"యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిధ్యానియులను అప్పగించతగదు, ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగచేసి కొనెననుకొని, నా మెడ అతిశయించుదురేమో" (న్యాయాధిపతులు 7:2).
ఇది సామాన్య కథ. కాని ఇది చాలా ప్రాముఖ్యమైన కథ. స్వధర్మత ఉండే దినాలలో యవనుడైన గిద్యోను జీవించాడు. అది మన దృష్టిని మరల్చాలి ఎందుకంటే ప్రస్తుతము గొప్ప అంత్యకాల స్వధర్మత దినాలలో ఉన్నాము.
I. మొదటిది, స్వధర్మత.
ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టిలో చెడుతనము జరిగించారు. మిధ్యానీయులకు బానిసలుగా చేయడం ద్వారా దేవుడు వారిని శిక్షించాడు. వారు ఇశ్రాయేలీయులకు శత్రువులు. ఈ అనాగరిక మిధ్యానీయుల నుండి ఇశ్రాయేలు ప్రజలు పారిపోయారు. దేవుని లేని మిధ్యానీయుల నుండి వారు తప్పించుకొని గూహాలలో దాచుకున్నారు. మిధ్యానీయులు బలవంతులుగా ఉండి ఇశ్రాయేలీయుల పంటలను నాశనము చేసారు. వారి గొర్రెలను ఎడ్లను గాడిదలను వారు దొంగిలించారు. ఇశ్రాయేలు అణగగొట్టబడి నిరీక్షణ లేని దయినది. అప్పుడు వారు ప్రభువుకు మొరపెట్టారు.
అప్పుడు దేవుడు గిద్యోను దగ్గరకు వచ్చాడు. అతడు మిధ్యానీయుల నుండి దాగుకొనుచున్నప్పుడు దేవుడు అతని దగ్గరకు వచ్చాడు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, "పరాక్రమము గల బలాడ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడు" (న్యాయాధిపతులు 6:12).
నేను శాన్ ప్రాన్సిస్కోలోని స్వతంత్ర బైబిలును తిరస్కరించే సెమినరీలో ఉన్నప్పుడు, పరాక్రమము గల బలాడ్యుడుడను కాదు. నేను శాత్వికమైన సామాన్య బాప్టిస్టు బాల బోధకుడను. కాని అక్కడ నేను చూచినా దానిని బట్టి నేను ఆధునిక సువర్తీకరణను బట్టి చాలా కోపము తెచ్చుకున్నాను. వారు దేవుని బైబిలును నమ్మరు. వారు మిధ్యానీయులచే క్రమపరచబడుచున్నారు – వారు దేవుని బట్టలో చుట్టాలనుకుంటారు – వారు దేవుని వారి తలంపులను జీవితాలను అదుపులో ఉంచ ఇష్టపడరు.
డాక్టర్ డేవిడ్ ఎఫ్. వేల్స్ ఒక సుప్రసిద్ధ పుస్తకము వ్రాసాడు మన దినములలో సువర్తీకరణలోని అవినీతిపై అతడు వ్రాసాడు. దానిపేరు, సత్యమునకు స్థలము లేదు: లేక సువర్తీక వేదాంతమునకు ఏమి జరిగింది? (ఎర్డ్ మాన్స్, 1993). డాక్టర్ వేల్స్ కోపిష్టి. అతడంటాడు, "సువార్తిక ప్రపంచము దాని విప్లవతను కోల్పోయింది" (పేజీ 295). సువార్తిక సంఘాలు యవనస్తులను విప్లవ క్రైస్తవులుగా ఉంచడానికి ప్రేరేపించరు. వారు మృదువుగా, బలహీనంగా, స్వార్ధ పూరితంగా ఉంటారు – వారిని గూర్చి ప్రజలు ఏమనుకుంటారో అని భయపడతారు. సువార్తిక వ్యవస్థ ఈనాటి సంఘాలలో సంస్కరణలు వస్తే వాటిని వ్యతిరేకిస్తాయి. డాక్టర్ వేల్స్ అన్నాడు, "సువార్తిక ప్రపంచములో నిర్ధారణ శక్తివంతమైన అస్త్రము, అది త్వరగా నిర్వీర్యమైపోతుంది" (పేజీ 295).
నేను హాజరైన సెమినరీలో వారి అపనమ్మకముతో నేను కలవాలని చాలా విశ్వ ప్రయత్నము చేసారు. నేను బైబిలును సమర్ధిస్తే నేను దక్షిణ బాప్టిస్టు సంఘమును పొందుకోలేనని. వారు నాతో చెప్పారు, "అంత కష్టమైతే, అది నాకు వద్దు అని వారితో చెప్పాను."
అలా నిర్ణయించుకున్నందుకు నేను అంతా పోగొట్టుకున్నాను. నేను ఏది పోగొట్టుకోవాలి? నేను అప్పటికే అంతా పోగొట్టుకున్నాను. నాకు కావలసినది దక్షిణ బాప్టిస్టుల వద్ద లేదు. తెగను నేను అసహ్యించుకున్నాను. సెమినరీని అసహ్యించుకున్నాను. నన్ను బలపరచనందుకు నా సంఘాన్ని అసహ్యించుకొన్నాను. నా జీవితాన్ని అసహ్యించుకున్నాను. యేసును బైబిలును తప్ప సమస్తాన్ని అసహ్యించుకున్నాను. రాత్రి ఒంటరిగా నడిచాను. నడుస్తూ ఉండేవాడిని లేకపోతే నా మనసు కోల్పోతాననిపించింది.
నా గదిలో ఒక రాత్రి నిద్రపోతున్నాను. దేవుడే నన్ను లేపాడు. గది అంతా నిశ్శబ్దంగా ఉంది. చప్పుడు లేదు. నడుచుకుంటూ వెళ్లాను. సెమినరీ దగ్గర కొండపై నిలబడినప్పుడు శాన్ ప్రాన్సిస్కోలో వెలుగులు నీటిపై కనబడ్డాయి. గాలి నా జుట్టు ద్వారా బట్టల ద్వారా ప్రసరిస్తుంది. బాగా చలివేసింది. గాలిలో దేవుడు నాతో చెప్పాడు, "ఈ రాత్రి నీవు మరిచిపోలేవు. నన్ను సంతోష పరచడానికే నీవు బోధిస్తావు. భయపడకుండా ఉండడం నేర్చుకుంటావు. నా కొరకు మాత్రమే మాట్లాడతావు. నేను నీతో ఉంటాను."
నాకు ఇప్పుడు తెలుసు బోధించడమే నా పిలిపు అని. దానికి ముందు నేను కార్యకర్తగా ఉండేవాడిని. ఇప్పుడు నేను దేవుడు పిలిచిన బోధకుడను. ప్రతి భయపడని బోధకుడు ఇలాంటి క్లిష్ట పరిస్థితి ద్వారా వెళ్ళాలి అతడు సత్యము మాట్లాడడం విషయంలో దేవుడు నమ్మేటట్టుగా. భావోద్రేకము లేదు. కేవలం ఇదే, "మీరు చెప్పకపోతే ఎవరు చెప్పలేరు, అది తప్పకుండా చెప్పాలి – ఇతరులు చెప్పడానికి బయపడుతున్నారు, కాబట్టి మీరు చెప్పకపోతే, ఎవరు చెప్పలేరు, వారు సరిగా చెప్పలేరు." అవి నా పనసుపై చెరగని ముద్ర వేసాయి. డాక్టర్ డబ్ల్యూ. ఏ. టోజర్, ఒక వ్యాసము "ప్రవచానాత్మక గ్రహింపు యొక్క వరములో," ఇలా అన్నాడు: "అతడు దేవుని నామములో తిరస్కరిస్తాడు, వ్యతిరేకిస్తాడు అతడు ద్వేషము క్రైస్తవ్యత నుండి వ్యతిరేకత సంపాదించుకుంటాడు... కాని ఊపిరి పీల్చుకునే దేనికి అతడు భయపడడు." బహుశా అందుకే డాక్టర్ బాబ్ జోన్స్ III అన్నాడు "నేను ఆత్మ విషయంలో పాత నిబంధన ప్రవక్త వలే ఉన్నాను." పూర్తి వివరణ కొరకు, నా స్వీయ చరిత్ర, "భయములన్నిటికీ వ్యతిరేకంగా" చదవండి.
దేవునితో ఆ అర్ధరాత్రి అనుభవము గిద్యోను లాంటి వ్యక్తిని అర్ధం చేసుకునేలా చేసింది. దేవుడు అతనితో అన్నాడు, "పరాక్రమము గల బలాడ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడు." నేను గిద్యోనును కానప్పటికిని, నేను ఇప్పుడు అతని అర్ధం చేసుకుంటున్నాను. గిద్యోను అన్నాడు, "యెహోవా మమ్మును విడిచి పెట్టి, మిధ్యానీయుల చేతికి మమ్మును అప్పగించెను" (న్యాయాధిపతులు 6:13).
గిద్యోను అర్హత లేనివానిగా భావించి ఇది చెయ్యలేకపోయాడు. మోషే వలే, గిద్యోను కూడ సాకులు చెప్పాడు. నా స్నేహితులారా, మనము, అంత్యకాలపు స్వధర్మత దినాలలో ఉన్నాము. మనము అయోగ్యులుగా భావించి నూతన సువార్తిక మిధ్యానీయుల అబద్ధపు మతమునకు వ్యతిరేకంగా పోరాడలేకపోతున్నాము. స్వధర్మత చాలా లోతుగా ఉంది. సువార్తిక మిధ్యానీయుల శక్తి చాలా గొప్పగా ఉంది. దేవుని బైబిలును బైబిలు యొక్క దేవుని ఈ స్వధర్మత స్థితి నుండి రక్షించడానికి మనమేమి చెయ్యలేము.
II. రెండవది, బైబిలు యొక్క దేవుడు ఇంకా సజీవుడై యున్నాడు!
దేవుడన్నాడు, "యెహోవానైన నేను, మార్పులేని వాడను"! (మలాకి 3:6). అప్పుడు దేవుని ఆత్మ గిద్యోనుపై దిగి వచ్చింది. మిధ్యానీయులపై యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు గుంపులను పోగుచేయడానికి అతడు దూతలను పంపించాడు.
"అప్పుడు యేరుబ్బయలు, అనగా గిద్యోనును, అతనితోనున్న జనులందరును, వేకువను లేచి, హీరోదు బావి వద్ద దిగగా: లోయలోని మోరే కొండకు ఉత్తరముగా, మిధ్యానీయుల దండుపాలేము, వారికి కనబడెను. యెహోవా, నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిధ్యానీయులను అప్పగించతగదు, ఇశ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగచేసి కొనెననుకొని, నా మీద అతిశయించుదరేమో. కాబట్టి, నీవు ఎవరు భయపడి వణుకుచున్నడో, వాడు త్వరపడి, గిలాదు కొండవిడిచి తిరిగి వెళ్లవలేనని, జనులు వినునట్టుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. అప్పుడు జనులలో నుండి ఇరువది రెండు వేలమంది తిరిగి వెళ్ళిపోయిరి; మరియు ఇంకా అక్కడ పదివేల మంది మిగిలారు" (న్యాయాధిపతులు 7:1-3).
దేవుడు గిద్యోనుతో అన్నాడు, "నీతో నున్న జనులు ఎక్కువ మంది." వెళ్లి చెప్పు, "ఎవడు భయపడి వణుకుచున్నాడో, వాడు తిరిగి వెళ్ళవలెను" (న్యాయాధిపతులు 7:3).
ఇరవై రెండు వేలమంది తిరిగి వెళ్ళిపోయారు. పదివేలమంది గిద్యోనుతో ఉన్నారు. అదే మనకు జరిగింది. మనము లీ కొంటే జూనియర్ పాఠశాలలో కలుసుకునేటప్పుడు మన సంఖ్య 1,100 మంది వరకు వెళ్ళింది. కాని వారిలో చాలామంది యేసు నిమిత్తము వారి జీవితాలు త్యాగము చేయడానికి భయపడ్డారు. ఇతరులు "వినోదము" కొరకు సంయోగము కొరకు – మత్తు పదార్ధాల కొరకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారు యేసుచే విట్టువాని ఉపమానములో వివరింపబడ్డారు. ఆ ఉపమానము లూకా 8:10-15 లో వివరింపబడింది. మొదటి రకము వారు దేవుని వాక్యము వింటారు, సాతాను వచ్చి వారి హృదయములలో నుండి వాక్యమును ఎత్తుకొనిపోతుంది "నమ్మి రక్షింపబడకుండునట్లు" (లూకా 8:12). ప్రతివారము అది చూస్తాము. వారు వచ్చి ప్రసంగము వినకుండా ఐపాడ్ చూస్తారు. లేకపోతే కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తారు. దేవుని వాక్యము వారికి ఏమంచి చేయదు, ఎందుకంటే వారి హృదయాలలో నుండి దేవుని వాక్యమును సాతాను ఎత్తుకోనిపోడానికి అనుమతిస్తారు.
రెండవ రకము వారు సంతోషముగా దేవుని వాక్యము వింటారు. కాని క్రీస్తులో వారికి వేరులేదు. కనుక కొంతమట్టుకు నమ్మడానికి ప్రయత్నిస్తారు. కాని శోధన కాలమున పడిపోతారు.
మూడవ రకము వారు వాక్యమును విని వారి దారిలో వెళ్ళిపోతారు. తరువాత వారు విచారముల చేతను ధన భోగముల చేత అణచివేయబడి, "పరిపక్వముగా ఫలించరు." డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ అన్నాడు ఈ మూడు రకాల వారు ఎన్నడు మార్పు నొందని వారు. గతంలో మన సంఘాన్ని విడిచి పెట్టిన వారు ఈ రకాల వారిని చూపిస్తారు. వారు ఎవ్వరు మార్పు చెందలేదని వారి జీవితాలు చూపిస్తున్నాయి. వారు కేవలము మన గుడిలో ఉంటే సహవాసము కొరకు వినోదము కొరకు వచ్చారు. కాని వారు పరీక్షింపబడినప్పుడు వారు పశ్చాత్తాప పడి వారు తిరిగి జన్మించలేదు కాబట్టి వారు విడిచి వెళ్ళిపోయారు. గిద్యోనుకు సహాయము చేయడానికి వచ్చి చాలా భయపడి దేవుని సైనికులుగా ఉండ ఇష్టపడకున్న ఇరవై రెండు వేలమందిని వీరు పోలియున్నారు! వారు సిలువ సైనికులుగా ఉండలేకపోయారు!
"యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిధ్యానియులను అప్పగించతగదు, ఇశ్రాయేలీయులు నా బాహుబలము, నాకు రక్షణ కలుగచేసి కొనెననుకొని, నా మెడ అతిశయించుదురేమో" (న్యాయాధిపతులు 7:2).
కాని ఇంకా చాలామంది మిగిలారు. దేవుడు గిద్యోనుతో అన్నాడు, "ఈ జనులింకా ఎక్కువమంది, నీళ్ళ యొద్దకు వారిని దిగచేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెను" (న్యాయాధిపతులు 7:4). అక్కడ వేడి ఎక్కువగా ఉంది "లోయలోని, మోరే కొరకు ఉత్తరముగా" (న్యాయాధిపతులు 7:1). ఇశ్రాయేలీయులు చాలా దాహముతో ఉన్నారు. గిద్యోను మనష్యులతో చాలామంది, నీటి యొద్దకు పరుగెత్తి, వంగి నీళ్ళలో చేతులుంచారు. "చేతితో నోటికందించుకొని, గతికిన వారి లెక్క, మూడు వందల మంది" (న్యాయాధిపతులు 7:6). చాలా దాహంగా ఉన్నారు కాబట్టి చాలా మంది నీళ్ళల్లో చేతులు ముంచారు. కాని మూడు వందల మంది మాత్రమే చేతులలోనికి నీరు తీసుకొని తాగగలిగారు. మిధ్యానీయుల కొరకు వెదకడములో, వారి తలలు పైకెత్తి ఉంచాలని వారికి తెలుసు.
"అప్పుడు యెహోవా గతికిన, మూడు వందల మనష్యుల ద్వారా మిమ్మును రక్షించెదను, మిధ్యానీయులను నీ చేతికి అప్పగించెదను: జనులందరూ తమ తమ చోట్లకు వెళ్లవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను" (న్యాయాధిపతులు 7:7).
ఈ రాత్రి గిద్యోను మూడు వందల మందితో మనము సాగుతున్నాము. మిధ్యానీయులు లోయలో ఉన్నారు, "జన సమూహము లెక్కకు మిడతల వలే ఉన్నారు; వారి ఒంటెలు సముద్ర తీరమందలి, ఇసుక రేణువుల వలే ఉన్నారు" (న్యాయాధిపతులు 7:12). ఆ రాత్రి దేవుడు మిధ్యానీయుల గొప్ప సైన్యమును గిద్యోను మూడు వందల మందికి అప్పగించాడు. మిధ్యానీయులు పరుగులెట్టారు. మరియు ఇశ్రాయేలీయులు మిధ్యాను అధిపతులైన, ఓరేబు మరియు జేయేబులను పట్టుకొని, వారి తలలను నరికి గిద్యోను వద్దకు తెచ్చిరి (న్యాయాధిపతులు 7:25 చూడండి). కేవలము మూడు వందల మంది సైనికులతో దేవుడు విజయము అనుగ్రహించాడు!
ఇక్కడ ఈ రాత్రి ఒక పాఠము మనకు ఉంది. ఈనాడు చాలా సంఘాలు అంకెలలో ఆసక్తి ఉన్న వారిచే నడిపించబడుతున్నాయి. వీరు సువార్తిక మిధ్యానీయులు. వందలమంది హాజరు అవాలని వారనుకుంటారు. అయినను వారు శక్తి హీనులు. అలాంటి వారు గిద్యోను అతని చిన్న నమ్మకస్తులైన సైనికులను గూర్చి ఆలోచించాలి.
జోనాతాన్ ఎస్. డికేర్ సన్ ఒక గొప్ప పుస్తకము వ్రాసాడు గొప్ప సువార్తిక తరుగుదల (బేకర్స్ బుక్స్). అతడు గణాంకాలు ఇచ్చాడు. ఈనాడు కేవలము 7% యవనస్తులు సువార్తిక క్రైస్తవులుగా చెప్పుకుంటున్నారు. రానున్న ఇరవై సంవత్సరాలలో నలభై ఐదు శాతము సువార్తిక క్రైస్తవులు చనిపోతారు. దాని అర్ధము యవ్వన సువార్తిక క్రైస్తవులు 7% నుండి "4 శాతంనకు పడిపోతారు – కొత్త శిష్యులు రాకపోతే" (ఐబిఐడి., పేజీ 144).
ఎందుకు సంఘాలలో యవనస్తులు తగ్గిపోతున్నారు? సజీవ క్రైస్తవ్యమును సవాలుగా తీసుకోనందుకు అలా అవుతుందని నేను ఒప్పింపబడ్డాను. మన గురి ఏమిటి? మన గురి ఈ గుడిలో యవనస్తులు క్రీస్తులో ఎతైన మంచి స్థితికి చేరుకోవాలని గిద్యోను సైన్యము వలే ఒక గుంపు యవనస్తులను తయారు చేయాలని మా ఆశ. మన సంఘానికి వచ్చు యవనస్తులు యేసు క్రీస్తు శిష్యులుగా ఉండడానికి సహాయ పడడానికి ఇక్కడ ఉన్నాము. క్రీస్తు సైన్యములో చేరు వారు యవనస్తులు. కొత్తది సవాలుతో కూడినది చేయడానికి యవనస్తులు సిద్ధంగా ఉన్నారు. యేసు అన్నాడు,
"నన్ను వెంబడించగోరువాడు, తన్ను తాను ఉపేక్షించుకొని, తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడించవలెను" (మార్కు 8:34).
యేసును వెంబడించదానికి ఆసక్తి లేనివారు, ఏది ఏమైనా సరే, వారు పెరికి వేయబడాలి. చిన్న పిల్లలులా చూడబడే వారిని "తీసుకోనువారు" అంటారు. "తీసుకొనువారు" తమమును తాము ఉపేక్షించుకొనరు. వారు యేసుకు ఏమియు ఇవ్వడానికి ఇష్టపడరు. జీవితాంతము మేము మిమ్మును చూసుకోవాలని మీరనుకుంటే, ఈ సంఘము మీకు కాదు.
పదహారు సంవత్సరాలప్పుడు నా భార్య లియానా మన గుడికి వచ్చింది. మూడు వారాలలో సంఘానికి మార్గము సిద్ధము చేసుకుంది. మూడు వారాల తరువాత ఎవరు "తీసుకురావలసిన" అవసరము రాలేదు. నేరుగా మన సంఘములో ఆమె పనికత్తె అయింది. 17 ఏళ్లకు ఫోను ఉపయోగించే వ్యక్తిగా అయింది. 19 ఏళ్లకే నన్ను వివాహము చేసుకుంది. మాకు కవల పిల్లలు పుట్టాక మొదటి ఆదివారము గుడికి తెచ్చింది. పుట్టినప్పటి నుండి నా కుమారుడు లెస్ లీ ఆదివారము గుడి తప్పిపోలేదు. తన జీవిత కాలములో అనారోగ్య కారణంగా ఒక్క ఆదివారమే గుడికి రాలేదు. అది చాలా దారుణమని చాలా మంది స్త్రీలు అన్నారు. చిన్న అస్వస్థత ఉంటే వారి పిల్లలను ఇంటిలో వదిలేసేవారు. నా భార్య సరి ఇతరులు చేసినది తప్పు. పిల్లలంతా స్వార్ధ పర జీవితమూ కొరకు గుడి విడిచి వెళ్ళిపోయారు. మా ఇద్దరు అబ్బాయిలు ఇప్పటి వరకు ప్రతి ఆరాధనకు వచ్చారు. నా భార్య క్రీస్తు శిష్యురాలు కనుక వారు ఇక్కడ ఉన్నారు. డాక్టర్ క్రైటన్ ఎల్. చాన్, తన 60 వ పుట్టినరోజు సందర్భముగా మనము గౌరవించబోతున్నాం, అతడు శ్రీమతి హైమర్స్ ను గూర్చి ఇలా అన్నాడు, "ఆమె తొలిసారి మన సంఘమునకు రావడం నాకు తెలుసు. అప్పటి నుండి, ఇప్పటి వరకు, ఆమెకు క్రీస్తు పట్ల గొప్ప ప్రేమ ఉంది నశించు ఆత్మల నిమిత్తము తపన కలిగియుంది. [యుక్త వయస్కురాలిగా] ఆమె మన సంఘ పరిచర్య నిమిత్తము తన జీవితాన్ని ధారపోసింది ఏదీ వెనక్కు తీసుకోలేదు...యవనస్తులారా, శ్రీమతి హైమర్స్ మీకు మాదిరి. మీరు ఆమెను ఉదాహరణగా వెంబడిస్తే, మన సంఘమునకు మహిమాయుక్త భవిష్యత్తు ఉంటుంది."
మనం డాక్టర్ చాన్ అరవైవ పుట్టినరోజు జరుపుతున్నాం ఆయన కూడ క్రీస్తు శిష్యునిగా మంచి ప్రకాశిత ఉదాహరణ. ఆయన మన సంఘములో అభిషేకింపబడిన సంఘ కాపరి. చిన్నప్పుడు అనారోగ్యముతో ఉండేవాడు. చిన్నప్పుడు చాలాకాలము అతనిని ఆసుపత్రిలో గ్లాసు బోనులో ఉంచారు. వైద్య విద్య నభ్యసిస్తూ అతడు యుక్త వయస్సులో మన గుడికి వచ్చాడు. ముప్ఫై సంవత్సరాల పైబడి బ్రతకవని మిగిలిన డాక్టర్లు అతనితో చెప్పారు. అతడు బలహీనుడై సంఘము అతని చూచుకోవలసిన పరిస్థితి. గాని కాదు! అతడు సంఘ పనిలో నిమగ్నుడై క్రీస్తు శిష్యుడయ్యాడు. ఎక్కువ పని చెయ్యవద్దని లేనిచో ముప్ఫై సంవత్సరాల ముందే చచ్చిపోతావని వారు అతనితో చెప్పారు. కాని క్రీస్తు పని డాక్టర్ చాన్ ను బలపరిచింది. ఊహించిన దానికంటే ఎక్కువగా ముప్ఫై సంవత్సరాలు ఎక్కువగా మంచి, బలమైన జీవితమూ పొందాడు. తన సిలువను ఎత్తుకొని యేసును వెంబడించాడు. ఇప్పుడు వేదికపై అరవైవ యేట గొప్ప దైవ జనునిగా కూర్చున్నాడు!
ఈ విధంగా నేను మెన్సియా, మరియు సాలాజార్, మరియు బెన్ గ్రిఫిత్ ల గురుంచి, చెప్పుకుంటూ పోగలను. విర్జెల్ నిక్కెల్ దంపతుల గురించి చెప్పగలను, వారు ఈ భవనము కొనడానికి చాలా డబ్బు ఇచ్చారు. నిక్కెల్ గారు 75 సంవత్సరాల వయస్సు మధుమేహము ఉంది – అయినను ప్రతి బుధవారము రాత్రి, ఆదివారము ఉదయము, మరియు సాయంకాలము మన గుడికి రావడానికి గంట కారు ప్రయాణము చేసి వస్తారు. ఈ అద్భుత యవనస్తుడు, రెవరెండ్ జాన్ సామ్యూల్ కాగన్ గురించి చెప్పగలను త్వరలో అతడు నా స్థానములో సంఘ కాపరి అవుతాడు. ఈ ప్రజలంతా యేసు శిష్యులయ్యారు, సిలువపై సైనికులయ్యారు.
నా కాపరి డాక్టర్ తిమోతి లిన్ అన్నాడు, "ఎక్కువ కంటే తక్కువ మేలు...ఆదివారము అన్ని వరుసలు నిండిపోవచ్చు, కాని వాస్తవము ప్రార్ధన కూటములో చాలాకొద్ది మంది ఉంటారు... ఇది ఆరోగ్యకరమని మనము చెప్పలేము" (సంఘ ఎదుగుదల రహస్యము, పేజీ 39).
బైబిలు చూడండి. మీరు మళ్ళీ మళ్ళీ చూస్తారు "ఎక్కువ కంటే తక్కువ మేలు." యేసు 11 మందిని తీసుకొని ప్రపంచాన్ని మార్చాడు ఎందుకంటే తన మనష్యులు ఆయన నిమిత్తము చనిపోవడానికి ఇష్టపడ్డారు. సంఘ చరిత్రలో అదే పాఠము చూస్తాము. పెంతేకొస్తు దినాన 120 మంది హాజరయ్యారు. కేవలము కొద్దిమంది మొరావియన్ క్రైస్తవులు ఆధునిక విస్సవ్ చలనమునకు నాంది పలికారు. గొప్ప మేల్కొలుపును, కొంతమంది మెథడిష్టులను, పురికొల్పారు. చైనాను సువర్తీకరించడానికి కొద్దిమంది మాత్రము జేమ్స్ హడ్సన్ టేలర్ ను వెంబడించారు.
క్రీస్తు కొరకు శ్రేష్టమైనది ఇవ్వడానికి ఇష్టపడని వారిని పెరికి వేయాలి. ఎప్పుడు చిన్న పిల్లల వలే ఉండడం ఇష్ట పడు వారిని పెరికి వెయ్యాలి. వారి సౌకర్య పరిధి నుండి బయటకు రావడానికి ఇష్ట పాడనీ వారిని పెరికి వెయ్యాలి. వారు ఎప్పుడు "తీసుకునే వారు" ఏదీ క్రీస్తుకు ఇవ్వరు. శిష్యులతో కూడిన సంఘము కావాలంటే, "తీసుకునే వారిని" పంపెయ్యాలి, మన యవనస్తులు సుతిమెత్తని కొత్త సువర్తీకరణను ఎదుర్కొని, దానిని మార్చాలి. యేసు క్రీస్తుకు జీవితాలను అర్పించే వారిని మనము ప్రోత్సాహించాలి. పిల్లల వలే ఉండి ఎదగడానికి ఇష్టపడని వారిని మనము ప్రోత్సహించ కూడదు! యేసు శిష్యులుగా అవలనుకున్న వారిని మనము ప్రోత్సహించాలి, గిద్యోను చేసినట్లు మిగిలిన వారిని ఇంటికి పంపేయాలి!
దయచేసి నిలబడి పాటల కాగితములో 1 వ పాట పాడండి, "కదలండి, క్రైస్తవ సైనికులారా." పాడండి!
కదలండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి అన్నట్టుగా కదలండి,
యేసు సిలువ మీ ముందు వెళ్ళుచుండగా:
రాజగురువు క్రీస్తు శత్రువుకు వ్యతిరేకంగా నడిపిస్తాడు;
యుద్ధమునకు ముందుకు, ఆయన పతాకములు వెళ్ళుట చూడండి!
కదలండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి అన్నట్టుగా కదలండి,
యేసు సిలువ మీ ముందు వెళ్ళుచుండగా.
గొప్ప సైన్యము దేవుని సంఘమును నడిపిస్తూ ఉండగా;
సహోదరులారా, పరిశుద్ధులు ఎక్కడ నడిచారో మనం అక్కడ నడుస్తున్నాం;
మనము విడిపోలేదు, మనము ఏక శరీరము,
నిరీక్షణలో సిద్ధాంతములో ఒకటే, ధర్మలో ఒకటే.
కదలండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి అన్నట్టుగా కదలండి,
యేసు సిలువ మీ ముందు వెళ్ళుచుండగా.
కదలండి, ప్రజలారా, మన ఆనంద సమూహాన్ని కలవండి,
మాతో మీ స్వరాలు కలపడి విజయోత్సహా గీతికలో;
మహిమ, ఘనత ప్రభావము రాజైన క్రీస్తునకే;
ఇది లెక్కింపలేని తరాలకు మానవులు దూతలు పాడతారు.
కదలండి, క్రైస్తవ సైనికులారా, యుద్ధానికి అన్నట్టుగా కదలండి,
యేసు సిలువ మీ ముందు వెళ్ళుచుండగా.
Tags:christian messages in telugu pdf, తెలుగు ప్రసంగాలు, telugu messages in Telugu worship messages in telugu pdf spiritual messages bible Telugu Telugu christian songs telugu message
0 comments