>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

యేసే నా ఆశ్రయము
యేసే నా ఆధారము
నా కోట నీవే… నా దుర్గము నీవే
నా కాపరి నీవే ||2||

శ్రమలోయలు ఎన్నో ఎదురు వచ్చినా
కష్టాల ఊభిలో కూరుకున్ననూ ||2||
నన్ను లేవనెత్తును నన్ను బలపరచును
నాకు శక్తినిచ్చి నడిపించును ||2||       ||యేసే నా||

జీవ నావలో తుఫాను చెలరేగినా
ఆత్మీయ జీవితంలో అలలు ఎగసినా ||2||
నాకు తోడైయుండును నన్ను దరి చేర్చును
చుక్కాని అయి దారిచుపును ||2||       ||యేసే నా||

దినమంతయు చీకటి అలుముకున్ననూ
బ్రతుకే భారమైన సంద్రమైననూ ||2||
నాకు వెలుగిచ్చిను నన్ను వెలుగించును
నా నావలో నాతో నుండును ||2||         ||యేసే నా||



0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels