>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

 

 


 దేవుని పరిపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకొనుట....✍️

 

 *ఈ రోజున మనము మన జీవితాల కొరకు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని ఎలా తెలుసుకోగలమో చూద్దాము.*

*మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.*  రోమా 12:2

👉 ఇది చాలా చాలా ముఖ్యమైన అంశము. రోమీయులు 12వ అధ్యాయములో,
*దేవుని పరిపూర్ణ చిత్తాన్ని అర్థం చేసుకోవడం గురించి బైబిలు చెప్తుంది.*

👉 రమా 12:2లో ఇలా చెప్తుంది,
*మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనునట్లు మీ మనస్సుమారి నూతనమగుటవలన రూపాంతరము పొందుడి.*

👉 మ జీవితం కొరకు సంపూర్ణమైన దేవుని చిత్తమొకటుంది.

🔹 *మీరు తిరిగి జన్మించిన సమయం నుండి,*
🔹 *మీరు మీ జీవితాన్ని క్రీస్తుకు ఇచ్చినప్పటినుండి,*
🔹 *భూమి మీద మీకు నియమింపబడిన దినాల అంతము వరకు,*
 
*దేవుడు మీ జీవితం యొక్క ప్రతి వివరానికి ఒక సంపూర్ణ ప్రణాళికను, ఒక పరిపూర్ణమైన నమూనాను సిద్ధపరిచాడు.*

👉మరెక్కడ జీవించాలో మీరెవరిని పెళ్ళి చేసుకోవాలో, మీరేమి చేయాలో, మీ భూలోక వృత్తి ఏమైయుండాలో, మీరు ఎటువంటి శోధనలు ఎదుర్కొనాలో, ఎటువంటి కష్టాలు అనుభవించాలో, ఆయన శరీరంలో అంటే సంఘంలో ఎటువంటి పరిచర్యను కలిగియుండాలో ఇవన్నీ కూడా మీ జీవితం కొరకు దేవుని ప్రణాళికలో ఒక భాగము.

👉 *మీకు ఒక బలమైన కోరిక లేకుండా మీరా ప్రణాళికను తెలుసుకోలేరు లేక నెరవేర్చలేరు.*

👉  *ఆయన ప్రణాళిక చొప్పున నడవడానికి దేవుడు ఎవరినీ బలవంతం చేయడు.*

🔺 పరజలు పరలోకంలోకి వెళ్లడానికి కూడా ఆయన వారిని బలవంతపెట్టడు. మనుష్యులు నరకానికి వెళ్లాలనుకొంటే వారిని నరకానికి వెళ్లకుండా ఆయన ఆపడు.

👉 *దేవున్ని జాగ్రత్తగా వెదకువారికి ఆయన ప్రతిఫలాన్నిస్తాడు.*

👉 పరిశుద్ధాత్ముడు లోకంలో తిరుగుతూ ప్రజలను దేవుని వైపుకు త్రిప్పుతున్నాడు, దేవునికి సమర్పించుకొని ఆయన సంపూర్ణ చిత్తాన్ని వెదకడానికి ఆయన ఇచ్చే పిలుపుకు స్పందించమని విశ్వాసులను పురికొల్పుతున్నాడు.

👉 *కాని నీ జీవితంలో దేవుని పరిపూర్ణ చిత్తాన్ని చేయడాన్ని గురించి మీరు తీవ్రంగా లేరని ఆయన చూస్తే, ఆయన మిమ్మును వదిలేస్తాడు. ఆయన మిమ్మును వెంటాడడు.*

👉 *ఆయన కొన్నిసార్లు ప్రయత్నించవచ్చేమో గాని, దేవుని చిత్తాన్ని చేయడానికి మీకు ఆశలేదని, మీరు లోకంలో పైకి రాలేరు కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని వెదకడం లేదని ఆయన చూస్తే, ఆయన మిమ్మును వదిలేస్తాడు. నిత్యత్వంలో మీరు ఎంతో పశ్చాత్తాపపడతారు ఎందుకంటే మీరు మీ జీవితం కొరకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నప్పుడు, మీరొక గ్రుడ్డివాడి వలే దాన్ని చేసారు.*

🔹భవిష్యత్తుకు సంబంధించినంతవరకు మీరు పూర్తిగా గ్రుడ్డివారు, మీకు రేపు ఏమౌతుందో కూడా తెలియదు. మీ ముందున్న మనుష్యుల చేత, సాతాను అతని దయ్యముల చేత చేయబడిన గుంట, ప్రమాదాలన్నిటికి సంబంధించినంతవరకు మీరు పూర్తిగా గ్రుడ్డివారు.

*భవిష్యుత్తుకు సంబంధించినంతవరకు మనము పూర్తిగా గ్రుడ్డివారము.*

👉 అది ఒక గ్రుడ్డివాడు, తెలియని దారిలో నడిచినట్లుంటుంది. అటువంటి ఒక వ్యక్తికి, కళ్లు బాగా తెరచియున్న, బాగా దూరంగా చూడగలిగిన ఒక మార్గదర్శి ఉండటం మంచిది కాదా? ఖచ్చితంగా దాన్నే మన కొరకు దేవుడు చేయాలనుకొంటున్నాడు.

🔺 *దేవునికి భవిష్యత్తు అంతా తెలుసు. మనకు ఏది మంచిదో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. మీ కొరకు మనుష్యులచేత లేక దయ్యములచేత సిద్ధపరచబడియున్న ప్రతి గుంట, ప్రతి ఉరి ఆయనకు తెలుసు. వాటన్నిటినుండి ఆయన మిమ్మును కాపాడగలడు.*

👉 ఆయన మిమ్మును మీ భూలోక జీవితంలో ఎంత పరిపూర్ణమైన త్రోవలో నడిపించగలడంటే,
*ఒక దినాన మీరు మీ జీవితం యొక్క అంతిమ దశకు వచ్చినప్పుడు, మీరు ప్రభువు యెదుట నిలబడి, తిరిగి మీ జీవితాన్ని చూచుకొన్నప్పుడు, నీవు దీని కంటే శ్రేష్టమైన ప్రణాళికను వేసియుండ లేకపోయేవాడివని గ్రహిస్తావు.*

👉నను దాన్ని ఈ విధంగా చూస్తాను.
▪️భవిష్యత్తులో నా జీవితాన్ని ప్రభావితం చేసే అన్ని విషయాలు నాకు తెలిసియుంటే,
▪️ నకు ఈ మార్గం వెంట, ఆ మార్గం వెంట జరిగే ప్రతి ఒక్క విషయము నాకు తెలిసుంటే నేను ఎంచుకోవలసిన ప్రత్యామ్నాయాలు నాకు తెలిసుంటే,
▪️భవిష్యత్తు యొక్క ప్రతి కోణము నాకు తెలిసుంటే,
▪️ దవుడు నన్ను, నా సామర్థ్యాలను నా వ్యక్తిత్వాన్ని ఎరిగినట్లు నన్ను నేను ఎరిగియుంటే
*నాకు గనుక దేవునికున్న జ్ఞానముంటే, నేను వేసుకొనే ప్రణాళిక ఖచ్చితంగా దేవుడు నా కొరకు వేసిన ప్రణాళిక వలెనే ఉంటుంది.*            

♻️ ఎందుకంటే మన మందరము మన స్వప్రయోజనములను చూచుకొంటాము.
👉 మనకు ఏది మంచో దాన్ని చూసుకుంటాము.
*మీకు ఏది మంచో దాని కొరకే దేవుడు కూడా చూస్తున్నాడని మీకు తెలుసా?*

 యిర్మీయా 29వ అధ్యాయములో ఒక వచనముంది. అక్కడ దేవుడు మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును, అని చెప్తున్నాడు, యిర్మీయా 29:11, *రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు.*

👉 *మన కొరకు దేవుని యొక్క పరిపూర్ణ ప్రణాళిక మన క్షేమము కొరకే అది.*

👉మన కొరకు అతి శ్రేష్టమైనది. కనుక నీవు యేసు క్రీస్తు యొక్క పూర్ణహృదయుడవైన శిష్యుడవైతే,
*నీ జీవితం యొక్క ప్రతి విషయంలో ఆయన ప్రణాళికను వెదుకుతావు.*

🔺 ''ప్రభువా, నీవు నన్ను నివసించమనని ఏ నగరంలోను, ఏ పట్టణంలోను నేను ఉండాలనుకోవడం లేదు.

🔺 నవు నన్ను పెళ్లిచేసుకోమనని ఏ అమ్మాయినైనా, ఏ అబ్బాయినైనా నేను పెళ్లిచేసుకోవాలనుకోవడం లేదు.

🔺 *నా జీవితం యొక్క ప్రతి విషయంలో నీ ఎంపికే అన్నిటికంటే పైన ఉంటుంది.*

🔺 నవు నన్ను ఖర్చుపెట్టమన్నట్టు నా డబ్బును ఖర్చుపెట్టాలనుకొంటున్నాను.

🔺 న సమయాన్ని నీవు నన్ను గడపమన్నట్టు నేను దాన్ని గడపాలనుకొంటున్నాను.

🔺ఈ భూమిమీద నీవు నన్ను ఏం చేయాలనుకొంటున్నావో దాన్ని మాత్రమే నేను చేయాలనుకొంటున్నాను అని చెప్తావు.

♻️ *నీవటువంటి వ్యక్తివైతే, మనం దేవుని సంపూర్ణ చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోవడానికి నేను మీతో కొన్ని నియమాలను పంచుకోవాలనుకొంటున్నాను.*

మనం దేవుని సంపూర్ణ చిత్తాన్ని తెలుసుకోవాలంటే,
*మనలను మనం ప్రశ్నించుకోవలసిన 12 ప్రశ్నల రూపంలో నేను వీటిని పంచుకోవాలనుకొంటున్నాను.*

👉 కన్నిసార్లు మనకు నిశ్చయతలేని ఒక విషయాన్ని మనం ఎదుర్కోవచ్చు. ఇది దేవుని చిత్తమా లేక దేవుని చిత్తం కాదా? మనలను మనం ఈ 12 ప్రశ్నలు వేసుకొని, వాటికి యథార్థంగా జవాబివ్వడానికి చూస్తే, మనమా ప్రశ్నల పట్టి చివరికి వచ్చే సరికి, దేవుని చిత్తమేంటో, మనకు ఇంకా ఇంకా స్పష్టమవుతుంది.
👉 నను మొదట ఆ ప్రశ్నలను మీకు చదువుతాను, ఆ తరువాత మనం వాటిగుండా ఒకదాని తరువాత ఒకటి వెళ్దాం.

1⃣ *మొట్టమొదటిగా మనకు మనము వేసుకోవలసిన ప్రశ్న ఏమిటంటే, నేను ఆలోచించే (పరిగణించే) ఈ విషయము నీకు తెలిసినంతవరకు యేసు మరియు అపొస్తులులు యొక్క బోధకు, క్రొత్తనిబంధన యొక్క ఆత్మకు, సారమునకు విరుద్ధంగా ఉందా?*
👉 వరే మాటల్లో చెప్పాలంటే, దాన్ని నిషేధించేది దేవుని వాక్యంలో ప్రత్యేకంగా క్రొత్తనిబంధనలో ఎక్కడైనా ఉందా?

2⃣ రండవదిగా, *దాన్ని నేను ఒక నిర్మలమైన మనస్సాక్షితో చేయగలనా?*

3⃣ మూడవదిగా, *దాన్ని నేను దేవుని మహిమార్థమై చేయగలనా?*

4⃣ నల్గవదిగా,
*నేను యేసుతో సహవాసములో ఉండి దాన్ని చేయగలనా?*

5⃣ అయిదవదిగా,
*నేను దాన్ని చేస్తుండగా, నన్ను దీవించమని దేవుణ్ణి అడగగలనా?*

6⃣ ఆరవదిగా, *దాన్ని చేయడం నా ఆత్మీయ పదునును ఏ విధంగానైనా పోగొడుతుందా?*

7⃣ ఏడవదిగా,
*నాకు తెలిసినంతవరకు అది ఆత్మీయంగా లాభకరమైనది, క్షేమాభివృద్ధి కలుగజేస్తుందా?*

8⃣ఎనిమిది,
*యేసు భూమిమీదకు తిరిగి వచ్చినప్పుడు, నేను దాన్ని చేయడం చూస్తే సంతోషిస్తాడా?*

9⃣ తమ్మిది,
*దాని గురించి జ్ఞానముగల పరిణితి చెందిన విశ్వాసులు ఏమనుకొంటున్నారు?*

🔟 పది,
*నేను దాన్ని చేయడం ఇతరులకు తెలిస్తే దేవుని నామాన్ని అవమానపరిచి, నా సాక్ష్యాన్ని పాడుచేస్తుందా?*

1⃣1⃣ పదకొండు,

 *నేను దాన్ని చేయడం ఇతరులకు తెలిస్తే వారు అభ్యంతర పడతారా?*

 1⃣2⃣ పన్నెండు,
 *దానిని చేయడానికి నా ఆత్మలో నేను స్వేచ్చ కలిగియున్నానా?*

👉 మనం ఒక దాని తరువాత ఒకటి ఈ 12 ప్రశ్నలను చూస్తే, ఏ విషయములోనైనా దేవుని చిత్తమేంటో ఇంకా ఇంకా స్పష్టమవుతుంది.

 ♻️ *మొట్టమొదటిది* ♻️

👉 ఏదైనా లేఖనాలలో నిషేధించబడితే, మనం దాని గురించి రెండోసారి ఆలోచించనక్కరలేదు. అది లేఖనాల్లో చాలా స్పష్టంగా ఉంది.
*నేను ఇక్కడొక అబద్ధం చెప్పచ్చా?*
 *అబద్ధం చెప్పడం గురించి లేఖనాలేమైనా చెప్తున్నాయా?*
👉 ఖచ్చితంగా చెప్తున్నాయి.
 *ఆ వ్యక్తిని క్షమించకపోవడానికి నాకేదైనా సాకు ఉందా?*
👉 ఆ విషయాలలో లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
 *మనం క్షమించాలి, మనమెల్లప్పుడు నిజం చెప్పాలి.*
👉 ఇలాంటి అనేక విషయాలలో దేవుని వాక్యం తేటతెల్లగా ఉంది. గనుక మనం ప్రార్థించి దేవుణ్ణి వెదకనక్కరలేదు.

*మనం దేవుని వాక్యానికి విరుద్ధమైన దాన్ని ఏమైనా చేయడానికి చూస్తున్నామా?*
🔹 అది క్రొత్తనిబంధన ఆత్మకు, సారమునకు విరుద్ధమైనదా?
👉 నను పరిగణించే విషయానికి సంబంధించిన ప్రత్యేకమైన వాక్యభాగము లేఖనాల్లో లేకపోవచ్చు.

👉కని *నేను క్రొత్త నిబంధన యొక్క నియమాలను అర్థం చేసుకొనుంటే, అది క్రొత్త నిబంధన ఆత్మకు విరుద్ధమైనదా అని నన్ను నేను ప్రశ్నించుకోవచ్చు.*

👉 దని ద్వారానే, అది మొదటి ప్రశ్న అని నేను తెలుసుకోవాలి,
*అందుచేతనే, లేఖనాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోవడం మనకు ముఖ్యము.*

 2తిమోతి 3:16,17లో, *దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది అని చెప్పబడింది. కనుక లేఖనాలు మనకు తప్పు దిద్దడానికి నీతి మార్గములో నడిపించడానికి, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచడానికి ఇవ్వబడినవని మనమక్కడ చూస్తాము.*

🔺 *కనుక మీకు క్రొత్త నిబంధన యొక్క ఉపదేశముతో పరిచయం లేకపోతే, మీకు దేవుని చిత్తమేంటో తెలియని సందర్భాలు మీ జీవితంలో రావచ్చు. మీరు దాన్ని తెలుసుకోలేరు*

👉ఎందుకంటే, ఆవిధంగా దేవుని చిత్తాన్ని ఆయన లేఖనాల్లో బయలుపరచిన విషయాలలో మనం తెలుసుకోవచ్చు. అప్పుడు మన జీవితాల యొక్క అనేక ఇతర విషయాల్లో లేఖనాల్లో బయలుపరచబడని, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకు చాలా సులువుగా ఉంటుంది.

*ఉదాహరణకు,*
 నీవు ఒక ఉద్యోగం గురించి లేక ఎవరినైనా పెళ్లి చేసుకోవడం గురించో ఆలోచిస్తున్నావనుకో, అది లేఖనాల్లో పేర్కొనబడలేదు.

👉కని నీవు లేఖనాల్లో చూచిన ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని చేయడానికి చూస్తూ నీ జీవితాన్ని గడిపితే వివాహం వంటి ముఖ్యమైన విషయాలలో నీవు ఆయన చిత్తాన్ని పోగొట్టుకోకుండా ఉండేటట్లు దేవుడు చూసుకుంటాడు. దేవునికి లోబడటం వల్ల మనకు వచ్చే ఫలితమదే.

ఈ ప్రశ్నలను వేసుకున్నాక, మీరు అనుకూలమైన సమాధానాన్ని ఈ ప్రశ్నలకు సరైన సమాధానాన్ని పొందగలిగితే అప్పుడు మనం ముందుకు వెళ్లవచ్చు ఎందుకంటే, రోమా 8:6లో, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైయున్నది అని బైబిలు  చెప్తుంది.

👉 మరు ముందుకు వెళ్లినప్పుడు, మీ ఆత్మలో మీరు సమాధానాన్ని కలిగియుంటారు. అప్పుడు మీరు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని నెరవేర్చగలరు.    


Written By :- *- జాక్‌ పూనెన్‌*
➖➖➖➖➖➖➖➖➖
 

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures