>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..



సాధు సుందర్ సింగ్" గారిని ఒక బ్రాహ్మణ మేజిస్ట్రేట్ అడిగిన గొప్ప ప్రశ్న?

మనుస్యులు ఎందుకు చనిపోతున్నారు?

అనుదినము వేలమంది పుడుతున్నారు, వేలమంది చనిపోతున్నారు. దీని వలన దేవునికి ఏమి లాభము?
బ్రాహ్మణ మేజిస్ట్రేట్  నేను ఎన్నో మత గ్రంధాలు చదివాను కానీ నేను ఈ ప్రశ్నకు జవాబు కనుగొనలేకపోయాను. మీకు తెలిస్తే చెప్పండి అని సింగ్ గారిని అడిగాడు. అందుకు సింగ్ గారు మేజిస్ట్రేట్ గారితో అయ్యా మీరు విద్యావంతులు, నేను విద్యావంతుని కాను. నేను మీకు సంతృప్తికరమైన సమాధానము ఇవ్వలేకపోవచ్చును కానీ ప్రభువు కృపను బట్టి నేను జవాబు చెప్పుటకు ప్రయత్నించెదను..

రైతు పొలములో భూమిని దున్ని, నాట్లు వేసి, ఎరువులు వేసెను. వర్షము కురిసెను మొక్కలు త్వరత్వరగా పెరిగి పెద్దవి అయ్యాయి. పంటకు ఏ హాని కలుగకుండా రైతు కాపలా ఉండెను.. సమయము ఆసన్నమైనప్పుడు  కొందరు కోత కోయువారు వచ్చి పెరిగిన పంట మొక్కలను కోశారు. ఒకవేళ ఆ మొక్కలకు జీవము, నోరు ఉంటే ఈలాగు ప్రశ్నించేవి
దీని వలన ప్రయోజనమేమిటి? *ఇంతవరకు మమ్మును పెంచిన నువ్వే (రైతు) చివరికి మమ్మును కోయుటకు కారణము ఏమిటి అని ప్రశ్నించేవి కావా?వాస్తవానికి కోత రహస్యం మొక్కలకు తెలియదు కానీ రైతుకు తెలుసు. ఆ ప్రకారమే మనము ఎందుకు చనిపోతున్నామో మనకు తెలియదు కానీ దేవునికి తెలుసు అని సింగ్ గారు బ్రాహ్మణ మేజిస్ట్రేట్ గారికి సమాధానము ఇచ్చారు.. నిజమే..
పంట కోయుట వలన అనేకులకు ఆహారం లభిస్తుంది. అనేకులకు మేలు కలుగుతుంది. ఆ రైతుకు కూడా పంట వలన ఆనందము, మేలు కలుగుతుంది. ఈ విషయాలు మొక్కలకు తెలీదు కానీ రైతుకు తెలుసు...
పంట వంటి వారమైన మనలను కూడా తగిన సమయమందు ప్రభువు కోస్తారు. ఎందుకు కోస్తున్నారో మనకు తెలియక పోవచ్చు కానీ మన దేవునికి తెలుసు...

ఆయన కోయు సమయానికి మనము మన పరుగును కడముట్టించాలి
(2తిమోతి 4:7)

భళా నమ్మకమైన మంచి దాసుడా అని పరమ తండ్రితో  అనిపించుకోవాలి..
(మత్తయి 25:21)

సిగ్గుపడనక్కరలేని పనివానిగా మనము ఉండాలి.
(2తిమోతి  2:15)

మనము కలిగిన వాటిని గట్టిగా పట్టుకోవాలి.
(ప్రకటన 2:25)

మెలకువగా ఉండాలి
(మత్తయి 24:42)

మన వస్త్రములను కాపాడుకోవాలి
(ప్రకటన 16:16)

మన పౌర స్థితిని ఎప్పుడూ జ్ఞాపకము ఉంచుకోవాలి.
(ఫిలిప్పీ 3:20)

ఓ ప్రియ చదువరీ!!!
ఆయన రాకడ అతి సమీపముగా ఉంది.
జాగ్రత్తగా మెలకువగా వుండుము...

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures