యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు: Download Server -1
1 మొదటి మాట
విఙ్ఞాపన (FATHER… FORGIVE):-
యేసు – “తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము”. (లూకా.23:34)
ముఖ్యంగా ఈ మాటను మనం మూడు భాగములుగా ధ్యానించవచ్చును.*
1 తండ్రీ!
2 వీరేమి చేయుచున్నారో వీరెరుగరు
3 వీరిని క్షమించుము.
👉 తాము చేయుచున్న పని ఎంత ఘోరమైనదో, ఎంత భయంకరమైనదో వీరికి తెలియదు.
👉 తమ పితరుల కాలం నుండి ఎదురుచూస్తున్న మెస్సయ్యనే వీరు చిత్రహింసలు పెడుతున్నారని వీరికి తెలియదు.
👉నిజముగ ఆయన లోక కళ్యాణం కోసం జన్మించిన జీవాధిపతి అని వీరికి తెలియదు.
వీరు చేయుచున్న పని ఏమిటో వీరికి తెలియదు.
యేసులో ఏ పాపము లేదని వీరికి తెలుసు.
నాలో పాపమున్నదని ఎవడు స్ధాపించగలడు అని ఆయన విసరిన సవాలుకు ఎవరూ కిమ్మనలేదు (యోహాను 8:46).
👉ప్రభువు చేసిన ఎన్నో అద్భుతాలు వీళ్ళు చూసారు. విశ్రాంతి దినాన్ని ప్రభువు చేసిన కార్యాలను వీళ్ళు విమర్శించారు.
👉ఆయన దేవుని కుమారుడని వీరికి తెలియదా? వీరి హృదయాలకు మనోనేత్రాలకు ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనం కలిగించింది
(2కొరింధీ4:4).
👉 దుష్ట మృగాల్లా చెలరేగి పోయిన రౌడీ రోమియులపట్ల ప్రేమామయుని ప్రార్ధన ఓ అద్భుతమైన విఙ్ఞాపన ప్రార్ధనగా మార్చివేయబడింది.
👉 వీరి క్రూరత్వము యేసులో దయార్ధహృదయాన్ని ప్రేరేపించింది.
👉అందుకే వీరి క్షమాపణ కొరకు ప్రార్ధిస్తున్నాడు. శత్రువులను క్షమించండి. వారి కొరకు ప్రార్ధించండి. అని ధన్యతల కొండ మీద చేసిన ప్రసంగం, ఈ కల్వారి కొండ మీద నెరవేర్చుచున్నాడు (మత్తయి 5:44).
యూదామత సంప్రదాయం ప్రకారం ఒకనిని ఏడుసార్లు మాత్రమే క్షమించమని బోధకులు బోధించేవారు.
🔹 కానీ పేతురు ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే ఎన్ని సార్లు క్షమించాలి అంటే – యేసు ఏడుసారులు మట్టుకే కాదు డెబ్బది ఏడు మారుల మట్టుకు క్షమించమన్నాడు. అంత ఉదార స్వభావము గలవాడు మన ప్రభువు.
క్షమించుట చాలా కష్టమైన విషయం.
👉 సిలువలో అలసిన యేసయ్యను చూడండి.
🔹అబద్దసాక్ష్యాలతో,
🔹 దుషారోపణలతో ప్రభువును సిలువకు కొట్టి,
🔹 తలపై ముళ్ళ కిరీటము మొత్తి,
🔹రక్తము ప్రవాహమువలె ప్రవహించునట్లుగా ఆయన వీపును చీరి,
🔹 కాళ్ళు చేతులలో మేకులు కొట్టి,
🔹శాపగ్రస్తమైన సిలువ మ్రానుపై వ్రేలాడ దీసీ,
🔹శారీరక వేదనతో పాటు మానసిక వేదనకు కూడ గురి చేసిన ఈ వక్రజనాంగాన్ని క్షమించమని ప్రార్ధిస్తున్న ప్రభువును ఆయన ప్రేమను గమనించుము.
👉 సిలువ నాధుడు మన కొరకు తండ్రిని ప్రార్ధించుచున్నాడు.
ఈ ప్రార్ధనలో ఎంతో ఆత్మీయత దాగివుంది.
పాపులుగ, దుర్మార్గులుగ, దూషకులుగ, సిలువకు విరోధులుగ, ఇంకా ఎన్నో శరీర కార్యములకు దాసులుగ ప్రభువు ప్రేమను నిర్లక్ష్యం చేస్తూ జీవించుచున్నవారి విషయమై కూడ ప్రార్ధిస్తున్నాడు. గనుక క్షమాగుణమే క్రైస్తవ జీవితానికి వునాది అని గమనించుము.
👉ప్రభువుచే క్షమించబడినవారు ఇతరులను క్షమించగలవారై యుండవలెను. ప్రేమ దయతో సంపూర్ణముగ క్షమించవలెను.
యేసు ప్రార్ధనలోని మర్మము
👉యేసు చేసిన ఈ ప్రార్ధన ఎంతో మర్మయుక్తమైనది. యేసు సిలువ శ్రమలు అనుభవిస్తూ కూడ ఆత్మీయ సత్యాలను ఎరిగియున్నాడు.
👉 ఆయన సిలువ కొయ్యకు బిగించబడకమునుపు ఎందరినో నీ పాపములు క్షమించబడి యున్నవని చేప్పి వారి పాపాలు క్షమించాడు. ఎందుకంటే ఆయనకే పాపాలు క్షమించే అధికారం ఇయ్యబడింది (మత్తయి 9:6; అపో 4:12).
1 యేసు పాపములు క్షమించిన కొన్ని సంఘటనలు
(a). పక్షవాయువు గల వానిని క్షమించెను (మత్తయి 9:2).
(b). పాపాత్మురాలైన స్త్రీ పాపాలు క్షమించెను. (లూకా 7:48) మొదలైనవి..
2 యేసు ప్రార్ధన ఉపదేశసారం
యేసు బోధలలోని ఉపదేశసారమే ఈ ప్రార్ధన. మీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుల కొరకు ప్రార్ధించండి, వారిని ప్రేమించండి. (మత్తయి 5:43,44) ఇలాంటి ఎన్నో ఉపదేశాల సారమే ఈ ప్రార్ధన. ఆయన బలహీన స్ధితిలో కూడ ఇట్టి ప్రార్ధన చేయటం మనకు ఆశీర్వాదకరం.
3 యేసు ప్రార్ధన దేవుని సహవాసాన్ని చూపుతుంది
“తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసు చేసిన ప్రార్ధన తండ్రికి, కుమారునికి గల సన్నిహిత సంబంధాన్ని, ఐక్యతను, వారి సహవాసాన్ని ఙ్ఞాపకం చేస్తుంది. తండ్రి నేను ఏకమైయున్నాను. నన్ను చూపిన వాడు తండ్రిని చూచును అని చెప్పిన మాట ఈ సహవాసాన్ని బలపరచుచున్నది(యోహాను 10:30).
4 యేసు ప్రార్ధన బాల్యర్పణను ఙ్ఞాపకం చేయుచున్నది
కొందరు చేయుప్రార్ధనలు వ్యర్ధముగ వుంటాయి. అర్ధం లేనివిగ కూడ వుంటాయి. కానీ యేసు చేసిన ప్రార్ధన ఎంతో భావయుక్తమైనది. ఈ ప్రార్ధన ఆయన చేయుచున్న బల్యర్పణను ఙ్ఞాపకం చేస్తున్నది. “ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను..” (యెషయా 53:12).
5 యేసు ప్రార్ధన లేఖన నెరవేర్పు
యేసయ్య చేసిన ఈ ప్రార్ధన లేఖనముల నెరవేర్పు అని గమనించుము. ఈ సంఘటన జరుగక పూర్యము దాదాపు 510 సం. ముందే యెషయా ప్రవక్త ప్రవచించాడు.
అనేకులు పాపములు భరించును తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విఙ్ఞాపన చేసెను
(యెషయా 53:12).
👉అందుకే ఆయనకు ఇరుప్రక్కల తిరుగుబాటు దారులను సిలువవేసెను. ఆయన బదులు దూషించలేదు. బెదిరించలేదు. కాని మాదిరికర మార్గమును మన కొరకు వుంచెను (1పేతురు 2:21-23).
♻ కొన్ని ఇతర సందర్భములు
👉 పరిశుద్ధ గ్రంధంలో ఎన్నో ప్రార్ధనలు లేక విఙ్ఞాపనలు వ్రాయబడియున్నవి. వాటిని గూర్చిన కొన్ని విషయములు గమనింతము.
(i). హేబేలు రక్తం పగతో రగిలిపోయి శత్రువు శిక్షకై ప్రార్ధించింది (అది 4:10).
(ii). నాబోతు రక్తం శత్రువు మరణానికి గుర్తుగా వుంది (1రాజులు 21:19).
(iii). పస్కాగొఱ్ఱెపిల్ల రక్తం ఇశ్రాయేలీయుల వికోచనకు గుర్తు (నిర్గ 12:13).
(iv). యేసు రక్తం పాపక్షమాపణకై చిందించబడిన నిబంధన రక్తం (మత్తయి 26:28).
♻ పగతీర్చుకొనే స్వభావం
👉యేసును ఇంతగ చిత్రవధకు గురిచేసిన వారిని క్షమించమని తండ్రికి విఙ్ఞాపన చేయుచున్నాడు.
♻ కొందరు వారి తప్పును కప్పి పుచ్చుకొనుటకు ఎదుటవారిపై పగతీర్చుకున్నారు గమనించండి..
దావీదు
దావీదు చేసిన తప్పును దాచుకోవటానికి ప్రయాసపడ్డాడు. నమ్మకమైన సైనికుని చంపించిననాడు (2 సమూయేలు 11:17).
హేరోదు రాజు
బప్తిస్మమిచ్చు యోహాను హేరోదు చేసిన పాపాన్ని గద్దించిన కారణాన యోహాను తల నరికించివేసెను
(మత్తయి 14:10).
ప్రియులరా! యేసు మాత్రం సిలువ శత్రువుల కొరకై ప్రార్ధించుచున్నాడు.
👉 వారిని ప్రేమించాడు.
👉 వారిలోని పాపాన్ని ద్వేషించాడు.
కానీ వీరి కోసం, వీరి క్షమాపణ కోసం ప్రార్ధిస్తున్నాడు.
👉 మన ప్రభువుది ఎంత దయార్ధహృదయమో గమనించండి.
తీర్పు తీర్పు పని మనది కాదు అని యేసు న్యాయముగ తీర్పు తీర్చే దేవునికి తన్నుతాను అప్పగించుకున్నాడు
(1పేతురు 2:23)
👉 మనం పాపం చేసినను ఆయన కృపాక్షమాపణలు గల దేవుడు (దానియేలు 9:9) గనుక ఆయన మనలను క్షమించును. అందుకే యేసు చూపిన మార్గమున సాగిపొమ్ము!
నీవును ఇట్టి ఆత్మీయ అనుభవమును పొందుకొనుము. యేసును మాదిరిని ఎరిగి అట్టి మాదిరి కనపరచుము. దేవుడు నిన్నును క్షమించుగాక! దీవించుగాక ! ఆమెన్...
(To be continued)
యేసు క్రీస్తు శిలువ పై పలికిన ఏడు మాటలు: Download pdf Books Server -1
: Download pdf Books Server -2
0 comments