>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

పల్లవి:     ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే 
ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే
 ప్రభువా  జరిగేది నీ చిత్తమే 
నీ వాక్కుకై - వేచి యుంటిని - నా ప్రార్ధన ఆలకించుమా 
ప్రభువా  -  నా ప్రార్ధన ఆలకించుమా 

1.        
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ప్రాణి నిలువ లేదు 
నీ తోడు లేక - నీ ప్రేమ లేక - ఇలలోన ప్రాణి నిలువ లేదు 
అడవి పూవులే - నీ ప్రేమ పొందగా - అడవి పూవులే - నీ ప్రేమ పొందగా
నా ప్రార్ధన ఆలకించుమా - ప్రభువా  నా ప్రార్ధన ఆలకించుమా  

2.        
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి 
నా ఇంటి దీపం - నీవే అని తెలిసి - నా హృదయం నీ కొరకు పదిల పరచితి 
ఆరిపోయిన నా వెలుగు దీపము - ఆరిపోయిన నా వెలుగు దీపము 
వెలిగించుము నీ ప్రేమతో -  ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో

3.        
ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 
ఆపదలు నన్ను - వెన్నంటియున్న - నా కాపరి నీవై నన్ను ఆదుకొంటివి 
లోకమంతయు నన్ను విడిచినా - లోకమంతయు నన్ను విడిచినా 
నీ నుండి వేరు చేయవు - ప్రభువా నీ నుండి వేరు చేయవు  
ఎన్ని తలచినా - ఏది  అడిగినా - జరిగేది నీ చిత్తమే
            ప్రభువా  జరిగేది నీ చిత్తమే

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Popular Posts

Labels