>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
Showing posts with label Telugu Christan Messages. Show all posts
Showing posts with label Telugu Christan Messages. Show all posts

2021 అనే తలుపు నీ యెదుట తీయబడినది

 "ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను. దానిని ఎవడును వేయనేరడు" ప్రకటన 3:8

🏵ఉపోద్ఘాతం: 2021అనే తలుపు ప్రభువు మరో దినంలో తెరవ బోతున్నాడు. మనం మరి కొద్ది గంటలలో నూతన సంవత్సరము 2021 ప్రవేశించి మన ప్రయాణం ఆరంభించుచుండగా, దేవుడు నూతన సంవత్సరంలో అనేక నూతన తలుపులను నీకు తీయబోతున్నాడు.

2020లో సాతానుడు మన జీవితంలో అనేక విషయాలకు తలుపులు మూసి బంధించాడు. సాతాను చేత మూయబడిన అనేక ఇత్తడి తలుపులను ఇనుప గడియలను ప్రభువు ఈ సంవత్సరం పగులగొట్టి నూతన ద్వారములను నీకు తీయనున్నాడు. (యెషయా 45:2 నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థల ములను సరాళముచేసెదను. ఇత్తడి తలుపులను పగుల గొట్టెదను ఇనుప గడియలను విడగొట్టెదను)  

కారణం ప్రతి తలుపు యొక్క తాళపు చెవులు ఆయన దగ్గర ఉన్నవి కనుక తలుపులు తీయుటకును వేయుటకును ఆయన సర్వాధికారి. ప్రభువు 2021లో నీ కొరకు తెరవనున్న కొన్ని తలుపులను మనం ఇప్పుడు గమనిద్దాం.

🏵1. విశ్వాస తలుపు: ఈ సంవత్సరమైన మనం విశ్వాసపు ద్వారంలో ప్రవేశించాలి. (అపో.కా 14:27 వారు వచ్చి, సంఘమును సమ కూర్చి, దేవుడు తమకు తోడైయుండి చేసిన కార్యము లన్నియు, అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరచిన సంగతియు, వివరించిరి.)

పౌలు మొదటి సువార్త దండ యాత్రలో ప్రభువు అనేక పట్టణాల్లో ప్రభువు అనేకులను విశ్వాస తలుపులు తీసాడు. అంతి యోకయ, ఈకొనియా దెర్బే, మొదలగు ప్రాతాలలో తలుపులు తెరువబడినవి. అపో. 14:19-24. పిసిదియా దేశమంతటా వారికి దేవుడు తలుపులు తీశాడు. మరి మన కొరకు కూడా ప్రభువు విశ్వాస తలుపులు తీయనున్నాడు.  

🏵2. ప్రార్ధనా తలుపు:
పేతురు కొరకు సంఘస్తులు చేసిన ప్రార్ధనకు దేవుడు అద్భుతమైన సమాధానం వారు తలుపు తీసిన తరువాత చూడగలిగారు. (అపో.కా 12:16 పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి.) వారు హృదయ పూర్వకంగా ప్రార్థన చేశారు గాని వచనాలను బట్టి చూస్తే ఎక్కువ విశ్వాసంతో ప్రార్థన చేయలేదని అర్థమౌతుంది. అయినా అల్ప విశ్వాసంతో చేసిన వీరి ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చాడు.

నిజ దేవునికి ప్రార్థన చేసేవారందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉండాలి. దానియేలు అయితే ముమ్మారు కిటికీ తలుపులు తీసే ప్రార్ధన చేశాడు గనుక మరణం నుండి తప్పించబడ్డాడు. (దానియేలు 6:10 ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి యుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.)

2019 సంవత్సరంలో చాలమంది జీవితాల్లో ప్రార్ధనా తలుపులు మూయ బడ్డాయి. కనీసం 2020 లో ప్రార్ధనా తలుపు మరోసారి తెరవబడుచుండగా ప్రవేశిద్దాం.

🏵3. సహవాస తలుపు: నులివెచ్చని స్థితిలో ఉన్న లవొదికయ సంఘం, ప్రభువుతో సహవాసం చేయకుండా ప్రభువును బయటే ఉంచింది. (ప్రకటన 3:20 ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.)

ఆయన తలుపు తట్టవలసి వచ్చింది. ఇది సూచించేదేమంటే, అనేకులు ప్రభువు యొక్క సహవాసం చేయలేని స్థితిలో ఉన్నారు. కనీసం ఈ సంవత్సరమైన ప్రభువును నమ్మి, ఆయనను రక్షకునిగా  స్వీకరించి వాస్తవంగా ఆయన కుటుంబంలో ప్రవేశించి దేవుని పిల్లలం అవుదాం.

🏵4. రక్షణ తలుపు: రక్షణ ద్వారం క్రీస్తే. క్రీస్తు ద్వారా ఎవరైనా లోపలికి వస్తే అతనికి రక్షణ లభిస్తుంది. అతడు లోపలికి వస్తూ, బయటికి వెళ్తూ మేత కనుక్కొంటాడు.  (యోహాను 10:9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడై, లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును)

2020 సంవత్సరంలోనైనా రక్షణ ద్వారంలోనికి ప్రవేశించాలని తీర్మానం చేసుకుందామా? రక్షణ తలుపులు నీకొరకే తీయబడి ఉన్నవి. లోపలకు వస్తే, ఆయన నీ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు కూడా అద్భుతమైన రక్షణ ఇవ్వగలడు. గనుక శక్తివంతమైన సువార్త ద్వారా రక్షణలో ద్వారంలోనికి ప్రవేశిద్దాం.

అతడు లోపలకు పోవుచు అనగా క్రీస్తులో బలపడుట, బయటకు వచ్చుచు అనగా సువార్త ప్రకటనకు అని అర్ధం. ప్రభువు నీకొరకు సువార్త తలుపు కూడా 2020 సంవత్సరంలో తీయనున్నాడు.  

🏵5. పరిచర్య తలుపు: క్రీస్తు కొరకు పరిచర్య చేసే తలుపు ప్రభువు తెరచాడు.  (యోబు 31:32 పరదేశిని వీధిలో ఉండనియ్యక నా యింటి వీధితలుపులు తెరచితిని గదా.) మార్త ప్రభువును తన ఇంటిలోనికి ఆహ్వానించి పరిచర్య చేసింది. జక్కయ్య ప్రభువు కొరకు తన తలుపులు తెరచి పరిచర్య చేశాడు. అబ్రహాము తన ఇంటి గుడారపు ద్వారా యొద్ద కూర్చొని ప్రభువును ఆహ్వానించి విందు పరిచర్య చేసి ఆశీర్వదించబడ్డాడు.

(ఆది కా 18:1 మరియు మమ్రే దగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.)

మరి రాబోయే 2020 సంవత్సరంలోనైనా మనం పరిచర్య ద్వారంలో ప్రవేశించుటకు తీర్మానం చేద్దామా?

🏵6. దీవెన తలుపులు: 2020లో ప్రభువు నీ కొరకు దీవెనల తలుపు తెరచాడు. మరి మనం ప్రభువుకివ్వడానికి కానుకల తలుపు తెరిస్తే, ప్రభువు మనకొరకు దీవెనల తలుపు రాబోయే సంవత్సరంలో తెరవడానికి సిద్ధంగా ఉన్నాడు.

(మలాకి 3:10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి,పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు).

మనం ప్రభువుకు ఇచ్చేదానిమీదే నూతన సంవత్సరంలో ప్రభువు మనకిచ్చే దీవెన ఆధారపడి ఉంటుంది. (లూకా 6:38  ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ    కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల  కొలువబడునని చెప్పెను.)

🏵7. రాకడ తలుపులు: ప్రభువు వచ్చే ఆ రోజు గానీ గడియ గానీ మీకు తెలియదు, గనుక మెళుకువగా ఉండండి.  (లూకా 12:36 తమ ప్రభువు పెండ్లి విందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి.)

ఆధ్యాత్మికంగా సిద్ధమై ఉండండి.  నిజమైన క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఉండవలసినది లేకుండా, అంటే క్రీస్తు ఆత్మ లేకుండా, క్రైస్తవ జీవితం గడపాలని ప్రయత్నించడం బుద్ధి తక్కువ పని. అందుకే బుద్ధిలేని కన్యకలు విడువ బడ్డారు. వారికొరకు నరకం కాచుకొని ఉన్నది.

(మత్తయి 25:11-13 అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. ఆ దినమై      నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.)

రాకడ తలుపులో ప్రవేశించుటకు ఆలస్యం చేస్తే ప్రభువు మనకు దొరకడు. (పరమ 5:6 నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్లిపోయెను.)  

ఒకానొక దినాన ప్రభువు సువార్త తలుపు మూసి పరలోకపు తలుపు తెరచును. ప్రకటన 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడియుండెను (యెషయా 22:22 నేను దావీదు ఇంటితాళపు అధికార భారమును అతని  భుజము మీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు.)

🏵ముగింపు: ప్రియ దేవునిబిడ్డలారా! సమయం దాటకముందే ద్వారంలో ప్రవేశించాలి లేదా తీయబడిన తలుపు వేయబడుతుంది. అప్పుడు ఎవరును ద్వారములోనికి ప్రవేశించలేరు.  నోవాహు ఓడ తలుపు మూసివేసినది దేవుడే.

(ఆది.కా 7:16 ప్రవేశించిన వన్నియు దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడుదియు ప్రవేశించెను; అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేసెను. ఆది.కా 7:21 అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.)

ఆశిక్ష మనకు రాక ముందే ప్రభువు మన కొరకు తెరచిన ద్వారంలో ప్రవేశిద్దాం. ఆయనే ద్వారమై యున్నాడు. (యోహాను 10:9 నేనే ద్వారమును;)

రాబోయే నూతన సంవత్సరం 2020లో మన కొరకు తీయబడిన ఏడు తలుపులలో అనగా ద్వారం అనబడిన యేసులో ప్రవేశించి ప్రభువును గొప్పగా మహిమ పరచే భాగ్యం మనకు ఆత్మ దేవుడు సమృద్ధిగా అనుగ్రహించునుగాక! ఆమెన్!!

దైవశ్శీస్సులు


- పాస్టర్ జ్యోతిరాజు వేముల
ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి
నిడుబ్రోలు

o
Share/Bookmark

    ప్రార్థన యొక్క ప్రాముఖ్యత
➖➖➖➖➖➖➖➖
మనము దేవునితో సంబంధాన్ని లేక సహవాసాన్ని రెండు విధములుగా కలిగియుండవచ్చును. మొదటిగా మనము దేవుని వాక్యము ద్వారా ఆయన నుండి వింటాము. తరువాత ఆయన వాక్యానికి స్పందిస్తాము. (వాక్యముతో ఏకీభవించి, ఆమేన్‌ చెబుతాము).

 ప్రార్థనంటే కేవలము మన మనవులను విన్నపము చేయుట కాదు. పెళ్ళికుమార్తె పెళ్ళి కుమారునితో సహవాసము చేసినట్లు ప్రభువును ఆస్వాదిస్తూ, ప్రభువులో ఆనందిస్తూ ఆయనతో సహవాసము చేయుటయే ప్రార్థనలో ముఖ్యమైన విషయము. పెళ్ళి కుమార్తె పెళ్ళి కుమారునితో ఏవిధముగా మాట్లాడాలి అనుదానికి నియమనిబంధనలేమియు లేవు.

అయినను ఈవిధముగా ప్రార్థించుట మంచిది.

1. తండ్రియైన దేవుడు ఏమైయున్నాడో దానంతటినిబట్టి ఆయనను స్తుతించుట.

2. మనము చేసిన పాపములను మరియు ఓటములను ఒప్పుకొనుట.

3. దేవుని రాజ్యము మనలోనికి వచ్చునట్లు ప్రార్థించుట.

4. మన అవసరములన్నిటి కొరకు ప్రార్థించుట.

5. ఇతరుల కొరకు విజ్ఞాపన చేయుట

6. దేవుడు చేసిన దానంతటికీ వందనములు చెప్పుట.

7. దేవుడు చేయబోయే దానంతటి కొరకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుట.

''విసుకక ఎల్లప్పుడు ప్రార్థించమని'' ప్రభువైన యేసు చెప్పారు (లూకా 18:1).

చిన్నచిన్న విషయములను గురించి ప్రతిరోజు దేవునితో మాట్లాడుచూ రోజంతయు ప్రార్థనాత్మలో ఉండుట మంచి అలవాటు. అప్పుడు అది ఒక ఆచారముగా ఉండక, దేవునిని అనుభవిస్తూ, ఆయనలో ఆనందిస్తాము. దేవుడు కూడా అద్భుతముగా మన హృదయాలలో మాట్లాడును. ప్రార్థించుటలో ఇవన్నియు మొదటి పాఠములు. మనము ఈ విధముగా చేస్తూ ఉంటే ఆత్మీయముగా అభివృద్ధిని పొందుతాము. అయితే ప్రార్థన ఒక ఆచారముగా మారిపోకూడదు.

ప్రార్థన అనగా దేవునిని పీల్చుకొనుట, దేవునిని పొందుకొనుట, దేవునిని ఆశ్వాదించుట, దేవునితో నింపుకొనుట. ఊపిరి పీల్చుకొనుట కష్టముగా ఉంటే, ఏదో సమస్య ఉన్నట్లు మనకు తెలుసును. విసుగు పుట్టించేదిగానో లేక అసంతృప్తితో ఉండునట్లు చేయుటకు, దేవుడు ప్రార్థన అను వరమును ఇవ్వలేదు. కాని మనము క్రీస్తులో క్షేమాభివృద్ధి పొందేకొలది ప్రార్థన మరి ఎక్కువగా చేయవలసి యుంటుంది.

దేవుడు మన హృదయములలో పెట్టిన చిన్న చిన్న భారములకొరకు నమ్మకముగా ప్రార్థిస్తూ ఉంటే, దేవుడు మరిఎక్కువగా ఆయన భారములను ఇస్తాడు. ఆ విధముగా ఇతరులను ఆశీర్వదించే ఆయన పనిలో, మనము కూడా ఆయనకు సహపనివారమవుదుము. ప్రభువైన యేసు కన్నీటితోను, మహారోధనతోను ప్రార్థించారు (హెబ్రీ 5:7). ఒకసారి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువులవలే కారింది (లూకా 22:44). ఆయన ప్రార్థన అంత తీవ్రముగా ఉండెను.

ఒకసారి ఆయన రాత్రంతయు ప్రార్థనలో గడిపారు (లూకా 6:12). అప్పుడప్పుడు అరణ్యములోకి వెళ్ళి ప్రార్థించే అలవాటు ఆయనకున్నది (లూకా 5:16). ఒకరు చెప్పినట్లు, యాత్రికులు క్రొత్త స్థలాలు చూచుటకు ఆసక్తి కలిగినట్లే ఆయన ఎక్కడకు వెళ్లినను ప్రార్థించుటకు అనుకూలమైన స్థలము కొరకు చూచేవారు. ఆయనకే ప్రార్థన అంత అవసరమైతే నీకు మరియు నాకు ఇంకెంత అవసరమో గదా! కాబట్టి సోమరితనానికి వ్యతిరేకముగా పోరాడి, ఎట్టి పరిస్థితులలోనైనను ప్రార్థించుటకు తీర్మానించుకుందాము.                              - జాక్‌ పూనెన్‌
o
Share/Bookmark

♻ గురియొద్దకే పరుగెత్తుచున్నామా..?  🏃


ఫిలిప్పీయులకు 3:14
 క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, "గురి యొద్దకే పరుగెత్తుచున్నాను".



🏵ఉపోద్ఘాతం: 2020 సంవత్సరం చివరకు వచ్చాం. ఈ సంవత్సరంలో మన ఆత్మీయ పరుగులో అనగా ఆత్మీయ జీవితంలో ఏమైనా పరిపూర్ణత సాధించామా? చాలామంది ఆత్మీయ పరుగు ఆగిపోయింది మరికొంతమంది పరుగు ఆగిపోయే పరిస్థితిలో ఉన్నది. మరి మన ఆత్మీయ పరుగు ఎలా ఉన్నది? ఆత్మీయ జీవితంలో సంపూర్ణత లోనికి ఎదిగామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన సమయం.

కొంతమంది “మేము ఆత్మీయ జీవితంలో పరిపూర్ణస్థితికి వచ్చేశాము” అని మాట్లాడుతారు. కాని ప్రియదేవుని బిడ్డలారా! గొప్ప రాయబారి పౌలుకే పరిపూర్ణత లేనప్పుడు, మనలో లేదనుకోవడానికి సంశయం ఏముంది?   క్రీస్తు తనను రక్షించి పిలిచినప్పుడు తాను ఎలా ఉండాలని ఆయన కోరాడో పూర్తిగా ఆ విధంగా అయిపోవాలని పౌలు ఆశ.

క్రొత్త సంవత్సరం సిద్ధపాటు కొరకు ఏడు సూత్రాలు: (ఫిలిప్పీ 3:12-16 నుండి ధ్యానం)

🏵1. ఆధ్యాత్మిక జీవితంలో సంతృప్తి చెందామని అనుకోవద్దు: ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా సాధించవలసినది చాలా ఉంది చాలామంది విశ్వాసులు ఈ సంవత్సరం తమ క్రైస్తవ నడకతో సంతృప్తి చెందామని అనుకుంటున్నారు. ఎందుకంటే వారు ఇతర క్రైస్తవులతో తమను తాము పోల్చి చూస్తున్నారు. కాని పౌలు అయితే ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తు ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తున్నాడు.

(ఫిలిప్పి  3:12 ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని యైనను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో  దానిని పట్టుకొనవలెనని పరుగెత్తు చున్నాను.)

🏵2. ఇంకా సాధించాలనే ఆసక్తి యుండాలి: దేవుని విషయంలో మనలో ప్రతి ఒక్కరూ పూర్తి నిశ్చయతతో శ్రద్ధాసక్తులు చివరిదాకా చూపాలనీ పౌలు కోరిక. (హెబ్రీ  6:11-12 మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.)   

క్రైస్తవ జీవితంలో ఇంకా అధ్బుతంగా ముందుకు సాగాలన్న యథార్థమైన బలమైన కోరిక మనలో లేకపోతే ఆత్మీయ జీవితంలో వెనుకకు జారిపోతాము. ఈ లోకంలో మన జీవితాంతం క్రీస్తులో నమ్మకం ఉంచుతూ, ఆయనకు సేవ చేస్తూ పోవడమే ప్రాముఖ్యమైన విషయం.  

🏵3. వెనుకున్నవి మర్చిపోవాలి: గతంకన్నా భవిష్యత్తే ముఖ్యం కనుక వెనుకున్నవి మర్చిపోవాలి. అంటే అన్ని మరచిపోమ్మని కాదు. పౌలు తన పాత జీవితం మీద తన ఆలోచనలను ఉంచుకోలేదని దీని అర్థం. పాత జీవితం తనను వశపరచుకోకూడదని అతని ఉద్దేశం. అతనికి గతం కన్న భవిష్యత్తే ముఖ్యం. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలను కుంటున్నాడు.

(ఫిలిప్పి 3:13 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి)

"వెనుక ఉన్న వైఫల్యాలను మర్చిపోవాలి, లేకపోతే వెనుకున్న అపజయాలు రాబోయే సంవత్సరంలో మనం సాధించబోయే విజయాలను నియంత్రిస్తాయి. గతంలోని తన జయాపజయాలను వెనకే విడిచిపెట్టి ముందుకు సాగిపోవాలను కుంటున్నాడు పౌలు.

🏵4. ఈ సంవత్సరం సాధించిన విజయాలపై గర్వం వద్దు: తన విజయాలపై సంతృప్తి చెంది గర్వించి ఏమరుపాటుగా ఉండేలా చెయ్యడానికీ పౌలు అనుమతించడం లేదు. గర్వం మన ఆత్మీయ పరుగును నిదానింపజేసి ఆపివేస్తుంది. నాశనమునకు ముందు గర్వము నడుచును (సామెతలు 16:18)

ఈ గర్వము మరియు అహంకారమైన మనస్సు మనలను నాశనమునకు తెసుకెల్తుంది.   బైబిల్ చూస్తే,  గోలియతు,  హామాను,  నెబుకద్నెజరు, బెల్షస్సరువంటి వారు వారి గర్వము బట్టి పతనానికి వెళ్లిపోయారు. గర్వము ఆత్మకు, మనసుకు,  శరీరమునకు విషం మాదిరిగా ఉన్నది. ఈ గర్వము వలన మనము ఎవరిని కూడా ప్రేమించలేము.  సామెతలు 29:23 " ఎవని గర్వము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనతనొందును “

🏵5. ముందున్న గురిని మర్చిపోవద్దు: పౌలు దృష్టి ఎల్లపుడు దేవుడిచ్చు బహుమతిపైనే ఉన్నట్లుగా మనం కూడా ఎన్ని సంవత్సరాలు గతించి పోతున్నా మన పరుగు ఆపకూడదు మనం పోరాటం ఆగకూడదు.  

(ఫిలిప్పీయులకు3:13,14 సహోదరులారా, నేనిదివరకే పట్టుకొనియున్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను; వెనుక ఉన్నవి మరచి (లక్ష్యపెట్టక) ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను.

సాతాను మన దృష్టి ప్రక్కకు మరల్చడానికి చూస్తాడు.  పరుగు పందెంలో పరుగెత్తే వారంతా పరుగెత్తుతారు గానీ బహుమతి లభించేది ఒకరికే అని తెలిసికొని ఆ బహుమతి మనకే లభించేలా గురివైపు పరుగెత్తాలి. క్రీడాకారుడు అన్నిటిలో తనను అదుపులో ఉంచుకొంటాడు. (1 కొరి 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము.)  

🏵6. క్రీస్తువలె ఉండుటకు క్రీస్తు స్వరూపంలోనికి ఇంకా ఎదగాలి: కొలస్సి 1:28 ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన యెదుట నిలువబెట్టవలెనని, సమస్తవిధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధిచెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు, ఆయనను ప్రకటించు చున్నాము.

మనము పరిపూర్ణతలో ఇంకా పైకి ఎదగాలి. ఎన్ని అలలు వచ్చినా, గాలికి కొట్టుకొని పోకుండా, క్రీస్తు స్వరూపమునకు ఎదగాలి.  ఫిలిప్పి 1:9 మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను  కూడినదై,  అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు,

ఈ 2019 సంవత్సరంలో మనం ఎంతో పరిపూర్ణమైన ఆత్మీయ జీవితం జీవించినా అది ఇంకా చాలదు. రాబోయే 2020 సంవత్సరంలో అంతకంతకు అభివృద్ధి పొందాలి.  పౌలు అంతటివాడే తనలో పాపమేమీ లేకుండా ఒక్క తప్పు కూడా చేయకుండా ఉండే పరిపూర్ణ స్థితి తనకున్నదని అనలేదు.  కానీ తానొక పరిపక్వత చెందిన విశ్వాసిననీ, క్రీస్తులో ఆధ్యాత్మికంగా ఎదిగినవాడిననీ అతనికి తెలుసు. ఇంకా పైకి పరిపూర్ణతలోనికి పౌలువలె మనం కూడా ఎదగవలసి యున్నది.  ఫిలిప్పీ 3:15 కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగియుందము.

ఎఫేస్సి 4:14-15 అందువలన మనమిక మీదట పసిపిల్లలమై యుండి, మనుష్యుల మాయో పాయములచేత వంచనతోను, తప్పుమార్గమునకు లాగు కుయుక్తితోను, గాలికి కొట్టుకొనిపోవునట్లు, కల్పింపబడిన ప్రతి ఉపదేశామునకు కొట్టుకొని పోవుచు అలలచే  ఎగుర గొట్టబడిన వారమైనట్లుండక  ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము.

🏵7. ఆత్మీయ పరుగులో క్రమశిక్షణ కలిగి యుండాలి: There must be discipline in our Christian lives. క్రమమైన జీవితంలో నడవమని పౌలు చెప్పుచున్నాడు. ఎన్ని ప్రేరేపణలు కలిగినా యోసేపువలె క్రమశిక్షణ గలిగి  విశ్వాసులు వారికున్న జ్ఞానం మేరకు నడుచుకోవాలి. మనం అలా క్రమశిక్షణలో జీవిస్తే, దేవుడు మనకు సత్యాన్ని గురించి మరింత గ్రహింపును ఇస్తాడు.

(ఫిలిప్పి 3:16 అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానినిబట్టియే క్రమముగా నడుచుకొందము. హెబ్రీ 12:9 మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై యుండిరి. వారి యందు భయభక్తులు కలిగి యుంటిమి; అట్లయితే ఆత్మలకు తండ్రియైన వానికి మరి యెక్కువగా లోబడి బ్రదుక వలెనుగదా).

క్రైస్తవ క్రమశిక్షణను మనలను సరిచేస్తుంది. మనలను సరియైన మార్గములో నడిపిస్తుంది. మనలను మార్చుకొనుటకు సహాయ పడుతుంది. (సామెతలు 13:1 తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.)

🏵ముగింపు: యేసుతో జీవితం మనకు సంతృప్తిగానే ఉంది గాని మన ఆత్మీయ పరుగులో ఆత్మీయ జీవితంలో సంతృప్తి అనేదే ఉండకూడదు. పౌలు కూడా ప్రస్తుతం ఉన్న తన ఆధ్యాత్మిక స్థితితో సంతృప్తి చెంది ఊరుకోలేదు. గతంలో తాను సాధించినవి అతనికి సంతృప్తి కలిగించలేదు. తన జీవితంలో క్రీస్తును గురించిన పరిపూర్ణత ఇంకా ఎక్కువగా ఉండాలని ఆశిస్తు పరుగెడుతున్నాడు.

అదే రీతిగా ఈ 2020 సంవత్సరాంతంలో ఉన్న మనం పరిశీలన చేసుకొని మన తప్పులను సరిచేసుకొని రానున్న 2021 సంవత్సరంలో మరింత ఆత్మీయంగా పరుగెత్తుటకును ఎదుగుటకును ఆత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక!! ఆమెన్!!

దైవాశ్శీసులు!


-  పాస్టర్ జ్యోతిరాజు వేముల ప్రిన్సిపాల్
ఇమ్మానుయేల్ బైబిల్ కాలేజి
నిడుబ్రోలు

o
Share/Bookmark

💥 నీ దుఃఖానికి కారణమేమిటో తెలుసా 💥

☘ సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను - రూతు 1:20, 21

🍁 నయోమి చెప్తుంది దేవుడు నాకు దుఃఖము కలుగజేసెను, నన్ను బాధపరచెను అని. మనము కూడా అనేక సందర్భాలలో దేవుడు నన్ను బాధపరచెను, నన్ను ఏడిపించెను ఆయనకు కనికరము లేదు నా జీవితములో ఆనందము లేకుండా చేసాడు అని అంటుంటాము.

🍁 నిజముగానే నేటి మన దుఃఖమునకు, నేటి మన బాధకు కారణము దేవుడేనా, మరి దీన్నిబట్టి దేవుడేమి సెలవిస్తున్నారో, మనము ఏమి చేశామో  ఒక్కసారి తెలుసుకుందాము.

☘ దేవుని చిత్తము కానీ మార్గాలలో నడుచుట వలన మనము దుఃఖమునకు గురి కావల్సి వస్తుంది.

🍁 బేత్లెహేములో కరవు వచ్చింది, తినటానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయములో నయోమి భర్త తన భార్యను, తన ఇద్దరి పిల్లలను తీసుకుని వేరే దేశమునకు వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు, తీర్మానం తీసుకున్నప్పుడు ఒక్కసారి అయినా దేవుని చిత్తము కోసము, దేవుని నడిపింపు కోసం దేవుని సన్నిధిలో ఎదురుచూడలేదు, దేవుణ్ణి సలహా అడగలేదు తమంతట తామే వెళ్లిపోయారు. కాబట్టి కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది నయోమి తన భర్తను, బిడ్డలను కోల్పోయి రిక్తురాలిగా మార్చబడింది.

☘ దేవుడు చెప్పిన మార్గములో నడవకపోవుట వలన మనము దుఃఖమునకు గురికావల్సి వస్తుంది.

🍁 సొదొమ గొమొఱ్ఱ పట్టణములను నాశనం చేస్తున్నప్పుడు దేవుడే ఒక ప్రాంతాన్ని చూపించి అక్కడకి వెళ్లమంటే వద్దులే ప్రభువా ఇది దగ్గరగా ఉంది అని మరొక ప్రాంతానికి వెళ్ళాడు లోతు. మత్తుడై చేయారని పాపము చేసి, తన బిడ్డల జీవితంలో సంతోషము లేకుండా దేవుని ప్రజలను బాధించిన మోయాబీయులు, అమ్మోనీయులు జన్మించుటకు కారకుడు అయ్యాడు లోతు.

🤔 మరి దేవుడే కారణము అని చెప్తున్న మనకి దేవుడు చెప్తున్న మాటలు ఏమిటి??

🌷 దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము

🌷 సర్వశక్తుడు న్యాయము తప్పడు.

🌷 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును - యోబు 34:10 - 12

🤔 కాబట్టి ఈరోజు మన దుఃఖమునకు కారణము ఏంటి?  

🌷 దేవుని చిత్తములేని మార్గములో నడుచుట,
దేవుడు చెప్పిన మార్గములో నడువక పోవుట వలన నేడు మనలో అనేకమందిమి కన్నీటి మార్గాలలో గుండా నడుస్తున్నాము, శోకపు వలలోచిక్కుబడి ఉన్నాము. అందుకు కారణం మన సొంత నిర్ణయాలు మాత్రమే.

🌷 కాబట్టి ఈరోజు మన దుఃఖం తుడిచివేయబడాలి అంటే, మన కన్నీరు నాట్యముగా చేయబడాలి అంటే, మన విచారం ఆనందంగా మారాలి అంటే మారాని పోలిన మార్గములలో మన జీవితాన్ని మధురంగా చేయ శక్తిగల దేవుని పాదాల చెంతకు చేరుదాము. ఆయనే మనకి నోటి నిండా నవ్వు కలుగజేయువారు. ఇట్టి ధన్యత ప్రభువు మన అందరికి అనుగ్రహించును గాక...

o
Share/Bookmark

Bro.Yasanna Telugu Christian Massage

Posted by Unknown Sunday, March 1, 2015 0 comments




Bro.Yasanna Telugu Christian Massage




Tags: Bro.Yasanna Telugu Christian Massage , Telugu bible messages  telugu priysekhar songs  telugu chrisan messags  telugu christian mesages We Belong To JESUS - R R K Murthy, Give Preference To JESUS - Praveen Calvary ,CFC Message Library Bangalore Church Christian


o
Share/Bookmark

Dr.P.Joshi Yesu Anucharulu - Jesus Followers

Posted by D Veeranna Monday, April 11, 2011 0 comments








Tags: Dr.P.Joshi Yesu Anucharulu - Jesus Followers ,Mobile Bible Jar Files,Mobile Bible, English Mobile Bible Jar, Telugu Mobile Bible Jar, Bible E Books,Telugu Bible, English Bible, Bible Jar Files, Christan wallpaper, jesus wallpaper,Jesus Followers, Dr.P.Joshi Yesu Jesus Followers.
o
Share/Bookmark











Tags: ,telugu christian messages sajeevaswaram , telugu christian messages,English Mobile Bible Jar, Telugu Mobile Bible Jar, Bible E Books,Telugu Bible, English Bible, Bible Jar Files, Christan wallpaper, jesus wallpaper,telugu christian,telugu christian Songs.
o
Share/Bookmark

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels