🌾 *గడచిన దినములన్నియు కాచి, కాపాడి ఈ నూతన దినమును అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు*.
🍃 *బాగున్నారా సమాధానముగా జీవిస్తున్నారా! కుటుంబములో మీ పిల్లలు బాగున్నారా! దేవుడు ఏ సమయములో ఏది కావాలో అది తప్పక తగిన సమయములో అందిస్తాడు. ధైర్యముగా జీవించుదాము.దేవునికృప మనకు తోడై ఉండును గాక ఆమెన్*!
ఏ పరిస్థితులలోనైనా సమాధానముగా జీవించాలంటే ?
🤦♀️ ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ కరోనా వైరస్ ప్రభావము వలన ప్రతిఒక్కరిలో తెలియని ఆందోళన, కలవరము,భయము ఇలా అనేక ఆలోచనలు మనిషి హృదయములో వున్నవి .
🍃 ఎక్కడ చూసిన సమాధానము లేదు. అనేకులు కుటుంబములలో నెమ్మది లేకుండ జీవిస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని ఆలోచనలు మనిషిని సమాధానముగా బ్రతుకనివ్వకుండా చేస్తున్నాయి ఈ ఆలోచనలు, పరిస్థితులు. అయితే ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో మనము సమాధానముగా బ్రతకాలంటే ఏమి చేయాలి. ?చదువుకుందాము!
📖 ఆయనతో సహవాసముచేసినయెడల నీకు సమాధానము కలుగును ఆలాగున నీకు మేలు కలుగును .(యోబు22:21)
📖 *గమనించారా! ఎంతో ఆదరణను అనుగ్రహించే వాక్యము*.
*అవును దేవునితో మనము సహవాసము చేసినప్పుడు సమాధానముగా జీవించగలుతాము అని రాయబడింది*.
*ఈలోకములో మనము ఎవరితోనైనా సహవాసము చేసినప్పుడు సమాధానము కలుగుతుందో లేదో కానీ దేవునితో సహవాసము చేసినప్పుడు తప్పక సమాధానము కలుగుతుంది*.
💁♂️ *అవును!కొన్నిసార్లు మనుషులతో మాట్లాడినప్పుడు తలనొప్పికూడా వస్తుంది. నాకు తెలిసిన ఒక సేవకుడు వున్నాడు, ఆయనతో ఎప్పుడు మాట్లాడినా నాకు తలనొప్పి కలిగేటట్లు మాట్లాడుతాడు. ఎప్పుడు సమాధానముగా మాట్లాడడు.ఎప్పుడు ఏదోఒకటి స్వార్థముతో మాట్లాడుతూవుంటాడు.కుయుక్తితో మాట్లాడుతూవుంటాడు. నేను అన్నాను అతనితో? సేవకులతో మాట్లాడితే సమాధానము కలగాలి, కానీ నీతో మాట్లాడితే తలనొప్పి కలుగుతుంది అని అన్నాను*.
🤷♂️ *అవును ఈ లోకములో కొంతమందితో మాట్లాడితే తలనొప్పి కలుగుతుంది. ఎప్పుడెప్పుడు మాట్లాడకుండా వెళ్లిపోవాలి అని అనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడితే నెమ్మది,సమాధానము కలుగుతుంది. అయితే కొంతమందితో మాట్లాడితేనే సమాధానము కలిగితే మరి దేవునితో సహవాసము చేస్తే ఇంకెంత సమాధానము కలుగుతుందో ఒక్కసారి ఆలోచించండి*.
🤦♀️ *కొంతమంది సహవాసము ద్వారా కన్నీరు విడిచేవారు వున్నారు. బాధపడేవారు వున్నారు. నష్టమును అనుభవిస్తూవుంటారు.చివరికి సిగ్గుతో తలను దించుకునే పరిస్థితులు కూడా కలుగుతూవుంటాయి. కానీ దేవునితో సహవాసము చేస్తే గొప్ప సమాధానము మరియు మేలులు కుడా కలుగుతాయి*.
🌾 *ప్రియా సహోదరి సహోదరులారా! మనము ఏ పరిస్థిలోనైనా సమాధానముగా జీవించాలంటే ఒకే ఒక్క మార్గము దేవునితో సహవాసము కలిగివుండడము తప్ప వేరొక మార్గము లేదు. దేవునితో సహవాసము చేస్తే మేలులుకూడా కలుగుతాయి. మరి సమాధానమిచ్చే దేవునితో సహవాసము చేయక సమాధానమును పోగొట్టే మనుషులతో సహవాసము చేయడము ద్వారా లాభము ఉందంటారా*?
🤷♂️ *నేను పూర్తిగా మనుషులతో సహవాసము చేయకూడదు వారితో కలిసి మాట్లాడకూడదు వారితో స్నేహము చేయకూడదు అని నేను అనట్లేదు. కానీ మనుషులతో మనము ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మనుషులతో కంటే ఎక్కువగా దేవునితో సహవాసము కలిగివుండడము చాల ప్రాముఖ్యము*.
💁♂️ *చూడండి కొంతమంది స్నేహితులు కలుసుకున్నప్పుడు చాలాసేపు మాట్లాడుకుంటారు*. *అక్కడక్కడా కూర్చొని మాట్లాడుకుంటూవుంటారు*. *ఇక టీ,కాఫీ లు ఎన్నితాగుతారో కూడా తెలియదు. ఇక వెళ్లిపోదామురా ఇంటికి అని ఎవరైనా ఒకరు అన్నారనుకోండి వెళ్లుదాములేరా అప్పుడేనా ఇంటికేకదా వెళ్లేది అని అంటారు. ఇక మాట్లాడుతూవుంటే సమయమే తెలియదు కారణము స్నేహితుల సహవాసము అటువంటిది*.
💁♂️ *మరి ఈ లోకములో మన తోటి స్నేహితులతో అన్ని గంటలు సహవాసము చేస్తే మరి సమాధానముచ్చే మన ప్రభువుతో ఇంకెంత సమయము సహవాసము చేస్తున్నామన్నది మనము ఒక్కసారి మనమందరము ఆలోచించుకోవాలి*.
🙎♂️ మరి కొంతమంది స్నేహితులు సహవాసము చేస్తూ మాట్లాడుకుంటూవుంటారు ఇక మాట్లాడుకుంటూ,మాట్లాడుకుంటూ చివరికి పోట్లాడుకుంటారు ఇక సమాధానమే ఉండదు వారి మధ్యలో అవునంటారా?
🙎♂️ *ప్రియా సహోదరి సహోదరులారా! ఒక్కసారి ఆలోచించుకుందాము.కొంతమంది మనుషుల సహవాసములో స్వార్ధము ఉంటుంది. మనుషుల సహవాసములో అసూయలు ఉంటాయి. కానీ దేవుని సహవాసములో ప్రేమ ఉంటుంది*. *త్యాగము ఉంటుంది*.
*మరి మనుషుల సహవాసమలో వుంటూ పోట్లాడుకుంటూ సమాధానము లేకుండా జీవించేదానికంటే దేవునితో సహవాసము కలిగి సమాధానముతో జీవించడము చాల ప్రాముఖ్యము*.
📖 *ఆయనతో సహవాసము అనగా దేవునితో మాట్లాడడము. మన స్నేహితులతో సహవాసము చేస్తూ ఎలా మాట్లాడుతామో అలాగే దేవునితో మాట్లాడడమే ఆయనతో సహవాసము చేయడము. మనము దేవునితో సహవాసము చేసినప్పుడు మనము దేవునితో మాట్లాడవచ్చు దేవుడు కూడా మనతో మాట్లాడుతాడు. ఇక సంతోషమే సమాధానమే*! అవునంటారా!
🙎♀️ *అవును మనము ఎన్ని శ్రమలలో ఉన్నప్పటికీ ఎన్ని ఆటకముల మధ్యలో ఉన్నప్పటికి ఎటూవెళ్లలేని పరిస్థితులు ఏర్పడినప్పటికీ మనము దేవునితో గనుక సహవాసము చేస్తే తప్పక మన జీవితములో సమాధానము కలుగుతుంది*.
📖 *దేవునితో సహవాసము చేయాలంటే మనము కూర్చోవడము నేర్చుకోవాలి. ఎక్కడ కూర్చోవాలి ప్రార్థనలో కూర్చొవాలి. ఎవరిదగ్గర కూర్చోవాలి దేవుని దగ్గర కూర్చోవాలి..దేవునితో మాట్లాడాలంటే మరి అయన దగ్గర కూర్చోవాలి కదా.కూర్చోవాలంటే సమయమును కేటాయించాలి. మోకరించి ప్రభువు సన్నిధిలో ప్రార్థిస్తూవున్నప్పుడు మనము దేవునితో మాట్లాడుతూవున్నప్పుడు దేవుడు మన మాటలు విని మనకు జవాబును ఇస్తాడు. మరియు వాక్యము చదువుతూవున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతాడు. ఇక మనకు గొప్ప ధైర్యము వస్తుంది. ఆదరణ కలుగుతుంది. సమాధానము కలుగుతుంది. సంతోషము కలుగుతుంది*.
💁♂️ *ఏ మనుషులతో మాట్లాడినా కొంతవరకు మాత్రమే సమాధానము, సంతోషము కలుగుతుంది. కానీ దేవునితో మాట్లాడుతూవునన్నంతకాలము ఎల్లప్పుడు సమాధానముగా జీవించగలుగుతాము*.
*మరి ప్రియా సహోదరి ,సహోదరులారా ఒక్కసారి ఆలోచించుకుందాము దేవునితో సహవాసము చేయడము చాల ప్రాముఖ్యము. ఈ భయంకరమైన పరిస్థితులలో మనము సమాధానముగా జీవించాలంటే దేవునితో సహవాసము కలివుండడము తప్ప వేరొక మార్గము లేదు. అవును యేసే అన్నింటికి మార్గము*
✍️ *చెప్పేదానికి ఎన్నో విషయములు వున్నవి*.
*ఇంతవరకు మనుషుల సహవాసము ద్వారా నెమ్మది,సంతోషము ,సమాధానము లేకుండా జీవించిన దినములు ఇక చాలు*!
🙇♀️ *ఇప్పటికైనా గ్రహించుదాము దేవునితో సహవాసము కలిగివుందాము. సమాధానముతో జీవించుదాము. దేవునితో సహవాసము చేసి గొప్ప సమాధానముతో జీవించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహింవిహును గాక* !ఆమెన్
దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించి గొప్ప సమాధానమును అనుగ్రహించును గాక !ఆమెన్
మీ సహోదరుడు
పాస్టరు బి.స్టీఫెన్ పాల్
IPC MINISTRIES
పుట్లూరు,తాడిపత్రి,అనంతపురము
0 comments