తప్పేంటి అని అడుగుతారు. బైబిలు వ్రాయబడినప్పుడు సిగరెట్లు బీడీలు లేవు ఉంటే వ్రాయబడి ఉండేది. ఒకవేళ దేవుడు ధూమపానాన్ని అనుమతిస్తే నీ తలమీద గాని, మరో ప్రాంతంలో ఒక పొగ గొట్టాన్ని (exhaust pipe) పెట్టి ఉండేవారు కదా! గాలి పీల్చుకోడానికి ముక్కు రంధ్రాలు, మలమూత్ర విసర్జనకు మరో రంధ్రాలును ఏర్పాటుచేసినట్లు. ఎంత ఘోరమంటే ఆ సిగరెట్ పేకట్ మీద ప్రొగత్రాగడం హానికరం అని వ్రాసినా డబ్బు పెట్టి కొని, అగ్గి పెట్టి కాల్చేస్తున్నావు. కొంత కాలానికి అవి నీ ఊపిరితిత్తులను తినేస్తాయి. మరికొందరు మాధక ద్రవ్యాల మత్తులో మూలుగు తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి కాలేజీలలో అడ్మిట్ చేస్తున్నారు తర్వాత వారు ఎలా ప్రవర్తిస్తున్నారో పట్టించుకోవడం లేదు. మరీ ముఖ్యంగా వాళ్ళకోసం మోకాళ్ళ మీద కన్నీటితో దేవునికి ప్రార్థన చెయ్యడం లేదు.ఫలితంగా సాతాను మీ పిల్లలను ఈ లోకాశలమీదకు మళ్ళించి నాశనానికి తీసుకొని పోతున్నాడు.
ఇక పేతురుగారు అంటున్నారు మద్యపానం గాని, త్రాగుబోతుల విందులు గాని చేయగూడదు అని (1 పేతురు 4:3). పౌలుగారు అంటున్నారు త్రాగుబోతులు పరలోకం వెళ్లరని (1 కొరింథీ 6:9,10). యెషయా గ్రంథంలో త్రాగుబోతులకు శ్రమ అంటున్నారు (యెషయా 28:1).
అందుకే యోవేలు గ్రంథంలో దేవుడంటున్నారు "మత్తులారా! మేలుకొని కన్నీరు విడువండి, ద్రాక్షరస పానం చేయువారలారా! రోదనం చేయుడి" (యోవేలు 1:5)
కాబట్టి నేడే నీ మత్తు, మద్యపానం, ధూమపానం, మాదకద్రవ్యాలు వదలి యేసయ్య పాదాలు దగ్గరకు రా! మానేద్దామని అనుకొంటున్నా మానలేక పోతున్నావా? నీ సిగరెట్ పేకట్లు, మందు బాటిల్లు బయట పారవేసి యేసయ్య పాదాలను నీ కన్నీటితో కడుగు. వెంటనే నీకు దేవుడు వాటిమీద అసహ్యాన్ని కలిగిస్తారు. అప్పుడు నీవు సంతోషిస్తావు. నీతో పాటు నీ కుటుంబం. సమాజంలో మంచి పేరు కూడా వస్తుంది. చివరకు పరలోకాన్ని పొందుకొంటావు.
అట్టి కృప అందరికీ కలుగును గాక!
దైవాశీస్సులు.
మద్యపానం - ధూమపానము
👉అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, అంటరానివారుగా పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.
👉 *సమరయ అనగా Watch Tower (కాపలా కోట). అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది.*
ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకోనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు.
*ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.*(2రాజులు 17: 24-41).
👉ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18).
👉 అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యేశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు.
👉అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు.
*ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది.* ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.
👉 *అయితే ఇటువంటి అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు.*
ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం!
ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!
*ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా?*
*అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా?*
*నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా?*
*నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా?*
👉 భయపడొద్దు!
*పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు.*
ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.
*ఆయనకి నీవుకావాలి!*
👉 *ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు.*
👉ఆయన వద్దకు వస్తావా?
*వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు.*
*హల్లెలూయ...*
(రెండవ బాగము)
ప్రియ సహోదరీ/సహోదరులారా! మధ్యాహ్నం ఇంచుమించు 12గంటల సమయంలో యేసుప్రభులవారు సమరయ ప్రాంతంలో సుఖారు గ్రామ పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసియున్న రీతినే కూర్చోన్నట్లు చదువుకొన్నాం.
యోహాను 4: 6,7 వచనాలు. *అప్పుడు సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు రాగా యేసు- దాహమునకిమ్మని ఆమెనడిగెను.*
*ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయస్త్రీ నీరుకోసం బావిదగ్గరకు వచ్చింది.*
పల్లెటూర్లలో (పూర్వకాలం) స్త్రీలు వేకువఝామున లేచి మంచినీరుకోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఉదయం 7గంటల తర్వాత ఎవరు బావికి రారు. ఆ సమయానికి ఆ రోజుకి సరిపడే నీళ్ళు తెచ్చేసుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు.
👉కాని ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి?
1. తెచ్చుకొన్న నీరు అయిపోయిందా?
*తర్వాత వచనాలు ప్రకారం ఎంతమాత్రము కాదు.*
2. Privacy కోసమా? ఒంటరితనం కోసమా? ఏమో తెలియదు. ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన?
3. ఆ సమయంలో ఎవరూ బావి దగ్గర ఉండరని తెలిసా? ఏం ఎందువల్ల?
4. తన పాపపు జీవితం కొనసాగించడానికి అదే మంచి సమయమనా? ఏమో! మనకి తెలియదు.
5. *లేక తనజీవితాన్ని ఎరిగియున్న ఊరిజనం తనని సూటిపోటి మాటలతో భాదిస్తున్నందువలన వారిని తప్పించుకోడానికి ఆ సమయంలో వచ్చిందా?* మనకి తెలియదు.
*పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాటిరేవు(బావి)దగ్గర చెబితే కొంతసేపటకి ఊరంతా ప్రాకిపోతుంది, ఉన్నదానికి ఇంకొంచెం కలిపి చెప్పేవారు!! ఈమె గూర్చి కూడా అలా చెప్పుకోన్నారేమో!!*
6. లేక ప్రజలకి తన జీవితం ఎలాంటిదో తెలియక పోయినా తన అంతరాత్మ గద్దింపుతో ప్రజలకి తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో!!
👉 ఒకవేళ ప్రియ చదువరీ! నీవుకూడా అదే పరిస్తితిలో నున్నావా? చింతపడకు!
*ఇలాంటి స్తితిలో నున్న ఒక స్త్రీని రక్షించడానికి యేసయ్య అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆస్త్రీతో మాట్లాడారు.*
ఈలోకంలో ఎవరికీ మనజీవిత రహష్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు.
*ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే యేసయ్య అక్కడికి వెళ్లి రక్షణను అందించారు.*
*నాయీను గ్రామంలో* విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడచి (కపెర్నహూము నుండి నాయీను కి సుమారు 32 కి.మీ.) ఉదయాన్నే ఆ గ్రామం చేరుకొని ఆ విధవరాలి కుమారున్ని బ్రతికించి ఇచ్చారు.
*యేసయ్యని చూడాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య* కోసం ఆ ఊరు వచ్చి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్న జక్కయ్యను పేరుపెట్టి మరీ పిలచి అంటున్నారు – జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బసచేయవలసి ఉంది.
👉 *మనం చేసే ప్రతీ ఆక్రందన ప్రతీ ప్రార్ధన ఆయనకు వినబడుతుంది.*
👉 *నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను.*
*నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య,జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య, నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.*
👉 అయితే గమనించ వలసినది ఏమిటంటే
*“దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.”*
👉 దురదృష్టవశాత్తూ మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాము. కాని దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా మరల వస్తుంది.
*అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారం.*
👉కాబట్టి బెదరిపోకు!
👉 అలసిపోకు!
👉 సోలసిపోకు!
*దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు.*
*సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేల కలసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నారు.*
*సమరయ స్త్రీ ఒకతె నీల్లుచేదుకొనుటకు అక్కడికి రాగా యేసు- నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.*
యోహాను 4:7
👉ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి.
1⃣ *యేసుప్రభులవారు దైవమానవుడు*.
ఆయన సశరీరుడుగాఈలోకంలో జన్మించినందువలన *రెండుసార్లు ఆయన దప్పిగొనినట్లు బైబిల్ గ్రంధంలో చూస్తాం.*
ఒకసారి యాకోబు బావి దగ్గర, రెండవసారి సిలువలో వ్రేలాడుచున్నప్పుడు లేఖనం నేరవేర్పుకై. ఆయన నీలా నాలా దప్పిగొన్నారు.
*మనం నిజంగా పరిశీలిస్తే ఆయన నిజమైన దాహం ఆకలి ఏమిటి?*
👉 ఇదే అధ్యాయంలో వ్రాయబడింది
*నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించడమే ఆయన దాహం, ఆకలి!!!*
👉క్రీస్తులో రక్షించబడి వెలిగించబడిన ప్రియ చదువరీ!
*నీకు ఆ దాహముందా??! లేకపోతె ఇప్పుడే పొందుకో!*
2⃣ *సమరయ స్త్రీ యొక్క ఇతరులను గౌరవించే/ మర్యాద నిచ్చే లక్షణం*:
క్రింది వచనాలు చూసుకొంటే ఎప్పుడైతే యేసయ్య దాహమునకిమ్మని ఆమెనడిగారో, వెంటనే ఆమె అశ్చ్యర్యపోయింది.
మొదటి బాగంలో చెప్పిన విధముగా అనేక వందలాది సంవత్సరాలునుండి యూదులకు, సమరయులకు వైరం, శత్రుత్వం.
*అయితే ఇక్కడ శత్రువు మొట్టమొదటగా కనబడి ఏమైనా సహాయం అడిగితే- శత్రువు మీద ప్రతీకారం చేయకుండా, సూటిపోటి మాటలాడకుండా ఎంతో నమ్రతతో అడుగుతుంది*
యేసయ్యను- యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహనమునకిమ్మని ఎలాగు అడుగుచున్నావు?
ఎందుకంటే మనం యూదులు తాము గొప్పవారమని- సమరయులు పాపులని, అంటరానివారని పరిగనిస్తున్నట్లుగా చదువుకొన్నాం కదా! అందుకే ఆమె అలా అడిగింది.
మరో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ సంభాషణ అంతటిలో
*ఆమె యేసయ్యని – అయ్యా! అని సంభోదిస్తుంది.*
యేసయ్య జాతిప్రకారం ఆమెకు శత్రువైనా ఎంతో గౌరవం ఇస్తుంది.
*ప్రియ చదువరీ! నీలో నాలో అటువంటి మంచి లక్షణం ఉందా?*
👉 ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసయ్య కి నీరు/దాహమునకివ్వడానికి సిద్దపడింది.
👉అయితే ఇక్కడ మరో చిక్కు.
*సమరయుల నీటిని ఆహారాన్ని యూదులు సేవించరు!*
సరికదా వారి వస్తువులను కూడా తాకరు. అందుకే మరోసారి అడుగుతుంది
🔺 అయ్యా! మీరు మా వస్తువులు ముట్టుకోరు కదా! మీకు నీరు చేదుకోడానికి చేద/బొక్కెన లేదు కదా! మరి నాకు ఎలా జీవజలం ఇస్తారు అని!
🔺 ఇక్కడ ఆమెకు యేసయ్య జవాబిచ్చారు
*తన నిజమైన దాహం ప్రజలకు నిత్యజీవం ఇవ్వడం, నిత్యరక్షణ, నిత్యరాజ్యం ఇవ్వడమే తన దాహం అని చెప్పారు!*
3⃣ *సమరయ స్త్రీకున్న లేఖనాల మీద అవగాహన- చరిత్రమీద అవగాహన*:
ఈ 4వ అధ్యాయం పూర్తిగా చదివితే ఈ సమరయస్త్రీ కి లేఖనాలమీద ఎటువంటి పట్టు ఉందొ తెలుస్తుంది.
1).12వ వచనం ప్రకారం ఆబావి తానును తనకుమాల్లును ఈ బావి నీళ్ళు త్రాగి, మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటే నీవు గొప్పవాడివా? అని అడిగింది.
ఇక్కడ అది యాకోబు బావి అని మొత్తమందరికీ తెలుసు.
👉అయితే ఆమె యేసయ్యతో ఏమంటుంది?
*మనతండ్రియైన యాకోబు. అంటే యూదులకు సమరయులకు అందరికీ తండ్రి యాకోబు.*
🔺 పరోక్షంగా చెబుతుంది నీవు నేను అందరం ఒకే తండ్రి బిడ్డలం. ఒకే దేవుని బిడ్డలం. అయితే మీరు మమ్మల్ని అంటరానివారుగా చూస్తున్నారు.
👉 ప్రియ చదువరీ! *ఇదేమాట సమరయస్త్రీ నిన్ను నన్ను అడుగుతుంది నీలో నాలో కూడా ఇంకా అంటరానితనం అనే దుర్ఘుణంఉందా?*
🔺ఈలోకంలో ఎవరూ అంటరానివారు లేరు!
🔺అందరినీ దేవుడు ఒకేలాగా ప్రేమిస్తున్నారు.
*చెడ్డవారిని చూసి వ్యసనపడకుము* అని లేఖనం సెలవిస్తుంది కీర్తనలు 37:1 లో.
2) 20వ వచనం ప్రకారం
*తనకు చరిత్ర తెలుసు.* ఇంతకముందు చెప్పినట్లుగా సమరయులు *మొదట గెరీజీము కొండపై* ఒక మందిరాన్ని కట్టుకొంటే ఒక యూదు రాజు దానిని పడగొట్టేశాడు.
అప్పుడు సమరయులు షెకెము కొండమీద మందిరం కట్టుకొని ఆరాధిస్తున్నారు, అదే విషయం ఆమె చెబుతుంది. యేసయ్య అన్నారు.
*కొండమీద కాదు , ఆయనని ఆరాదించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించాలి అని.*
3) 25వ వచనం ప్రకారం
*క్రీస్తు అనబడే మెస్సీయ వచ్చునని నాకు తెలుసు.* ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేయును.
ఈవచనం ప్రకారం మనకు క్షుణ్ణంగా అర్ధమయ్యేదేమిటంటే
👉 *తన జీవితం ఎలాంటిదైనా గాని ఆమెకు దైవభక్తి, లేఖనాలు చదివే అలవాటుంది.*
👉మెస్సీయా వస్తాడనే నిరీక్షణ ఉంది. అందుకే మొట్టమొదటగా
*బైబిల్ లో ఆమెతోనే చెప్పారు యేసయ్య – ఆ మెస్సీయను నేనే అని!!!*
ఇంతవరకు సమరయస్త్రీ ఒక వ్యభిచారని, కేరెక్టర్ లేని వ్యక్తి అని విని ఉండొచ్చు!
*ప్రియ చదువరీ! ఆమెలో ఉన్న మంచి లక్షణాలను చూడు. ఆ మంచి లక్షణాలు నీకున్నాయా?*
🔹 శత్రువుని ప్రేమించే లక్షణం,
🔹 గౌరవం ఇచ్చే లక్షణం,
🔹 ప్రతీకారం చేయకుండా క్షమించే లక్షణం,
🔹లేఖనాలు చదివే లక్షణం నీకున్నాయా?
*పరీక్షించుకో! లేకపోతె ఇప్పుడే అలవరుచుకో!!!!*
*హల్లెలూయ...*
♻️ *సమరయస్త్రీ-గొంగళిపురుగు...✍️*
మనం కొన్నిరోజులనుండి సమరయస్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం.
*“దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా ? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము: ఇదే ప్రభువగు యెహోవా వాక్కు”* యెహెజ్కేలు 18:23
👉 చలా తరచుగా కొందరు ఇలా అంటారు
*“నాకు దేవుడు బాగా అర్ధం అయ్యారు కానీ,ఈ దేవుని వాక్యమే అర్ధం కావటం లేదు”* అని....
👉 మరికొందరు
*“నాకు దేవుని వాక్యం చాలా బాగా అర్ధం అవుతుంది కానీ; ఆ దేవుడే సరిగ్గా అర్ధం కారు”*
అని.
ఈ వైఖరి ముమ్మాటికి తప్పు. ఎందుకంటే....
👉దవుడు, దేవుని వాక్యం ఎప్పుడూ సమాంతరంగానే ఉంటాయి.
మనం పూర్తిగా దేవునిని తెలుసుకోవటానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రధానమైన ఆధారం *“ఈ దేవుని వాక్యం”.*
*దేవుని గుణలక్షణాలను గురించి తెలుసుకోవాలా..?*
📔దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని ప్రేమ యొక్క పరిధి ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని కోపం యొక్క తీవ్రత ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని కృప యొక్క వైశాల్యం ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని శక్తీ యొక్క సామర్ధ్యం ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని నమ్మకత్వం యొక్క దృఢత్వం ఎంతో తెలుసుకోవాలా..?*
📔దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని జ్ఞానం యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని పరిశుద్ధత యొక్క ఉన్నతి ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
👉దవుని గురించి మీరు ఏం తెలుసుకోవాలన్న సరే; సరిగ్గా, సులువుగా, అద్భుతంగా, ఉన్నది ఉన్నట్లుగా
ఈ *“బైబిల్“* ఈ పరిశుద్ధగ్రంధం తప్ప ఇంక ఏదియు చెప్పనేలేదు.
*మోషే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నపుడు*
👉 ఆ దేవాధి దేవుడిని చూడాలి అని మనవిచేసి కోరినప్పుడు,
👉ఆ దేవుడు మోషేకి తననుతాను బయలుపరచుకున్నారు..
*దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యేక్తిగా మోషే మారిన సందర్బం అది....*
అది ఒక అద్భుతం.
👉 దవుడు తన ముఖాన్ని మోషేకి చూపించలేదు కానీ....
🔺 తన మంచితన్నాన్ని మోషేకి చూపించారు.
🔺తన మహిమను మోషేకి చూపించారు.
🔺తన నామమునకు ఉన్న విశిష్టతను మోషేకు ప్రకటించారు.
*పూర్తిగా తన గుణలక్షణాలను మోషేకు వివరించారు.*
నిర్గామ 33:18-23
*మోషే దేవుని గుణలక్షణాలలోనుండి దేవుని పూర్తిగా తెలుసుకోగలిగారు అందుకే దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యక్తిగా మోషే మారాడు.* ద్వితియో 34:12
👉దవుని గుణలక్షణాలు అనేవి దేవునిని మనం తెలుసుకోటానికి ఉపయోగపడతాయి.
ఇప్పుడు ఇది ఈ *"బైబిల్ "* ద్వారా మాత్రమే... సాధ్యం.
అలాటి దేవుని గుణలక్షణాలలో
ఒ క లక్షణం
*“దుష్టులు తమ దుష్టత్వంలోనే మరణించటం, పాపి తన పాపంలోనే మరణించటం ఆ దేవాధి దేవునికి ఇష్టంలేదు”*
👉 దవుడు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని కాదు....
👉 దవుడు పాపాన్ని చంపుతారు కానీ, మారిన పాపిని కాదు....
🔹సర్వసమాజంలో పాపంపట్ల భయం కలుగునిమిత్తం,
🔹 మరణభయం వల్ల ప్రజలు పాపం నుండి దూరంగా వెళ్ళటం కోసం పాత నిబంధనలో దేవుడు కొన్ని మరణాలను అనుమతించారు.
👉 కనీ *అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు దేవుని ఉద్దేశం పాపి మారాలని మరుమనస్సు పొందాలని అంతేకాని ఒక పాపి ఆ పాపంలోనే మరణించాలని కాదు.*
యేసుప్రభులవారు పాపియైన సమరయస్త్రీని రక్షించిన విధానం మనం ధ్యానిస్తున్నాం.
యోహాను 4: 7-9
👉 *నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను.*
*నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య,జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య, నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.*
👉 అయితే గమనించ వలసినది ఏమిటంటే
*“దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.”*
*సమరయస్త్రీని బైబిల్ పండితులు గొంగళిపురుగుతో పోలుస్తారు. గొంగళిపురుగులాగానే మార్చబడిన జీవితం సమరయస్త్రీది.*
👉 *మొదటగా మనం గొంగళిపురుగు పురుగుకోసం చూద్దాం!*
👉ఇది ఎవరికీ ఇష్టం లేని ఒక అసహ్యమైన పురుగు. ఒంటినిండా ముళ్ళు, ముట్టుకొంటే చాలు గుచ్చుకోపోతాయి. చూస్తేనేచాలు చంపాలి అనిపిస్తుంది. పిల్లలు దానిని చూస్తే జడుసుకొంటారు. చివరకి పక్షులుకూడా వాటిని తినడానికి ఇష్టపడవు.
అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని, త్వరత్వరగా ఎదుగుతాయి. అలుపులేకుండా ఆహారం కోసం తిరిగి పచ్చదనాన్ని ఖాళీచేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలసి చెట్టు కాండానికి పట్టి, మొదటగా చెట్టుబెరడును, తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి. ఈరకంగా మొక్కలను పాడుచేసే ఒకరకమైన చీడపురుగు!
ఇంతవరకూ వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు!
అయితే గొంగళిపురుగు పెద్దదైన తర్వాత దానికి ఒకరకమైన భయంకరమైన నిద్రముంచుకొస్తుంది. దానికోసం అనువైన ప్రాంతంకోసం ఎత్తైన,ఎవరూ తన నిద్రను భంగం కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని, అక్కడ తన నోటినుండి లాలాజలంతో తనచుట్టూ ఒక గూడు కట్టుకొంటుంది. ఒకసారి గూడులోనికి వెళ్ళిన తర్వాత ఆహారం, లోకాన్ని మరచిపోయి సుదీర్ఘమైన నిద్రపోతుంది.
*ఆ నిద్రలో తనకి రూపాంతరం జరుగుతుంది.*
*నవజీవనం కలుగుతుంది. గొంగళిపురుగుగా చనిపోయి అందమైన సీతాకోకచిలుకగా బయటికి వస్తుంది.*
*నేలమీద, చెట్లుమీద ప్రాకే పురుగు ఇప్పుడు ఆకాశంలో రెక్కలతో ఎగురుతుంది.*
*ఒకరోజు అందరూ తనని చూసి అసహ్యించుకొన్న గొంగళిపురుగు, మరల మరల చూడాలనిపించేటట్లుగా మారిపోతుంది.*
*పిల్లలు చూసి జడుసుకొనే పురుగు, పిల్లలు తన వెంటపడే విధంగా మారిపోయింది.అయితే అది అలా మారడానికి చాలాశ్రమ పడింది.*
👉 *ఇక సమరయస్త్రీ జీవితంలో కూడా ఇదే జరిగింది.*
▫️ఒకరోజు ప్రజలతో వ్యభిచారిగా,
▫️కరెక్టర్ లేని స్త్రీగా,
▫️ బజారుమనిషిగా,
▫️ అంటరానిదానిగా,
▫️ వలివేయబడిన దానిగా ఎంచబడ్డ సమరయస్త్రీ-
*బావిదగ్గర యేసయ్య దగ్గర రక్షణ పొందింది. తనపాపపు కుండను అక్కడే వదలివేసింది. భయంకరమైన వ్యభిచారం, అబద్దాలు, ఎందరినో తన కంటిచూపుతో ఆకర్షించిన తన మొహపుచూపు అన్నీ వదలివేసింది.*
👉 గంగళిపురుగుకుండే ముళ్ళు పోయి రెక్కలు వచ్చి ఎగరడం ఎలా ప్రారంభించిదో, అలానే *పాపపు జీవితాన్ని విడచిన సమరయస్త్రీ- సాక్ష్యార్ధమైన బ్రతుకు కలిగింది.*
👉అందరూ చీదరించుకొన్న సమరయస్త్రీని ఇప్పుడు అందరూ కావాలని కోరుకోనేలా మారిపోయింది. *గ్రామానికి ఒక Role Model గా,ఒక వెన్నెముకుగా మారిపోయింది.*
*ఎప్పుడూ?*
*యేసయ్యని ఆహ్వానిచినప్పుడు!*
*పాపాన్ని విడచిపెట్టినప్పుడు!*
*తన పాపపుజీవితాన్ని సిగ్గువిడచి అందరికీ చెప్పినప్పుడు!*
👉 సమరయస్త్రీని మార్చిన దేవుడు నిన్నుకూడా మార్చగలరు.
నీ జీవితంలో కూడా గొప్ప అధ్బుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.
*అయితే ఆయనకీ నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి!*
*గొంగళిపురుగులా ఆ గూడులో సమాధి అయిపోవాలి.*
*నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని, దానిని భాప్తిస్మం ద్వారా సమాదిచేయాలి!*
*అప్పుడు క్రీస్తులోనికి భాప్తిస్మం పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు!*
*పునరుత్థానం పొందుతావు.*
(రోమా 6:3-9)
👉అప్పుడు నీజీవితం సీతాకోకచిలుకలా మారిపోతుంది.
▫️నభాష,
▫️న ప్రవర్తన,
▫️న అలవాట్లు అన్నీ మారిపోతాయి.
*ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయంత్నిచిన సమరయస్త్రీ రక్షించబడి,*
*ఎలా ప్రజలకి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిందో,*
👉 అలాగే నీ జీవితంలో కూడా పాపం, అబద్దాలు, త్రాగుడు, చెడు అలవాట్లు అన్నీ పోయి గొంగళిపురుగు- సీతాకోకచిలుకలా పరివర్తన చెందినట్లు,
*పాపివైన నీవు కూడా నూతనసృష్టిగా మారిపోతావు!*
👉 *ఆమార్పు నీకు కావాలా?*
👉 *అయితే నేడే యేసునొద్దకు రా!*
*నీ జీవితాన్ని ప్రభుకివ్వు!*
*ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో!*
*దేవుడు నీ జీవితంలో అధ్బుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు!*
👉ఈ సమరయస్త్రీ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారని ఆశిస్తున్నాను.
సమరయస్త్రీ పొందుకొన్న భాగ్యం మనందరికీ మెండుగా కలుగును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
o
సమరయ స్త్రీ
క్రైస్తవులకు ఔషధములు నిషేదమా?????
*ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయాజేస్తున్నాను.*
▪️ పోగత్రాగుట నిషేధము ,
▪️మద్యపానం సేవించుట నిషేధము,
▪️అనుమతి లేనిదే ప్రవేశం నిషేధం,
▪️ ఈ దారిలో భారి వాహనములకు ప్రవేశం నిషేదించబడినది అని ఇలాంటి బోర్డులు మనం ప్రతి నిత్యం ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో గానీ,ఆయా పరిసర ప్రాంతాలలో గానీ మనం గమనిస్తే *“నిషేధము”*
👉అన్న పదానికి *చేయకుడానిది అను అర్థము.*
👉ఈ పదాన్ని మనం తరచుగా ఆరోగ్యానికి హానికరమైనవి (సిగరెట్టు,మద్యం,గుట్క)వాటిని తీసికోనకూడదు అనేందుకు ఉపయోగిస్తాం.
♻️ *అలానే కొంతమంది క్రైస్తవులు నిషేదించిన వాటిలో ఔషధములు ప్రాముఖ్యమైనది .*
👉 ఔషధములు అనగా *మందులు.*
🔹అనగా రోగాన్ని తగ్గించే గుణాలున్న పదార్ధాలు.
🔹అనగా ఇందులో పసరు,పలు రకాల కాషాయాలు,లేపనాలు ఉంటాయి. ఇప్పుడు వీటి రూపం,నామం మర్చి టాబ్లెట్స్(tablets),ఇంజేక్షన్(injections),సిరప్స్(టానిక్స్),ఆయింట్ మెంట్స్(ointments) అంటున్నారు.
*క్రైస్తవులు మేడిసిన్స్(మందులు) వాడకూడదు అని మరియు ఇది దైవ విరుద్ద కార్యమని,ఒక పాపంగా అనుకుంటున్నారు.*
👉కరైస్తవ భోదకులలో చాలా మంది దీనిని సమర్దిస్తూ వైద్యం చేయించుకోవడం పాపకర్యంగా చాటిస్తూ ఎంతో మంది క్రైస్తవుల జీవితాలతో ఆడుకుంటున్నారు.
♻️ *నిజముగా బైబిల్ లో దేవుడు మందులు(ఔషధములు) వాడకూడదని,అవి క్రైస్తవులకు నిషేధమని అజ్ఞాగా ఇచ్చాడా??*
అని పరిశోధనాత్మకంగా బైబిల్ ను ఆలోచిస్తే అర్థం అవుతుంది.
👉మనిషి పుట్టుక నుండి వారి ప్రాంతపు వాతావరణ పరిస్థితుల బట్టి,ఆహారపు అలవాట్ల బట్టి అనారోగ్య కారణాలు బయటపడటం జీవన విధానంలో సర్వసాధారణమైన విషయం. *పరిపూర్ణ ఆరోగ్యవంతుడు ఎవ్వరూ భూమి పై లేరని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(ప్రపంచ ఆరోగ్య సంస్థ) సర్వేలో వెల్లడించింది.*
👉 *ఏదో ఒక చిన్నపాటి రోగం ఉన్నవారు మొదలుకొని కుదరని రోగాలతో జీవనం సాగిస్తున్న వారు లేకపోలేదు.*
ఈ సామాన్య బలహీనతను క్రైస్తవులలో కొందరు బలంగా మార్చుకుని తమ స్వప్రయోజనాల కోసం త్రిప్పుకున్నారు.
ఔషధాలు ఎక్కడివి???????
♻️ *ముందుగా ఔషధములు వాడకూడదని బైబిల్ లోని 66 పుస్తకాలలో ఎక్కడ లేదు కానీ మందులను వాడకూడదని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు.*
ఔషధములు పుట్టినిల్లు ఈ ప్రకృతి
🔹 సదారణంగా మనం ఆలోచిస్తే వైద్య శాస్త్రంలో ఉపయోగించే మందులన్నీ ప్రకృతి నుండి తీయబడ్డాయి. ఔషధములు వెటి నుండి తయారు చేస్తారో గమనిస్తే తలనొప్పికి మన వాడుతున్న అమృతాoజాన్ మెంధోప్లస్(amruthanjan mentho plus) లాంటి మందులపై తులసి ఆకులు,తైలపు ఆకులు ముద్రించడం చూడవచ్చు.అంటే పై మందులను ఈ తైలపు ఆకుల నుండి తయారు చేసారు.
*ఇలా మందులన్నీ ప్రకృతిలో చెట్లకున్న ఆకులు,వ్రేళ్ళు,పూతలు,పిందెలు,పండ్లు,బెరడు,విత్తనాలు లాంటివి ఉపయోగించి తయారు చేస్తారు.*
👉 *ప్రకృతి నుండి ఔషధములు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఈ ప్రకృతిని కలుగజేసినదేవరు???*
దేవుడా?????? దెయ్యమా????
*హెబ్రీ 11:3, ఆదికాండ 1:29*
*ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు,వృక్ష ఫలము గల ప్రతీ వృక్షమును నేను ఇచ్చాను అని దేవుడు అంటున్నాడు.*
🔺 నరులను ప్రేమించి ప్రకృతిని అందులోని సకలమును దేవుడు మనకిస్తే, ఆ ప్రకృతి నుండి తీయబడిన పదార్ధాన్ని *“ఔషధoగా”* ఎందుకు స్వీకరించడం లేదు??
🔺మనిషికి సర్వసాధారణంగా వచ్చే రోగాలను ప్రకృతిలో దేవుడు కలిగించిన ముడి పదార్ధం ఉపయోగించి నయం చేయుటకు ఔషధాలు వచ్చాయి. వీటిని ఎలా ఉపయోగించాలో సూత్రాలు చెప్పే *“వైద్యం”* క్రమక్రమంగా ప్రారంభమైనది.
👉 ఒకవేళ ఈ ఔషధాలు ప్రత్యేకముగా తీసుకోనప్పటికీ మనం అను నిత్యం తీసుకుంటున్న ఆహారంలో ఇవి ఉండనే ఉంటున్నాయి.
👉 *ఆహారములో కూరగాయలు,పండ్లు,ఆకూ కూరలు ఉండగా, ఔషధo(మందు)గా వీటి రూపం మర్చి ఇస్తున్నారు.*
🔹 మనం తింటున్న భోజనంలో ఇవే పదార్ధాలుండగా , ఔషధాలలో కూడ ఇవే ఉపయోగిస్తూండగా *భోజనాన్ని అనుమతించి , ఔషధాన్ని నిషేదించడం విరుద్దంగా,వ్యతిరేకముగా ,అన్యాయంగా కనిపిస్తుంది.*
👉 ఇది అర్థం చేసుకుంటే భోజనం ముందు కుర్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలా పుచ్చుకుంటారో
*అలాగే మరో రూపంలో ఉన్న ఔషధాన్ని,ఆరోగ్యాన్నిచ్చే మందులను కూడ ప్రకృతిలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి.*
👉ఇది పాపకార్యం ఎలా అవుతుందో ఆలోచించండి.
♻️ పరకృతి నుండి వచ్చిన శరీరం రోగం బారిన పడగా,అదే ప్రకృతి నుండి పుట్టిన ఔషధాలు వాడటంలో కొంచమైన అనుమాన పడాల్సిన అవసరం లేదు.
♻️ *బైబిల్ లో ప్రస్తావించబడిన ఔషధాలు*
ఆకులు- చెట్ల ఆకులలోని ఔషధ గుణాలు అనారోగ్య కారకాలకు స్వస్తి చెబుతుందని తెలుసు. ఉదా:: తులసి ఆకులు,తైలపు ఆకులు......
యెహేజ్కేలు 47: 12
*నదీతీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకలజాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడి పోవు, వాటి కాయలు ఎప్పటికిని రాలవు. ఈ నదినీరు పరిశుద్ధ స్థలములోనుండి పారుచున్నది గనుక ఆచెట్లు నెల నెలకు కాయలు కాయును, వాటి పండ్లు ఆహారమునకును వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును.*
*చెట్ల ఆకులు ఔషధమునకు వినియోగించెను .*
👉 ఇక్కడ దేవుడు ఆకులను ఔషధానికి వినియోగించండి అని అంటున్నాడా లేక నిషేదించండి అని అంటున్నాడా???? వినియోగించండి అని అంటున్నాడు.
పండ్లు,కాయలు
ఆదికాండము 30: 14
*గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లియైన లేయాకు తెచ్చి యిచ్చెను. అప్పుడు రాహేలునీ కుమారుని పుత్ర దాతవృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయుమని లేయాతో అనగా*
👉 ఇక్కడ పుత్ర దాత వృక్షపు పండ్లుఅన్న ఔషధాన్ని దేవుడు రాయించాడు.
*ఈ ఫలాలలోని సారం దేవుడు ఏర్పరచినదే.*
ఈ ఫలం ను ఔషధముగా ఉపయోగించడం వలన లేయాకు గర్భాఫలం కలిగింది.
*అనగా రుబేను లేయాకు తెచ్చి ఇచ్చిన ఔషధ ఫలం వాళ్ళ దేవుని సహాయంతో ఆమె గర్భాఫలం పొందింది.*
గుగ్గిలము
యిర్మియా 8: 22
*గిలాదులో గుగ్గిలము ఏమియు లేదా? అక్కడ ఏ వైద్యు డును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగక పోవు చున్నది?*
*గుగ్గిలం అన్న ఔషధము నొప్పిని తగ్గించేదిగా బైబిల్ లో వ్రాయబడింది.*
👉కనుక ఈ గుగ్గిలము అను ఔషధoను పోలిన ఎన్నో మందులు నేడు లబిస్తున్నాయి.
4⃣ *మూలికలు* (చెట్ల )-యోబు 30:4-
*తంగేడు వేర్లు వారికీ ఆహారమై యున్నవి.*
దంత సంభంధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి కూడ ఈ వేరు ఉపయోగపడుతుంది.
5⃣ *తైలము*- యాకోబు 5:14- *రోగికి నునే రాసి అతని కొరకు ప్రార్ధన చేయవలెను.*
యెషయ 1:6 చదవండి
🔺 *దేవుడు బైబిల్ లో రాయించిన అద్బుతమైన సందర్భాలను ఆలోచించగా రకరకాల ఔషధాలను అను నిత్యం మన దైనందిన జీవితంలో ఉపయోగించమన్నట్లు గోచరిస్తుంది.*
దేవుని మాటకు విలువనిస్తారో లేక కొందరు భోదకుల మాటకు విలువిస్తారో మిరే నిర్ణయించుకోండి.
♻️ *క్రీస్తు స్వస్థపరిచిన విధానం*
మత్తయి 9:12- *“ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర లేదు”* అని వదిలెయ్యలేదు
👉కనీ *రోగులకే గానీ* అన్న పదం ముందు పలికాడు. అనగా ఆరోగ్యవంతునికి వైద్యుని అవసరం లేదు. రోగికి వైద్యుని అవసరత ఉంది అని అర్థం.
*అంటే క్రీస్తు స్వయంగా ఒక ఉపమానంగా వైద్యుని ప్రస్తావన తీసుకురావడం జరిగింది.*
♻️ *స్వస్థత ఇచ్చేది దేవుడే.దేవుని సహాయం లేకుండా స్వస్థత జరగదు.*
డాక్టర్ వాళ్ళ కాదు. ఎందుకంటే డాక్టర్ మందుల చీటి మాత్రమే రాసి ఇవ్వగలదు తప్ప ఆ మందులను సృష్టించలేడు.దేవుడు ప్రకృతిలో ఉంచిన మందులను వాడమని సలహా ఇచ్చేవాడే వైద్యుడు.
♻️ *క్రీస్తును అనుసరించిన వారు కూడా వైద్యాన్ని పాటించిన వారున్నారు.*
క్రీస్తును అనుసరించిన అనేక మంది శిష్యులలో ఒకరు
*“ వైద్యుడు”* అతనే *లూకా.*
పౌలు గారు కూడ లూకా గారిని సంభోదిస్తూ
కొలస్సీయులకు 4: 14
*లూకా అను ప్రియుడైన వైద్యుడును,*
అనడం గమనించవచ్చు
👉నజముగా క్రైస్తవునికి ఔషధo,వైద్యం నిషేధమే అయితే *“ అసహ్యుడైన వైద్యుడైన లూకా అని అనాలి.*
🔺 *ఔషధాలు నిషేధము* అన్నవారికి అడిగే ప్రశ్నలు
1⃣ *పుట్టిన పిల్లలకు టీకాలు వేయించలేదా?*
*పోలియో చుక్కలు వేయించలేదా???*
ఫై ఇవి ఔషధాలు కావా?? కేవలం tablets,injectons,taniks మొదలైనవి మాత్రమే ఔషధాలా?? ఆలోచించండి.
2⃣ *నిద్రలేవగానే దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తున్న tooth paste మందు కాదా???*
tooth paste అనేది మన పళ్ళపాచి,దుర్వాసనను తొలగించడానికి ఉపయోగించే “ఔషధo”.
3⃣ *స్నానం చేసేటప్పుడు మన శరీరానికి అంటుకున్న మురికిని,క్రిములను చంపటానికి ఉపయోగించే ఔషధo “సబ్బు” ఔషధo కాదా???*
4⃣ మల మూత్ర విసర్జన తర్వాత రోగ కారిక క్రిములను చంపుటకు చేతులను శుభ్రం చేయుటలో ఉపయోగించే dettol ఒక ఔషధo కాదా???
5⃣ కురకాయలు తరిగేటప్పుడు చేతివేలు కోసుకుంటే వెంటనే వేసే ఒక ఔషధo కాదా???
6⃣ చయ్యి విరిగితే మరలా ఎముకులు కట్టుకోవడానికి “పుత్తూరు కట్టు” పేరుతో ఆకుల పసరుతో చికిత్స పొందుకోవడం లేదా?? ఇది వైద్యం కాదా????
👉 *కాబట్టి దేవుడిచ్చిన ఔషధాలను వాడి రోగం నయం చేసుకుని ,స్వస్థపరచిన తండ్రిని ఘన పరచి, తిరిగి సువార్త కార్యక్రమాలలో ,సత్య వాక్యపు క్రియలలో కొనసాగండి.*
👉 *ఒక వేల తీవ్రమైన రోగాల భారిన పడినా ,కదల్చబడక ప్రభువు నందు స్థిరులై అంతం వరకు సహిస్తే, మరణకరమైన రోగమైన మన సత్ క్రియల వాళ్ళ మనం ప్రభువు చెంతకు చేరగలమన్న నిరీక్షణతో సువార్త యాత్రలో సాగిపొండి...*
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
క్రైస్తవులకు ఔషధములు నిషేదమా ??
♻️ *మీ పాస్టర్ గురించి ఆలోచిస్తున్నారా ?.....✍️*
*మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు*
*ప్రార్ధించే పెదవులకన్నా,*
*సాయం చేసే చేతులు మిన్న!*
— మదర్ థెరిస్సా
👉 *మందిరాలు మూసివేయబడ్డాయి. దేవుని పరిచర్యకై సమర్పించుకొని, జీవితాన్ని కొనసాగించే సేవకుల కుటుంబ జీవనం ప్రశ్నార్థకమయ్యింది.*
ఏలీయాను కాకులతో పోషించిన దేవుడు, వారిని కూడా అట్లానే పోషిస్తారని, నీకున్న బైబిల్ జ్ఞానమంతా ప్రదర్శించే సమయమిది కాదుగాని, *ఇప్పుడు నిరుపేద సేవకుని పోషించే కాకివి నీవే కావాలి.*
*రొట్టెలు, మాంసపు ముక్కలు అవసరం లేదుగాని, పస్తులతో వారు పండుకోకుండా వుండే బాధ్యత నీవు తీసుకొంటే చాలు.*
👉 *మన పొరుగువారుగాని, మన నిరుపేద సేవకులుగాని, పస్తులతో పండుకోవడం, దేవుని పిల్లలముగా మన జీవితాలకు ఆశీర్వాదకరం కాదు.*
👉 *మనవెనకున్న అప్పులు కాదు చూడాల్సింది.* బ్రతికున్నంతవరకు అవి మనతోనే ఉంటాయి.
*మన నిరుపేద సేవకులు, పొరుగువారు పడే తిప్పలు చూడాలి. వారికి సహాయం చెయ్యడం వలన మనము నష్టపోయేదేదిలేదని గ్రహించాలి.*
👉 *మీరు ఏ ఊరిలో నివసిస్తున్నారో, ఆ ప్రాంత సేవకులు, పొరుగువారి స్థితిగతులను ఒక్కసారి దృష్టించి ప్రయత్నం చెయ్యండి.*
👉 ఇతరులు సహాయం చేస్తుందరు కదా అని, మిమ్మల్ని మీరు సర్దిచెప్పుకొనే ప్రయత్నం చెయ్యకుండా, *పేద సేవకులను, అనాథలను, బీదవారిని, విధవరాండ్రను గుర్తించి మీరు చెయ్యగలిగే సహాయం చెయ్యండి.*
👉 *మతము, కులము, వర్గము, డినామినేషన్ బేధాలు వద్దు. అవసరతలోనున్న వారిని గుర్తించి, దేవుని పిల్లలముగా, ఆయన ప్రేమను చాటుదాం. ఆపదలోనున్న వారిని, ఆదుకోవడానికి ప్రభువు మనకిచ్చే గొప్ప అవకాశముగా భావిద్దాం!*
లాక్ డౌన్ కారణంగా అనేక ప్రాంతాలలో చర్చిలు మూతపడ్డాయి.. సంఘ ఆరాధన కార్యక్రమాలు అగిపోయాయి..కొంతమంది తమ తమ ఇండ్లలోనే కుటుంబముతో కలిసి ఆరాధన చేసుకొంటున్నారు..మరి కొంతమంది online ద్వారా ఆరాధనలలో పాల్గొంటున్నారు..మంచిదే
👉 *కాని ఇక్కడ కొంతమంది విశ్వాసులు తమ సొంత సేవకుని మరచిపోతున్నారు..ఇది బాధకరమైన విషయం...* ముఖ్యముగా పల్లెటూరులలో, మారుమూల గ్రామాలలో ఉండే సంఘాలు.
వీరిని నడిపించే పాస్టర్స్ కి online worship వంటివి ఏమి తెలీదు..వారికి దాని మీద అవగాహన కూడ ఉండదు..దీంతో ఆయా సంఘాల విశ్వాసులు online worship చేస్తున్న చర్చిలను ఫాలో అవుతున్నారు....youtube live లేదా వివిధ రకాల apps ద్వారా online ఆరాధనలలో పాల్గొంటున్నారు.....కుటుంబముతో కలిసి ఏదో రకముగా ఆరాధనలలో పాల్గొనడము మంచిదే కాని *మీ కానుకలను కూడా వారికే పంపించి స్థానిక సంఘకాపరిని మరచిపోతున్నారు..ఇది మీకు ఆశీర్వాదకరము కాదు..*
👉 *కరోనా లాక్ డౌన్ కారణంగా చర్చిలు ఓపెన్ చేయడము లేదు...మరి మీ సంఘ పాస్టర్ పోషణ ఎలాగో ఆలోచించారా ?*
👉 *ఆయన కుటుంబము ఎలా ఉందో , ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఆలోచించారా ?*
👉 *ఆయన యోగక్షేమాలు గురించి తెలుసుకొంటున్నారా?* ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి
క్రీస్తు నందు ప్రియమైన సహోదరి, సహోదరుడా దయచేసి మీ పాస్టర్స్ గురించి ఆలోచించండి...చర్చిలు మూతపడటముతో వారు ఆర్థికముగా ఇబ్బంది పడుతుంటారు...
*వారు మీ కొరకు ఒకప్పుడు ఎంతగానో ప్రయాసపడి మీకు సువార్త ప్రకటించి మిమ్మల్ని క్రీస్తు చెంతకు నడిపించి ఉంటారు.. ఈ లాక్ డౌన్ రాకముందు మీ కుటుంబాలను దర్శిస్తూ ,మీ కుటుంబ స్థితిగతులు తెలుసుకొంటూ ఏ కష్టము వచ్చినా మిమ్మల్ని వాక్యము ద్వారా ఆదరిస్తూ బలపరుస్తూ మీ కటుంబ ప్రతి కార్యక్రమములో పాల్గొంటూ నడిపిస్తూ వచ్చి ఉంటారు... మీ కొరకు ఇప్పుడు కూడా ప్రార్థిస్తూనే ఉంటారు...అలాంటి నీ సేవకుని మరచిపోవడము ,నీ సేవకుని పరిస్థితుల గురించి ఆలోచించకపోవడము మీకు దీవెన కాదు*
*క్రీస్తునందు మీకు ఉపదేశకులు పదివేలమంది యున్నను తండ్రులు అనేకులు లేరు.*
*క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని* (1 కొరింథీ 4:15,16)
ఆయా ప్రాంతాల్లో ముఖ్యముగా పల్లెటూరులలో సేవ చేసే చాలా మంది పాస్టర్స్ , విశ్వాసులకు భారముగా ఉండకూడదని వారి మీద ఆర్థిక భారము మోపకూడదని ఏదో ఒకపని చేస్తూ దేవుని పరిచర్యను కొనసాగిస్తున్నారు (2 కొరింథీ 11:9 ; 2 థెస్స 3:8)...
అయితే ఈ లాక్ డౌన్ వల్ల వారు కొంత ఇబ్బందిపడుతున్నారు అనే మాట వాస్తవం...పైగా హస్టల్స్ లో చదివే వారి పిల్లలు కూడా ఇంటికి రావడముతో కుటుంబ భారము కూడా ఆధికమవుతుంది
నా ప్రియ సహోదరుడా మీ పాస్టర్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకొన్నారా ?
👉 *విశ్వాసులుగా ఆలోచించాల్సిన భాధ్యత మీకు ఉంది...మీ పాస్టర్ యోగక్షేమాలు తెలుసుకోండి...ప్రతి ఆదివారం మీ కానుకలను పోగుచేసి వారికి పంపండి....వాస్తవానికి ఈ ఆలోచన ప్రతి విశ్వాసిలో స్వతహగా కలగాలి....*
కాని సంఘములో పరిపక్వత లేని కొందరి విశ్వాసులు ఎక్కడ తప్పుగా అర్థం చేసుకొంటారో అని..కానుకలు గురించి, పరిచర్యలో వారి ఆర్థిక భారాల గురించి పాస్టర్స్ చెప్పకపోవడముతో వారి ఇబ్బందులు విశ్వాసులకు తెలియటలేదు
మాసిదోనియలోని సంఘాలు ఆర్థికముగా బీదస్థితిలో ఉన్నా పౌలు పరిచర్యకు సహకరించడము మాత్రము మానలేదు (2 కొరింథీ 8:1-7 ; 11: 8-9 వచనాలు చదవండి)
ఫిలిప్పీ సంఘము పౌలు గురించి యోచన చేసి కొంత కానుకలను పౌలుకు పంపుతూ ఉండేవారు ...పౌలు సువార్త పరిచర్యలో పాలిభాగస్థులుగా ఉండేవారు (ఫిలిప్పీ 4:10-20)
ఇవన్నీ వాక్యములోనే ఉన్నాయి... ఇలాంటి వాటిని మాదిరికరముగా తీసుకోరు కొందరు విశ్వాసులు ....ఎంతసేపు ఈ భూమి మీద ఆశీర్వాదాల గురించి, తమ స్వలాభము గురించి ఆలోచిస్తారు తప్ప క్రీస్తు కార్యములను పట్టించుకోరు (ఫిలిప్పీ 2:21)
👉 *నా ప్రియ విశ్వాసి , ఫిలిప్పీ సంఘము వలె నీవు ఎందుకు ఆలోచించలేకపోతున్నావు ?* ఈ లోకములో దేవుని పరిచర్యకు సహకరించి పరలోకములో దేవుడిచ్చే బహుమానాలు పొందుకోవడానికి ప్రయాసపడు కాని..తాత్కాలిక లోకము కొరకు క్రీస్తు పరిచర్యను నిర్లక్ష్యము చేయకు (హెబ్రీ 11:24-26)
👉 *ఇప్పటికైనా మీ పాస్టర్ గురించి ఆలోచించు...ఒకవేళ ఇన్ని రోజులు మీ పాస్టర్ ను నిర్లక్ష్యము చేసి ఉంటే దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి..మీ పాస్టర్ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని ఆయనకు సహకరించండి...* మీ కానుకలను, దశమభాగాలను పోగుచేసి మీ పాస్టర్ కు పంపండి.. దాని వల్ల మీకే దీవెన (2 కొరింథీ 9:6-10)
*నేను యీవిని అపేక్షించి యీలాగు చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తారఫలము రావలెనని అపేక్షించి చెప్పుచున్నాను.* (ఫిలిప్పీ 4:17)
ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడా ఇలాంటి లాక్ డౌన్ పరిస్థితులు వచ్చినా మీ పాస్టర్ ను మరచిపోకండి
online live worship టెలికాస్ట్ చేసే సంఘాలకు వారి వారి విశ్వాసులు ఉంటారు ...మీరు వారికి కానుకలను పంపి మీ పాస్టర్ ను నిర్లక్ష్యము చేయడము మంచిది కాదు..
ఇంకా మీ పాస్టర్ సంపన్న స్థితిలో ఉంటే , మీరు ఇతరులకు ఇచ్చే స్థితిలో ఉంటే వేరే ఇతర పాస్టర్స్ కు కూడా సహకరించండి...ముఖ్యముగా సువార్తికులను, పల్లెటూరులో సంఘాలు కట్టి సేవ చేస్తున్న సేవకులను జ్ఞాపకము చేసుకోండి...వారిని గుర్తించి సహకరించండి..
*మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.* (ఫిలిప్పీ 2:4)
*సణుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను; దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. (2 కొరింథీ 9:7)*
👉 *మతము, కులము, వర్గము, డినామినేషన్ బేధాలు వద్దు. అవసరతలోనున్న వారిని గుర్తించి, దేవుని పిల్లలముగా, ఆయన ప్రేమను చాటుదాం. ఆపదలోనున్న వారిని, ఆదుకోవడానికి ప్రభువు మనకిచ్చే గొప్ప అవకాశముగా భావిద్దాం!*
*ప్రార్ధించే పెదవులకన్నా,*
*సాయం చేసే చేతులు మిన్న!*
— మదర్ థెరిస్సా
🕊 *పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా వుండి, మిమ్ములను నడిపించును గాక! ఆమెన్!*
o
మీ పాస్టర్ గురించి ఆలోచిస్తున్నారా ?...✍️
144,000 మంది మొదట ప్రకటన 7: 4 లో ప్రస్తావించబడ్డారు, “అప్పుడు సీలు
వేయబడిన వారి సంఖ్యను నేను విన్నాను: ఇశ్రాయేలులోని అన్ని తెగల నుండి
144,000.” ఈ భాగం ప్రతిక్రియ యొక్క ఆరవ ముద్ర (ప్రకటన 6: 12–17) మరియు ఏడవ
ముద్ర తెరవడం (ప్రకటన 8: 1) మధ్య ఒక విరామంలో వస్తుంది.
"144,000 ఎవరు?" అనే ప్రశ్నకు ఒకరు ఎలా సమాధానం ఇస్తారు? ప్రకటన
పుస్తకానికి ఒకరు ఏ వివరణాత్మక విధానాన్ని తీసుకుంటారు అనే దానిపై ఆధారపడి
ఉంటుంది. మేము ఉత్తమంగా భావించే భవిష్యత్తు విధానం 144,000 ను అక్షరాలా
వివరిస్తుంది. ముఖ విలువతో తీసుకున్నప్పుడు, ప్రకటన 7: 4 అంతిమ కాలపు
కష్టాల సమయంలో నివసిస్తున్న 144,000 మంది వాస్తవ ప్రజల గురించి
మాట్లాడుతుంది. 5-8 వచనాల ప్రకారం, 144,000 మంది యూదుల సంఖ్యను పిల్లల
ప్రతి తెగ నుండి 12,000 మంది తీసుకున్నారు.
ఈ 144,000 మంది యూదులు “సీల” చేయబడ్డారు, అంటే వారికి దేవుని ప్రత్యేక
రక్షణ ఉంది. వారు దైవిక తీర్పుల నుండి మరియు పాకులాడే కోపం నుండి
సురక్షితంగా ఉంచబడ్డారు. ప్రతిక్రియ సమయంలో వారు తమ లక్ష్యాన్ని స్వేచ్ఛగా
చేయగలరు. ఇజ్రాయెల్ పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి వస్తుందని ఇంతకు
ముందే ప్రవచించారు (జెకర్యా 12:10; రోమీయులు 11: 25-27), మరియు 144,000
మంది యూదులు ఒక రకమైన “మొదటి ఫలాలు” (ప్రకటన 14: 4) ఇశ్రాయేలు విమోచనం.
వారి లక్ష్యం రాకడ అనంతర ప్రపంచాన్ని సువార్త ప్రకటించడం మరియు శ్రమ కాలంలో
సువార్తను ప్రకటించడం. వారి పరిచర్య ఫలితంగా, లక్షలాది- “అటు తరువాత నేను
చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు,
ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప
సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు
చేతపట్టుకొని సింహాసనము ఎదుటను గొఱ్ఱెపిల్లయెదుటను నిలువబడి” (ప్రకటన 7: 9)
- క్రీస్తుపై విశ్వాసం వస్తుంది.
144,000 కు సంబంధించిన చాలా గందరగోళం యెహోవాసాక్షుల తప్పుడు సిద్ధాంతం
యొక్క ఫలితం. పరలోకంలో క్రీస్తుతో పరిపాలించి, దేవునితో శాశ్వతత్వం
గడుపుతున్న వారి సంఖ్యకు 144,000 పరిమితి అని యెహోవాసాక్షులు పేర్కొన్నారు.
144,000 మందికి యెహోవాసాక్షులు “స్వర్గపు ఆశ” అని పిలుస్తారు. 144,000
మందిలో లేని వారు “భూసంబంధమైన ఆశ” అని పిలిచేదాన్ని ఆనందిస్తారు-క్రీస్తు
పరిపాలించిన భూమిపై స్వర్గం మరియు 144,000. క్రీస్తుతో సహస్రాబ్దిలో
పాలించే వ్యక్తులు ఉంటారన్నది నిజం. ఈ ప్రజలు సంఘం (యేసుక్రీస్తు
విశ్వాసులు, 1 కొరింథీయులు 6: 2), పాత నిబంధన సాధువులు (క్రీస్తు మొదటి
రాకముందు మరణించిన విశ్వాసులు, దానియేలు 7:27), మరియు ప్రతిక్రియ సాధువులు
(ప్రతిక్రియ సమయంలో క్రీస్తును అంగీకరించేవారు) , ప్రకటన 20: 4). ఇంకా
బైబిల్ ఈ వ్యక్తుల సమూహానికి సంఖ్యా పరిమితిని ఇవ్వలేదు. ఇంకా, సహస్రాబ్ది
శాశ్వతమైన స్థితికి భిన్నంగా ఉంటుంది, ఇది వెయ్యేళ్ళ కాలం పూర్తవుతుంది. ఆ
సమయంలో, దేవుడు మనతో క్రొత్త యెరూషలేములో నివసిస్తాడు. ఆయన మన దేవుడు,
మరియు మేము ఆయన ప్రజలు అవుతాము (ప్రకటన 21: 3). క్రీస్తులో మనకు వాగ్దానం
చేయబడిన మరియు పరిశుద్ధాత్మ చేత మూసివేయబడిన వారసత్వం (ఎఫెసీయులు 1: 13-14)
మనది అవుతుంది, మరియు మేము క్రీస్తుతో సహ వారసులం అవుతాము (రోమన్లు 8:17).
Scorce :.gotquestions.org
144,000 మంది ఎవరు?
దేవుని పరిపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనుట....✍️
*ఈ రోజున మనము మన జీవితాల కొరకు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ఎలా తెలుసుకోగలమో చూద్దాము.*
*మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.* రోమా 12:2
👉 ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము. రోమీయులు 12వ అధ్యాయములో,
*దేవుని పరిపూర్ణ చిత్తాన్ని అర్థం చేసుకోవడం గురించి బైబిలు చెప్తుంది.*
👉 రమా 12:2లో ఇలా చెప్తుంది,
*మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.*
👉 మ జీవితం కొరకు సంపూర్ణమైన దేవుని చిత్తమొకటుంది.
🔹 *మీరు తిరిగి జన్మించిన సమయం నుండి,*
🔹 *మీరు మీ జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చినప్పటినుండి,*
🔹 *భూమి మీద మీకు నియమింపబడిన దినాల అంతము వరకు,*
*దేవుడు మీ జీవితం యొక్క ప్రతి వివరానికి ఒక సంపూర్ణ ప్రణాళికను, ఒక పరిపూర్ణమైన నమూనాను సిద్ధపరిచాడు.*
👉మరెక్కడ జీవించాలో మీరెవరిని పెళ్ళి చేసుకోవాలో, మీరేమి చేయాలో, మీ భూలోక వృత్తి ఏమైయుండాలో, మీరు ఎటువంటి శోధనలు ఎదుర్కొనాలో, ఎటువంటి కష్టాలు అనుభవించాలో, ఆయన శరీరంలో అంటే సంఘంలో ఎటువంటి పరిచర్యను కలిగియుండాలో ఇవన్నీ కూడా మీ జీవితం కొరకు దేవుని ప్రణాళికలో ఒక భాగము.
👉 *మీకు ఒక బలమైన కోరిక లేకుండా మీరా ప్రణాళికను తెలుసుకోలేరు లేక నెరవేర్చలేరు.*
👉 *ఆయన ప్రణాళిక చొప్పున నడవడానికి దేవుడు ఎవరినీ బలవంతం చేయడు.*
🔺 పరజలు పరలోకంలోకి వెళ్లడానికి కూడా ఆయన వారిని బలవంతపెట్టడు. మనుష్యులు నరకానికి వెళ్లాలనుకొంటే వారిని నరకానికి వెళ్లకుండా ఆయన ఆపడు.
👉 *దేవున్ని జాగ్రత్తగా వెదకువారికి ఆయన ప్రతిఫలాన్నిస్తాడు.*
👉 పరిశుద్ధాత్ముడు లోకంలో తిరుగుతూ ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతున్నాడు, దేవునికి సమర్పించుకొని ఆయన సంపూర్ణ చిత్తాన్ని వెదకడానికి ఆయన ఇచ్చే పిలుపుకు స్పందించమని విశ్వాసులను పురికొల్పుతున్నాడు.
👉 *కాని నీ జీవితంలో దేవుని పరిపూర్ణ చిత్తాన్ని చేయడాన్ని గురించి మీరు తీవ్రంగా లేరని ఆయన చూస్తే, ఆయన మిమ్మును వదిలేస్తాడు. ఆయన మిమ్మును వెంటాడడు.*
👉 *ఆయన కొన్నిసార్లు ప్రయత్నించవచ్చేమో గాని, దేవుని చిత్తాన్ని చేయడానికి మీకు ఆశలేదని, మీరు లోకంలో పైకి రాలేరు కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని వెదకడం లేదని ఆయన చూస్తే, ఆయన మిమ్మును వదిలేస్తాడు. నిత్యత్వంలో మీరు ఎంతో పశ్చాత్తాపపడతారు ఎందుకంటే మీరు మీ జీవితం కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు, మీరొక గ్రుడ్డివాడి వలే దాన్ని చేసారు.*
🔹భవిష్యత్తుకు సంబంధించినంతవరకు మీరు పూర్తిగా గ్రుడ్డివారు, మీకు రేపు ఏమౌతుందో కూడా తెలియదు. మీ ముందున్న మనుష్యుల చేత, సాతాను అతని దయ్యముల చేత చేయబడిన గుంట, ప్రమాదాలన్నిటికి సంబంధించినంతవరకు మీరు పూర్తిగా గ్రుడ్డివారు.
*భవిష్యుత్తుకు సంబంధించినంతవరకు మనము పూర్తిగా గ్రుడ్డివారము.*
👉 అది ఒక గ్రుడ్డివాడు, తెలియని దారిలో నడిచినట్లుంటుంది. అటువంటి ఒక వ్యక్తికి, కళ్లు బాగా తెరచియున్న, బాగా దూరంగా చూడగలిగిన ఒక మార్గదర్శి ఉండటం మంచిది కాదా? ఖచ్చితంగా దాన్నే మన కొరకు దేవుడు చేయాలనుకొంటున్నాడు.
🔺 *దేవునికి భవిష్యత్తు అంతా తెలుసు. మనకు ఏది మంచిదో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మీ కొరకు మనుష్యులచేత లేక దయ్యములచేత సిద్ధపరచబడియున్న ప్రతి గుంట, ప్రతి ఉరి ఆయనకు తెలుసు. వాటన్నిటినుండి ఆయన మిమ్మును కాపాడగలడు.*
👉 ఆయన మిమ్మును మీ భూలోక జీవితంలో ఎంత పరిపూర్ణమైన త్రోవలో నడిపించగలడంటే,
*ఒక దినాన మీరు మీ జీవితం యొక్క అంతిమ దశకు వచ్చినప్పుడు, మీరు ప్రభువు యెదుట నిలబడి, తిరిగి మీ జీవితాన్ని చూచుకొన్నప్పుడు, నీవు దీని కంటే శ్రేష్టమైన ప్రణాళికను వేసియుండ లేకపోయేవాడివని గ్రహిస్తావు.*
👉నను దాన్ని ఈ విధంగా చూస్తాను.
▪️భవిష్యత్తులో నా జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని విషయాలు నాకు తెలిసియుంటే,
▪️ నకు ఈ మార్గం వెంట, ఆ మార్గం వెంట జరిగే ప్రతి ఒక్క విషయము నాకు తెలిసుంటే నేను ఎంచుకోవలసిన ప్రత్యామ్నాయాలు నాకు తెలిసుంటే,
▪️భవిష్యత్తు యొక్క ప్రతి కోణము నాకు తెలిసుంటే,
▪️ దవుడు నన్ను, నా సామర్థ్యాలను నా వ్యక్తిత్వాన్ని ఎరిగినట్లు నన్ను నేను ఎరిగియుంటే
*నాకు గనుక దేవునికున్న జ్ఞానముంటే, నేను వేసుకొనే ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు నా కొరకు వేసిన ప్రణాళిక వలెనే ఉంటుంది.*
♻️ ఎందుకంటే మన మందరము మన స్వప్రయోజనములను చూచుకొంటాము.
👉 మనకు ఏది మంచో దాన్ని చూసుకుంటాము.
*మీకు ఏది మంచో దాని కొరకే దేవుడు కూడా చూస్తున్నాడని మీకు తెలుసా?*
యిర్మీయా 29వ అధ్యాయములో ఒక వచనముంది. అక్కడ దేవుడు మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, అని చెప్తున్నాడు, యిర్మీయా 29:11, *రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు.*
👉 *మన కొరకు దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక మన క్షేమము కొరకే అది.*
👉మన కొరకు అతి శ్రేష్టమైనది. కనుక నీవు యేసు క్రీస్తు యొక్క పూర్ణహృదయుడవైన శిష్యుడవైతే,
*నీ జీవితం యొక్క ప్రతి విషయంలో ఆయన ప్రణాళికను వెదుకుతావు.*
🔺 ''ప్రభువా, నీవు నన్ను నివసించమనని ఏ నగరంలోను, ఏ పట్టణంలోను నేను ఉండాలనుకోవడం లేదు.
🔺 నవు నన్ను పెళ్లిచేసుకోమనని ఏ అమ్మాయినైనా, ఏ అబ్బాయినైనా నేను పెళ్లిచేసుకోవాలనుకోవడం లేదు.
🔺 *నా జీవితం యొక్క ప్రతి విషయంలో నీ ఎంపికే అన్నిటికంటే పైన ఉంటుంది.*
🔺 నవు నన్ను ఖర్చుపెట్టమన్నట్టు నా డబ్బును ఖర్చుపెట్టాలనుకొంటున్నాను.
🔺 న సమయాన్ని నీవు నన్ను గడపమన్నట్టు నేను దాన్ని గడపాలనుకొంటున్నాను.
🔺ఈ భూమిమీద నీవు నన్ను ఏం చేయాలనుకొంటున్నావో దాన్ని మాత్రమే నేను చేయాలనుకొంటున్నాను అని చెప్తావు.
♻️ *నీవటువంటి వ్యక్తివైతే, మనం దేవుని సంపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి నేను మీతో కొన్ని నియమాలను పంచుకోవాలనుకొంటున్నాను.*
మనం దేవుని సంపూర్ణ చిత్తాన్ని తెలుసుకోవాలంటే,
*మనలను మనం ప్రశ్నించుకోవలసిన 12 ప్రశ్నల రూపంలో నేను వీటిని పంచుకోవాలనుకొంటున్నాను.*
👉 కన్నిసార్లు మనకు నిశ్చయతలేని ఒక విషయాన్ని మనం ఎదుర్కోవచ్చు. ఇది దేవుని చిత్తమా లేక దేవుని చిత్తం కాదా? మనలను మనం ఈ 12 ప్రశ్నలు వేసుకొని, వాటికి యథార్థంగా జవాబివ్వడానికి చూస్తే, మనమా ప్రశ్నల పట్టి చివరికి వచ్చే సరికి, దేవుని చిత్తమేంటో, మనకు ఇంకా ఇంకా స్పష్టమవుతుంది.
👉 నను మొదట ఆ ప్రశ్నలను మీకు చదువుతాను, ఆ తరువాత మనం వాటిగుండా ఒకదాని తరువాత ఒకటి వెళ్దాం.
1⃣ *మొట్టమొదటిగా మనకు మనము వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, నేను ఆలోచించే (పరిగణించే) ఈ విషయము నీకు తెలిసినంతవరకు యేసు మరియు అపొస్తులులు యొక్క బోధకు, క్రొత్తనిబంధన యొక్క ఆత్మకు, సారమునకు విరుద్ధంగా ఉందా?*
👉 వరే మాటల్లో చెప్పాలంటే, దాన్ని నిషేధించేది దేవుని వాక్యంలో ప్రత్యేకంగా క్రొత్తనిబంధనలో ఎక్కడైనా ఉందా?
2⃣ రండవదిగా, *దాన్ని నేను ఒక నిర్మలమైన మనస్సాక్షితో చేయగలనా?*
3⃣ మూడవదిగా, *దాన్ని నేను దేవుని మహిమార్థమై చేయగలనా?*
4⃣ నల్గవదిగా,
*నేను యేసుతో సహవాసములో ఉండి దాన్ని చేయగలనా?*
5⃣ అయిదవదిగా,
*నేను దాన్ని చేస్తుండగా, నన్ను దీవించమని దేవుణ్ణి అడగగలనా?*
6⃣ ఆరవదిగా, *దాన్ని చేయడం నా ఆత్మీయ పదునును ఏ విధంగానైనా పోగొడుతుందా?*
7⃣ ఏడవదిగా,
*నాకు తెలిసినంతవరకు అది ఆత్మీయంగా లాభకరమైనది, క్షేమాభివృద్ధి కలుగజేస్తుందా?*
8⃣ఎనిమిది,
*యేసు భూమిమీదకు తిరిగి వచ్చినప్పుడు, నేను దాన్ని చేయడం చూస్తే సంతోషిస్తాడా?*
9⃣ తమ్మిది,
*దాని గురించి జ్ఞానముగల పరిణితి చెందిన విశ్వాసులు ఏమనుకొంటున్నారు?*
🔟 పది,
*నేను దాన్ని చేయడం ఇతరులకు తెలిస్తే దేవుని నామాన్ని అవమానపరిచి, నా సాక్ష్యాన్ని పాడుచేస్తుందా?*
1⃣1⃣ పదకొండు,
*నేను దాన్ని చేయడం ఇతరులకు తెలిస్తే వారు అభ్యంతర పడతారా?*
1⃣2⃣ పన్నెండు,
*దానిని చేయడానికి నా ఆత్మలో నేను స్వేచ్చ కలిగియున్నానా?*
👉 మనం ఒక దాని తరువాత ఒకటి ఈ 12 ప్రశ్నలను చూస్తే, ఏ విషయములోనైనా దేవుని చిత్తమేంటో ఇంకా ఇంకా స్పష్టమవుతుంది.
♻️ *మొట్టమొదటిది* ♻️
👉 ఏదైనా లేఖనాలలో నిషేధించబడితే, మనం దాని గురించి రెండోసారి ఆలోచించనక్కరలేదు. అది లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది.
*నేను ఇక్కడొక అబద్ధం చెప్పచ్చా?*
*అబద్ధం చెప్పడం గురించి లేఖనాలేమైనా చెప్తున్నాయా?*
👉 ఖచ్చితంగా చెప్తున్నాయి.
*ఆ వ్యక్తిని క్షమించకపోవడానికి నాకేదైనా సాకు ఉందా?*
👉 ఆ విషయాలలో లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
*మనం క్షమించాలి, మనమెల్లప్పుడు నిజం చెప్పాలి.*
👉 ఇలాంటి అనేక విషయాలలో దేవుని వాక్యం తేటతెల్లగా ఉంది. గనుక మనం ప్రార్థించి దేవుణ్ణి వెదకనక్కరలేదు.
*మనం దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని ఏమైనా చేయడానికి చూస్తున్నామా?*
🔹 అది క్రొత్తనిబంధన ఆత్మకు, సారమునకు విరుద్ధమైనదా?
👉 నను పరిగణించే విషయానికి సంబంధించిన ప్రత్యేకమైన వాక్యభాగము లేఖనాల్లో లేకపోవచ్చు.
👉కని *నేను క్రొత్త నిబంధన యొక్క నియమాలను అర్థం చేసుకొనుంటే, అది క్రొత్త నిబంధన ఆత్మకు విరుద్ధమైనదా అని నన్ను నేను ప్రశ్నించుకోవచ్చు.*
👉 దని ద్వారానే, అది మొదటి ప్రశ్న అని నేను తెలుసుకోవాలి,
*అందుచేతనే, లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవడం మనకు ముఖ్యము.*
2తిమోతి 3:16,17లో, *దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది అని చెప్పబడింది. కనుక లేఖనాలు మనకు తప్పు దిద్దడానికి నీతి మార్గములో నడిపించడానికి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచడానికి ఇవ్వబడినవని మనమక్కడ చూస్తాము.*
🔺 *కనుక మీకు క్రొత్త నిబంధన యొక్క ఉపదేశముతో పరిచయం లేకపోతే, మీకు దేవుని చిత్తమేంటో తెలియని సందర్భాలు మీ జీవితంలో రావచ్చు. మీరు దాన్ని తెలుసుకోలేరు*
👉ఎందుకంటే, ఆవిధంగా దేవుని చిత్తాన్ని ఆయన లేఖనాల్లో బయలుపరచిన విషయాలలో మనం తెలుసుకోవచ్చు. అప్పుడు మన జీవితాల యొక్క అనేక ఇతర విషయాల్లో లేఖనాల్లో బయలుపరచబడని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకు చాలా సులువుగా ఉంటుంది.
*ఉదాహరణకు,*
నీవు ఒక ఉద్యోగం గురించి లేక ఎవరినైనా పెళ్లి చేసుకోవడం గురించో ఆలోచిస్తున్నావనుకో, అది లేఖనాల్లో పేర్కొనబడలేదు.
👉కని నీవు లేఖనాల్లో చూచిన ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయడానికి చూస్తూ నీ జీవితాన్ని గడిపితే వివాహం వంటి ముఖ్యమైన విషయాలలో నీవు ఆయన చిత్తాన్ని పోగొట్టుకోకుండా ఉండేటట్లు దేవుడు చూసుకుంటాడు. దేవునికి లోబడటం వల్ల మనకు వచ్చే ఫలితమదే.
ఈ ప్రశ్నలను వేసుకున్నాక, మీరు అనుకూలమైన సమాధానాన్ని ఈ ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పొందగలిగితే అప్పుడు మనం ముందుకు వెళ్లవచ్చు ఎందుకంటే, రోమా 8:6లో, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది అని బైబిలు చెప్తుంది.
👉 మరు ముందుకు వెళ్లినప్పుడు, మీ ఆత్మలో మీరు సమాధానాన్ని కలిగియుంటారు. అప్పుడు మీరు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చగలరు.
Written By :- *- జాక్ పూనెన్*
➖➖➖➖➖➖➖➖➖
దేవుని పరిపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనుట....✍️










