ఎజ్రా 5:1-2; 6:14 లో ఉన్న హగ్గయి ప్రవక్త.
వ్రాసిన కాలం
క్రీ. పూ. సుమారు 520. పారసీకుల చక్రవర్తి దర్యావేషు పరిపాలన రెండో సంవత్సరంలో.
ముఖ్యాంశాలు
👉కోరెషు పరిపాలన రెండవ సంవత్సరంలో యూదులు జెరుసలంకు తిరిగి వెళ్లిపోవచ్చని ఆజ్ఞ అయింది (క్రీ.పూ.538).
👉 వెంటనే కొంత మంది తిరిగి వెళ్ళి జెరుబ్బాబెల్ నాయకత్వంలో దేవాలయ పునర్నిర్మాణం మొదలుపెట్టారు గాని పునాదులవరకు కట్టి పని మానుకున్నారు.
దేవాలయం నిర్మాణానికి యూదుల్ని పురిగొల్పాడు హగ్గయి.
👉 దేవుని కార్యం పట్ల అవిధేయత చూపుతున్నందువల్ల కలుగుతున్న నష్టాలనూ విధేయత చూపితే ఒనగూడే దీవెనలనూ వివరించాడు. నాయకుడైన జెరుబ్బాబెల్‌కు ఆలయ నిర్మాణాన్ని గురించిన వాగ్దానం, ప్రోత్సాహం ఇందులో ఉన్నాయి.
విషయసూచిక
హగ్గయిప్రవక్త భవిష్యద్వాక్కులు పలికిన సందర్భం 1:1
ఆలయ నిర్మాణం విషయంలో ప్రజలు చెప్తున్న సాకు,
నిర్లక్ష్యం చేసినందువల్ల వాటిల్లుతున్న నష్టాలు 1:2-11
ప్రజలకు భయభక్తులు కలగడం 1:12
దేవుని వాగ్దానం, పని తిరిగి ప్రారంభం 1:13-15
నాయకులకు దేవుడు ధైర్యం చెప్పడం 2:1-5
అభిషిక్తుని రాక గురించీ ఆలయం వైభవకరం కావడం గురించి వాగ్దానం 2:6-9
ప్రజల పాపపూరితమైన ప్రయత్నాలన్నీ అపవిత్రత కలిగిస్తాయి 2:10-14
ప్రజల కష్టార్జితమంతా వ్యర్దమైపోతూ ఉండడం 2:15-19
ఇతర రాజ్యాలపై దేవుని తీర్పు 2:20-22
జెరుబ్బాబెల్‌కు ధన్యకరమైన వాగ్దానం 2:23
0 comments