>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..


నాదు జీవమాయెనే నా సమస్తము
నా సర్వస్వమేసుకే నాదు జీవము
నాదు దైవము – దివి దివ్య తేజము ||2||            ||నాదు||

కృంగిన వేళ – భంగపడిన వేళ – నా దరికి చేరెను
చుక్కాని లేని – నావ వలె నేనుండ – అద్దరికి చేర్చెను
ఆత్మతో నింపెను – ఆలోచన చెప్పెను ||2||              ||నాదు||

సాతాను బంధీనై – కుములుచున్న వేళ – విడిపించెను శ్రీ యేసుడు
రక్తమంత కార్చి – ప్రాణాన్ని బలిచేసి – విమోచన దయచేసెను
సాతానుని అణగద్రొక్కన్ – అధికారం బలమిచ్చెను ||2||           ||నాదు||

కారు మేఘాలెన్నో – క్రమ్మిన వేళ – నీతిసుర్యుడు నడుపును
తూఫానులెన్నో – చెలరేగి లేచిననూ – నడుపును నా జీవిత నావ
త్వరలో ప్రభు దిగివచ్చును – తరలి పోదును ప్రభునితో ||2||          ||నాదు

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels