చిన్నపిల్లల వంటి దీనత్వము
*మీరు మార్పు నొంది బిడ్డలవంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్నుతాను తగ్గించుకొనువాడెవడో వాడే పరలోకరాజ్యములో గొప్పవాడు. ( మత్తయి 18: 3,4 )*
ఒక చిన్న బిడ్డ గ్రహింపుతో తన్ను తాను తగ్గించుకొనడు. తగ్గించుకొనుట అనునది ఒక చిన్నబిడ్డకు సహజ స్వభావము. తల్లి బిడ్డను గద్దించినా లేక శిక్షించినా తిరిగి తన తల్లి యొద్దకే చేరుతుంది.
*పెద్దవారమైన మనము కొంచెము క్రోధాన్ని ఉంచుకొంటాము.మనము ఎదుగుచున్న కొలది ఆ క్రోధము మనతో పాటు ఎదుగుతుంది. అది మనకును దేవునికిని మధ్య ఒక పెద్ద పర్వతము వలె ఉంటుంది. కొందరైతే ఆ కొండను ఎన్నడు తీసివేసుకొనలేరు. వారు దానిలోని కొంతభాగమును తీసివేయుటకు ప్రయత్నిస్తారు. అప్పుడు సాతాను వారితో "ఇప్పటికిది చాలును. నీవు చేసినది చాలా గొప్పది. అంతయు తీసివేసుకోనవసరము లేదు. దానిని అక్కడే ఉండనియ్యి" అని చెప్తాడు. కాబట్టి మరల పాత వేరు ఎదుగుటకు ఆరంభిస్తుంది. మూడు సంవత్సరముల తరువాత వారు మరల పాత స్థితికి వస్తారు. ఆ కోపముతోనే, ఆ క్షమించలేని ఆత్మతోనే, ఆ ద్వేషముతోనే మరల పాత మార్గములలోనికి తిరిగి వస్తారు. ఇది ఎలా చేయవలెనో సాతానుకు బాగా తెలుసు.*
లైట్ వేసే స్విచ్ ఎక్కడ ఉందో తెలిసి కూడ దానిని నేను నొక్కకపోతే, నాలో ఏదో చాలా తీవ్రమైన తప్పు ఉన్నట్లే. దాన్ని నొక్కే శక్తి నాకు ఉన్నది. కాని అలా చేయడానికి నేనిష్టపడకపోతే దేవుడెలా నన్ను వాడుకొంటాడు? అసలు పరలోకానికి ఆయనెలా నన్ను ప్రవేశింపనిస్తాడు?
*"క్షమించండి" అని చెప్పుటకు సిద్ధముగా నుండక మరొకని మీద నింద వేయుటకు ఇష్టపడినట్లైతే, నా వెలుగు త్వరలోనే ఆరిపోతుంది. నీవు ఒక పెద్దమనిషివనుకొని మరొకరు 'క్షమించండి' అని చెప్పవలెనని తలంచినట్లైతే నీవు తప్పు చేయుచున్నావు. వెలుగులో నీతోపాటు నడవని వారెవరైనా ఉన్నారా? ఆ వ్యక్తితో నీవు సమాధానపడక పోయినట్లైతే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పోగొట్టుకుంటావు.*
మనము సత్యస్వరూపియైన ఆత్మ చేత నింపబడాలి. ఒక చిన్న బిడ్డ సులభముగా సత్యమును వెల్లడి చేయును. నీవు అబద్ధమును చెప్పమని నేర్పించినను అబద్ధము చెప్పుటకు అది కష్టపడుతుంది. "మీరు మార్పు నొంది బిడ్డలవంటి వారైతేనే గాని". సత్యస్వరూపియైన ఆత్మ నీలో ఉంటే నీవు సత్యమునే చెప్తావు. నీవు ఏమియు దాయక బాహాటముగా ఉంటావు.
*ఎంతమంది వారి నిజస్థితిని గూర్చి పూర్తిగా చెప్పుటకు కష్టపడతారు. వారు పరిస్థితులను నిందిస్తారు. ఎవరో ఒకరిని నిందిస్తారు. అది సత్యస్వరూపియైన ఆత్మ కాదు. సత్యస్వరూపియైన ఆత్మను మీలో ప్రవేశింపనియ్యుడి.*
*~ జాషువా డానియేలు*

0 comments