>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..


        ఎపుడమ్మివేసావు యేసయ్యను - ఎక్కడమ్మివేసావు దేవదేవుని - 2
        ఉద్యోగంలోనా.. దాంపత్యంలోనా... ఏకాంతంలోనా... దైవసేవలోనా.. ?! - 2
        యోచించుమా నేస్తమా - గమనించుమా సేవకా

        1. ఒక్కపూట కూటికై - జ్యేష్టత్వపు హక్కును - అమ్మివేసుకున్నాడొక ఏశావు 
        ధనము పొందగోరి - నయమాన్ని వెంబడించి - కుష్టు పొందుకున్నాడొక  గెహజీ
        లోకం అశాశ్వతమని ముందే ఎరిగి - శాశ్వతమగు యేసుప్రేమ రుచి చూచీ 
        ఎక్కడమ్ముడైనావో - యేసు నమ్మివేసినావేమో
        యోచించుమా నేస్తమా - గమనించుమా సేవకా

        2. క్రైస్తవ పేరును కలిగి -  అన్యునిగా జీవించి - క్రీస్తు పేరు దూషణకు గురిచేయకు
        బడిలో ఒక పేరుతో - గుడిలో ఒక పేరుతో - ఉభయచరపు జీవితం మానుకో
        వెచ్చగా ఉండూ - లేక చల్లగా ఉండు - నులివెచ్చని జీవితం బహుఘోరం
        ఎలా బ్రతుకుచున్నావో - నీవు ఎక్కడ పడిపోయావో
        యోచించుమా నేస్తమా - గమనించుమా సేవకా


Album: సాటిలేని దేవుడు, Artist: బ్రదర్. ఆకుమర్తి దానియేల్,

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels