*....ప్రభు బల్ల.....*
👉 *1. ప్రభు బల్ల అంటే ఏంటి?*
👉 *2.ఎందుకు తీసుకోవాలి?*
👉 *3. దేనికోసం తీసుకోకూడదు?*
అనే ఈ మూడు అంశాలు ధ్యానిద్దాము.
👉 మనకు చాలా సంఘాలు ఉన్నాయి. కొంతమంది శనివారం తీసుకుంటారు. కొంతమంది మొదటి ఆదివారము & చివరి ఆదివారము తీసుకుంటారు.
*1కోరింథీయులకు 11: 23 - 32*
*నేను మీకు అప్పగించిన దానిని ప్రభువువలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞ తాస్తుతులు చెల్లించి దానిని విరిచియిది మీకొరకైన(అనేక ప్రాచీనప్రతులలో-మీ కొరకు విరవబడిన అని పాఠాంతరము) నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను ఆప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొనియీ పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని, యీ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్నుతాను పరీక్షించుకొనవలెను; ఆలాగుచేసి ఆ రొట్టెను తిని, ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు; చాలమంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము. మనము తీర్పు పొందినయెడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువుచేత శిక్షింపబడుచున్నాము.*
*ప్రభు బల్ల అంటే ఏమిటి?*
*యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను - పస్కాపశువును వధించి, హిస్సోపు కుంచె తీసుకొని, రక్తములో ముంచి, ద్వార బంధపు పైకమ్మికిని, రెండు నిలువ కమ్మిలకు ఆ రక్తము రాయవలెను. ఐగుప్తీయులను సంహరించుటకు వచ్చినపుడు ఈ రక్తము చూసి సంహరకుడు లోపలికి రాడు. దీనిని కట్టడగా ఆచరించవలెను*
(నిర్గమ 12:21-25).
*పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల పండుగ దినము రాగా, యేసు పేతురును, యోహానును చూచి మీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను*
(లూకా 22:7-8).
👉ఆ రోజు దేవుడు పస్కా బలికి సాదృశ్యముగా,
*బలి పశువుకి సరూప్యముగా రొట్టెను,*
*బలి పశువు రక్తానికి సరూప్యముగా ద్రాక్షరసాన్ని ఇచ్చెను*
(లూకా 22:17-20).
👉ఇకనుంచి ఆ రొట్టెను యేసు శరీరమునకు సాదృశ్యముగా,
👉 దరాక్షరసాన్ని యేసు రక్తానికి సారూప్యముముగా మనము తీసుకుంటున్నాము.
*ఈ ప్రక్రియనే ప్రభుబల్ల అంటాము.*
*ఎందుకు ప్రభుబల్ల తీసుకోవాలి?*
*మనము దీవుంచు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు_రక్తములోనిది త్రాగుటయే గదా?* (1కోరింథి10:16).
*ప్రభుబల్లలో పాలు పొందునపుడు అయన బలియాగాన్ని జ్ఞాపకము చేసుకోనుచున్నాము.*
(1కోరింథి 11:24)
👉ఈ కార్యము ఆది సంఘం దినదినము,
ప్రతి ఇంట కుడుకొనుచు ఆచరించేవారు. (అపో. 2:42)
👉దనిని ప్రభువువచ్చు వరకు ఆచరించెదము.
(1కోరింథి 11:26)
👉 అయన మరణము ప్రచురించు చున్నాము.
(1కోరింథి 10:16-17)
👉 దనిలో పాలు పొందునపుడెల్ల మనలను మనము పరీక్షించుకుంటాము. (1కోరింథి11:28)
*ప్రభుబల్ల దేనికోసం తీసుకోకూడదు?*
*పాపాలు క్షమింపబడుటకు కాదు.*
👉పపాలు కేవలం మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మం పొందితేనే పాపాలు క్షమింపబడతాయి.
*శరీర ఆరోగ్యంకోసం కాదు.*
👉పరభుబల్ల వలన శరీర ఆరోగ్యము రాదు, నిత్య జీవము కలుగును.
(యోహాను 6:53-59)
*ఇది దేవుని శరీరం రక్తం అని కాకుండా అయోగ్యముగా స్వీకరిస్తే బలహీనులము రోగులము అవుతాము*
(1కోరింథి 11:30)
👉తలియక కొందరు రక్షణ, ఆశీర్వాదము,
👉రగ విముక్తి కొరకు,
👉 సమస్యల పరిష్కారము కొరకు,
👉ఫలహారం కొరకు ప్రభు బల్లలో పాలు పొందుతున్నారు.
*అలా కాకుండా నిర్దోషమైన చేతులతో ప్రభు బల్లలో పాలు పంచుకుందము.*
*అయోగ్యులముగా కాక ప్రభుబల్లకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకొని, యోగ్యులగా ప్రభుబల్ల_సమీపిద్దాము.*
👉 అప్పుడే నిత్యజీవ పాత్రులము అవుతాము. అటువంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించును గాక!
*హల్లెలూయ...*
*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*
*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వాసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.మీ ప్రార్థనలే మాకు ఆశీర్వాదము.*
👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.*
👉 *మీ మిత్రులకు share చేసి మీ వంతుగా దేవుని పని చేయండి.*
0 comments