>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

✍️ *మట్టల ఆదివారం ప్రత్యేక అంశం: విమోచన* ✍️





👉       "మీ యెదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; వెళ్లగానే కట్టబడియున్న యొక గాడిదయు దానితోనున్న యొక గాడిదపిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నాయొద్దకు తోలుకొని రండి; ఎవడైనను మీతో ఏమైనను అనిన యెడలఅవి ప్రభువునకు కావలసియున్నవని చెప్పవలెను, వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. (మత్తయి 21:2-3)"

👉 ఈ వచనములో గొప్ప విషయాలు దాగివున్నవి.
ఒలివ కొండ యెరూషలేము నకు తూర్పువైపున ఉంది. ఆ కొండ పైనుంచి దిగువన ఉన్న నగరాన్ని చూడవచ్చు. అక్కడ నుండి వేరే చోట ఏం జరుగుతున్నదో తెలుసుకో గలిగిన శక్తి క్రీస్తు నకు ఉంది అని అనడానికి ఇది ఒక ఉదాహరణ. ( జెకర్యా 9:9). రాజు తన రాజ నగరంలోకి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఇది అహంభావం లేని సాధుశీలికి తగిన నగర ప్రవేశం (11:29). “సీయోను కుమారి” అంటే జెరుసలం. యేసు తన ఇద్దరి శిష్యులను ఆ గ్రామమునకు పంపాడు.  ఏమేం జరుగుతున్నదో తెలిసి, ఏం చెయ్యాలో అతి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వగలిగిన రాజును సేవించే అవకాశం, అధిక్యత క్రైస్తవులది. వారు చేయవలసినదల్లా విధేయత చూపడమే.

👉         ఇక్కడ శిష్యులు విధేయత చూపించారు, గాడిద యజమాని, గాడిద ఇలా అందరూ విధేయత చూపించుట మనం చూడగలం. శిష్యులు ఆ గ్రామమములోకి వెళ్లి కట్టబడిన గాడిద కట్లు విప్పి యేసు వద్దకు తీసుకొచ్చారు. అక్కడ అందరూ తమ పై వస్త్రాలు పరిచి యేసుని గాడిద మీద ఎక్కించి, 2 రాజులు 9:13 లో చూపిన సాదృశ్యము వలె
" వెంటనే వాళ్ళంతా వాళ్ళ పైవస్త్రాలను తీసి యెహూక్రింద మెట్లమీద పరిచారు. వాళ్ళు పొట్టేలు కొమ్ము బూర• ఊది “యెహూ రాజయ్యాడు” అని ప్రకటించారు." ( 2 రాజులు 9:13) యేసుని గాడిద మీద ఎక్కించి, చెట్ల కొమ్మలు నరికి, తమ వస్త్రాలు రోడ్ల మీద పరిచి, ఆ నగరం అంతా తిప్పుతూ దావీదు రాజుకు జయము అని స్తుతించారు.  
“జయం”– ఇది హీబ్రూ పదం “హోసన్నా” నుంచి తర్జుమా చేయబడింది. పూర్వం దీనికి అర్థం “రక్షించు” అని చేసే ప్రార్థన. కాలక్రమేణ అది సంస్తుతులను వెల్లడి చేసే మాట అయింది. ఇది రక్షించగలిగినవాడు ఇక్కడే ఉన్నాడని సూచిస్తూ ఆయన్ను స్తుతించే పదం.  కొందరు యేసును అభిషిక్తుడుగా, దేవుడు నియమించిన రాజుగా అంగీకరించేందుకు సిద్ధమయ్యారు.

👉  ఈ మట్టల ఆదివారం సందేశం ద్వార మనం విమోచన / విడుదల అనే అంశాన్ని ధ్యానించాలి

👉   గడిద తన కట్లు విప్పబడుట వలన యేసునే తన మీద ఎక్కించుకొని మోసే ఘనత పొందింది. యెరూషలేమునకు దూరముగా కట్టబడిన గాడిద విప్పబడిన తరువాతే దేవుని మోసుకొని పోయింది, ఘనత పొందింది. విప్పబడక పోతే స్వాతంత్ర్యము లేదు, విమోచన లేదు.

♻️  *● విమోచన గూర్చి ఇంకొన్ని బైబిల్ సత్యాలు ●*

👉 *◆  మనకు మరణము నుండి విడుదల అవసరం:*
                ఎఫెసీయులకు 2:1 లో "మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారైయుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను." ఆజ్ఞను మీరి పాపం చేసిన సంతానము మనం. మరణమే మన పితరులు మనకిచ్చిన స్వాస్థ్యము. దానినే మనం అనుభవిస్తున్నాము. కడపటి ఆదాముగా వచ్చిన క్రీస్తు మరణము జయించి తిరిగి లేచి మరణము నుండి మనలను విడిపించి మనలను తిరిగి జీవింప చేసెను.

👉  *◆  మరణ బలము గలవాని నుండి విడుదల అవసరం:*
              హెబ్రీయులకు 2:14,15 లో "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణముయొక్క బలముగలవానిని, అనగా అపవాదిని(అనగా-సాతాను) మరణముద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను." ఈ లోక అధికారులు మన ప్రభువైన యేసును ఘోరమైన సిలువ వేసి చంపియున్నాము అని సంతోషించిరి. సమాధికి ముద్ర వేసి కావలి ఉంచారు. కానీ మరణపు ముళ్ళు విరిచి వేయగల సమర్ధుడు అని అంచనా వేయలేకపోయిరి. మొదటి కొరింథీయులకు 2:8 లో "అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు; అది వారికి తెలిసియుండినయెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయియుందురు."

👉 *◆  దర్మసంబంధమైన శాపము నుండి విడుదల అవసరం:*
               గలతీయులకు 4:4,5 లో "అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి, మనము దత్తపుత్రులము(స్వీకృతపుత్రులము) కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి యున్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను." ధర్మశాస్త్రం పాపము గూర్చి భోధించింది కాని పాపము తీయలేకపోయింది. మన ప్రభువైన యేసు సిలువలో బలియాగము ద్వార శాపము నుండి విడుదల చేసి ధర్మశాస్త్రం నెరవేర్చాడు.

👉 *◆  దుర్నీతి నుండి విడుదల అవసరం:*
           తీతుకు 2:14 లో "ఆయన సమస్తమైన దుర్నీతినుండి మనలను విమోచించి, సత్‌క్రియలయందాసక్తిగల ప్రజలను తన కోసరము పవిత్ర పరచుకొని తన సొత్తుగా చేసికొనుటకు తన్నుతానే మనకొరకు అర్పించుకొనెను." గనుక పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు దుర్నీతిని విడిచి మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి.


👉 *◆  బంధకములనుండి విడుదల అవసరం:*
             ఇశ్రాయేలీయులు ఐగుప్తు లో 430 సంవత్సరములు బానిసలుగా బాధలను అనుభవించుచున్నపుడు వారు పెట్టిన మొఱ్ఱ కృప కలిగిన దేవుడు ఆలకించి వారిని విడిపించుటకు మోషే ను పంపించాడు. యూదా జనాంగము బబులోనులో చేరలోనుండుటకు కొనిపోబడిన 70 సంవత్సరముల తరువాత వారిని బంధకముల నుండి విడిపించాడు.

♻️ *● విమోచనకై మార్గాలు ●*

👉 *◆  విమోచించగలవాడు దేవుడొక్కడే:*
              "కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు హిత్తీయులకు అమోరీయులకు పెరిజ్జీయు లకు హివ్వీయులకు యెబూసీయులకు నివాసస్థానమై, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించు టకును దిగివచ్చి యున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నాయొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారినిపెట్టు చున్న హింస చూచితిని." (నిర్గమ 3: 8,9).

👉 *◆  విమోచించుటకు ఒక మధ్యవర్తి కావాలి:*
          "కాగా రమ్ము, నిన్ను ఫరోయొద్దకు పంపెదను; ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులోనుండి తోడుకొని పోవలెననెను. (నిర్గమ 3:10)."  ఇశ్రాయేలీయులు తమ కష్టకాలంలో దేవునికి మొఱ్ఱపెట్టగా మొదట మోషేను, ఒకసారి ఒత్నియేలును, ఒకసారి ఏ హుదును, ఒకసారి గిద్యోనును ( న్యాయాధిపతులు 3:9,15; 6:14) వారికి రక్షకులుగా పంపితివి. మనం పాపులుముగా ఉండగా యేసే స్వయముగా రక్షకునిగా (మత్త 1:21) వచ్చియున్నాడు.

👉 *◆  విమోచించుటకు రక్తం అవసరం:*
             "మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు." (నిర్గమ 12:13). ఇశ్రాయేలీయుల పస్కా పశువు రక్తమును తమ ఇంటి ద్వారము యొక్క కమ్మీ మీద చిలకరించుట ద్వార దేవుని ఆజ్ఞ నెరవేర్చి మరణము నుండి తప్పింపబడి యున్నారు. మానమింక పాపులమై యుండగా పస్కా పశువుగా యేసే విధింప బడి ఆ రక్తము ద్వార మనం రక్షింపబడియున్నాము. "అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమైయుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును. (1 యెహను 1:7)".

👉◆  విమోచించుటకు బ *హువు (ఒక శక్తి ) అవసరం:*
             "కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పుమునేనే యెహోవాను; నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి, వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులుతీర్చి మిమ్మును విడిపించెదను (నిర్గమ 6:6)."
"నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది నా బాహువులు జనములకు తీర్పుతీర్చును ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవా రగుదురు వారు నా బాహువును ఆశ్రయింతురు. (యెషయా 51:5)"
ఉగ్రత నుండి తప్పించుకొనుటకు, విమోచింపబడుటకు యేసు యొక్క బహువు అవసరం.

👉 *◆  విమోచించడానికి ఒక దినం అవసరం:*
          ఇశ్రాయేలీయులు 450 సంవత్సరములు గడిచిన తరువాతే యెహోవా సేనలు ఐగుప్తు నుండి బయలుదేరి పోయెను. ఆనాడే పస్కా (15th of Bisan). ఇది దైవ నిర్ణయం. ఇది ఆదిలో అబ్రాహామును పిలిచిన దినమున దేవుడు బయలుపరచాడు (ఆది 15:14). ఆ మహా దేవుని ప్రణాళిక ఎంత సుధీర్ఘమైనది? మరి మన విషయమైతే ప్రతి వ్యక్తి రక్షణ  (విమోచన) గూర్చి ఒక దినము నిర్ణయించాడు (హెబ్రీ 4:7),  ఇదిగో ఇదియే రక్షణ దినము (2కోరింది 6:2). కాబట్టి రక్షణ పొందుటకు ఆలస్యము చేయకు. మంచి రోజు అని చూడకు. ఎందుకంటే రేపు నీది కాదేమో!
             ప్రియమైన సహోదరుడా, సహోదరీ నీవు మరణము యొక్క బలము నుండి, ధర్మశాస్త్ర శాపము నుండి, దుర్నీతి నుండి, సాతాను బంధకముల నుండి విడుదల పొందితివా? అవును అంటే దేవునికి వందనములు. ఇంకా లేదు అంటే నేడే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో. ఎందుకనగా నీకు నీవు విడిపించుకోలేవు సుమా! విమోచింపబడిన ఇశ్రాయేలు వలె ఎఱ్ఱసముద్రం దాటి, యెర్ధను దాటి కనాను చేరాలి. విమోచింపబడిన గాడిద వలె ప్రభువుని కలిగి యెరూషలేము చేరాలి. అలా చేరుటకు ఆ ప్రభువు సహాయం చేయును గాక! ఆమెన్!!!







 

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures