దేవుని పిల్లలకు శ్రమలెందుకు?
ఆసాపు గారు దేవునిని ఇట్లా ప్రశ్నిస్తున్నారు. భక్తి హీనులు వారికి నచ్చినట్లుగా జీవిస్తున్నారు. అయినప్పటికీ వారికి బాధలు లేవు, వేదనలు లేవు, సంతోషమే వారిని వెంటాడుతున్నట్లుంది. నేనైతే నీకోసమే జీవిస్తున్నా అయితే, దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. నా హృదయమును నేను శుద్ధిచేసికొని యుండుట వ్యర్థమే నా చేతులు కడుగుకొని నిర్మలుడనై యుండుట వ్యర్థమే. మన జీవితంలో కూడా ఇట్లాంటి ప్రశ్నలే తలెత్తిన సందర్భాలు అనేకం కదా? దేవునిని లెక్కచేయక వారికి నచ్చినట్లు జీవిస్తున్నవారితో, మన పరిస్థితులను పోల్చుకొనిచూస్తే, ఎక్కడా పొంతనలేదు కదా? మనకుండే బాధలు, శ్రమలు వారికి ఉన్నట్లు కనిపించవు. వారి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులన్నీ మనకు అందనంత ఉన్నతంగా మనకంటికి కనిపిస్తాయి.
అయితే, ఆసాపు గారు దేవునిని నిందించి, అక్కడితో విడిచిపెట్టలేదు. దేవుని సన్నిధిలో ధ్యానించి, భక్తిహీనుల గమ్యమేమిటో, దేవుని పిల్లల గమ్యమేమిటో తెలుసుకొని, నీ ఆలోచనచేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నా కక్కర లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గ మును స్వాస్థ్యమునై యున్నాడు. నిన్ను విసర్జించువారు నశించెదరు నిన్ను విడిచి వ్యభిచరించు వారినందరిని నీవు సంహ రించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. (కీర్తనల 73: 23-28) అంటూ ఆయన సన్నిధిలో ఒదిగిపోయారు. మనమునూ ప్రభువు సన్నిధిలో ధ్యానించగలిగితే, ఆసాపుగారు చేరుకున్న అత్యున్నతమైన అనుభవంలోకి చేరగలము.
నేటి దినాలలో అనేకులు యేసు క్రీస్తును నమ్ముకొంటే, మీ బాధలు తొలగిపోతాయి. స్వస్థతలొస్తాయి, ఉద్యోగాలొస్తాయి, కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, ఆర్థికమైన ఆశీర్వాదాలు ఇట్లా ఏవేవో ప్రకటించి, ప్రజలను భ్రమపరచే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ ఆయన చెయ్యగలరు. కానీ వాటికోసం నాదగ్గరకు రండనిగాని, నా దగ్గరకు వస్తే మీ బాధలన్నీ తీరిపోతాయనిగాని ప్రభువు ఎప్పుడూ బోధించలేదు. లోకములో మీకు శ్రమ కలుగును ( యోహాను 16:33) అని ఆయన ముందుగానే హెచ్చరించారు. క్రీస్తును అనుసరించేవారికి శ్రమలు వుండవనేది వాక్య విరుద్ధమైన బోధ. క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు. (2 తిమోతికి 3:12) ఆ హింస నీ ఆధ్యాత్మిక జీవితానికి మేలే తప్ప, కీడెంత మాత్రమూ కాదు. అందుకే కీర్తనాకారుడు ఈరీతిగా చెప్పగలుగుతున్నారు. నేను నీ కట్టడలను నేర్చుకొనునట్లు శ్రమనొంది యుండుట నాకు మేలాయెను. (కీర్తనల 119:71)
ప్రభువు మనలను ఎందుకు పిలిచారంటే? శ్రమలు అనుభవించడానికే మనము పిలువబడితిమి ( థెస్స 3 : 1-4) క్రీస్తుయేసునందు సద్భక్తితో బ్రదకనుద్దేశించువారందరు హింసపొందుదురు.
(2 తిమోతికి 3 :12) శ్ర మలు, హింసలు అనుభవిస్తూ ఉన్నామంటే? ఆయన పిలుపులో మనమున్నాము. ఆయన పిలుపులో మనముంటే? ఇంతకుమించిన ధన్యత యింకేముంటుంది? అట్లా అని చెప్పి, విలాసాలకు అలవాటుపడి అప్పులపాలై, నచ్చినట్లుగా జీవించి అనారోగ్యం పాలై, ఇవన్నీ దేవునిపిలుపులో భాగమని నిన్నునీవు మోసం చేసుకొనే ప్రయత్నం చెయ్యొద్దు.
క్రీస్తు కొరకు శ్రమపడితే?
🔸దవుని మార్గములో నడవగలుగుతాము. ( కీర్తనలు 119:67)
🔸కరీస్తు మహిమలో పాలివారగుదుము ( రోమా 8:17 )
🔸కరీస్తు సారూప్యములోనికి మార్చబడతాము (రోమా 8:28,29 )
🔸సథిరపడి బలపరచబడతాము. (1పేతురు 5:10 )
🔸పరలోక రాజ్యములో ప్రవేశిస్తాము ( అపో. కా 14:22)
కాబట్టి,
🔹శరమలయందు ఓర్పుకలిగి యుండాలి. (రోమా 12:12 )
🔹శరమలయందు అతిశయపడాలి (రోమా 5:4 )
🔹శరమలయందు సహనము కలిగియుండాలి (2థెస్స 1:4)
🔹శరమలయందు ప్రార్ధించాలి ( 2దిన 20:8 )
🔹శరమలయందు నిందించక, దేవునిని స్తుతించాలి (యోబు 1:21,22)
🔹శరమలయందు సంతోషించాలి (అపో. 5:41,42 )
అయితే, ఇవన్నీ చెప్పినంత సులభం కాదు, సాధ్యం కాదు. అదెప్పుడు సాధ్యమైతే? సజీవయాగముగా మన శరీరాలను ప్రభువు కొరకు సమర్పించినప్పుడు మాత్రమే సాధ్యం. మన జీవితాలను ప్రభువునకు సమర్పించి, ఆయన అనుగ్రహించబోయే నిత్యమైన ఆశీర్వాదములను అనుభవించెదము. అట్టి కృప ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్!
Amen🥺🙏🙏