>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

యోనా - ప్రవక్త!

Posted by Veeranna Devarasetti Friday, May 14, 2021

 డాక్టర్ ఆర్. ఎల్. హైమర్స్, జూనియర్ గారిచే
పాష్టర్ ఎమెరిటస్
by Dr. R. L. Hymers, Jr.,
Pastor Emeritus

 

 


"యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, ఇలాగు, సెలవిచ్చెను, నీనెవే పట్టణస్తుల, దోషము నా దృష్టికి, ఘోరమాయెను; గనుక నీవు లేచి నీనెవే మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము" (యోనా 1:1, 2).


యోనా పుస్తకమును ప్రవక్త యోనాయే స్వయముగా వ్రాసాడు. నేను అలా ఎందుకు చెప్తున్నానంటే, అది బయలు పరుస్తుంది. యోనా తలంపులు ప్రార్ధనలు యోనాకు తప్ప మరెవ్వరికి తెలియవు. II రాజులు 14:24-25లో యోనా చారిత్రాత్మక వ్యక్తి అనే వాస్తవము చెప్పబడింది, "గతే పెరు ఊరి వాడైన, అమిత్తయి కుమారుడైన, యోనా, అను ప్రవక్త" (II రాజులు 14:25). ప్రభువైన యేసు క్రీస్తు కూడ, యోనా ఒక నిజ చారిత్రాత్మక ప్రవక్త అని చెప్పాడు. దయచేసి మత్తయి 12:39-41 చూడండి. యోనాను గూర్చి యేసు చెప్పిన మాటలు నేను చదువుచుండగా నిలబడండి,

"వ్యభిచారులైన చెడ్డ తరము వారు, సూచక క్రియను అడుగుచున్నారు; ప్రవక్తయైన యోనాను [యోనా] గూర్చిన సూచక క్రియయే గాని, మరి ఏ సూచక క్రియ యైనను వారికి అనుగ్రహింపబడదు: యోనా మూడు రాత్రింబవళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో; ఆలాగు మనష్యు కుమారుడు మూడు రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. నీనెవే వారు యోనా ప్రకటన విని, మారు మనస్సు పొందిరి: గనుక విమర్శ సమయమున నీనెవేవారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు; ఇదిగో, యోనా కంటే గొప్పవాడు, ఇక్కడ ఉన్నాడు" (మత్తయి 12:39-41).

నిలబడే ఉండి లూకా 11:29-30 చూడండి.

"మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు, ఆయన ఇలాగు చెప్పసాగెను, ఈతరము వారు దుష్ట తరము వారై యుండిరి: సూచక క్రియ నడుగుచున్నారు; అయితే యోనాను [యోనా] గూర్చిన సూచక క్రియయే, గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింపబడదు. యోనా నీనెవే పట్టణస్తులకు ఎలాగు సూచనగా ఉండెనో, అలాగే మనష్య కుమారుడు ఈ తరము వారికి సూచనగా ఉండును" (లూకా 11:29-30).

కూర్చోండి.

కనుక II రాజులు 14:25 యోనాను గూర్చిన చారిత్రాత్మక సమాచారము ఇస్తుంది. మరియు లూకా 11:29-30 యోనాను గూర్చి యేసు ఒక సూచన అని చెప్పడం కనిపిస్తుంది. మత్తయి 12:39-41 చెప్తుంది యోనా పునరుత్థానము యేసు మూడవ రోజున తన సమాధి పునరుత్థానములను సూచిస్తుంది. అలా, పాత నిబంధన యోనాను ఒక నిజ వ్యక్తిగా వ్రాసింది, క్రీస్తు కూడ యోనా మరణ పునరుత్థానముల ప్రవచనము ఆయన మరణ పునరుత్థానములను సూచిస్తుందని మనకు చెప్తున్నాడు. 

 


 

I. మొదటిది, యోనా పిలుపు.

"యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి, నీనెవే మహా పట్టణమునకు, పోయి, దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము..." (యోనా 1:1, 2).

వచనము 3,

"కాని యోనా యెహోవా సన్నిధిలో...నుండి పారిపోయెను" (యోనా 1:3).

ఈ వ్యక్తి యోనాను అర్ధము చేసుకున్నాను. అందుకే పాత నిబంధనలో చిన్న పుస్తకమైన యోనా నాకు చాలా ఇష్టమైనది. యోనా ప్రభువు సన్నిధిలో నుండి పారిపోయాడు. నేను అలా చెయ్యలేదు. నేను మిస్సెనరీగా పిలువా బడ్డానని నాకు తెలుసు. కాని నేను పేద విద్యార్ధిని కళాశాల పట్టా పొందలేననుకున్నాను. దక్షిణ బాప్టిస్టు మిస్సెనరీ కావాలంటే నేను కళాశాల సెమినరీ పట్టభద్రుడని కావాలి. నేను యోనాలా అనుకున్నాను. నేను పిలువబడ్డానని నాకు తెలుసు, కాని కళాశాలలో తప్పుతాననే భయముతో దేవుని సన్నిధి నుండి పారిపోవాలని ప్రయత్నించాను. అసాధ్యమైన దానిని చెయ్యమని దేవుడు నాకు చెప్తున్నాడు.

ఒక యవన సెమినెరీ విద్యార్ధి నాతో ఇలా అన్నాడు, "నేను సేవలోనికి వెళ్ళలేను ఎందుకంటే నేను చితికి కాలిపోతానని నాకు తెలుసు అని." పరిచర్యలో విఫలము గురుండి అతడు భయపడ్డాడు. నేను దానిని గూర్చి ఆలోచించాను. తరువాత నేననుకున్నాను, "నేను ఇప్పటికే చాలాసార్లు చితికి కాలిపోయాను. ఇక దానిని గూర్చి ఏమి భయపడను."

భయము దేవునిచే పిలువబడిన మనిషిని పరిచర్యకు దూరము చేస్తుంది. ఏదో విధముగా భయము. ఈ ప్రత్యేక యవనస్థుడు చేసిన ప్రతి దానిలో విజయము పొందాడు - కాని సేవను గూర్చి భయపడ్డాడు. తనను గూర్చి అతని తమ్ముడు ఇలా అన్నాడు, "నా అన్నయ్య ఏదైనా చెయ్యగలడు." కాని ఒక భయాన్ని జయించలేకపోయాడు "చితికి పోవడం కాలిపోవడం." అతడు ఆరు అడుగుల ఎత్తరి, "ఏ" కోవ విద్యార్ధి, తలంతు కలిగిన బోధకుడు. కాని భయపడి దేవుని సన్నిధి నుండి పారిపోయాడు!

ఇప్పుడు, యవనులారా, నా జీవితములో నేర్చుకున్నది మీకు చెప్తాను, "మీరు ఏదైనా చెయ్యగలరు దేవుని పిలుపును బట్టి – ఏదైనా!" బైబిలు చెప్తుంది, "నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13). నేను ఆ వచనాన్ని ఋజువు చేసాను, అది సత్యమని నాకు తెలుసు. నాకు 80 సంవత్సరాలు, కేన్సరు నుండి బయట పడ్డాను, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కాని నేను భయపడను, భయంకర సంఘ చీలికలో ఇద్దరు దుష్టులు సంఘములో 3/4 వంతుల మందిని తీసుకెళ్ళి నప్పటికినీ. అయినను తల్లి చేతిలో ఉన్న చిన్న శిశువు వలే నేను మౌనముగా ఉంటాను. నేను భయ పడ్డానా? యదార్ధంగా, నేను ఏమాత్రము భయపడలేదు! నా అమ్మమ్మ నాతో చెప్పేవారు, "నీవు దేని గూర్చి భయపడ నవసరము లేదు." ఇది అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్డ్ గొప్ప నిస్పృహ కాలములో చెప్పిన మాట. నా వృద్ధ అమ్మమ్మ సరియే అని నేను గ్రహించాను!

నేను ఇంకొకటి కనుగొన్నాను మీరు "ప్రభువు సన్నిధి నుండి" ఎన్నడు పారిపోలేరు. ఎందుకు? ఎందుకంటే మీరు ఎక్కడున్నా దేవుడు మీతో ఉంటాడు – అందుకు! మీరు, యోనా వలే, తార్శిస్ కు పోవచ్చు. కాని దేవుడు అక్కడ ఉంటాడు ఇంట్లో ఉన్నట్టే! కష్ట పడకుండా ఒక బోధకుని దేవుడు వెల్లనివ్వడు.

ఒక త్రాగుబోతు నాకు తెలుసు. తరువాత నేను కనుగొన్నాను తన మనసును కప్పి పెట్టడానికి అతడు తాగేవాడు, దేవుడు తనను పిలిచినప్పటికి దేవుని పిలుపుకు విదేయుడవడానికి చాలా భయపడేవాడు. భయము నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు ప్రతి రాత్రి తాగుచున్నాడు. అతని పేరు జాన్ బిర్చ్ (ఊరికే కాదు!) సెమినెరీ లో నాతో ఉండేవాడు, తాగి ఉండే స్థలములో చిందర వందర చేసేవాడు!

అలాన్ అనే ఇంకొక వ్యక్తి నాకు తెలుసు. నేను అలాన్ ను క్రీస్తు నొద్దకు నడిపించాను, కాని చాలా కష్టంగా. ఎందుకు? రక్షింపబడితే పరలోకానికి వెళ్ళాలని అతడు భయ పడేవారు! పరలోకానికి వెళ్ళడానికి ఎందుకు భయపడేవాడు? ఒక రోజు నాతో చెప్పాడు, "నేను నా తండ్రిని అక్కడ చూడాలి నేను సెమినెరీకి వెళ్లి ఆయనలా ప్రెస్బిటేరియన్ బోధకుడుని కాలేదని నాపై కోపముగా ఉండేవాడు." ఎలాన్ అరవై సంవత్సరాల వయస్కుడు. ఆదివారము ప్రెస్బిటేరియన్ గుడిలో కూర్చుని, రక్షింప బడడానికి భయపడేవాడు ఎందుకంటే పరలోకములో చనిపోయిన తండ్రి తనపై కోపపడతాడని! నలభై సంవత్సరాలుగా ఆ తలంపుతో వేధింపబడ్డాడు. కాని నేను అతనికి నచ్చచెప్పాను. అతని తండ్రి [రెవ. బ్లాక్] తప్పిపోయిన కుమారుని తండ్రి వలే, నవ్వి అతనిని, కౌగిలించుకుంటాడని చెప్పాను. నేను క్రీస్తు నొద్దకు నడిపించిన వారిలో ఎలాన్ మొదటి వాడు!

నేను సెమినెరీలో ఉన్నప్పుడు, కళాశాల వయసు అమ్మాయి మా కూటాలలో రక్షింపబడింది. ఆమెకు సిగ్గు ఎక్కువ, ఆమె అలజడిలో ఉన్నట్టు గమనించి, ఆమెతో మాట్లాడాను. ఆమె ఇలా చెప్పింది, "నేను రక్షింపబడినట్లు నా అమ్మకు చెప్పడానికి భయపడుతున్నాను." నేనన్నాను, "వెళ్ళి ఆమెతో చెప్పు. ఆమెకు పిచ్చి పట్టదు." కాని నాది తప్పు. ఆమె రక్షించబడినట్లు తన తల్లికి తెలిసేక, ఇంటి నుండి బయటికి వెల్లగొట్టింది. ఆ అమ్మాయి ఏడవడం చూసాను. కనుక నేనన్నాను, "నేను వచ్చి మీ అమ్మతో మాట్లాడతాను." మంచిగా సూటు ధరించి టై కట్టుకొని, ఆమెను చూడ వెళ్లాను. నేనెవరో తెలిసి, నాపై అరవడం మొదలు పెట్టింది. చివరకు ఆమె ముందు గదికి వెళ్లాను. నేను ఆమెతో చెప్పాను, "నీ కుమార్తెను ఇంటిలోనికి రానివ్వరా?" ఆమె చెప్పింది, "నా కుమార్తె లైంగిక సంబంధము కలిగి మత్తు పదార్ధాలు తీసుకునేటప్పుడు నేను తట్టుకున్నాను. ఇప్పుడు ఆమె క్రైస్తవురాలు! ఆమెను ఎన్నడు నా ఇంటిలోనికి రానివ్వను."

ఆ అమ్మాయి గుడిలో ఇంకొకరి ఇంటికి వెళ్లి ఉద్యోగమూ సంపాదించి, తన కళాశాల చదువు ముగించింది. చివరకు ఒక చక్కని యవన క్రైస్తవుని పెళ్లి చేసుకుంది. పెళ్ళికి తల్లి హాజరు కాలేదు. యూరప్ లో ఒక దేశానికి ఆ యవ్వన జంట మిసెనరీలుగా వెళ్ళారు. వారికి సహాయము చేయడానికి ప్రతి నెలా డబ్బు పంపించాము.

ఒకరోజు ఆ అమ్మ ఇంటి ముందు వార్తా పత్రికలూ నిండిపోయాయి. పోలీసులు తలుపులు బద్దలు కొట్టి ఆమె అమ్మ - నేలపై చనిపోయి ఉండడము చూసారు - ఆమె చేతిలో మందు సీసా ఉంది!

ఓ, ఎంత కన్నీరు ఎంత బాధ ఆ అమ్మాయి చవి చూసింది ఒక క్రైస్తావరాలు మిస్సెనరీ అయినందుకు! కాని ఆమె యేసును ఎక్కువగా ప్రేమించింది భయాలను జయించి ప్రభువును వెంబడించడానికి! ఆమె ఆత్మీయముగా ఉండి యేసు చెప్పేది వినేది, ఆయన చెప్పిన దానికి లోబడేది.

నిలబడి మత్తయి 10:34-39 చూడండి.

"నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితినని తలంచకుడి: ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు, నేను రాలేదు. ఒక మనష్యునికిని వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికి ఆమె అత్తకును విరోధము పెట్ట వచ్చితిని. ఒక మనష్యుని ఇంటి వారే అతనికి [శత్రువులు] శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువ ప్రేమించు వాడు: మరియు అతడు అతని కుమారుడు లేదా కూతురు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని, నన్ను వెంబడింపని వాడు, నాకు పాత్రుడు కాదు. తన ప్రాణమును దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును: గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దానిని దక్కించు కొనును" (మత్తయి 10:34-39).

కూర్చోండి.

మీలో కొందరి తల్లిదండ్రులు మీరు మన సంఘాన్ని విడిచిపెట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలుసు. దయచేసి ఈ అమ్మాయి ధైర్యము గుర్తు చేసుకొని ఆమె ఉదాహరణ గైకొనుడి. మీరు అలా చేస్తే, వారు మీపై చాల కోపపడతారు - కొంతకాలము మాత్రమే. కాని వారు మీ మంచి జీవితమూ చూచి, చివరకు వారు - భవిష్యత్తులో - మీతోపాటు మన గుడికి వస్తారు. కాని క్రీస్తును వెంబడించడానికి, మీకు విశ్వాసము ఉండాలి! వారు మిమ్మును అంగీకరించనప్పటికినీ! యోనా వలే ఉండకండి ప్రభువు సన్నిధి నుండి పారిపోవద్దు!!!

చైనీయ సంఘములో, నాకు ఇద్దరు సన్నిహిత స్నేహితులున్నారు – వారు బెన్ మరియు జాక్. బెన్ డాక్టర్ లిన్ పై తిరుగబడ్డాడు. చివరకు అతని స్నేహితురాలితో వెళ్ళిపోయాడు. అతనిని తిరిగి చూడలేదు. కాని జాక్ మందుల తయారీలో తర్ఫీదు పొందాడు. అయినా అది అతనికి నచ్చలేదు, కనుక టల్ బోట్ సెమినెరీకి వెళ్ళి అక్కడ బోధకుడు అయ్యాడు. అతడు నాకు అత్యంత సన్నిహిత స్నేహితుడు. అతని పెళ్లిలో నేను తోడ పెళ్లి కొడుకుగా ఉన్నాను. మా కూటాలలో అతడు యేసును విశ్వసించాడు. అతడు ఇలా వ్రాసాడు, "చాలా సంవత్సరాలు తరువాత నా తల్లిదండ్రుల రక్షణ అను ఫలము పొందాను...నా తండ్రి ఆదివారపు బడిలో తర్ఫీదు ఇచ్చి సేవ చేసి, బోధకునిగా అతని విద్యార్ధులను వారి జీవితాలను ప్రభావితము చేయడం సంఘ అభివృద్ధికి దోహద పడడం నేను కళ్ళారా చూసాను."

 


 

II. రెండవది, యోనా యొక్క శ్రమ.

"అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని, యోనా ముప్పెకు పోయిరి; తర్షీషునకు పోవు ఒక ఓడను చూచిరి: ప్రయాణమునకు కేవు ఇచ్చి, యెహోవా సన్నిధిలో, విలువక ఓడ వారితో కూడ తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, సముద్రమందు గొప్ప తుపాను రేగి, ఓడ బద్దలైపోవు గతి వచ్చెను" (యోనా 1:3-4).

పైకి చూడండి. ఆ తుఫాను దేవుని నుండి అని యోనాకు తెలుసు.

"నన్ను బట్టియే, ఈ గొప్ప తుఫాను, మీ మీదికి వచ్చెనని నాకు తెలిసియున్నది; నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి: అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండ నిమ్మలించునని అతడు వారితో చెప్పెను" (యోనా 1:12).

చివరకు నావికులు యోనాను సముద్రములో పడద్రోసిరి, అంతట సముద్రము నిమ్మలమాయేను.

"గొప్ప మత్చ్యము ఒకటి యోనాను మ్రింగవలేనని యెహోవా నియమించి యుండగా. యోనా ఆ మూడు దినములు ఆ మత్చ్యము యొక్క కడుపులో ఉండెను. ఆ మత్చ్యము యొక్క కడుపులో నుండి యోనా యోహోవాకు ఇలాగు ప్రార్ధించెను" (యోనా 1:17-2:1).

ఇది నమ్మడానికి నాకు కష్టము అనిపించేది. కాని తరువాత నేను చూసాను ఇది యేసు, సిలువపై మరణించి, పాతిపెట్టబడి, మృతులలో నుండి లేచుటను సూచించుచున్నది.

తరువాత డాక్టర్ యం. ఆర్. డీహాన్ యోనా గొప్ప చేపను గూర్చి చెప్పినది చదివాను. డాక్టర్ జే. వెర్నోన్ మెక్ గీ ఇలా అన్నాడు,

ఈ పుస్తకము వాస్తవానికి పునరుత్థానమునకు ప్రవచనాత్మకము. ప్రభువైన యేసు స్వయంగా చెప్పాడు, నీనెవే పట్టణ ప్రజలకు యోనా సూచనగా ఉన్నట్లు మృతులలో నుండి పునరుత్థానుడగుట ఆయన తరము వారికి ఒక సూచన...యోనా చిన్న పుస్తకము యేసు క్రీస్తు పునరుత్థానమును ఉదాహరిస్తూ బోధిస్తుంది (Thru the Bible, note on Jonah’s resurrection from the dead, volume III, p. 739).

యోనా 1:17 చూడండి.

"గొప్ప మత్చ్యము ఒకటి యోనాను మ్రింగవలెనని యెహోవా నియమించియుండరి. యోనా మూడు దినములు ఆ మత్చ్యము యొక్క కడుపులో నుండెను" (యోనా 1:17).

ఇప్పుడు యోనా పుస్తకములోని అతి ప్రాముఖ్య పదాలు చూడండి, యోనా 2:9 లో ఆఖరి ఐదు పదములు,

"యెహోవా యోద్దనే రక్షణ దొరుకును" (యోనా 2:9బి).

ఇక్కడ ఆగి గొప్ప మత్స్యములో యోనా శ్రమను గూర్చి నా స్వంత తలంపులు చెప్తాను.

మొన్నటి రాత్రి నేను యోనా గ్రంథము చదువుచుండగా, మునుపెప్పుడు నేను ఆలోచించని ఒక విషయము నాకు తట్టింది. బాహ్య పరిస్థితుల ద్వారా ఉజ్జీవాలు "మెరుస్తాయి" అనుకోవడం సర్వ సామాన్యము. చాలా మంది ప్రసిద్ధ బోధకులు కరోనా వైరస్ ఉజ్జీవాన్ని "ఉద్భవింపచేస్తుందని" చెప్తున్నారు. నేను దానిని నమ్మనే నమ్మను!!! అది ఫిన్నీ తలంపు, అది నిజము కానే కాదు.

కాని ఉజ్జీవానికి నిజ వాస్తవము ఇక్కడ ఉంది – అది "ఉద్భవిస్తుంది" (నేటి నూతన సువార్తికుల పదాలంటే నాకు అసహ్యము) – ఉజ్జీవము దేవుని చేతనే "ప్రజ్వలిస్తుంది", "యెహోవా వలననే రక్షణ కలుగును" (యోనా 2:9బి).

మొన్నటి రాత్రి ఇది నేను తేటగా చూసాను – చరిత్రలో గొప్ప ఉజ్జీవాలను చదువుచుండగా, గొప్ప ఉజ్జీవాలు నాయకులు శ్రమల ద్వారా వెళ్తుండడం ద్వారా అని మనము కనుగొంటాము. నాకు తట్టిన కొన్ని మీకు చెప్తాను.

జాన్ వెస్లీ – గొప్ప మొదటి మేల్కొలుపు ముందు అతడు అనుభవించిన కొన్ని శ్రమలు మీకు చూపిస్తాను. జార్జియా మిస్సెనరీగా అతడు విఫలుడయ్యాడు. అతడు దయ్యాలతో పోరాడాడు. అతడు కాల్చబడ్డాడు. సుమారుగా చనిపోయాడు. అతని స్నేహితుడు జార్జి వైట్ ఫీల్డ్ అతనితో సహవాసము తెంచేసుకున్నాడు. తన తెగ వారు బహిష్కరించారు. తన తండ్రి సంఘములో అవమానింప బడ్డాడు ప్రభువు బల్ల అతనికి నిరాకరించబడింది. వివాహ మాడిన స్త్రీ అతనిని విడిచి పెట్టింది. అప్పుడు వెస్లీ తన స్వంత పెంతేకొస్తు అనుభవించాడు. ఆ తరువాతనే అతడు సొంత పెంతేకొస్తు అనుభవించాడు! వేలమంది ఆయన బోధ వినడానికి గడ్డ కట్టే చలిలో నిలబడ్డాడు. రాజు అధికారిచే అతని జీవితమూ పని కొనియాడబడ్డాడు. "ఏ ఒక్క వ్యక్తి ఇన్ని మనసులను ప్రభావితము చేయలేదు. ఏ ఒక్క స్వరము ఇన్ని హృదయాలు తాకలేదు. ఏ వ్యక్తి ఇంగ్లాండ్ కొరకు ఇంత జీవిత పనిచేయలేదు." ఒక ముద్రణా సంస్థ ఇటీవల చెప్పింది, జాన్ వెస్లీ "అపోస్తలుల కాలము నుండి అతి శక్తివంత బోధకులలో ఒకడు."

మారీ మోన్ సేన్ – ఆమె చైనా ఉజ్జీవము కొరకు ఉపవసించి ప్రార్ధించింది. సాతాను ఆమెను పడవేసి గొప్ప పాము వలే ఆమె శరీరాన్ని పాడు చేసింది. ఆమెకు సహాయము లేదు, ఒంటరి, అవివాహిత మిస్సెనరీ ఆమె ప్రార్ధనల ద్వారా ఈ నాటికి చైనా గృహ సంఘాలలో గొప్ప ఉజ్జీవము కొనసాగుతూనే ఉంది.

జోనాతాన్ గో ఫోర్త్ – అతడు తన భార్య చైనా వెళ్లి చాలా శ్రమలను అనుభవించారు. నలుగురు పిల్లలు చనిపోయారు. గోఫోర్త్ కూడ రెండు సార్లు చనిపోబోయాడు. చనిపోయిన తన పిల్లల శవాలను ఒక బండిలో 12 గంటల పాటు తీసుకెళ్ళి క్రైస్తవ సమాధి చేసాడు. శ్రీమతి గోఫోర్త్ ఆమె పిల్లలు ఎంతో శ్రమ పడ్డారో చెప్పడానికి సమయము చాలదు. వారి పాప చనిపోయినప్పుడు, "మా పాప మృత దేహము తన అక్క దేహము ప్రక్క తన పుట్టిన రోజున పెట్టబడింది, అక్టోబర్ 13, 1902."
     దాని తరువాత మాత్రమే దేవుని ఉజ్జీవ అగ్ని గోఫోర్త్ కూటాలపై దిగి వచ్చింది. ప్రార్ధనకు అవకాశము ఇవ్వబడింది. శ్రీమతి గోఫోర్త్ ఇలా అన్నారు, "ఇది అకస్మాత్తుగా పెను తుఫానులా వచ్చింది...ఇది ప్రార్ధనా తుఫానుతో వచ్చింది. దీనికి అడ్డులేదు, అలాంటి ప్రయత్నము లేదు...స్ర్తీ పురుషులు దేవుని శక్తి క్రిందకు వచ్చారు...దేవుని నుండి దూరంగా ఉండి తిరిగేవారు, తమ పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గరకు బహిరంగంగా వచ్చారు...తికమక లేదు. జన సమూహము ప్రార్ధనలో ఏకీభవించింది...మోకాళ్ళ నుండి నేరుగా, మేమంతా నేరుగా కూటాలకు వెళ్ళే వాళ్ళము, ఓ, అందులో ఆనందము మహిమ!...తలలు వంచి దేవుని స్వరాన్ని వినే వాళ్ళము, ‘ఊరకుండుడి నేను దేవుడనని తెలుసుకొనుడి.’ ఇప్పుడు మేము నేర్చుకున్నాము ‘బలము చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ ద్వారా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.’
     గొప్ప సమయము, 700 మందికి పైగా, పాపాలు ఒప్పుకోవడానికి ముందుకు వచ్చారు...కూటాలు ముగించడం కష్టమయింది. ప్రతి కూటము మూడు గంటలు జరిగింది. నిజంగా, కూటము రోజంతా జరిగేది... గోఫోర్త్ సంక్షిప్త ప్రసంగము చేసేవారు ప్రతి జీవితమూ శ్రేష్ట అనుభవము పొందుకుంది. వీరు కఠిన ప్రెస్బిటేరియన్లు, నిష్టగా ఉంటారు, కృప కొరకు, దేవునికి మోర పెడతారు... ఒక బలమైన ప్రెస్బిటేరియన్ బోధకుడు తరువాత దొరికాడు, తన గదిలో ఒంటరిగా, ఆత్మలో గొప్ప వేదనతో," శ్రీమతి గోఫోర్త్ అన్నారు, "గొప్ప ప్రార్ధనలు – నేరుగా సామాన్యంగా, నిశ్చయతతో! అలాంటి వాతావరణములో ఉండడం ఒక స్పూర్తి!"
     "ఈ తెల్ల మిస్సెనరీలు చైనీయ సహోదరులతో వారి తప్పిదాలు పాపాలు పొరపాట్లు ఒప్పుకునేవారు. అందరు ఏకమైయేవారు – చైనీయుడు చైనీయుడు, మిస్సెనరీ చైనీయుడు, ఎందుకంటే వారందరూ క్రీస్తులో ఏకమైయారు కనుక. క్రీస్తు మనమందరికి చెప్తున్నాడు, ‘వారందరూ ఏకమవ్వాలి... నేను వారితో ఉంటాను వారు నాతో ఉంటారు, వారు పరిపూర్ణులగుదురు.’"

చైనాలో డాక్టర్ గోఫోర్త్ కూటాల వలే బయటికి కనబడే కొన్ని కూటాలు మేము జరిగించాము. "బయటికి" ఒక ఉద్దేశముతో అన్నాను. కాని చాలామంది మన "నాయకులు" వారి పాపములు ఒప్పుకొని దేవునితో అబద్దము ఆడారు. అలా, డాక్టర్ టోజర్ చెప్పినట్టు, వారు రెండు పాపాలు చేసారు – అబద్దం పాపము, దేవుని పేరట అబద్దమాడడం! క్రైటన్ డాక్టర్ కాగన్ తో అబద్ధమాడాడు "నెరవేర్పు" నకు "బోధించుట" అవసరము కాదు అని చెప్పడం ద్వారా. ఈ వ్యక్తి యూదులా అయాడు, యూదా క్రీస్తును అప్పగించాడు, కాని పేతురు యదార్ధంగా పశ్చాత్తాపపడ్డాడు.

నిజమైన ఉజ్జీవము జోనాతాన్ గోఫోర్త్ ద్వారా వచ్చినది నేను వ్యక్తి గతముగా డాక్టర్ తిమోతి లిన్ ద్వారా చూసాను నిజమైనది, 1960 లో మొదటి చైనీయ బాప్టిస్టు సంఘములో, అక్కడ "ఆత్మవరములపై" ఒక్కానింపు లేదు – కాని యదార్ధ పశ్చాత్తాపము మరియు ప్రార్ధన ఉండేది. విచారముగా, నాకనిపిస్తుంది, "ఒప్పుకోలు మరియు పశ్చాత్తాపము" ఉద్రేక పూరితమైనవి – కాని యదార్ధమైనవి కావు. నాకు ఆశ్చర్యము కలిగించేది క్రైటన్ మరియు గ్రిఫిత్ వారు దేవుని మాయచేయవచ్చును అనుకున్నారు!!! ఎంత గుడ్డితనము!!!

కొన్ని రాత్రుల క్రితము నేను ఈ ప్రసంగము స్నానపు గదిలో రాస్తుండగా, స్నానపు డబ్బా అంచున కూర్చున్నాడు. ఒకసారి నేను స్నానపు డబ్బాలో పడ్డాను, తల డబ్బాలో మునిగింది. కాళ్ళపై లేవ ప్రయత్నించాను. నేను లేవడానికి ప్రయత్నించా, కాని లేవలేక పోయాను. అక్కడ పడి ఉండి, డబ్బాలో పడి, నా మెడ విరిగింది అనుకున్నాను. కాని నా తొడలు పట్టివేసాయి, అందువలన నేను నిలిచి నా వెన్నెముక విరగలేదని తెలుసుకున్నాను.

ఆ భయంకర పరిస్థితిలో ఉండగా, నిజ ఉజ్జీవము మనము పొందుకోలేము అని సాతాను నాతో చెప్పింది. అప్పుడు తరువాత దేవుడు చరిత్రలోని గొప్ప ఉజ్జీవాలు చూపించాడు వెస్లీ, మారీ మాన్ సెన్, జోనాతాన్ గోఫోర్త్, జాన్ సంగ్ ల తరువాత, గొప్ప పరీక్షల తరువాత, గొప్ప మత్స్యము కడుపులో యోనా వలే, దేవుడు వారిని నమ్మి గొప్ప ఉజ్జీవము ఇచ్చాడు. ఇప్పుడు మనము నిజ ఉజ్జీవము పొందగలమా? అయి ఉండవచ్చు. కాని మనము చాలా యదార్ధంగా వాస్తవంగా ఉండాలి, లేనిచో దేవుడు కొన్ని సంవత్సరాలుగా ప్రార్ధన చేసిన నిజ ఉజ్జీవము పంపడు.

యోనా వలే, పాస్టరు రిచర్డ్ వార్మ్ బ్రాండ్ చేప కడుపులో 14 సంవత్సరాలు కమ్యునిష్టు జైలులో ఉన్నాడు. 14 సంవత్సరాలలో మూడు సంవత్సరాలు ఒంటరిగా ఉన్నాడు, చిత్ర హింసలు పెట్టె వారిని తప్ప ఎవరినీ చూడకుండ. ఎందుకు దేవుడు వార్మ్ బ్రాండ్ ను అలా అనుమతించాడు? అతని పుస్తకాలు చదివితే అర్ధం అవుతుంది ప్రేమగా యదార్ధంగా ఉండడం దేవుడు జైలులో అతనికి నేర్పించాడు. రిచర్డ్ వార్మ్ బ్రాండ్ అంత యదార్ధ వ్యక్తిని ఎవరిని నేను కలువలేదు. జైలులో యదార్ధంగా మాట్లాడడం నేర్చుకొని జైలు నుండి బయటికి వచ్చి అలా జీవించాడు. చిన్న వ్యక్తులు క్రైటన్ మరియు గ్రిఫిత్ యదార్ధ వంతులు కారు. దేవునితో అబద్ధమాడారు. వారు పాపాలు "ఒప్పుకున్నారు" కూడ ఏమాత్రము వారికి విలువ లేకుండా.

 Tags:christian messages in telugu pdf, తెలుగు ప్రసంగాలు,  telugu messages in Telugu worship messages in telugu pdf spiritual messages bible Telugu Telugu christian songs telugu message

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures