Sunday, March 22, 2020

ఓ యౌవనుడా....‼️ ఎట్లా పరుగులు తీస్తున్నావ్ ?




ఓ యౌవనుడా....‼️
ఎట్లా పరుగులు తీస్తున్నావ్❓
 👩‍🎤💔🍺🍷🚬🚬 ..🏃🏽‍♀🏃🏽‍♂🏃🏿‍♂


👷‍♀కయీను దేవుని సన్నిధిలోనుండి పారిపోతున్నాడు.
👨‍⚕యకోబు తండ్రిని, అన్నను మోసం చేసి పారిపోతున్నాడు.
👨‍🔧యనా దేవుని మాట వినకుండా పారిపోతున్నాడు.
👩‍🚒చన్న కుమారుడు తన తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాడు.

అయితే,
🧖‍♂యసేపు తన యెవ్వనేచ్చల నుండి పారిపోతున్నాడు.

ఓ యౌవనుడా‼️
పారిపోతున్నావా?

 పాపం
వెంటబడుతున్నావా?


పాపము
👩‍🎤చూడడానికి అందముగా
వుంటుంది.
💃 చస్తున్నప్పుడు
ఆనందాన్నిస్తుంది.
😭 చసాక ఆవేదన మిగుల్చుతుంది.

పాపము
🏃‍♀నన్ను తరుముతుంది.
▫️ పట్టుకొంటుంది.
▫️బంధిస్తుంది
▫️దవునినుండి దూరం చేస్తుంది.
😭సమాధానం లేకుండా చేసి,
💀చవరకు నీ ప్రాణం తీసి,
🔥 నన్ను మంటల్లోకి విసిరేసి,
అది పగలబడి నవ్వుతుంది.

దానిని పట్టుకోవడానికేనా, నీ ఆరాటం❓

1. పాపము తరుముతుంది:
"కీడు పాపులను తరుమును"
          సామెతలు 13:21

2. పాపము పట్టుకొంటుంది:
"మీ పాపము మిమ్మును
పట్టుకొనును"
             సంఖ్యా 32:23

3. పాపము బంధిస్తుంది:
"దుష్టుని దోషములు వానిని చిక్కులబెట్టును వాడు తన పాపపాశములవలన బంధింపబడును."
        సామెతలు 5:22

4. దేవుని నుండి వేరు చేస్తుంది:
"మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను"
    యెషయా  59:2

5. సమాధానం లేకుండా చేస్తుంది:
"దుష్టులకు నెమ్మదియుండదని యెహోవా సెలవిచ్చు చున్నాడు.
            యెషయా 48:22

▪️ఇంతకీ నీవేస్థితిలో వున్నావ్?
▪️దని చేత తరమ బడుతున్నావా?
▪️నవే దానిని తరుముతున్నావా?
▪️ఏదో సరదా కోసం, స్నేహితులను కాదనలేక ప్రారంభమైన ఆ అలవాట్లు నిన్ను బానిసను చేసి, అవే నీ బాస్ గా మారిపోయాయా?
 ▪️నకున్న యౌవనేచ్ఛలు(శరీర కోరికలు) నీకు సమాధానంలేకుండా చేసేసాయా?
▪️ఎవ్వరితోనూ చెప్పుకోలేక, వాటిని వదులుకోలేక, వాటి మధ్య  కొట్టిమిట్టాడుతున్నావా?

నీ మార్గం సరియైనది కాదని నీ మనస్సాక్షి నీ మీద నేర స్థాపన చేస్తున్నా, వాని పీక నొక్కేసి అదే దారిలో వెళ్తున్నావు కదూ!

పాపం చెయ్యడానికి అన్ని ప్రయత్నాలూ చేసి, చివరికి సఫలం కాలేక, నేను పరిశుద్ధుడనే ఏ తప్పు చెయ్యలేదని నీకు నీవే సంబరపడి పోతున్నావు కదా?

▪️యవనంలో వున్నాను. ఇట్లాంటివి సహజం అని నీకు నీవే సర్దిచెప్పేసు కొంటున్నావా?
 ▪️యవ్వనాన్ని యౌవనేచ్ఛలతో ఎంజాయ్ చేసి, సిలువలో దొంగలా ఒక్క మాటతో పరలోకంలో ప్రవేశిద్దామనే ఆలోచనలోఉన్నావా?
▪️న యవ్వనాన్ని నీయౌవనేచ్ఛల కోసం, పిప్పిలాంటి మిగిలిన నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తావా?
నీ ఎంగిలి జీవితం కాదు ప్రభువుకు సమర్పించాల్సింది. నీ యవ్వన జీవితం.

సమర్పణ అంటే ఏమిటో తెలుసా?
"చనిపోవడానికి బ్రతకడం"

ఒక అమ్మాయి కోసమో, ఒక అబ్బాయికోసమో కాదు చావాల్సింది. నీ యౌవనేచ్ఛలను చంపుకొని ప్రభువు కోసం జీవించడం సమర్పణ.

అట్లా తన యౌవనాన్ని దేవుని కోసం సమర్పించి జీవించగలిగిన ఒక యౌవనుడు నాకు తెలుసు. అతడు పరాయి దేశంలో బానిసగా వున్నాడు. తన యజమానురాలు తనతో పాపం చెయ్యమని వెంటబడే పరిస్థితి. తాను అట్లా చెయ్యగలిగితే? ఈలోకం సకల సౌఖ్యాలను ఆమె చేకూర్చి పెడుతుంది. కానీ, అతడు అట్లా చేసిన వాడు కాదు. పాపము తనని తరుముతూ వుంటే? దానికి చిక్కకుండా అందనంత వేగంగా, దూరంగా పారిపోయాడు. ఆ పరుగే అతనిని ఆ దేశ ప్రధానిని చేసింది.

ఇంతవరకూ, నీ జీవితంలో
▪️ఒక సినీ యాక్టర్,
▪️ఒక క్రికెట్ ప్లేయర్,
▪️ఒక పాప్ సింగర్,
▪️ఒక మ్యుజీషియన్
▪️ఎవరో ఒకరు నీ రోల్ మోడల్ గా వున్నారేమో?
▪️అతనినే అనుకరించే ప్రయత్నాలు చేస్తున్నావేమో?
💢కనీ, పాపము నుండి పారిపోయిన ఆ యౌవనుడే నీ యౌవనజీవితానికి రోల్ మోడల్ కావాలి. అతనినే నీవు అనుసరించ గలగాలి. అతడే యోసేపు.💢

ఇంటిలో పాపముందని అది పట్టుకొంటుందని, అతడు ఇంటి బయట వున్నాడట.
▪️నవైతే పాపము ఎక్కడుందో? దాని చుట్టూనే తిరుగుతున్నావు కదా?
▪️న చూపులు, నీ తలంపులన్నీ దాని చుట్టూనే తిరుగుతున్నాయి కదా?
అట్లా తలంచినంత మాత్రాన నేనేమి పాపం చెయ్యడం లేదుకదా అంటూ, నీకు నీవే సర్ది చెప్పుకొనే ప్రయత్నం చెయ్యొద్దు.

🔳మూర్ఖుని యోచన పాపము
     సామెతలు 24:9
🔳ఆజ్ఞాతిక్రమమే పాపము.
         1యొహాను 3:4   
🔳సకల దుర్ణీతియు పాపము
      1యోహాను 5:17

💢హృదయ తలంపులు మలినమైతే? మన జీవితమంతా మలినమైనట్లే.💢

ఎందుకంటే?

దురాలోచనలు నరహత్యలు వ్యభి చారములు వేశ్యాగమనములు దొంగతనములు అబద్ధసాక్ష్య ములు దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును (మత్తయి 15:19)

అందుచే,
నీ హృదయములోనుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటె ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము
           సామెతలు 4:23

యౌవనుడా! నీ యౌవనేచ్ఛలనుండి పారిపో!
వాటివల్ల నీ జీవితానికి సమాధానం లేదు. నిన్ను కని, పెంచి, పెద్ద చేసిన నీ తలిదండ్రులకు సమాధానం లేదు. నీకోసం ప్రాణం పెట్టిన నీ దేవునికి సమాధానం లేదు.

నీవు ¸యౌవనేచ్ఛలనుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితోకూడ నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము.
         2 తిమోతి 2:22

నీ యౌవనేచ్ఛలనుండి నుండి పారిపోయినంత మాత్రానా ప్రయోజనం లేదు. నీ సహవాసం మారాలి. పరిశుద్ధ హృదయం కలిగి, ప్రభువుతో సహవాసం చేసేవారితో నీవు సహవాసం చెయ్యాలి.

ఇంతవరకూ పాపాన్ని వెంటాడిన నీవు, ఇప్పుడు నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడాలి.

1. నీతి:
అయనను నమ్మడమే నీతి.
            ఆది  15:6

2. విశ్వాసమును:
విశ్వాసమునకు కర్త ఆయనే.
             హెబ్రీ  12:2

3. ప్రేమ:
ఆయనే ప్రేమాస్వరూపి,
             1 యోహాను 4:8

4. సమాధానము:
ఆయనే మన సమాధానము
               ఎఫెసీ  2:14 

యౌవనేచ్ఛలను విడచి, నీ కోసం తన యౌవన రక్తాన్ని చిందించిన యేసయ్యను వెంబడించు. ఇక సమాధానం నీ వెంటే పరుగులు తీస్తుంది. ప్రయత్నించి చూడు, నీ జీవితం ధన్యమౌతుంది.
 అట్టి కృప, ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!



No comments:

Post a Comment