>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

1. పరమజీవము నాకు నివ్వ - తిరిగిలేచెను నాతోనుండ
నిరంతరము నడిపించును - మరలవచ్చి యేసు కొనిపోవును
యేసు చాలును, యేసు చాలును - యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
2. సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగివెళ్ళెదను
లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళెదను
యేసు చాలును, యేసు చాలును - యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
3. పచ్చికబయలులో పరుండజేయున్ - శాంతిజలములచెంత నడిపించును
అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణలోయలో నన్ను కాపాడును
యేసు చాలును, యేసు చాలును - యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును
4. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను 
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడిచినను 
యేసు చాలును, యేసు చాలును - యే సమయమైన యే స్థితికైనా
నా జీవితములో యేసు చాలును

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels