శక్తిచేత నైనను బలముచేతనైననుకాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జెకర్యా 4:6
జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని కట్టించుటకు సిద్ధపడుతున్న సందర్భములో, దేవుడు సెలవిస్తున్న మాట. గొప్ప పర్వతమా , జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదునుభూమి వగుదువు (జెకర్యా 4:7) జెరుబ్బాబెలు దేవుని మందిరాన్ని కట్టించడానికి సిద్ధపడుతున్నది అతని శక్తిని చూచి, అతని బలము చూచి, లేదా తన వెనుకనున్న బలగం చూచి కాదు, దేవుని ఆత్మతో ఆయన నడిపించబడబోతున్నారు. దేవుని ఆత్మచే ఆ కార్యాన్ని ప్రారంభించి, ముగించబోతున్నారు. పర్వతమువంటి ఏ సమస్యయైనా ఆయనను అడ్డగించలేదు. అడ్డగించే ప్రయత్నం చేస్తే, చదును భూమిగా మారి ఆయన పాదాల చెంత మోకరిల్లాల్సిందే.
నీ జీవితంలో నీ స్వంత బలము, బలగము, శక్తి, జ్ఞానముపై ఆధారపడి పర్వతముల వంటి సమస్యలు కొనితెచ్చుకొని, వాటిని అధిగమించే శక్తిలేక, పరిష్కారం కానరాక, నీవే వాటిముందు మోకరిల్లి కృంగిన జీవితాన్ని నీవు జీవిస్తావుంటే, ఒక్క క్షణం ఆగి ఆలోచించు! పేతురు తన స్వంత శక్తి, బలము, నైపుణ్యముపై ఆధారపడి రాత్రంతా ప్రయాసపడినప్పటికీ, అతని ప్రయాసంతా వ్యర్ధమే కదా? ఆయన మాటకు విధేయుడైనప్పుడు, తానుపట్టిన చేపల రాశిని చూచి విస్మయమొందారు. పర్వతముల వంటి సమస్యలు నిన్ను ఊపిరాడనీయకుండా చేస్తున్నప్పుడు, నీ ప్రయత్నాలన్నీ నీవు చేసేసి, నిరాశా నిస్పృహలతో నీ జీవితాన్ని వెళ్లబుచ్చుతుంటే? నీ శక్తిని నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని ప్రక్కనబెట్టి సంపూర్ణముగా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి, ఆయనపై ఆధారపడగలిగితే, ప్రభువు ఆత్మతో నిన్ను నడిపిస్తారు. పర్వతములవంటి సమస్యలు పేకమేడల్లా నీముందే కుప్పకూలిపోతాయి.
♻️ *దేవుని యొక్క సంపూర్ణమైన బలము*
🔸ఆయన సమస్త క్రియలను చేయువాడు. ఆయన ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదు. (యోబు 42 : 2)
🔸ఆయన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమునూ చేయువాడు (కీర్తనల 115:3)
🔸ఆయన చేతిలోనుండి విడిపింపగలిగిన వారెవ్వరూ లేరు. ఆయన కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడును లేడు. (యెషయా 43 : 13)
🔸ఆయనకు అసాధ్యమైనదేదియో లేదు. (మత్తయి 19 : 26)
🔸ఆయన చెప్పిన యేమాటయైనను నిరర్థకముకాదు. (లూకా 1 : 37)
🔸ఆయన సర్వాధికారము గలిగినవాడు: (ప్రకటన 19 : 6)
♻️ *దేవుని బలము*
🔹వడిపించు బలము (దానియేలు 3:17)
🔹రళ్ళద్వారా పిల్లలను పుట్టింపగలడు (లూకా 3:8)
🔹వగ్ధానములను నెరవేర్చగలడు (రోమా 4:21)
🔹సమస్త కృపను విస్తరింపజేయ గలడు (2కొరింథీ 9:8)
🔹సమస్తమును అధికారము చేయగలరు (ఎఫెసి 3:20)
🔹సమస్తమును తనకు లోబరచుకొనగలడు (ఫిలిప్పి 3:21)
🔹అప్పగింపబడినను కాపాడగలడు (2తిమోతి 1:12)
🔹సంపూర్ణముగా రక్షించగలడు (హెబ్రీ 7:25)
🔹తట్రిల్లకుండా కాపాడ గలడు ( యూదా 24)
♻️ *బలహీనమైన వాటితో బలమైన క్రియలు చేయగలవాడు*:
🔸ఒక కర్ర (నిర్గమ 4:2)
🔸ఒక దవడ ఎముక (న్యాయాధి 15:15)
🔸అయిదు నున్నని రాళ్లు (1సమూ 17:40)
🔸పడికెడు పిండి, కొంచెము నూనె (1రాజులు17:12)
🔸అరచేతియంత మేఘము (1రాజులు 18:44)
🔸అల్పమైన ఆరంభం (జెకర్యా 4:10)
🔸ఆవగింజ (మత్తయి 13:32)
🔸అయిదు రొట్టెలు (యోహాను 6:9)
🔸సమాన్యులను ఏర్పరచుకొనుట (1కొరింథీ 1:27-29)
♻️ *సృష్టిమీద దేవుని శక్తి*
🔹రట్టెలు పెరిగినవి (మత్తయి 14:20)
🔹సముద్రము మీద నడచుట ( మత్తయి 14:25)
🔹చప నోటిలో షెకెలు (మత్తయి 17:27)
🔹తుఫానును అణచివేయుట (మార్కు 4:39)
🔹నటిని ద్రాక్షారసముగా మార్చుట ( యోహాను 2:7)
🔹అంజూరపు చెట్టుకు ఫలములు లేకపోవుట (మత్తయి 21:19)
ఇంకా సముద్రము ఆయనకు లోబడుతుంది. తుఫాను ఆయనకు లోబడుతుంది. సృష్టియొక్క స్థితిగతులు ఆయన స్వాధీనంలో ఉంటాయి. ఎండిన ఎముకలను కూడా తిరిగి బ్రతికించగల సమర్థుడాయన. నీలోనీవు చూచుకొని కృంగిపోవద్దు. నీ ప్రతీ పరిస్థితికి సమాధానముంది. నీ పరిస్థితి ఏదైనప్పటికీ కూడా, ఆయనపై ఆధారపడగలిగితే, నిన్ను రక్షించడానికి సంపూర్ణ సామర్ధ్యం గలవాడు నీ దేవుడు. ఆయనపై ఆధారపడదాం! విడిపింపబడదాం! అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
0 comments