>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

I సమూయేలు- బైబిల్ స్టడీస్

Posted by Jhon Peter Friday, August 16, 2019

 I సమూయేలు -బైబిల్ స్టడీస్

పరిచయం

రచయిత: -  తెలియదు.

వ్రాసిన కాలం:

మొదటిలో 1,2 సమూయేలు పుస్తకాలు ఒకటిగా ఉండేవి. పాత ఒడంబడికను గ్రీకు భాషలోకి అనువదించినప్పుడు అనువాదకులు ఈ పుస్తకాన్ని రెండుగా విభజించారు.

 1 సమూ 27:6లో రచయిత విడిపోయిన రాజ్యాన్ని సూచించగల యూదా రాజులను గురించి వ్రాస్తున్నాడు కాబట్టి, అతడు ఈ పుస్తకాలను సొలొమోను మరణించిన తరువాతనే వ్రాసి ఉండాలి అని చెప్పవచ్చు. సొలొమోను కుమారుడు రెహబాం కాలంవరకు రాజ్యం విడిపోలేదు.

ముఖ్యాంశాలు:

1) న్యాయాధిపతులలో లేక నాయకులలో సమూయేలు అత్యంత ఘనుడు.
1 సమూయేలులో అతని పుట్టుక, జీవితం, అతడు చేసినపని ఒక ముఖ్యాంశంగా ఉంది.

 2) మరొక ముఖ్యాంశం
👉 ఇస్రాయేల్‌వారు తమకు దేవుడు రాజుగా ఉండడానికి ఒప్పుకోకుండా ఒకతణ్ణి రాజుగా నియమించుకోవడం.

3) మరో ముఖ్యాంశం:
👉 దావీదు జీవితంలోని ఆరంభ దశను మొదలుకొని సౌలు మరణించేంతవరకు జరిగిన సంగతులు. బైబిలులోని మిగతా భాగాలలాగే ఈ పుస్తకంలో నుండి కూడా ఇప్పటి విశ్వాసులు గ్రహించవలసిన ఆత్మసంబంధమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి (2 తిమోతి 3:16-17).

విషయసూచిక: -

సమూయేలు తల్లి హన్నా 1:1-20

సమూయేలు పుట్టుక, బాల్యం 1:20-28

హన్నా గీతం 2:1-10

భక్తిహీనులైన ఏలీ కుమారులు 2:12-17

ఏలీ ఇంటిమీద దేవుని కోపం 2:27-36

దేవుడు సమూయేలును పిలవడం 3:1-21

దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకుపోవడం 4:1-11

ఏలీ మరణం, ఇకాబోద్ పుట్టుక 4:12-22

దేవుని మందసం ఫిలిష్తీయ పట్టణాల మీదికి తెచ్చి పెట్టిన చేటు 5:1-12

మందసాన్ని ఇస్రాయేల్‌కు తిరిగి ఇచ్చివేయడం 6:1—7:1

మిస్పావద్ద ప్రజలు తిరిగి ప్రతిష్ఠించుకోవడం, ఫిలిష్తీయవారి ఓటమి 7:2-13

రాజుకోసం ప్రజల కోరిక 8:1-22

సౌలు, సమూయేలు 9:1-27

సమూయేలు సౌలును అభిషేకించడం 10:1-8

సౌలు రాజు కావడం 10:9-27

సౌలు అమ్మోనువారిని ఓడించడం 11:1-15

సమూయేలు చివరి ఉపదేశం 12:1-25

సౌలు ఒక హోమబలిని అర్పించడం, సమూయేలు అతణ్ణి ఖండించడం 13:1-15

కత్తులు, ఈటెలు లేని సైనికులు 13:16-22

యోనాతాను సాహసకార్యం 14:1-14

ఫిలిష్తీయవారిమీద విజయం 14:15-23

సౌలు తీర్మానం, యోనాతానుకు అపాయం 14:24-45

శత్రువులమీద సౌలు సాధించిన విజయాలు 14:46-52

అమాలేకువాళ్ళ పై యుద్ధం 15:1-33

సౌలు అవిధేయత 15:1-9

సమూయేలుద్వారా సౌలుకు దేవుని సందేశం,
సౌలును రాజుగా దేవుడు తిరస్కరించడం 15:8-35

సమూయేలు దావీదును అభిషేకించడం 16:1-13

సౌలు ఇంటిలో దావీదు 16:14-23

దావీదు గొల్యాతు 17:1-58

దావీదు మీద సౌలుకు అసూయ, భయం 18:1-16

సౌలు దావీదు చావును కోరడం 18:17-25

దావీదు సౌలు కూతురు మీకాల్‌ను పెండ్లాడడం 18:26-27

దావీదును చంపడానికి సౌలు ప్రయత్నం 19:1-11

దావీదు తప్పించుకుపోవడానికి మీకాల్ సహాయం 19:12-17

సౌలు, అతని మనుషులు పరవశులై ప్రకటించడం 19:19-24

దావీదు, యోనాతానుల మధ్య అమోఘమైన స్నేహం 20:1-42

దావీదు నోబుకు తప్పించుకుపోవడం, అక్కడ ఒక యాజకుడు దావీదుకు
ప్రతిష్ఠితమైన రొట్టెను, గొల్యాతు ఖడ్గాన్ని ఇవ్వడం 21:1-9

గాతులో దావీదు పిచ్చివానిలాగా నటించడం 21:10-15

అదుల్లాం, మిస్పాకు దావీదు పారిపోవడం 22:1-5

నోబులో యాజులను సౌలు చంపడం 22:6-23

కెయీలా పట్టణాన్ని దావీదు కాపాడడం 23:1-13

జీఫువారు దావీదును మోసగించడం 23:14-29

దావీదు సౌలును ప్రాణంతో వదలడం 24:1-22

దావీదు, నాబాలు, అబీగేల్ 25:1-44

దావీదు సౌలు రెండోసారి ప్రాణంతో వదలడం 26:1-25

దావీదు, ఫిలిష్తీయవారి దగ్గరకు తిరిగి వెళ్ళడం 27:1-12

ఏన్‌దోరులో పూనకం వచ్చి పలికే స్త్రీని సౌలు దర్శించడం 28:1-25

ఫిలిష్తీయవారు దావీదును సిక్లగుకు తిరిగి పంపడం 29:1-11

దావీదు దేవునిలో ఆదరణను పొందడం 30:1-8

దావీదు అంతటిని తిరిగి చేకూర్చుకోవడం 30:9-31

గిల్బోవా కొండమీద సౌలు, యోనాతానుల మరణం 31:1-13



0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures