ఇతరుల దేవుళ్లను దూషించడం వలన పాపులారిటీ వస్తుంది తప్ప దైవికంగా ఒరిగేది పూర్తిగా ఏమి లేదు.
👉 వారి దేవుళ్ళ గురించి వారి పుస్తకాల్లో ఏముందో చెప్పడం వలన ఎవరు మారరు, మారినా ఒకరో ఇద్దరో అంతే వీరి కోసం ఇంత అల్లరి రచ్చ అనవసరం అయినా అవి వాళ్లకు తెలీని విషయాలు కావు అన్ని తెలుసని మనకు వారి వీడియోల ద్వారా తెలిసిపోతుంది. *వారి పుస్తకాల్లో ఉన్నవి చెప్పడం ద్వారా లాభమేంటని ఆలోచిస్తే బోధకులు బైబిల్ నే కాదు ఇతర గ్రంధాల్లో కూడా చదవగలరని, క్రైస్తవులలో కొందరి మెప్పు పొందటం వారిని సంతోషపెట్టడం తప్ప ఇందులో ఆత్మల రక్షణ లేదని నేను గ్రహించాను ఈ విషయం మీ మనసాక్షి కూడా అవుననే అంటుంది.*
👉 నిజం చెప్పాలంటే కొన్ని సార్లు మన మిత్రులు బంధువులు కూడా వారి దేవుళ్ళ గురించి మాట్లాడితే నొచ్చుకొని గొడవ పడి మనకు దూరం అవుతారు కావాలంటే ట్రై చేసి చూడండి. మన మిత్రులు బందువులే అంగీకరించి ఒప్పుకోరు బయటవాడు నువ్వు చెప్పగానే ఒప్పుకుంటాడా? ఇద్దరి మధ్య వాగ్వాదం లక్షల మందితో ముడి వేసుకునేలా అవుతుంది మతాల మధ్య చిచ్చు రేపుతుంది అంతే. *దేవుడి సేవ అనుకుంటూనే మనకు తెలీకుండానే మనం ఉన్మాదుల్లా మారిపోతున్నాము.* ఇది దేవుడి కోసం పోరాటం అనేవాడు సరిగా వాక్య జ్ఞానం లేదని అనుకోవొచ్చు.
వాక్యం తెలినివాడు కామెంట్ పెట్టె ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ పోస్ట్ లో సత్యం ఉంటే స్పందించండి లేకుంటే లేఖనాలు చూపండి. ఈ నిజాలు మీకు నచ్చక బాదేస్తే నేనేం చేయలేను.
ఎదుటివాడు మన దేవున్ని దూషించాడు కాబట్టి మనం వాళ్ళ దేవున్ని దూషించాలి అందుకే మనది తప్పు కాదు. వాళ్లకి నచ్చినట్టు హేళన చేసి అవమానించి దూషించినందుకు, మనకు నచ్చినట్టు రెచ్చిపోయి ఇతరుల దేవుళ్లను కించపరిచి, వారి మనోభావాలు దెబ్బతీసేలా వారిని ఉద్రేకపరిచి మనకు శత్రువులుగా చేసుకోడం మంచిదేనా?
సుమారు 13 కోట్ల తెలుగు ప్రజలల్లో మహా అయితే ఒక లక్ష నుండి 5 లక్షల మంది వారిని అనుకరిచే వాళ్లు ఉంటారు,వీరిలో మహా ఐతే ఓ 10 నుండి 20 వెల మంది పనిపాట లెనోళ్లు కొంచెం ఆక్టివ్ గా ఉంటారు, విరిలో ఓ 500 నుండి 1000 మంది ఏదో అరుస్తుంటారు సోషల్ మీడియాలో, అందులో ఓ ఐదో పదో మంది సోషల్ మీడియాలో మాట్లాడి ఏదో అన్నంత మాత్రాన వచ్చే నష్టమే లేదు మనము సమాధానం చెప్పుకుంటూ పోవాల్సిందే తప్పా వారిలా ప్రవర్తిస్తే అంతే., మూడు కోట్ల మైనారిటీలను పక్కన పెట్టినా మిగితా 10 కోట్ల మందికి ఈ విషయాలు ఏమి పట్టవు వారి పనిలో వాళ్ళు ఉంటారు అయినా వీరి మనోభావాలు దెబ్బ తీయడం మనకు అవసరమా అనిపిస్తుంది. స్వల్ప సంఖ్యలో ఉన్న విద్వేషం రేపే వాళ్ళ కోసం మనం ఇంకాస్త ఉద్రేకత ఎక్కువ మందిలో సృష్టించడం సరికాదు.
పౌలు గారిని ఆలోచిస్తే ఆయన అర్తెమీ దేవిని దూషించినట్టుగా కానీ ఎఫెసియుల దేవతలను దూషించడం కానీ జరగలేదు అయినా అక్కడ అల్లరి జరిగింది ఆ అల్లరిలో ఆయన పట్టుబడ్డప్పుడు ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఆయన వారి దేవిదేవతలను దూషించలేదు అనే మాటలు చదవగలము.
మనం ఎందుకు ఇక్కడ దేవుళ్ళ గురించి హడావిడి చేస్తున్నాము? పౌలుగారిగా నిష్కపటులుగా ఉండండి.
Acts(అపొస్తలుల కార్యములు) 19:37 మీరు ఈ మనుష్యులను తీసికొనివచ్చితిరి. వీరు_గుడి_దోచినవారుకారు, మన_దేవతను_దూషింపను_లేదు.
👉 *ఎదుటివాడు దూషణ చేసాడు కాబట్టి మనము కూడా దూషణ చేస్తే చట్ట సభల్లో మనం మన నిర్దోషత్వాని నిరూపించుకోగలమా అనేది నా ప్రశ్న?*
అధికారులు ఎవరిని నిర్బంధిస్తారు? వాళ్లకు అనుకూలంగా లేని వర్గాన్ని మాత్రమే నిర్బంధిస్తారు లేదా ఫిర్యాదుల బట్టి వారికున్న ఆధారాలతో నిర్బంధిస్తారు.
*ఈ నిర్బందన అక్రమము అని మనం అన్నట్టే చట్టం ముందు నిరూపణ చేయగలమా? వాడు అన్నాడు కాబట్టి నేను అన్నాను నన్ను మాత్రమే ఎందుకు నిర్బంధించారు లేక మా వాన్ని ఎందుకు నిర్బంధించారు అనే మాటలు అక్కడ చెల్లవు కేవలం నీ నిర్దోషత్వాని నిరూపించుకోవాలి లేని పక్షంలో నీవు దోషివే అవుతావు.*
👉 మన సమస్య ఏంటి అంటే మన వాడిని నిర్బంధిస్తే ఎదుటి వాడిని ఎందుకు చేయలేదు కానీ చట్టం సమస్య ఎదుటివాడిని ఎందుకు నిర్బంధించలేదు అనేది కాదు నిర్బంధంలోకి వచ్చిన నీవు నీ నిర్దోషత్వాని నిలుపుకోగలవ అంటుంది. నిలుపుకొని పక్షంలో నీవు దోషివే అవుతావు. *అందుకే పౌలు గారిని న్యాయసభలకు తీసుకొని వెళ్ళినపుడు ఆయన తన నిర్దోషత్వాని నిలుపుకున్నాడు బయటకీ వచ్చాడు.*
Acts(అపొస్తలుల కార్యములు) 19:38,39 దేమేత్రికిని అతనితో కూడ నున్న కమసాలులకును #ఎవని_మీదనైనను_వ్యవహారమేదైన_ఉన్నయెడల_న్యాయసభలు_జరుగుచున్నవి, #అధిపతులు_ఉన్నారు గనుక వారు #ఒకరితో_ఒకరు_వ్యాజ్యెమాడవచ్చును. అయితే మీరు #ఇతర_సంగతులను_గూర్చియేమైనను_విచారణ_చేయవలెననియుంటే #అది_క్రమమైన_సభలో_పరిష్కారమగును.
తోడేళ్ల మధ్యలోకి గొఱ్ఱెలను పంపినట్టు ఆయన పంపితే విల్లు మాత్రం తోడేళ్ల మధ్యలోకి తోడేళ్ళుగా వెళుతున్నారు, తోడేలు మాస్క్ తీసి గొఱ్ఱె మాస్క్ వేసుకొని వెళ్లయ్యా బోధకా అంటే ఏ నీకు రోషం లేదా దమ్ములేదా అంటారు. నీ రోషం నీ దమ్ము తగలెట్టా ఆ యేసుకు తెలీదా నీకు దమ్ము రోషం ఎక్కించి తోడేళ్ల మధ్యకు పంపాలని? మనకు అనుకూలమైన బోధలకు మారులుకొల్పబడి వాటిని కాపాడుకోడానికి మనకు నచ్చిన మాటలు మాట్లాడుతాము.
Matthew(మత్తయి సువార్త) 10:16 *ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునైయుండుడి.*
Romans(రోమీయులకు) 16:19 *మీవిధేయత_అందరికిని_ప్రచురమైనది గనుక మిమ్మునుగూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులును,* *కీడు_విషయమై_నిష్కపటులునైయుండవలెనని_కోరుచున్నాను.*
Philippians(ఫిలిప్పీయులకు) 2:14 *మీరు_మూర్ఖమైన_వక్రజనము_మధ్య,* *నిరపరాధులును_నిష్కళంకులును_అనింద్యులునైన_దేవుని_కుమారులగునట్లు,*
మూర్ఖులు మధ్యలో మీరు అనిందులుగా ఉండాలి, నింద లేనివారిగా ఉంటేనే చట్ట సభల్లో న్యాయం జరుగుతుంది తప్ప లేకుంటే కఠిన శిక్షలు ఎదుర్కొంటారు.
బైబిల్ పక్కన పెట్టి మేము మా వ్యక్తిగతంగా వెల్లుతాము అంటే వారి గ్రంధాలు ముట్టినప్పుడు వాటిలో ఉన్నవే చెప్పండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ఉన్నదానికి మసాలా హేళన దూషణ కలిపి వారిని అవమానించకండి.
సినిమా రచయితలు డైరెక్టర్లు నిర్మాతలు దేవుళ్ళ మీద తీసిన సినిమాలు చాలానే ఉన్నాయి వాటిలో వాళ్లేమో అసభ్య కరంగా చిత్రీకరించలేదు కానీ ఉన్నది ఉన్నట్టు తీసి ప్రజలకు లోపాలు చూపించారు అది మనకు తెలుసు. ఎదుటివాడు తొడ కోసుకున్నాడని మనం పీక కోసుకుంటే మనకే ప్రమాదం. వాడు ఏదో తీస్తే దానికి కౌంటర్ గా మనం ఏదో తీసి అల్లరికి కర్తలు అవడం అలవాటు అయిపోయింది. పైగా దీనికి దేవుని పక్షాన పోరాటం అనే ఒక పెరు పెట్టడం మాకు తెలీదు మరి ఏది దేవుడి పక్షాన పొరటమో?
ఇంత రోషం పౌరుషం గల ఈ బోధకులు పల్లెల్లోకి విధుల్లోకి వెళ్లి సువార్త చెప్పగలరా? చెప్పలేరు కానీ రోషం పౌరుషం వాళ్ళకే ఉన్నట్టు మాట్లాడుతారు.
*హాని జాన్సన్ గారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నాను ఆయన వచ్చాక మరలా ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీయకుండా ఉండాలని ఆశిస్తున్నాను, ఆయనే కాదు అలాంటి షార్ట్ ఫిలిమ్స్ తీసే ప్రతి ఒక్కరు ఇలాంటివి మానుకోవాలి. సాధ్యమైతే సమాధానాలు చెప్పి వదిలేయండి.*
ఈరోజు పల్లెల్లో ఊర్లల్లో పట్టణాల్లో సువార్త చెప్పకుండా మనమే చేసుకుంటున్నాము.
ఈ పోస్ట్ ఎంత మంది వెతిరేకిస్తారో నేను లెక్క చేయను వెతిరేకించే ప్రతివాడు లేఖనాలతో వెతిరేకించండి స్వాగతిస్తాను, సంతోషిస్తాను. కొందరికి చదవగానే బాధగా కోపంగా ఉండొచ్చు దానికి నేను కారణము కాదు లేఖనం అలా చెప్పుతుంది కాబట్టి మీ కోపం ఆ లేఖనాలు రాయించినవాడి మీద చూపిస్తే నేను ఇంకా స్వాగతిస్తాను. దూషించే వాడు వాడి పనే అది కాబట్టి వాడిని ఏమి చేయలేము.
Biblical Thinker
0 comments