>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

 

 


  *ప్రపంచ మనుషులలో అతి కొద్దిమంది అంగవైకల్యంతో మన ముందు ఉండటం చూస్తున్నాము.*
 కాళ్ళు లేని వారుగా, చేతులు లేని వారుగా,చూపు లేని వారుగా,వినికిడి లేని వారుగా, మాట్లాడ లేని వారుగా,మతి స్థిమితం లేని వారుగా *ఇలా అనేక రకాలుగా అనేక మంది మన కళ్ళకు కనబడినప్పుడు చూసి జాలి పడటం సహజం.*

*అంగవైకల్యంతో భాదపడుతున్నవారు ఆరోగ్యంగా ఉన్నవారిని చూచి దేవుడు నాకు ఎందుకు ఇలాంటి బ్రతుకును ఇచ్చాడు అని, వారినెందుకు అలా ఆరోగ్యముగా చేసి నన్ను ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుట్టించాడు అని, నేను ఏమి పాపం చేసానని కుమిలిపోతు, కృంగిపోతు భాదపడుతుంటారు.*

👉 ఇంకా కొంతమంది అస్సలు దేవుడు అనేవాడు ఉన్నాడా మరి ఉంటే నేను ఎందుకు ఇలా అంగవైకల్యంతో పుడుతాను అని దేవుడినే నిందిస్తారు.

👉 ఆరోగ్యవంతులు అంగవైకల్యంతో భాద, వేదన పడుతున్న వారిని చూచి ఏంటి దేవుడు వీరి జీవితాలతో ఆటలాడుకోవడం అని,ఎందుకు ఇలాంటివారికి దేవుడు జన్మనిస్తున్నాడు అని, ఎందుకు దేవుని మనస్సు ఇంత కటినమైనది అన్న మాటలతో దేవునిని నిందించే వారు లేకపోలేదు.

👉మరి కొంత మంది అంగవైకల్యంతో పుట్టడానికి గత జన్మలో పాపం చేసారని, వారి కన్నవారు పాపం చేస్తే ఈ జన్మలో ఇలా అంగవైకల్యంగా పుట్టారని సమాజములో అనుకునే వారు కూడా లేకపోలేదు.
*ఇలా అంగవైకల్యంతో ఉన్నవారిని చూసి భాదపడుతూ , దేవునిని నిందిస్తూ చివరికి దేవుడే లేడనుకుంటున్నారు.*

1⃣ యహాను 9: 3
*యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను.*

👉 యసుప్రభువు శిష్యుల ఊహాగానాలన్నిటినీ త్రోసిపుచ్చాడు.

 👉మనుషులందరి లాగానే (రోమ్ 3:23)
 *ఆ గుడ్డివాడు, అతని తల్లిదండ్రులు పాపులు కాదని ఆయన చెప్పడం లేదు.*

👉 *ఆ మనిషి గుడ్డితనానికి వారి పాపాలకూ మాత్రం ఏ సంబంధమూ లేదంటున్నాడు.*
 
👉 *యేసుప్రభువు పునర్జన్మ సిద్ధాంతాన్ని ఉపదేశించలేదు.*
 ఆయన దాన్ని నమ్మినవాడైతే, లేదా ఈ భూమిపై మనిషి జీవితాన్ని వివరించడానికి పునర్జన్మ సిద్ధాంతం అర్థవంతమని తలచినవాడైతే అది చెప్పడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదు.
*అలా చెప్పడానికి బదులుగా ఆయన ఆ సిద్ధాంతానికి ఆధారం లేదని చూపుతున్నాడు.*

👉 *గత జన్మలో ఒక మనిషి చేసిన పాపాలు తరువాతి జన్మలో అతడి స్థితిని నిర్ణయిస్తాయన్న ఆలోచనలే ఆయన కాదన్నాడన్నమాట.*

లూకా 16:19-31లో యేసు నేర్పిన సత్యం కూడా పునర్జన్మ సిద్ధాంతానికి వ్యతిరేకమైనది.
యోహాను 3:3 కూడా చూడండి.
*శిష్యులు ఊహించిన దానికంటే మరింత ఉత్తమ కారణం మూలంగా ఈ మనిషి గుడ్డివాడుగా పుట్టాడని యేసు చెప్తున్నాడు.*

♻️ ఆ మనిషి విషయంలో దేవుని మహా శక్తివంతమైన అద్భుతం ఒకటి జరగబోతున్నది.
*దానిద్వారా దేవునికి, ఘనత కలుగనున్నది.*
 
🔺 *మనకు బాధ కలిగించే ఏ వ్యాధి, అశక్తత, అంగవైకల్యంలోనైనా దేవునికి ఇదే ఉద్దేశం ఉండవచ్చు.*

🔺 *దేవుని అద్భుత కార్యం ఒకటి మనలో కూడా జరగవచ్చు. లేదా ఆయనకు మహిమ కలిగించే వేరొక పని జరగవచ్చు.*
 
👉 అంటే అలాంటి బాధను వినయంతో, నమ్మకంగా, ఆనందంగా మనం సహించగలిగేలా మనకు సహాయం చేసే ఒక కార్యం మన హృదయంలో జరగవచ్చన్నమాట (అపొ కా 5:41; రోమ్ 5:3;2 కొరింతు 4:16-18;12:9-10; కొలస్సయి 1:24;).

3⃣ *అంగవైకల్యంతో పుట్టిన వారిని ఉద్దేశించి దేవునిని నిందించడం సరి కాదు.*
👉 అంగవైకల్యంతో పుట్టిన వారందరిని దేవుడే పుట్టిస్తున్నాడని అనుకోకండి. అలా అనుకుంటే ప్రారంభములో దేవుడు ఆదాము హవ్వను కలిగించినప్పుడు అంగవైకల్యంతో చేసాడా లేక అంగవైకల్యం లేనివారిగా చేసాడా? ఇద్దరినీ ఆరోగ్యవంతులుగా , చావు అనేది లేనట్టుగా దేవుడు కలిగించగ
*వారు పాపము చేయుట ద్వారా మరణము అను జీతము పొందుకున్నారు. అనగా పాపము చేయుట వలన శరీరం కాస్త మృతమైన దేహముగా మారిపోయింది.*
👉 దహం మృతమైనదిగా మారాలి అంటే ఆ యొక్క శరీరంలో ఉన్న జన్యువులలో ఉన్న కణాలలో మార్పు జరిగిన దేహం కాస్త మృతమైన దేహముగా మారింది. అప్పటినుండిశరీరకణాలలో శరీర జన్యువులలో మార్పులు ప్రారంభమైనాయి. అక్కడ నుంచి వారి గర్భాన పుట్టబోతున్న వారందరికీ మార్పులు వచ్చాయి.

4⃣ *మనము తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకోకపోతే అంగవైకల్యముగానే పుడతారు.*

👉 అందుకనే గర్భవతులను ఉద్దేశించి తరచుగా చెక్అప్ చేయించుకోవాలని,

👉పుట్టిన బిడ్డలకు పోలియోవేయించుకోవాలని,
👉తరచుగా అవసరమైన ఇంజక్షన్ వేసుకోవాలని,
👉టంకి మందులు వేసుకోవాలని ఇలా అనేక జాగ్రతలు చెప్తారు.

 *పాటించవలసిన జాగ్రతలు నిర్లక్షముతో పాటించక శరీరంలోకి రోగం వచ్చే సరికి దేవా ఏంటి ఈ పరిస్థితులు అని దేవుడిని నిందిస్తున్నారు.*
👉 మదటిగా గర్భముతో ఉన్న తల్లి తీసుకోనవలసిన జాగ్రతలు తీసుకోవాలి.
👉 నజముగా ఇలా అంగవైకల్యంతో పుట్టగానే అందరి చూపు దేవుని వైపు వెళ్ళిపోతుంది.
*పుట్టక ముందు మరియు పుట్టిన తర్వాత ఒక తల్లి తీసుకోనవలసిన జాగ్రతలు పిల్లల విషయములో తీసుకుంటే అప్పుడు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యముగా ఉంటాడు.*

 5⃣ *తీసుకొనవలసిన జాగ్రతలు తీసుకున్న అంగవైకల్యంతో పుట్టినప్పుడు కంగారు పడవలసిన అవసరత లేదు.*
🔺 *మోషే కూడా నత్తివాడు.*

 నిర్గమ 4:10
*నేను నోటి మాంద్యము, నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా అందుకు యెహోవా –మానవునకు నోరిచ్చువాడు ఎవడు? ముగ వానినేగాని, చెవిటి వానినేగానీ, దృష్టిగలవానినే గానీ, గ్రుడ్డి వానినే గానీ పుట్టించువాడేవడు? యెహోవానైన నేనే గదా..*

👉 మషే బట్టి ఆలోచిస్తే అంగవైకల్యపు వారితో, అంగవైకల్యం లేని వారితో దేవునికి అవసరత ఉన్నదీ.

👉 అంగవైకల్యంతో ఉన్న మోషే యొక్క ఆత్మీయ స్థితి దేవునికి నచ్చింది కనుక ఆహారోనును కాక మోషేనే ఎన్నుకున్నాడు.
🔹 *మోషేలో ఉన్న ఓపిక,సహనం, సాత్వికం లాంటి గుణాలు వలన దేవుని చేత ఎన్నికింపబడ్డాడు. దేవుని పనికి ఆహోరోను కాక మోషేనే సరియైనవాడు అని ఎన్నుకున్నాడు.*

♻️ *అంగవైకల్యంతో పుట్టిన వారమైన మేము దేవుని పనికి ఉపయోగం కాము అని అనుకోవడం సరి కాదు.*
👉 అంగవైకల్యంతో ఉన్న వారు దేవునికి అవసరం లేదని వారిని చూస్తున్న మనము అనుకోకూడదు.

మత్తయి 18:8-
*నీ చెయ్యి యైనను, నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని నరికి నీ యెద్ద నుండి పారివేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటే కుంటివాడవుగానో, అంగహినుడవుగానో జివములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దానిని పెరికి నీ యెద్ద నుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటే ఒక కన్ను కలిగి జివములో ప్రవేశించుట నీకు మేలు.*
👉 అనగా మనలో ఉన్న ఏ అవయవం అయితే చెడును జరిగించి, అభ్యంతరపరచి పాతాళమునకు నడిపిస్తుందో వాటిని పారివేయుము అని యేసు అంటున్నాడు.

రోమా 6:13-
*మీ అవయవములను దుర్నితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి.*

👉 *నిజముగా అంగవైకల్యం గలవారికిఅవయవాలు లేనందుకు నరకం వెళ్ళడానికి అవకాశం తక్కువ.*
👉 శరీరంలో ఏ అవయవం లేకపోయినా మిగిలిన అవయవాలుతో దేవుడు అప్పగించిన పని చేయవలసిన వారిగా ఉండాలి.

 రోమా9:20-
*ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు కీలాగు చేసితివని రూపింపబడినది రుపించువానితో చెప్పునా?*

👉 దవునిచే సృష్టించబడిన మనము తుదుకు దేవునినే అంగవైకల్యమును బట్టి నిండించటసరినా?కాదు.
*దేవుడు ఇచ్చిన అవయవాలతో దేవుని పని చేయాలి.*
🔺 *ఆరోగ్యవంతుడిగా అవయవాలు అన్ని సరిగా ఉన్నను దేవుని పని చేయక నరకానికి వెళ్ళిపోతున్న వాడికన్న అంగవైలక్యంతో ఉన్నను దేవుని కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళేవాడు చాలా గొప్పవాడు.*

👉 *వాస్తవముగా ఆలోచిస్తే పరలోకం వెళ్ళుటకు అంగవైకల్యం ఆటంకము కాదు.*
👉 అంగవైకల్యం అనునది శరీరానికి సంభందించిందే కానీ ఆత్మకు సంభందించింది కాదు. కనుక అంగవైకల్యంతో ఈ లోకములో జివించినప్పటికి చనిపోయాక పరలోకానికి ప్రవేశించవచ్చు *కానీ పాపంతో పరలోకానికి ప్రవేశించలేము.*

6⃣ *అంగవైకల్యం గలవారు ఆరోగ్యవంతుల స్థితిని చూచి భాదపడుతున్నారు అలానే ఆరోగ్యవంతులు అంగవైకల్యం గలవారి స్థితిని చూచి భాదపడుతున్నారు కానీ*.
♻️ *"పరలోకపు దేవుడు మానవుల పాపపు స్థితిని చూసి భాదపడుతున్నాడనే విషయం మరచిపోయారు".*

👉 అంగవైకల్యంతో ఉన్న అతి కొద్ది మందిని చూచి భాదపడుతున్నారు కానీ
*ఈ సృష్టిలో ఉన్న 700 కోట్ల మందికి జన్మనిచ్చిన పరలోకపు తండ్రి భాదను అర్థం చేసుకోవడం లేదు.*

🔹 మన కళ్ళ ముందు రెండు చేతులు లేనివాడిని చూసి అయ్యో అని భాదపడుతాము,
🔹 కంటి చూపు కోల్పోయిన వారిని చూచి అయ్యో అని సానుభుతి వ్యక్త పరుస్తాముమరి
👉 *ఏనాడైనా దేవుడు యొక్క వేదన స్థితిని ఆలోచించావా?*
🔹 చలా మంది పరలోకంలో దేవుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటున్నారు.

👉 నవాహు జల ప్రళయం ముందు దేవుని పరిస్థితిని చూస్తే ఎవరి విషయంలో భాదపడ్డాడో అర్థమవుతుంది. ఆదికాండ 6:5-
*నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నోచ్చుకోనేను.*

👉 నడున్న పరిస్థితులు ఆనాటి చెడు పరిస్థితుల కంటే మార్పు ఉంటే దేవుడు ఆనందముగా ఉన్నాడు అని అనుకోవాలి.
*వాస్తవముగా ఇప్పటి పరిస్థితులు బొత్తిగా చెడిపోయాయి.*
👉నవాహు కాలములో ఉన్న ప్రజల కన్న నేటి కాల ప్రజలు ఇంకా పాడైపోయారు.
*ఆనాడు తినుచు,త్రాగుచు సుఖిస్తున్న వారి విషయములో దేవుడు అంతగా భాదపడితే*
👉 మరి ఈ రోజు ఉన్న మనుషుల విషయములో దేవుడు ఇంకెంత భాదపడుతున్నడో అర్థం కావాలి.

7⃣ *పరలోకానికి అంగవైకల్యం ఆటంకము కాదు.*
👉 *గర్భవతిగా ఉన్నప్పుడు అన్ని జాగ్రతలు తీసుకున్నప్పుడు కూడా అంగవైకల్యంతో పుడితే భాదపడక దేవుని పనిలో ఉండగలిగితే లేక దేవునికి ఇష్టానుసారముగా ఉండగలిగితే ఆ మహాలోకమైన పరలోకానికి ప్రవేశించగలుగుతాము.*

👉 అంగవైకల్యంతో ఉన్నను లేక లేకపోయినను
 *దేవునిలోజీవించి*-
*దేవునితో జీవించి*-
*దేవునికై జీవించి*-
*దేవునిలా జీవించి*
పరలోకానికి ప్రవేశించుదాము.

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖

🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*

👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*



0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures