*క్షామకాలం కొరకు నీకున్న సిద్ధపాటు ఏమిటి?*
*చీమలు బలములేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును.*
సామెతలు 30:25
*చీమలు 🐜*
▫️చమలలో ఏడువేల రకాల జాతులున్నాయట
▫️చమలు ఒకే పుట్టలో నివాసముండి ఐకమత్యాన్ని చాటి చెబుతాయి.
▫️ఇవి క్రమశిక్షణ గలిగిన జీవులు
▫️ఇవి కష్టించి పనిచేస్తాయి.
▫️తన బరువుకంటే 20 రెట్లు బరువుగలిగిన వస్తువులను అవలీలగా మోసుకుపోతాయి.
▫️మనకు తెలిసి ఎర్ర చీమలు, నల్ల చీమలు, చలి చీమలు, ఖండ చీమలు ఇట్లా... సోమరి చీమలు మాత్రం కానరావు.
*🐜 చమలు వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును:*
వర్షాకాలం చీమలు ఎక్కువ రోజులు పుట్టలలోనే గడపాల్సి వస్తుంది? అట్లాంటప్పుడు వాటికి ఆహారమెక్కడది? అందుకే, వేసవికాలమంతా వాటి శక్తికి మించిన పనిచేసి వర్షాకాలం కొరకు, కోతకాలమందు ఆహారాన్ని సమకూర్చుకొని భద్రపరచుకొంటాయి.
మనుష్యులలో కూడా రాబోవు తరాలకు సరిపడే ఆస్తులు కూడగట్టేవారున్నారు. వారు సంపాదించడం తప్పని నేను అనడం లేదుగాని, వారి సంపాదన వారివెంట వస్తుందా? దేనికొరకు వారి ప్రయాస అన్నదే ప్రశ్న? భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. (మత్తయి 6:19)
*అయితే మనము సంపాదించుకోవలసిన ఆస్తి ఏమిటి?*
*రాబోవు దినము లందు దేశములో నేను క్షామము పుట్టింతును; అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును; ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై యీ సముద్రమునుండి ఆ సముద్రమువరకును ఉత్తరదిక్కునుండి తూర్పుదిక్కువరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు;* ఆమోసు 8:11, 12
సువార్త ద్వారాలు మూయబడే దినాలు దగ్గర కాబోతున్నాయి. దేవుని వాక్యం దొరకని అత్యంత భయంకరమైన క్షామం మనముందుంది. ఆ దినాలు ఊహలకే అత్యంత భయానకం. ఆ దినాలకొరకు, వాక్యము విరివిగా ప్రకటింపబడుతున్న ఈకాలమందే దానిని సమకూర్చుకొని, హృదయస్థం చేసుకోవాలి. ఆ దినాన్న నీ చేతిలోనున్న బైబిల్ లాక్కోగలరేమో గాని, నీ హృదయంలో ముద్రింపబడిన వాక్యాన్ని ఎవరు చెరిపివేయగలరు? నీవు సమకూర్చుకోవలసింది పరలోక ధనాన్ని. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పై నను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. (మత్తయి 6: 20) అయితే, దేవుని వాక్యానికి నీవిచ్చే ప్రాధాన్యత ఎంత? క్షామకాలం కొరకు నీవు సమకూర్చుకున్నదేదైనా ఉన్నదా? తుప్పుపట్టని పరలోకధనం ఏదైనా సమకూర్చుకున్నావా?నిన్ను నీవే పరిశీలన చేసుకో.
🐜 సృష్టిలో అత్యున్నత సృష్టమైన మనిషిని, అత్యంత అల్పజీవులైన చీమలనుండి నేర్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నారు.
దేవుడు పనిచేసేవారితో కలసి పని చేస్తారు. సాగిపోయేవారితో సాగిపోతారు. కానీ, సోమరిలా కూర్చుండేవారితో మాత్రం కూర్చోడాయన.
రాజు తన రాజ్యంలోనున్న సోమరులనంతా ఒకచోటచేర్చి, పరమ సోమరిని గుర్తించాలని, మీలో పరమ సోమరి ఎవరో చేతులెత్తండి అంటే అందరూ చేతులెత్తారట. ఒక్కడుతప్ప. అంటే, వాడు చెయ్యి కూడా ఎత్తలేనంత బద్దకస్తుడన్నమాట. వాడే పరమ సోమరి కిరీటాన్ని దక్కించుకున్నాడు. అవును!
సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు. (సామెతలు 19:24) వాడికి నమలడం బద్దకమని, జ్యూస్ చేసి నోట్లో పోసినాగాని, మ్రింగడానికి కూడా వానికి కష్టమే.
అందుకే దేవుడు, వారిని భూమిమీద అత్యంత అల్పజీవులైన చీమలయొద్దకు వెళ్లి బుద్ధి తెచ్చుకోమని హెచ్చరిస్తున్నారు.
సోమరీ,
▫️చీమలయొద్దకు వెళ్లు
▫️వటి నడతలు కనిపెట్టు
▫️జఞానము తెచ్చుకో
▫️వటికి న్యాయాధిపతి లేడు
▫️ప విచారణకర్త లేడు
▫️అధిపతి లేడు
▫️అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును
▫️కతకాలమందు ధాన్యము కూర్చుకొనును.
సామెతలు 6 : 6-8
సోమరివానికి నిద్ర అంటే ప్రాణం. ఎంతసేపూ, ఇంకా కొంచెం కునకాలి, ఇంకా నిద్రపోవాలి అదే ధ్యాసతప్ప, మంచాన్ని విడచి పెట్టడం వానికసలు ఇష్టముండదు. సోమరీ, ఎందాక నీవు పండుకొనియుందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? (సామె 6:9) సరే సోమరి సంగతి ప్రక్కనబెడదాం. ప్రార్ధించడానికి ఉదయం 4 గంటలకు అలారం పెట్టుకొని, రింగ్ అవుతుంటే టక్ ని ఆపేసి, కొంచెం సేపాగి లేద్దామని, ఉదయం వరకూ లేవని నిన్ను ఏమనాలి? నిద్రను ప్రేమించి, ప్రార్ధనను నిర్లక్ష్యం చేసే నిన్నేమనాలి? రక్షణను నిర్లక్ష్యం చేస్తూ, బాప్తీస్మం వాయిదా వేస్తూ, దేవుని పని చెయ్యడానికి తప్పించుకొని తిరుగుతూ, ఆధ్యాత్మిక మత్తులో జోగుతున్న నిన్నేమనాలి? నేను ఏదైనా అంటే, నీకు కోపం రావొచ్చు. నీవేంటో, నీవే తేల్చుకో.
సోమరితనాన్ని విడచిపెట్టి, ప్రభువుతో నిత్యమూ జీవించే ఆ సమయం కొరకు నిన్ను నీవు సిద్ధపరచుకో. ఆరీతిగా మన జీవితాలను సిద్ధపరచుకొందము. అట్టి కృప, ధన్యత ప్రభువు మనకు అనుగ్రహించును గాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్!
0 comments