>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

సమరయ స్త్రీ

Posted by Veeranna Devarasetti Tuesday, July 27, 2021

 

 

 


 


యూదయ గలలియ ప్రాంతాలకి మధ్యలో ఈ సమరయ ప్రాంతం ఉంది.
👉అయితే యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. సమరయుల నీరు త్రాగరు, మాట్లాడరు, భోజనం చేయరు. సమరయులను యూదులు పాపులుగా, వ్యభిచారులుగా, విగ్రహారాధికులుగా, అంటరానివారుగా పరిగనిస్తారు. చివరకి యూదయనుండి గలలియకు సమరయ మీదుగా దగ్గరదారి అయినా సరే చుట్టూ తిరిగివెల్తారు తప్ప సమరయలో అడుగుపెట్టరు. ఎందుకు అంటే మనం చరిత్ర తెలుసుకోవాలి.

👉 *సమరయ అనగా Watch Tower (కాపలా కోట). అది ఇశ్రాయేలు దేశం మధ్యలో ఉంది.*

ఇశ్రాయేలు రాజైన ఒమ్రీ, షెమెరు అనే వ్యక్తిదగ్గర రెండు తలాంతులకు ఆ కొండను కొని అక్కడ పట్టణం కట్టించి దానికి షోమ్రోను(సమరయ) అని పేరు పెట్టినట్టు చూస్తాం 1 రాజులు 16వ అధ్యాయం. కాలక్రమేనా ఈ పట్టణం అనేకసార్లు దాడికి గురిచేయబడ్డాది. (1,2వ రాజులు). సమరయులు అనే పేరు ఎలా వచ్చిందంటే క్రీ.పూ. 677- 721 మధ్యలో ఏషర్హద్దోన్ అనే అస్సూరు రాజు ఆప్రాంతాన్ని జయించి ఇశ్రాయేలీయులను చెరపట్టి, అస్సూరు రాజ్యానికి తీసుకోనిపోయాడు. ఇతర దేశ ప్రజలను తీసుకొచ్చి ఈ సమరయ ప్రాంతంలో నివాసం చేయమని చెప్పి అక్కడ పెడతాడు.
*ఈ రకంగా వచ్చిన మిశ్రమ జాతి వారే సమరయులు.*(2రాజులు 17: 24-41).

👉ఇది దేవునికి ఇష్టంలేని పని. అందువల్ల దేవుడు సింహాలను పంపుతారు. తర్వాత వారు తమ విగ్రహాలను విడచిపెట్టి క్రమక్రమంగా యూదుల ఆచారాలను, యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెడతారు. (ఎజ్రా 4:2,9,10; లూకా 17:18).

👉 అయితే యూదులు/ఇశ్రాయేలీయులు చెర విముక్తి పొందిన తర్వాత దైవాజ్న మేరకు మందిరం కట్టడం ప్రారంభిస్తారు. అప్పుడు ఈ సమరయులు మేము కూడా మీ దేవున్నే ప్రార్దిస్తున్నాం. మేము కూడా మీతోపాటు మందిరాన్ని కడతాం అంటే జెరుబ్బాబెలు, యేశూవ అనే పెద్దలు దానికి అంగీకరించరు. నెహేమ్యా గారైతే ఏకంగా మీకు మాలో పాలైనను, స్వాస్త్యమైనను లేదని ఖరాఖండిగా చెబుతారు.

👉అప్పటినుండి యూదులకు/ఇశ్రాయేలీయులుకు మధ్య వైరం మొదలైంది. చివరకు సమరయులు గెరీజీము కొండమీద ఒక మందిరాన్ని కట్టుకొంటే క్రీ.పూ. 139 లో ఒక యూదురాజు దానిని పడగొట్టినట్లు చరిత్ర చెబుతుంది. అప్పుడు వారు సమరయ అనగా షెకెము కొండమీద ఒకమందిరాన్ని కట్టుకొని ఆరాదించడం మొదలు పెట్టారు.
*ఈ రకంగా ఈ రెండుజాతులకు మధ్య వైరం యేసయ్య వచ్చేవరకూ కూడా కొనసాగింది.* ఇప్పటికి కూడా 160 సమరయ కుటుంబాలు ఈప్రాంతంలో నివాసం చేస్తున్నారు.

👉 *అయితే ఇటువంటి అంటరానిప్రాంతంగా, పాపపు ప్రాంతంగా,దొంగలతో నింపబడిన ప్రాంతంగా, ప్రజలందరితోను వెలివేయబడిన ప్రాంతానికి, ఏ ప్రవక్త, బోధకుడు కూడా వెళ్ళని, వెళ్ళడానికి భయపడే ప్రాంతానికి లోకరక్షకుడైన యేసయ్య తనే స్వయంగా ఆ ప్రాంతాన్ని దర్శించారు.*

ఆ ప్రాంతంలో కూడా మొట్టమొదట దర్శించిన స్త్రీ మామూలు వ్యక్తికాదు. ఏ మాత్రం మంచిసాక్ష్యం లేని ఒక వ్యక్తిని ఎన్నుకొని, ఆ ప్రాంతాన్ని మార్చిన వైనం నిజంగా అధ్బుతం!
ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త! నిత్యుడగు తండ్రి! సమాధాన కర్త!

*ఈరోజు నీవు కూడా ప్రజలందరితోను వెలివేయబడ్డావా?*

*అందరూ నిన్ను ఎందుకూ పనికిరానివాడు/పనికిరానిది అని హేలనచేస్తున్నారా?*

*నీవు అంటరానికులంలో పుట్టావు అని హేలనచేస్తున్నారా?*

*నీ భర్త, నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు అందరూ నిన్ను విడచిపోయారా?*

👉 భయపడొద్దు!
*పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈలోకానికి వచ్చారు. ఎవరైతే పాపులో, వెలివేయబడ్డారో, అంటరానివారిగా ఎంచబడ్డారో వాళ్ళ దగ్గరికే యేసయ్య వచ్చారు.*

ఈలోకంలో ఘనులైన వారిని వ్యర్ధం చేయడానికి ఎన్నికలేనివారిని ఆయన ఎన్నుకొన్నారు.

*ఆయనకి నీవుకావాలి!*
👉 *ప్రయాసబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా! నాయొద్దకు రండి అని పిలుస్తున్నారు.*

👉ఆయన వద్దకు వస్తావా?
*వస్తే ఆయన నీపాపాన్ని కడిగి నిన్ను శుద్ధిచేసి పరలోకవారసునిగా చేస్తారు. విలువలేని నీకు విలువ నిస్తారు.*

*హల్లెలూయ...*

 (రెండవ బాగము)

ప్రియ సహోదరీ/సహోదరులారా! మధ్యాహ్నం ఇంచుమించు 12గంటల సమయంలో యేసుప్రభులవారు సమరయ ప్రాంతంలో సుఖారు గ్రామ పొలిమేరల్లో గల యాకోబు బావి దగ్గర అలసియున్న రీతినే కూర్చోన్నట్లు చదువుకొన్నాం.

యోహాను 4: 6,7 వచనాలు. *అప్పుడు సమరయ స్త్రీ ఒకతె నీళ్ళు చేదుకొనుటకు రాగా యేసు- దాహమునకిమ్మని ఆమెనడిగెను.*


*ఇక్కడ మనం చూస్తే మధ్యాహ్నం పూట ఈ సమరయస్త్రీ నీరుకోసం బావిదగ్గరకు వచ్చింది.*

పల్లెటూర్లలో (పూర్వకాలం) స్త్రీలు వేకువఝామున లేచి మంచినీరుకోసం బావి దగ్గరకు వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఉదయం 7గంటల తర్వాత ఎవరు బావికి రారు. ఆ సమయానికి ఆ రోజుకి సరిపడే నీళ్ళు తెచ్చేసుకొని వంట కార్యక్రమాలు కొనసాగించేవారు.

👉కాని ఇక్కడ ఈ సమరయ స్త్రీ మధ్యాహ్నం రావడానికి కారణం ఏమిటి?

1. తెచ్చుకొన్న నీరు అయిపోయిందా?
*తర్వాత వచనాలు ప్రకారం ఎంతమాత్రము కాదు.*

2. Privacy కోసమా? ఒంటరితనం కోసమా? ఏమో తెలియదు. ఒకవేళ ఒంటరితనం ఆశిస్తే ఏ కారణాల వలన?

3. ఆ సమయంలో ఎవరూ బావి దగ్గర ఉండరని తెలిసా? ఏం ఎందువల్ల?

4. తన పాపపు జీవితం కొనసాగించడానికి అదే మంచి సమయమనా? ఏమో! మనకి తెలియదు.

5. *లేక తనజీవితాన్ని ఎరిగియున్న ఊరిజనం తనని సూటిపోటి మాటలతో భాదిస్తున్నందువలన వారిని తప్పించుకోడానికి ఆ సమయంలో వచ్చిందా?* మనకి తెలియదు.

*పూర్వకాలంలో ఒక విషయం ఊరంతా తెలియాలంటే నీలాటిరేవు(బావి)దగ్గర చెబితే కొంతసేపటకి ఊరంతా ప్రాకిపోతుంది, ఉన్నదానికి ఇంకొంచెం కలిపి చెప్పేవారు!! ఈమె గూర్చి కూడా అలా చెప్పుకోన్నారేమో!!*

6. లేక ప్రజలకి తన జీవితం ఎలాంటిదో తెలియక పోయినా తన అంతరాత్మ గద్దింపుతో ప్రజలకి తన ముఖం చూపించలేక మధ్యాహ్నం వచ్చిందేమో!!

👉 ఒకవేళ ప్రియ చదువరీ! నీవుకూడా అదే పరిస్తితిలో నున్నావా? చింతపడకు!

*ఇలాంటి స్తితిలో నున్న ఒక స్త్రీని రక్షించడానికి యేసయ్య అలసిపోయినా సరే ఆ బావి దగ్గర ఆగి ఆస్త్రీతో మాట్లాడారు.*

ఈలోకంలో ఎవరికీ మనజీవిత రహష్యాలు తెలియకపోయినా నిన్ను నన్ను పుట్టించిన ఆ సృష్టికర్తకు తెలుసు.

*ఆ సమరయ స్త్రీ ఆ సమయంలో అక్కడకు వస్తుందని తెలిసే యేసయ్య అక్కడికి వెళ్లి రక్షణను అందించారు.*

*నాయీను గ్రామంలో* విధవరాలి ఏకైక కుమారుడు చనిపోయాడని ఎరిగి ఒక రాత్రంతా నడచి (కపెర్నహూము నుండి నాయీను కి సుమారు 32 కి.మీ.) ఉదయాన్నే ఆ గ్రామం చేరుకొని ఆ విధవరాలి కుమారున్ని బ్రతికించి ఇచ్చారు.

*యేసయ్యని చూడాలని ఎప్పటినుంచో ఆశిస్తున్న పొట్టి జక్కయ్య* కోసం ఆ ఊరు వచ్చి మేడిచెట్టు ఎక్కి కూర్చొన్న జక్కయ్యను పేరుపెట్టి మరీ పిలచి అంటున్నారు – జక్కయా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట బసచేయవలసి ఉంది.

👉 *మనం చేసే ప్రతీ ఆక్రందన ప్రతీ ప్రార్ధన ఆయనకు వినబడుతుంది.*

👉 *నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను.*

*నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య,జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య, నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.*

👉 అయితే గమనించ వలసినది ఏమిటంటే

*“దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.”*

👉 దురదృష్టవశాత్తూ మనం అడిగిన వెంటనే పని జరిగిపోవాలి అని ఆశిస్తాము. కాని దేవుడు తన సమయంలో కార్యం చేస్తారు. మన ప్రణాళిక ప్రకారం పని జరిగితే ఆ సమస్య అప్పటికి తీరినా మరల వస్తుంది.

*అయితే దేవుని ప్రణాళిక ప్రకారం జరిగితే అది శాశ్వత పరిష్కారం.*

👉కాబట్టి బెదరిపోకు!
👉 అలసిపోకు!
👉 సోలసిపోకు!
*దేవుడు నిన్ను త్వరలో దర్శించబోతున్నారు.*

*సమరయ స్త్రీని రక్షించడానికి మధ్యాహ్నం వేల కలసిన దేవుడు నిన్ను కూడా దర్శించబోతున్నారు.*

*సమరయ స్త్రీ ఒకతె నీల్లుచేదుకొనుటకు అక్కడికి రాగా యేసు- నాకు దాహమునకిమ్మని ఆమె నడిగెను.*
యోహాను 4:7
👉ఇక్కడ మనకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కనబడతాయి.

1⃣ *యేసుప్రభులవారు దైవమానవుడు*.
ఆయన సశరీరుడుగాఈలోకంలో జన్మించినందువలన *రెండుసార్లు ఆయన దప్పిగొనినట్లు బైబిల్ గ్రంధంలో చూస్తాం.*

ఒకసారి యాకోబు బావి దగ్గర, రెండవసారి సిలువలో వ్రేలాడుచున్నప్పుడు లేఖనం నేరవేర్పుకై. ఆయన నీలా నాలా దప్పిగొన్నారు.

*మనం నిజంగా పరిశీలిస్తే ఆయన నిజమైన దాహం ఆకలి ఏమిటి?*

👉 ఇదే అధ్యాయంలో వ్రాయబడింది
*నశించిపోయే ఆత్మలను వెదకి రక్షించడమే ఆయన దాహం, ఆకలి!!!*

👉క్రీస్తులో రక్షించబడి వెలిగించబడిన ప్రియ చదువరీ!
*నీకు ఆ దాహముందా??! లేకపోతె ఇప్పుడే పొందుకో!*

2⃣ *సమరయ స్త్రీ యొక్క ఇతరులను గౌరవించే/ మర్యాద నిచ్చే లక్షణం*:
క్రింది వచనాలు చూసుకొంటే ఎప్పుడైతే యేసయ్య దాహమునకిమ్మని ఆమెనడిగారో, వెంటనే ఆమె అశ్చ్యర్యపోయింది.

మొదటి బాగంలో చెప్పిన విధముగా అనేక వందలాది సంవత్సరాలునుండి యూదులకు, సమరయులకు వైరం, శత్రుత్వం.
*అయితే ఇక్కడ శత్రువు మొట్టమొదటగా కనబడి ఏమైనా సహాయం అడిగితే- శత్రువు మీద ప్రతీకారం చేయకుండా, సూటిపోటి మాటలాడకుండా ఎంతో నమ్రతతో అడుగుతుంది*

యేసయ్యను- యూదుడవైన నీవు సమరయ స్త్రీ నైన నన్ను దాహనమునకిమ్మని ఎలాగు అడుగుచున్నావు?

ఎందుకంటే మనం యూదులు తాము గొప్పవారమని- సమరయులు పాపులని, అంటరానివారని పరిగనిస్తున్నట్లుగా చదువుకొన్నాం కదా! అందుకే ఆమె అలా అడిగింది.

మరో ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే ఈ సంభాషణ అంతటిలో
*ఆమె యేసయ్యని – అయ్యా! అని సంభోదిస్తుంది.*

యేసయ్య జాతిప్రకారం ఆమెకు శత్రువైనా ఎంతో గౌరవం ఇస్తుంది.

*ప్రియ చదువరీ! నీలో నాలో అటువంటి మంచి లక్షణం ఉందా?*

👉 ఇక్కడ ఈ సమరయ స్త్రీ యేసయ్య కి నీరు/దాహమునకివ్వడానికి సిద్దపడింది.

👉అయితే ఇక్కడ మరో చిక్కు.
*సమరయుల నీటిని ఆహారాన్ని యూదులు సేవించరు!*
సరికదా వారి వస్తువులను కూడా తాకరు. అందుకే మరోసారి అడుగుతుంది

🔺 అయ్యా! మీరు మా వస్తువులు ముట్టుకోరు కదా! మీకు నీరు చేదుకోడానికి చేద/బొక్కెన లేదు కదా! మరి నాకు ఎలా జీవజలం ఇస్తారు అని!

🔺 ఇక్కడ ఆమెకు యేసయ్య జవాబిచ్చారు
*తన నిజమైన దాహం ప్రజలకు నిత్యజీవం ఇవ్వడం, నిత్యరక్షణ, నిత్యరాజ్యం ఇవ్వడమే తన దాహం అని చెప్పారు!*

3⃣ *సమరయ స్త్రీకున్న లేఖనాల మీద అవగాహన- చరిత్రమీద అవగాహన*:

ఈ 4వ అధ్యాయం పూర్తిగా చదివితే ఈ సమరయస్త్రీ కి లేఖనాలమీద ఎటువంటి పట్టు ఉందొ తెలుస్తుంది.

1).12వ వచనం ప్రకారం ఆబావి తానును తనకుమాల్లును ఈ బావి నీళ్ళు త్రాగి, మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటే నీవు గొప్పవాడివా? అని అడిగింది.
ఇక్కడ అది యాకోబు బావి అని మొత్తమందరికీ తెలుసు.

👉అయితే ఆమె యేసయ్యతో ఏమంటుంది?
*మనతండ్రియైన యాకోబు. అంటే యూదులకు సమరయులకు అందరికీ తండ్రి యాకోబు.*

🔺 పరోక్షంగా చెబుతుంది నీవు నేను అందరం ఒకే తండ్రి బిడ్డలం. ఒకే దేవుని బిడ్డలం. అయితే మీరు మమ్మల్ని అంటరానివారుగా చూస్తున్నారు.

👉 ప్రియ చదువరీ! *ఇదేమాట సమరయస్త్రీ నిన్ను నన్ను అడుగుతుంది నీలో నాలో కూడా ఇంకా అంటరానితనం అనే దుర్ఘుణంఉందా?*

🔺ఈలోకంలో ఎవరూ అంటరానివారు లేరు!
🔺అందరినీ దేవుడు ఒకేలాగా ప్రేమిస్తున్నారు.
*చెడ్డవారిని చూసి వ్యసనపడకుము* అని లేఖనం సెలవిస్తుంది కీర్తనలు 37:1 లో.

2) 20వ వచనం ప్రకారం
*తనకు చరిత్ర తెలుసు.* ఇంతకముందు చెప్పినట్లుగా సమరయులు *మొదట గెరీజీము కొండపై* ఒక మందిరాన్ని కట్టుకొంటే ఒక యూదు రాజు దానిని పడగొట్టేశాడు.

అప్పుడు సమరయులు షెకెము కొండమీద మందిరం కట్టుకొని ఆరాధిస్తున్నారు, అదే విషయం ఆమె చెబుతుంది. యేసయ్య అన్నారు.
*కొండమీద కాదు , ఆయనని ఆరాదించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించాలి అని.*
3) 25వ వచనం ప్రకారం
*క్రీస్తు అనబడే మెస్సీయ వచ్చునని నాకు తెలుసు.* ఆయన వచ్చినప్పుడు సమస్తమును మాకు తెలియజేయును.

ఈవచనం ప్రకారం మనకు క్షుణ్ణంగా అర్ధమయ్యేదేమిటంటే
👉 *తన జీవితం ఎలాంటిదైనా గాని ఆమెకు దైవభక్తి, లేఖనాలు చదివే అలవాటుంది.*

👉మెస్సీయా వస్తాడనే నిరీక్షణ ఉంది. అందుకే మొట్టమొదటగా
*బైబిల్ లో ఆమెతోనే చెప్పారు యేసయ్య – ఆ మెస్సీయను నేనే అని!!!*

ఇంతవరకు సమరయస్త్రీ ఒక వ్యభిచారని, కేరెక్టర్ లేని వ్యక్తి అని విని ఉండొచ్చు!

*ప్రియ చదువరీ! ఆమెలో ఉన్న మంచి లక్షణాలను చూడు. ఆ మంచి లక్షణాలు నీకున్నాయా?*

🔹 శత్రువుని ప్రేమించే లక్షణం,
🔹 గౌరవం ఇచ్చే లక్షణం,
🔹 ప్రతీకారం చేయకుండా క్షమించే లక్షణం,
🔹లేఖనాలు చదివే లక్షణం నీకున్నాయా?
*పరీక్షించుకో! లేకపోతె ఇప్పుడే అలవరుచుకో!!!!*

*హల్లెలూయ...*


♻️ *సమరయస్త్రీ-గొంగళిపురుగు...✍️*
       
        మనం కొన్నిరోజులనుండి సమరయస్త్రీ గురించి ధ్యానం చేస్తున్నాం.

*“దుష్టులు మరణము  నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా ? వారు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటయే నాకు సంతోషము: ఇదే ప్రభువగు యెహోవా వాక్కు”* యెహెజ్కేలు 18:23


👉 చలా తరచుగా కొందరు ఇలా అంటారు

*“నాకు దేవుడు బాగా అర్ధం అయ్యారు కానీ,ఈ దేవుని వాక్యమే అర్ధం కావటం లేదు”* అని....
👉 మరికొందరు
*“నాకు దేవుని వాక్యం చాలా బాగా అర్ధం అవుతుంది కానీ; ఆ దేవుడే సరిగ్గా అర్ధం కారు”*
 అని.
ఈ వైఖరి ముమ్మాటికి తప్పు. ఎందుకంటే....
👉దవుడు, దేవుని వాక్యం ఎప్పుడూ సమాంతరంగానే ఉంటాయి.

మనం పూర్తిగా దేవునిని తెలుసుకోవటానికి ప్రస్తుతం మన దగ్గర ఉన్న ప్రధానమైన ఆధారం *“ఈ దేవుని వాక్యం”.*

*దేవుని గుణలక్షణాలను గురించి తెలుసుకోవాలా..?*
📔దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని ప్రేమ యొక్క పరిధి ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
 *దేవుని కోపం యొక్క తీవ్రత ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
 *దేవుని కృప యొక్క వైశాల్యం ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని శక్తీ యొక్క సామర్ధ్యం ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని నమ్మకత్వం యొక్క దృఢత్వం ఎంతో తెలుసుకోవాలా..?*
 📔దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని జ్ఞానం యొక్క లోతు ఎంతో తెలుసుకోవాలా....?*
📔 దవుని వాక్యం చెబుతుంది.
*దేవుని పరిశుద్ధత యొక్క ఉన్నతి ఎంతో తెలుసుకోవాలా....?*
 📔 దవుని వాక్యం చెబుతుంది.

👉దవుని గురించి మీరు ఏం తెలుసుకోవాలన్న సరే; సరిగ్గా, సులువుగా, అద్భుతంగా, ఉన్నది ఉన్నట్లుగా
ఈ *“బైబిల్“* ఈ పరిశుద్ధగ్రంధం తప్ప ఇంక ఏదియు చెప్పనేలేదు.

*మోషే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకున్నపుడు*
👉 ఆ దేవాధి దేవుడిని చూడాలి అని మనవిచేసి కోరినప్పుడు,
👉ఆ దేవుడు మోషేకి తననుతాను బయలుపరచుకున్నారు..
 *దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యేక్తిగా మోషే మారిన సందర్బం అది....*
 అది ఒక అద్భుతం.
👉 దవుడు తన ముఖాన్ని మోషేకి చూపించలేదు కానీ....
🔺 తన మంచితన్నాన్ని మోషేకి చూపించారు.
🔺తన మహిమను మోషేకి చూపించారు.
🔺తన నామమునకు ఉన్న విశిష్టతను మోషేకు ప్రకటించారు.
*పూర్తిగా తన గుణలక్షణాలను మోషేకు వివరించారు.*
 నిర్గామ 33:18-23

*మోషే దేవుని గుణలక్షణాలలోనుండి దేవుని పూర్తిగా తెలుసుకోగలిగారు అందుకే దేవుని ముఖం చూడకుండానే దేవునిని ముఖాముఖిగా తెలుసున్న వ్యక్తిగా మోషే మారాడు.* ద్వితియో 34:12

👉దవుని గుణలక్షణాలు అనేవి దేవునిని మనం తెలుసుకోటానికి ఉపయోగపడతాయి.
ఇప్పుడు ఇది ఈ *"బైబిల్ "* ద్వారా మాత్రమే... సాధ్యం.

అలాటి దేవుని గుణలక్షణాలలో
ఒ క లక్షణం
*“దుష్టులు తమ దుష్టత్వంలోనే మరణించటం, పాపి తన పాపంలోనే మరణించటం ఆ దేవాధి దేవునికి ఇష్టంలేదు”*

👉 దవుడు పాపాన్ని ద్వేషిస్తారు కానీ పాపిని కాదు....
👉 దవుడు పాపాన్ని చంపుతారు కానీ, మారిన పాపిని కాదు....
🔹సర్వసమాజంలో పాపంపట్ల భయం కలుగునిమిత్తం,
🔹 మరణభయం వల్ల ప్రజలు పాపం నుండి దూరంగా వెళ్ళటం కోసం పాత నిబంధనలో దేవుడు కొన్ని మరణాలను అనుమతించారు.
👉 కనీ *అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు దేవుని ఉద్దేశం పాపి మారాలని మరుమనస్సు పొందాలని అంతేకాని ఒక పాపి ఆ పాపంలోనే మరణించాలని కాదు.*

 యేసుప్రభులవారు  పాపియైన సమరయస్త్రీని రక్షించిన విధానం మనం ధ్యానిస్తున్నాం.
యోహాను 4: 7-9

👉 *నశించినదాని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు ఈలోకానికి వచ్చెను.*

*నశించిపోయే స్థితిలో ఉన్న సమరయ స్త్రీ ని రక్షించిన యేసయ్య, నాయీను విధవరాలి కుమారుని బ్రతికించిన యేసయ్య,జక్కయ్యను పలకరించి రక్షించిన యేసయ్య, నిన్నుకూడా సరియైన సమయంలో దర్శించబోతున్నారు.*

👉   అయితే గమనించ వలసినది ఏమిటంటే

*“దేవుని పని, దేవుని సమయంలో, దేవుని ప్రణాళిక ప్రకారం జరుగుతుంది.”*



*సమరయస్త్రీని బైబిల్ పండితులు గొంగళిపురుగుతో పోలుస్తారు. గొంగళిపురుగులాగానే మార్చబడిన జీవితం సమరయస్త్రీది.*

👉 *మొదటగా మనం గొంగళిపురుగు పురుగుకోసం చూద్దాం!*

👉ఇది ఎవరికీ ఇష్టం లేని ఒక అసహ్యమైన పురుగు. ఒంటినిండా ముళ్ళు, ముట్టుకొంటే చాలు గుచ్చుకోపోతాయి. చూస్తేనేచాలు చంపాలి అనిపిస్తుంది. పిల్లలు దానిని చూస్తే జడుసుకొంటారు. చివరకి పక్షులుకూడా వాటిని తినడానికి ఇష్టపడవు.

 అవి పుట్టిన తర్వాత పచ్చని ఆకులు తిని, త్వరత్వరగా ఎదుగుతాయి. అలుపులేకుండా ఆహారం కోసం తిరిగి పచ్చదనాన్ని ఖాళీచేస్తాయి. కొంచెం ఎదిగిన తర్వాత తనలాంటి పురుగులతో కలసి చెట్టు కాండానికి పట్టి, మొదటగా చెట్టుబెరడును, తర్వాత మొక్కలో ఉన్న జీవాన్ని పీల్చివేస్తాయి. ఈరకంగా మొక్కలను పాడుచేసే ఒకరకమైన చీడపురుగు!
 ఇంతవరకూ వీటిని చంపడానికి మందు కనిపెట్టలేదు!   

అయితే గొంగళిపురుగు పెద్దదైన తర్వాత దానికి ఒకరకమైన భయంకరమైన నిద్రముంచుకొస్తుంది. దానికోసం అనువైన ప్రాంతంకోసం ఎత్తైన,ఎవరూ తన నిద్రను భంగం కలిగించని ప్రాంతాన్ని ఎన్నుకొని, అక్కడ తన నోటినుండి లాలాజలంతో తనచుట్టూ ఒక గూడు కట్టుకొంటుంది. ఒకసారి గూడులోనికి వెళ్ళిన తర్వాత ఆహారం, లోకాన్ని మరచిపోయి సుదీర్ఘమైన నిద్రపోతుంది.
*ఆ నిద్రలో తనకి రూపాంతరం జరుగుతుంది.*

 *నవజీవనం కలుగుతుంది. గొంగళిపురుగుగా చనిపోయి అందమైన సీతాకోకచిలుకగా బయటికి వస్తుంది.*

 *నేలమీద, చెట్లుమీద ప్రాకే పురుగు ఇప్పుడు ఆకాశంలో రెక్కలతో ఎగురుతుంది.*

 *ఒకరోజు అందరూ తనని చూసి అసహ్యించుకొన్న గొంగళిపురుగు, మరల మరల చూడాలనిపించేటట్లుగా మారిపోతుంది.*

 *పిల్లలు చూసి జడుసుకొనే పురుగు, పిల్లలు తన వెంటపడే విధంగా మారిపోయింది.అయితే అది అలా మారడానికి చాలాశ్రమ పడింది.*

 👉 *ఇక సమరయస్త్రీ జీవితంలో కూడా ఇదే జరిగింది.*
 
▫️ఒకరోజు ప్రజలతో వ్యభిచారిగా,
▫️కరెక్టర్ లేని స్త్రీగా,
▫️ బజారుమనిషిగా,
▫️ అంటరానిదానిగా,
▫️ వలివేయబడిన దానిగా ఎంచబడ్డ సమరయస్త్రీ-

 *బావిదగ్గర యేసయ్య దగ్గర రక్షణ పొందింది. తనపాపపు కుండను అక్కడే వదలివేసింది. భయంకరమైన వ్యభిచారం, అబద్దాలు, ఎందరినో తన కంటిచూపుతో ఆకర్షించిన తన మొహపుచూపు అన్నీ వదలివేసింది.*

👉 గంగళిపురుగుకుండే ముళ్ళు పోయి రెక్కలు వచ్చి ఎగరడం ఎలా ప్రారంభించిదో, అలానే *పాపపు జీవితాన్ని విడచిన సమరయస్త్రీ- సాక్ష్యార్ధమైన బ్రతుకు కలిగింది.*

 👉అందరూ చీదరించుకొన్న సమరయస్త్రీని ఇప్పుడు అందరూ కావాలని కోరుకోనేలా మారిపోయింది. *గ్రామానికి ఒక Role Model గా,ఒక వెన్నెముకుగా మారిపోయింది.*

*ఎప్పుడూ?*

*యేసయ్యని ఆహ్వానిచినప్పుడు!*

*పాపాన్ని విడచిపెట్టినప్పుడు!*

*తన పాపపుజీవితాన్ని సిగ్గువిడచి అందరికీ చెప్పినప్పుడు!*

  👉  సమరయస్త్రీని మార్చిన దేవుడు నిన్నుకూడా మార్చగలరు.
నీ జీవితంలో కూడా గొప్ప అధ్బుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు.

*అయితే ఆయనకీ నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి!*

  *గొంగళిపురుగులా ఆ గూడులో సమాధి అయిపోవాలి.*

 *నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని, దానిని భాప్తిస్మం ద్వారా సమాదిచేయాలి!*

 *అప్పుడు క్రీస్తులోనికి భాప్తిస్మం పొందిన నీవు క్రీస్తుతో కూడా బ్రతికింపబడతావు!*
*పునరుత్థానం పొందుతావు.*
(రోమా 6:3-9)

👉అప్పుడు నీజీవితం సీతాకోకచిలుకలా మారిపోతుంది.
▫️నభాష,
▫️న ప్రవర్తన,
▫️న అలవాట్లు అన్నీ మారిపోతాయి.

*ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయంత్నిచిన సమరయస్త్రీ రక్షించబడి,*

 *ఎలా ప్రజలకి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టిందో,*

👉 అలాగే నీ జీవితంలో కూడా పాపం, అబద్దాలు, త్రాగుడు, చెడు అలవాట్లు అన్నీ పోయి గొంగళిపురుగు- సీతాకోకచిలుకలా పరివర్తన చెందినట్లు,
*పాపివైన నీవు కూడా నూతనసృష్టిగా మారిపోతావు!*

👉   *ఆమార్పు నీకు కావాలా?*

👉 *అయితే నేడే యేసునొద్దకు రా!*
 
*నీ జీవితాన్ని ప్రభుకివ్వు!*

 *ఆయన చేతులకు సంపూర్ణంగా సమర్పించుకో!*
 *దేవుడు నీ జీవితంలో అధ్బుతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు!*

👉ఈ సమరయస్త్రీ జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారని ఆశిస్తున్నాను.
సమరయస్త్రీ పొందుకొన్న భాగ్యం మనందరికీ మెండుగా కలుగును గాక!

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖


 

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures