>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
 



మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగియుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా? అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా. అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును. ( లూకా 15: 3-7)

సర్వమానవాళి, సాతాను అనే దుష్టుని కోరల్లో చిక్కి, వారిని విడిపించేవారులేక, నిత్యమరణమే శరణ్యమైనప్పుడు, ప్రభువే వారిని వెదుక్కుంటూ వచ్చిన సందర్భానికి ఈ ఉపమానం సాదృశ్యముగా వుంది.

🔅గర్రె తప్పిపోవడానికి గల కారణమేమిటి? కాపరిని వెంబడించక పోవడం. స్వంతమార్గాన్ని ఎన్నుకోవడం.

🔅తప్పిపోయిన గొర్రె తిరిగి దొడ్డెను చేరగలదా?
సాధ్యం కానేకాదు. గొర్రె తప్పిపోయిందంటే, అది తన ప్రాణానికే ముప్పు. ఎందుకంటే, మందనుండి వేరైన గొర్రె, ఒంటరియై ఎటు వెళ్ళాలో తెలియక, బిగ్గరగా ఏడ్వడం ప్రారంభిస్తుంది. ఆ ఏడ్పు ఏ దుష్టమృగానికైనా వినబడితే, అంతటితో దాని జీవితం సమాప్తమయినట్లే. అట్లా జరుగకుండా వుండాలంటే, దుష్ట మృగం దానిని కబళించకముందే ఆ కాపరి దానిని వెదకి రక్షించాలి. మరొక మార్గం లేదు.

🔅మిగిలిన గొర్రెల సంగతేమిటి?
ఒక్క గొర్రెకొరకు 99 గొర్రెలను విడిచిపెట్టడం అంటే? ప్రతీ గొర్రె పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను ఆయన కలిగియున్నారు. ఆ 99 గొర్రెలు ఆయనతోనే వున్నాయి కాబట్టి, వాటిని గురించిన చింత ఆయనకు లేదు. ఆయనను వెంబడించే గొర్రెలకంటే, ఆయనను లెక్కచేయని మొండె గొర్రెలపట్ల మరింత ప్రత్యేకమైన శ్రద్ధను కలిగియున్నారు. ఒక్క ఆత్మ కూడా నశించిపోవడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఈ ప్రపంచంలో అందరూ పరిశుద్ధులే వుండి, ఒకే ఒక్క పాపి మాత్రమే వుండివుంటే, ఆ ఒక్కపాపి నిమిత్తం కూడా తన ప్రాణం పెట్టడానికి ఈలోకానికి వచ్చివుండేవాడాయన. దానిలో సందేహం లేనేలేదు.

🔅గర్రెల కాపరి ఎవరు?
నేను గొఱ్ఱలకు మంచి కాపరిని ( యోహాను 10:11) యేసు ప్రభువే గొర్రెల కాపరికి సాదృశ్యం.

🔅తప్పిపోయిన గొర్రె?
మనమందరము గొఱ్ఱలవలె త్రోవ తప్పిపోతివిు మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను   (యెషయా 53:6) మనమే ఆ తప్పిపోయిన గొర్రెకు సాదృశ్యం.

🔅తప్పిపోయిన గొర్రెను వెదక వెళ్లిన కాపరి:
నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెను (లూకా 19:10)
నేను నేనే నా గొఱ్ఱలను వెదకి వాటిని కనుగొందును. ( యెహేజ్కేలు 34:11)

🔅తన భుజములమీద వేసికొని మోయును:
అవును! ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱపిల్ల (యోహాను 1:29) సర్వమానవాళి పాపమును సిలువగా మలచి, మన పాపభారాన్ని ఆయన భుజాలమీద మోసారు.

🔅తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు కలిగే సంతోషం:
కాపరి తన సంతోషాన్ని తన స్నేహితులు మరియు పొరుగువారితో పంచుకొంటున్నారు. వీరు దేవుని దూతలకు సాదృశ్యముగా తలంచవచ్చు.

🔅మరుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొకమందు ఎక్కువ సంతోషము కలుగును.

ఆయన మనపట్ల ఇంత శ్రద్ధ కలిగియున్నారు. ఆయన ప్రేమను అర్ధంచేసుకుని, ఇంకనూ ఆయనకు దూరంగా వుంటే, మారుమనస్సు పొంది, ఆయన మందలో చేరగలిగితే, జీవితం ధన్యమవుతుంది. ఆ రీతిగా మన హృదయాలను సిద్ధపరచుకొందము.

అట్టి కృప, ధన్యత, దేవుడు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures