☘ సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను, యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను - రూతు 1:20, 21
🍁 నయోమి చెప్తుంది దేవుడు నాకు దుఃఖము కలుగజేసెను, నన్ను బాధపరచెను అని. మనము కూడా అనేక సందర్భాలలో దేవుడు నన్ను బాధపరచెను, నన్ను ఏడిపించెను ఆయనకు కనికరము లేదు నా జీవితములో ఆనందము లేకుండా చేసాడు అని అంటుంటాము.
🍁 నిజముగానే నేటి మన దుఃఖమునకు, నేటి మన బాధకు కారణము దేవుడేనా, మరి దీన్నిబట్టి దేవుడేమి సెలవిస్తున్నారో, మనము ఏమి చేశామో ఒక్కసారి తెలుసుకుందాము.
☘ దేవుని చిత్తము కానీ మార్గాలలో నడుచుట వలన మనము దుఃఖమునకు గురి కావల్సి వస్తుంది.
🍁 బేత్లెహేములో కరవు వచ్చింది, తినటానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమయములో నయోమి భర్త తన భార్యను, తన ఇద్దరి పిల్లలను తీసుకుని వేరే దేశమునకు వెళ్ళాలి అని ఆలోచన చేసినప్పుడు, తీర్మానం తీసుకున్నప్పుడు ఒక్కసారి అయినా దేవుని చిత్తము కోసము, దేవుని నడిపింపు కోసం దేవుని సన్నిధిలో ఎదురుచూడలేదు, దేవుణ్ణి సలహా అడగలేదు తమంతట తామే వెళ్లిపోయారు. కాబట్టి కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చింది నయోమి తన భర్తను, బిడ్డలను కోల్పోయి రిక్తురాలిగా మార్చబడింది.
☘ దేవుడు చెప్పిన మార్గములో నడవకపోవుట వలన మనము దుఃఖమునకు గురికావల్సి వస్తుంది.
🍁 సొదొమ గొమొఱ్ఱ పట్టణములను నాశనం చేస్తున్నప్పుడు దేవుడే ఒక ప్రాంతాన్ని చూపించి అక్కడకి వెళ్లమంటే వద్దులే ప్రభువా ఇది దగ్గరగా ఉంది అని మరొక ప్రాంతానికి వెళ్ళాడు లోతు. మత్తుడై చేయారని పాపము చేసి, తన బిడ్డల జీవితంలో సంతోషము లేకుండా దేవుని ప్రజలను బాధించిన మోయాబీయులు, అమ్మోనీయులు జన్మించుటకు కారకుడు అయ్యాడు లోతు.
🤔 మరి దేవుడే కారణము అని చెప్తున్న మనకి దేవుడు చెప్తున్న మాటలు ఏమిటి??
🌷 దేవుడు అన్యాయము చేయుట అసంభవము. సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము
🌷 సర్వశక్తుడు న్యాయము తప్పడు.
🌷 నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారి కిచ్చును అందరికి వారి వారి మార్గములనుబట్టి వారికి ఫలమిచ్చును - యోబు 34:10 - 12
🤔 కాబట్టి ఈరోజు మన దుఃఖమునకు కారణము ఏంటి?
🌷 దేవుని చిత్తములేని మార్గములో నడుచుట,
దేవుడు చెప్పిన మార్గములో నడువక పోవుట వలన నేడు మనలో అనేకమందిమి కన్నీటి మార్గాలలో గుండా నడుస్తున్నాము, శోకపు వలలోచిక్కుబడి ఉన్నాము. అందుకు కారణం మన సొంత నిర్ణయాలు మాత్రమే.
🌷 కాబట్టి ఈరోజు మన దుఃఖం తుడిచివేయబడాలి అంటే, మన కన్నీరు నాట్యముగా చేయబడాలి అంటే, మన విచారం ఆనందంగా మారాలి అంటే మారాని పోలిన మార్గములలో మన జీవితాన్ని మధురంగా చేయ శక్తిగల దేవుని పాదాల చెంతకు చేరుదాము. ఆయనే మనకి నోటి నిండా నవ్వు కలుగజేయువారు. ఇట్టి ధన్యత ప్రభువు మన అందరికి అనుగ్రహించును గాక...
0 comments