నేడు నీ యింటికి రక్షణ వచ్చియున్నది
*✝️ యేసు*
పొట్టి జక్కయ్యను చూసి "ఇతడును అబ్రాహాము కుమారుడే; ఎందుకనగా నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
*నశించినదానిని* వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను."
( లూకా 19:9,10 )
*👉ఆ రోజు జక్కయ్య* ఇంటికి రక్షణ వచ్చింది.... ఈ రక్షణ చూడటానికి ఏలా ఉంటుంది....?
గమనించండి....
*✝️యసుక్రీస్తు* ప్రభువులవారే రక్షణ.... యేసుక్రీస్తువారిని కలిగి ఉండటమే రక్షణ.
ఏ క్షణం ఐతే యేసుక్రీస్తువారు పొట్టి జక్కయ్య ఇంటిలో ప్రవేశించారో....
*ఆ క్షణమే*
ఆ ఇంటిలోని చీకటి పారిపోయింది.
పొట్టి జక్కయ్య యొక్క పాపపు స్వభావం కూడా మారిపోయింది. దీనికి మొదటి కారణం
*✝️ యేసుక్రీస్తు*
ఆ ఇంటిలోకి ప్రవేశించారు. రెండవ కారణం పొట్టి జక్కయ్యకి కలిగిన ఒక "ఆశ"
ఏమిటా....ఆశ ?
*✝️ఈ జక్కయ్య* యేసుక్రీస్తు ఎవరో చూడాలి అని ఆశపడ్డాడు;
అప్పటి వరకు యేసుక్రీస్తు గురించి ప్రజలు గొప్పగా చెబుతుంటే విన్నాడు.
యేసుక్రీస్తు చేసిన బోధలు గురించి విన్నాడు.
*యేసుక్రీస్తు*
చేసిన అద్భుతాల గురించి విన్నాడు.
చివరికి యేసుక్రీస్తు వాళ్ళ ఊరిలోనుండి వెళ్తున్నారు అని తెలుసుకున్నాడు.
*ఈ జక్కయ్యకి*
ఆశ కలిగింది.... యేసుని చూడాలని. కానీ చూడలేక పోయాడు.
ఎందుకంటే.... ఈ జక్కయ్య పొట్టివాడు....
*జాగ్రతగా👇* గమనించండి. . . .
( అది 4:5 ).... తను యుక్తమైన బలిని దేవునికి ఇవ్వలేకపోయాను అని తెలుసుకున్న కయీను తన ముఖము చిన్నబుచ్చకొన్నాడు అంట;
*కయీను*
చేసిన అపరాధము తన ముఖాన్ని చిన్నబుచింది.
అవును. . . . మనం తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపములు మనం చిన్నబోయేలా చేస్తాయి.
అందుకే భయంకరమైన పాపంలో ఉన్న ఈ *జక్కయ్య కూడా* అత్మసంబందమైన మరుగుజ్జుతనంలోకి నేట్టివేయబడ్డాడు. అతనిలో పరిశుద్ధత లేదు.... పరిశుద్ధమైన క్రియలు లేవు.... అత్మలో మరుగుజ్జుతనం, అత్మీయతలో మరుగుజ్జుతనం. ఆత్మలో, ఆత్మీయతలో మరుగుజ్జుతనం వున్నా వారు దేవునిని చూడలేరు.
*✝️అందుకే*
ఈ జక్కయ్య కూడా ఏంత ప్రయత్నిచినా యేసుక్రీస్తుని చూడలేకపోయాడు.
*✝️ఎందుకంటే....*
ఈ జక్కయ్య పొట్టివాడు; అత్మసంబందమైన మరుగుజ్జుతనం.
*✝️ఈ జక్కయ్య* యేసుక్రీస్తుని చూడలేకపోవటానికి మరో కారణం.... ? ( లూకా 19:3 )
*"జక్కయ్య; యేసు* ఎవరోయని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుట వలన చూడ లేకపోయెను."
ఒక కారణం " పొట్టివాడైనందున " మరో కారణం " జనులు గుంపుకూడియుండుట వలన "
*👉ఈ జక్కయ్య* యేసుక్రీస్తుని చూడలేకపోవటానికి మరో కారణం " జనం " అంటే " లోకం ".
వాక్యం ఇలాగు చెబుతుంది " లోకంతో స్నేహం దేవునితో వైరం. . . . "అని.
లోకంలో ఉంటే దేవునిని చూడలేం.... అందుకే ఈ జక్కయ్య యేసుని చూడలేకపోయాడు.
*👉నకు కట్నకానుకలు*
కావాలి, ధనాభిషేకం కావాలి అలాగే దేవుని ఆత్మఅభిషేకం కావాలి అంటే కుదరదు.
అవినీతి చేస్తాను, మోసం చేస్తాను, వేభిచారం చేస్తాను అయిన దేవుని కృపావరాలు కావాలంటే కుదరదు.
పాపంలోనే ఉంటాను దేవుని పని కూడా చేస్తాను అంటే కుదరదు.
నాకు లోకంకావాలి అలాగే పరలోకం కూడా కావాలంటే కుదరదు.
లోకంతో స్నేహం దేవునితో వైరం. . . .
జనల మద్యలో లోకంలో ఉన్నాంతవరకు దేవునిని చూడలేము.
*👉ఈ జక్కయ్య*
ఇది గ్రహించాడు జనం మద్యలో ఉన్నత వరకు యేసుని చూడలేను అని గ్రహించాడు;
ఆ జనం మద్యలో నుండి బయటకి వచ్చాడు. అవును....
*ఈ జక్కయ్య* గ్రహించాడు తన ముందున్న యేసుని చూడలేక పోవటానికి కారణం తన అత్మసంబందమైన మరుగుజ్జుతనం అని గ్రహించాడు;
*✝️అందుకే దేవుని*
కొరకు "నిరీక్షణ" అనే; యేసుక్రీస్తును చూడాలి అనే "ఆశ" అనేడి ఏతైన చెట్టు ఎక్కాడు. . . .
*హల్లెలూయ. . . .*
*👉దవుడు చాలా* గొప్పవారు. జక్కయ్యను చూసారు, పేరు పెట్టి పిలిచారు.
*✝️అంతే....*
*యేసుక్రీస్తు* ఒక్క ప్రసంగం కూడా చేయలేదు, బోధించనులేదు, జక్కయ్య పాపములు అవి ఇవి అని కూడా చెప్పలేదు. కానీ జక్కయ్య మనసాక్షి ఇక్కడ పని చేసింది. . . .
*✝️జక్కయ్య*
యేసుక్రీస్తును తన ఇంటిలో చేర్చుకున్నాడు, తన హృదయంలో చేర్చుకున్నాడు. తన పాపములు తనే ఒప్పుకున్నాడు, పశ్చాతాపపడ్డాడు, అబ్రహాము సంతానంగా పిలువబడ్డాడు, దేవుని జనంగగా లెక్కించబడ్డాడు.
*👉మన రక్షడుడైన* *యేసుక్రీస్తు*
నేడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. . . .
*"నేను నీ యింట* నుండవలసియున్నదని" పలుకుతున్నాడు. . . .
అవును. . . .
*👉 నేడు నీ యింటికి* రక్షణ వచ్చియున్నది;
నీ ఇంటి తలుపులు తెరువు,
*నీ హృదయపు* తలుపులు తెరువు యేసుక్రీస్తుని నిలోనికి అనుమతించు
నీ ఇంటిలోని చీకటి పారిపోతుంది.
*నీ హృదయంలోని* చీకటి వెలుగుగా మారిపోతుంది. ఆమేన్.
*హల్లెలూయ. . . .*
*మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి గూర్చిన ఈ సువార్త ప్రకారముగాను వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్.ఆమేన్. ఆమేన్*
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
✍️మసహోదరుడు
ప్రభుదాస్.సంగిశెట్టి*
మిర్యాలగూడ - Dist నల్లగొండ
Tags:christian messages in telugu pdf, తెలుగు ప్రసంగాలు, telugu messages in Telugu worship messages in telugu pdf spiritual messages bible Telugu Telugu christian songs telugu message
0 comments