>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

 

 


 
✳️  *దానియేలు భక్తుడు కాలములో రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ చేయించి, దాని పూజించని వారిని అగ్నిగుండములో వేసాడు. అగ్నిగుండములో మహాభక్తుడైన "దానియేలుని" వేయకుండా కేవలము "షద్రకు, మేషాకు , అబేద్నగో" అను ముగ్గురిని మాత్రమే వేసాడు. ఎందుకు దానియేల్ ను అగ్నిగుండములో వేయలేదు ?*

👉 దానియేలు  ఆ ప్రతిమను పూజించలేదు. అయినా అగ్ని గుండములో వేయబడలేదు.

*ఇలాంటిదే మరొక విచిత్ర సంఘటన ఇదే దానియేలు గ్రంధములో వ్రాయబడింది . రాజగు దర్యావేషు కాలములో రాజుకు తప్ప మరి ఎవరికైనా ప్రార్ధన చేస్తే సింహల గుహలో పడద్రోయమని శాసనము చేయబడింది . అప్పుడు దానియేలు మాత్రమే సింహల గుహలో పడద్రోయ బడ్డాడు కానీ షద్రకు, మేషాకు , అబేద్నగోలు సింహల గుహలో పడద్రోయబడలేదు.*

ప్రాణాలు తెగించిమరి అగ్నిగుండములోకి వెళ్లిన ఈ ముగ్గురూ దేవునికి ప్రార్ధన చేసి ఉండరా ?! తప్పకుండా ప్రార్ధన చేసే ఉంటారు కానీ సింహల గుహలో పడద్రోయబడలేదు.

👉 *అదే ఎందుకు  దానియేలు  ఎందుకు అగ్ని గుండములో వేయబడలేదు ?*

👉  *షద్రకు, మేషాకు , అబేద్నగోలు ఎందుకు సింహల గుహలో పడద్రోయబడలేదు?*

👉 *వాళ్ళు అందరూ ఒకే కాలములో బ్రతకలేదా ?*

♻️ *వాళ్ళందరూ స్నేహితులు , దాదాపు సమాన వయస్సు కలవారు. వాళ్ళ నలుగురు బ్రతికివుండగానే ఈ రెండు సంఘటనులు జరిగాయి.*

👉 కనీ ఈ బేధము వెనక దేవుడు  మనకు ఒక ముఖ్యమైన పాఠము నేర్పాలనుకున్నాడు .

🔺 *ఎప్పుడైనా సాతాను ఒక శోదనగాని,శ్రమగాని విశ్వాసులందరి మీదకి  తీసుకుని  వస్తాడో అప్పుడు అందరు  విశ్వాసులు ఒకేలా శ్రమపడరు,ఒకేలా శోధింపబడరు.*

👉  ఆ శ్రమ లేదా శోధన యొక్క ప్రభావము కొందరి మీద అధికముగా ఉంటుంది,కొందరి మీద తక్కువగా ఉంటుంది , కొందరి మీద అసలు ఉండనే ఉండదు.

👉 సతాను ఒక కుటుంబాన్ని శోధించాలి అనుకున్నాడు అనుకో ఆ శోధన కుటుంబములో అందరి వ్యక్తులకు ఒకేలా ఉండదు.

▪️ ఒకొక్కసారి ఆ శోధన భార్యకు ఎక్కువగా ఉంటుంది ,
▪️ మరొకసారి ఆ శోధన భర్తకు ఎక్కువగా ఉంటుంది ,

▪️ఇంకొకసారి ఆ శోధన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది.

👉 *సాతాను హిట్ లిస్ట్ లో ఎవరువుంటారో, దేవుడు ఎవరిని అనుమతిస్తాడో వాళ్లే ఎక్కువగా శోదించబడతారు.*  

🔺 దనికి  చక్కటి ఉదాహరణ మన యేసయ్య లూకా 22:31లో చెప్పాడు . ఇక్కడ మన ప్రభువు   *"సీమోనూ, సీమోనూ, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని"* అంటున్నాడు .

👉 ఇక్కడ యేసయ్య...  సాతాను *"మిమ్మును"* శోధిస్తాడు అని అందరి గురించి  చెబుతూ *సీమోనూ  పేతురు యొక్క విశ్వాసము మాత్రమే తప్పిపోకుండునట్లు వేడుకున్నాడంట .*

👉 *అంటే సాతాను... శిష్యులందరిని శోదించబోతున్నప్పటికీ, ఆ  శోధన యొక్క ప్రభావము మాత్రము పేతురు మీద ఎక్కువగా ఉండబోతుంది.*

👉 సతాను హిట్ లిస్ట్ లో ఈసారి పేతురు వున్నాడు, నన్నెరుగనని ముమ్మారు అబద్ధము చెబుతాడు అని ముందే తెలిసి యేసయ్య  ముందుగానే ప్రార్థన చేసాడు.

🔺 *అదేవిధముగా  బబులోను దేశములో 'అగ్నిగుండములో పడద్రోయబడుట' అనే శోధన అందరికి వచ్చినప్పటికీ సాతాను హిట్ లిస్ట్ లో మాత్రము షద్రకు, మేషాకు , అబేద్నగో  మాత్రమే వున్నారు.*

🔺 *కానీ దానియేలు ఆ హిట్ లిస్ట్ లో లేడు   .  అలాగే ' సింహల గుహలో పడద్రోయబడుట 'అనే శోధన అందరికి వచ్చినప్పటికీ సాతాను హిట్ లిస్ట్ లో మాత్రము దానియేలు మాత్రమే వున్నాడు కానీ షద్రకు, మేషాకు , అబేద్నగోలు లేరు . వాళ్ళను ఏదోరకంగా  దేవుడు ఆ శోధన నుండి తప్పించాడు.*

♻️ *దానియేలు గ్రంధము ద్వారా దేవుడు మనకు ఈ పాఠాలని నేర్పడము వెనకు దేవునికి  ఏమైనా ప్రత్యేక ఉద్దేశము వుందా ?*

అవును బ్రదర్, ఏ ఉద్దేశము లేకుండా అనంతజ్ఞాని అయిన మన దేవుడు ఏమిచేయడు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి ,

*ఏ మతగ్రంధానికి లేని ఆధిక్యతలు బైబిల్ గ్రంధానికి మాత్రమే  ఉన్నాయి*

👉 అందులో ఒకటి ..  
*బైబిల్ గ్రంధము మాత్రమే భవిష్యత్ గురించి చెబుతుంది. కొత్తనిబంధనలో ప్రకటన గ్రంధము యేసు రెండవ రాకడ గురించి , భవిష్యత్ సంఘటనలు గురించి చెప్పే గ్రంధము. పాతనిబంధనలో కూడా ఇలాంటి గ్రంధమే వుంది అది దానియేలు గ్రంధము, ఈ గ్రంధము కూడా భవిష్యత్ సంఘటనలు గురించి చెబుతుంది .*

👉 దనియేలు గ్రంధాన్ని  బైబిల్ పండితులు *"పాతనిబంధన ప్రకటన గ్రంధము"* అంటారు. ఎందుకంటే *ఈ రెండు గ్రంధాలు యేసు రెండవ రాకడ గురించి , అబద్ద క్రీస్తు గురించి , అప్పుడు వుండే పరిస్థితుల గురించి ముక్తకంఠముతో చెబుతాయి.*   

👉 అబద్ద క్రీస్తు కాలములో వాడు చేసిన ప్రతిమకు నమస్కరించకుండా , 666 ముద్ర వేయించుకొనకుండా  ఆ యేసుని  నమ్ముతున్నవారిని  నరికి చంపేయండి (ప్రకటన13:15) అని అబద్ద క్రీస్తు ఆజ్ఞాపిస్తాడు.

👉 *ఎలాగైతే నెబుకద్నెజరు చేసిన బంగారు ప్రతిమకు నమస్కరించకపోయినా దానియేలు ఆ అగ్నిగుండములోకి వెళ్లలేదో ,అలాగే  కొందరు అబద్ద క్రీస్తు చేసిన ప్రతిమను  నమస్కరించపోయినా , 666 ముద్ర వేసుకోకపోయినా బ్రతికే వుంటారు.*

👉 👉 చలామంది ఎవరైతే హతసాక్షులగా  ఉండటానికి దేవుని చేత నిర్ణయించబడ్డారో వాళ్ళు మాత్రమే చంపబడతారు . మిగిలిన వారు మాత్రమూ ఎదో ఒక విధముగా విచిత్రముగా దానియేలులా కాపాడబడతారు, పోషించబడతారు .

🔺 *ఈ పాఠాన్ని నేర్పడానికి దేవుడు ఆ నలుగురి జీవిత చరిత్ర వాడుకున్నాడు కాబట్టి మనము కూడా ఎన్ని శ్రమలు, కష్టాలు వచ్చినా దానియేలు,షద్రకు, మేషాకు , అబేద్నగోలు వలే  ప్రభుకొరకు బలముగా నిలబడదాము,యేసు తప్ప వేరొక రక్షణ మార్గములేదనిగళమెత్తి చాటుదాం .చెప్పడము మాత్రమే మన బాధ్యత .*

*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
 
ప్రభుసేవలో....✍

మీ సహోదరుడు
*పాస్టర్ పాల్ కిరణ్ ,*
తాడిపత్రి,
అనంతపురం జిల్లా. A.P


 

 

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures