>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
  ఆపత్కాలములోనున్నావా?

ఆపదలు,శ్రమలు, శోధనలు, కష్టాలు ... ఈ మాటలు అంటేనే మనకు భయం. వీటిని యిష్టపడేవారుగాని, కోరుకొనేవారుగాని ఎవ్వరూ వుండరు. వీటిని మనం యిష్టపడడంలేదని మనవెంట రాకుండా వుంటాయా అంటే, ఎంత వద్దనుకున్నా వెంటబడి తరుముతూనే ఉంటాయి.

ఆధ్యాత్మిక దృష్టితో మనము ఆలోచించగలిగితే, ఆపదలే, శ్రమలే మనలను మన నిత్యమైన గమ్యానికి చేర్చేమార్గాలు.

 ప్రభువుకు మనము మరింతగా సన్నిహితమయ్యే సమయం ఏదైనా వుందంటే? అది ఆపత్కాలమే.

ఆపద సమయాన్ని సరియైన రీతిలో ఉపయోగించుకోగలిగితే, శ్రమలయందునూ ఆనందించగలము. శ్రమలయందే అతిశయించగలము. శ్రమలలో సహితం ఆనందించగలగడం దేవుని పిల్లలకుమాత్రమే సాధ్యం.

కష్టాల కడలిలో తీరం తెలియని పయనంలా సాగిపోతుందా జీవితం?
 ప్రభువు వైపు మాత్రమే  నీవు చూడగలిగితే, ఆయనపైన మాత్రమే ఆధారపడగలిగితే  కృంగిపోవాల్సిన పని ఎంతమాత్రమూ లేదు. యిక ఆయన పర్ణశాల ఎంతోదూరంలో లేదు.

ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును. (కీర్తనలు 27:5)

🏠 ఆయన పర్ణ శాలలో ఎప్పుడు అడుగు పెట్టగలమంటే? ఆపత్కాలంలోనే!
   
మనము ఎదుర్కొంటున్న శ్రమలు, శోధనలు ప్రభునకు మరింత దగ్గరచేసేవిగా వుండగలగాలి. శోధనలద్వారా మనము క్రీస్తుయొక్క సమరూపంలోనికి మారగలగాలి.

ఎప్పుడైతే ఆయన పర్ణశాలలో అడుగుపెట్టామో?
🔸ప్రభువు మన కన్నీటిని ప్రేమతో తుడుస్తాడు.
🔸మన దుఃఖదినాలు సమాప్తమవుతాయి.
🔸మన కన్నీరు నాట్యముగా
మార్చబడుతుంది.

 🏡 ఆయన గుడారము చాటున ఎప్పుడు దాగి యుండగలమంటే? ఆపత్కాలంలోనే!
    
యెహోవా! నీ ప్రసన్నతను చూచేటట్లు, నీ ఆలయంలో నిన్ను ఆరాధించేటట్లు, నా జీవితమంతా నీసన్నిధిలో నివసించాలి.
ఇట్లాంటి ఆశను కలిగి యుండి, దానిని వెదికే వారముగా మనముంటే?  ఆపత్కాల సమయంలో ఆయన గుడారంలో మనలను దాస్తాడు.

నీవు ఎదుర్కొంటున్న ఆపదలు, శోధనలు, శ్రమలు... యివన్నీ ఆయన గుడారాములోనికి నిన్ను  చేర్చగలిగితేనే వాటివలన నీ జీవితానికి క్షేమం.

👉 అట్లా కాకుండా నీవెదుర్కొంటున్న పరిస్థితులు  దేవునినుండి నిన్ను దూరముగా నెట్టుతూవుంటే, అత్యంత ప్రమాదకరమైన స్థితిలో నీవున్నట్లే. ఆపత్కాలమే ఆయన గుడారములో ప్రవేశించే సమయమని నీవు గ్రహించగలిగితే జీవితం ధన్యమయినట్లే.

ఆయన గుడారంలో నీవుంటే? ఇక శత్రువు నిన్నేమి చెయ్యగలడు?

 సాతాను సంధించే ఎట్లాంటి అగ్నిబాణాలైనా సరే, ఆయన గుడారాన్ని చేధించగలవా? ఛేదించడం కాదుకదా, దాని దరిదాపుల్లోనికి కూడా చేరలేవు.

🏔 ఎతైన ఆశ్రయ కొండ మీద మనలను ఎక్కించి కాపాడతాడు.
    
ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు; ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.
                ద్వితి 32:4

◾ఆయనే నీ ఆశ్రయ దుర్గము.
◾ఆయన కార్యములు సంపూర్ణము.
◾ఆయన ఏది చేసినా న్యాయమే.
◾ఆయన ఏ దోషం లేని వాడు.
◾ఆపత్కాలంలో నమ్మదగిన వాడు.
◾ఆయన నీతిపరుడు
◾ఆయన యదార్ధవంతుడు.

నీ ప్రతీ పరిస్థితిని ఆయనకు అప్పగించు.నీ సమస్యలనుండి విడిపించి, నీ కన్నీటిని నాట్యముగా మార్చగలడు.

 ఆ రీతిగా మన జీవితాలను సిద్దపరచుకుందాం! 

అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక!
 ఆమెన్! ఆమెన్! ఆమెన్!

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures