1 పై ప్రశ్నను తెరపై తీసుకొచ్చింది హేతువాదులే కానీ క్రైస్తవులు కాదు. ప్రపంచములో ఎక్కువ శాతం మంది దేవునిని నమ్మేవారు ఉన్నారు అలానే దేవునిని నమ్మని వారు కూడ ఉన్నారు. నమ్మని వారిని నాస్తికులుగా, హేతువాదులుగా పిలువబడుచున్నారు. ఆత్మ అనేది లేదని, దయ్యము-దేవుడు అనేది మనుష్యులు కల్పించినవి అని వారి ఉద్దేశ్యము. చక్కగాసుఖించి అనుభవించవలసిన ఈ జీవితములో దేవుడని,ఆత్మని లేని పోని ఉహాలను కల్పించుకుని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నది వీరి వాదన. లేని దేవునిని సృష్టించి , ఆ దేవుని పేరట మనుష్యులు వర్గాలుగా వీడిపోయి మత ఘర్షణలకు దిగి నరజాతిని నాశనం చేసుకుంటున్నారని వీరి అభిప్రాయము.
2 ఈ ప్రపంచాన్ని నాస్తికత్వంతో, హేతువాదంతో ఉద్దరించాలనే ప్రయత్నంలో దేవుడు లేడనే భావనను సమాజ ప్రజల మధ్యకు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఏ గ్రంధాలను బట్టి వారు దేవుడిగా నమ్ముతున్నారో ఆ గ్రంధాలను తప్పని నిరూపిస్తే సులువుగా దేవుడు లేడని నిరూపించి నమ్మించవచ్చనే ఆలోచనలు కలిగియున్నారు. ఆ కారణముతో బైబిల్ చదువుట మొదలుపెట్టారు. బైబిల్లో తప్పులు ఉన్నాయని నిరూపిస్తే ఆ దేవుడు తప్పు అని సులువుగా నిరూపించవచ్చని వారి ప్రయాస. ఆ ప్రయాసలో వీరికి కనబడిన ప్రశ్నయే “ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఎందుకు వేసినట్లు”
3 ఇకఈ అంశముపై వీరి ప్రశ్నలు చూస్తే దేవుడు ఆదాము-హవ్వలకు పండు తినవద్దని చెప్పడం దేనికి ? తిన్న తర్వాత ఇరువురిని పాపులుగా నిర్ధారించి బయటకు నెట్టడం దేనికి? ఆదాము పండు తీనుటకు కారణం చెట్టు ఉండుట వలనే కదా మరి ఒక వేళ చెట్టు లేకపోతే ఆదాము పండు ఎలా తినగలిగేవాడు? కనుక చెట్టు వేసింది దేవుడేనని, చెట్టు వేసి పండు తినడానికి ఆవకాశం ఇచ్చి, పండు తిన్నాడని నేరస్తుడని తీర్పు తీరుస్తుంది దేవుడే కదా? కనుక తప్పు ఆదాముది కాదు కానీ చెట్టు వేసి, పండు తినడానికి ఆవకాశం ఇచ్చి, పాపం చేయడానికి ప్రేరేపించిన దేవునిదే తప్పు అని ఇలా ప్రశ్నిస్తు అనేకమందిని సందేహములో నేట్టివేస్తున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే చెట్టు వేసి మొదట దేవుడే తప్పు చేశాడని వీరి వాదన.
4 వాస్తవముగా క్రైస్తవులైన మనకు ఈ సందేహం ఉండి ఉంటుంది. అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు. ఒక ప్రక్క సందేహాన్ని మనస్సులో కప్పిపెట్టుకుని దేవునిని నమ్మాము అను చెప్పుకోవడం వేషదారణ అవుతుంది. కనుక మన విశ్వాసం దెబ్బతినకుండా ఉండాలి అంటే బైబిల్లో ముందు మనకు ఏ సందేహాలు ఉండకూడదు. మనం సంపూర్ణముగా దేవునిని విశ్వసించుటకైనా దేవుడు ఎందుకు చెట్టు వేసాడో తెలుసుకోవాలి.
5 గలతీ 5:13-మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, గలతీ 5:1-ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి,క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసియున్నాడు, 1 పేతురు 2:16-స్వతంత్రులై యుండియు,,,,, &యోహాను 8:36- కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. పై వచనాలలోని భావాన్ని ఆలోచిస్తే తన పిల్లలమైన మనకు స్వాతంత్రము ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ దేవుడు మనకు స్వాతంత్రముఇవ్వకుంటే అప్పుడు మనం స్వాతంత్రులమా లేక బానిసలమా??? ఆలోచించండి.
6 ఆదికాండ 2:15 నుంచి-మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకు,దాని కాచుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా –ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నీరభ్యoతరముగా తినవచ్చును . అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు . నీవు వాటిని తిను దినమున నిర్చయముగా చచ్చేదవని నరునికి అజ్ఞాపించెను.... చెట్టు వేసింది దేవుడే. చెట్టు ఎందుకు వేసాడో, చెట్టు వేసాక దేవుడు తీనమన్నాడా లేక వద్దు అన్నాడా అని ఆలోచించాలి. చెట్టు వేసిన దేవునిని నిందించుటకు ముందు మనిషి తినుటకు ఎలాగు అధికారము కలిగియున్నాడో అలానే మాని వేయుటకు అంతే అధికారము కలిగియున్నాడని ఇక్కడ మనం గ్రహించవలెను. తినడానికి ముందు వచ్చు ఇతని జ్ఞానము తినకుండా ఉండుటకు ఎందుకు ముందు రాలేదు??
7 పరలోకమందున్న దేవుడు మనకు తండ్రి అని తెలుసు. ఈ లోకపు తల్లితండ్రులు వారి పిల్లల పట్ల తప్పుడు నిర్ణయం తీసుకోరనే సంగతి మనకు తెలుసు. వారి పిల్లల మంచి కొరకు తీసుకొను నిర్ణయాలు వాళ్ళకు అర్థం అయ్యిన లేక కాకపోయినా చివరికి అపార్ధం చేసుకున్న తల్లితండ్రులు ఎప్పుడు సరియైన నిర్ణయం తీసుకుంటారు. ఈ రీతిగా పిల్లలకు వారి తల్లితండ్రులు తీసుకొను నిర్ణయాలు ఎలాఅర్థంకావో అలానే దేవుని నిర్ణయాలు వెంటనే మనకు అర్థం కావు. అయితే మన యెడల దేవుడు తీసుకున్న నిర్ణయాలు తప్పు అని ఎలా చెప్పగలము?
8 1 తిమోతి 3:10- మరియు వారు మొదట పరీక్షింపబడవలెను.తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును.... సంఘములో పెద్దల నియామకం జరుగుతున్న సందర్భాన్ని గురించి ఇక్కడ పౌలు చెబుతున్నాడు.నియామకంకు మొదట పరీక్షి జరగాలి అని అర్థమవుతుంది. ఈ ప్రపంచములోని ఏ రంగంలోనైన ఉద్యోగం నిచ్చుట ముందు పరిక్ష పెడుతారు.
నేను నెల్లూరుకూ కలెక్టరవుతాను అంటే ప్రభుత్వం చేస్తుందా? చెయ్యదు. మొదట అర్హుడవో కాదో అని పరిక్ష పెడుతారు. ఒక వేళ పరిక్షనే లేకపోతే అర్హత లేని ప్రతి వాడు మందుకు వస్తాడు. పరిక్ష పెట్టి అందులో అర్హులుగా ఎంపికైన వారిని ఉద్యోగస్తులుగా ప్రభుత్వం ఎన్నుకుంటుంది. అలానే అదేను తోటలో దేవుడు ఆదాము-హవ్వాలను పరిక్ష పెట్టుట కొరకు చెట్టు వేసాడు.
9 ఎఫేసి 1:4,5-మనము తన యెదుట పరిశుద్దులమును ,నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయన క్రిస్తులో మనలను ఏర్పరచుకొనెను. .. పరలోకములో ఉన్న దేవుడు పరిశుద్దుడని, నిర్దోషుడని మనకు తెలుసు.రాబోవుతున్న తన పిల్లలమైన మనకు ఇలాంటి లక్షణాలు ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే ఆశపడ్డాడు. పరలోకం వెళ్ళేవారు పైన చెప్పబడిన లక్షణాలు ఉండాలని దేవుడు ఆశ పడ్డాడు. కనుకపరలోకమునకుఎన్నుకొనుట కొరకు ప్రతి మనిషిని ఈ భూమి మీదకు పంపించాడు. ఒకవేళ ఇలా కాకపోతే తన పిల్లలమైన మనల్ని పరలోకంలో పుట్టించి అక్కడే పెట్టుచు కదా ? ఈ భూమి పై నీకు 60,70 ఏళ్ళ జీవిత కాలమును ఇస్తాను. బ్రతుకు కాలమంతయు నాలా పరిశుద్దుడిగా ,పవిత్రుడిగా బ్రతికితే అప్పుడు నువ్వు పరలోకానికి అర్హుడవు అని దేవుని ఆలోచన...
10 నిజముగా ఈ భూమి మీద మనకున్న జీవిత కాలం ఒక పరిక్ష కాలమే. ఆదాము పరలోకానికి అర్హుడా కాదా అని తెలుసుకోవడానికి పరిక్ష పెట్టాడు. ఆదాము గొప్పవాడని దేవుడు చెబితే మనం నమ్ముతామా? మనం నమ్మిన సాతాను మాత్రం నమ్మడు. ఆదాము గొప్పవాడని పరలోకమును దేవుడు ఇస్తే వెనువెంటనే సాతాను అనే మాట “ నీ కొడుకు గొప్పవాడని నువ్వు ఎలా నిర్దారిస్తావు? పరిక్ష పెట్టి నిరూపించు అంటాడు. కనుక ఆదాముకు దేవుడు చెట్టు వేసి పరిక్ష పెట్టాడు. చివరికి తినొద్దు అని చెప్పిన ,వద్దున్నది తినీ దేవుడు పెట్టిన పరీక్షలో విఫలమయ్యాడు. వాస్తవముగా పరీక్షలో తప్పాడంటే తప్పువిద్యార్ధినా లేక పరిక్ష పెట్టిన మాస్టర్ తప్పా? ఖచ్చితముగా విద్యార్ధి తప్పు అవ్వుతుంది.
11 పాపము చేయుటకు అవకాశమే లేనప్పుడు పాపము చేయని వాడు గొప్పవాడా లేక పాపము చేయుటకు అవకాశము ఉండి పాపం చేయని వాడు గొప్పవాడా? పై ఇరువురిలో ఎవ్వరు గొప్పవారని మీరు తలంచుచున్నారు? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము కనబడినప్పుడు,తినుటకు అవకాశము ఉన్నప్పుడు, ఆదాము తినకుండా ఉండినప్పుడు గొప్పవాడా లేక ఏదేను వనములో అస్సలు ఆ వృక్షమే లేనప్పుడు నేను తినలేదని ఆదాము చెప్పినప్పుడు గొప్పవాడా?? పాపం చేసే అవకాశం ఉండి పాపం చెయ్యకపోతే అప్పుడు వాడు గొప్పవాడు. గొప్పవాడో కాదో తెలియాలి అంటే పాపం చేసే అవకాశం ఇవ్వాలి. దేవుడు ఆదే చేసాడు. వారి గొప్పతనాన్ని నిరూపించుకోమని దేవుడు ఆదాముకు ఎదేనులో చెట్టు వేస్తే తన గొప్పతనాన్ని నిరూపించుకునే ఆవకశామును పోగొట్టుకున్నాడు.
12 సమాజములో ఎవరైనా నేను గోప్పవాడనని చెప్పుకొనినప్పుడు ఈ మాటను విన్న ప్రజలు ఇతను ఎందుకు గొప్పవాడు అని, ఏందులో గొప్పవాడనే ప్రశ్నను లేవదీస్తారు. ఏదేను తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు ఉన్నప్పటికీ వాటిని తినకుండా నిలువబడిన వాడే గొప్పవాడుకాగలడు. నిర్మానుష్య ప్రదేశములో ఒక స్త్రీ ఒంటరిగా పురుషునితో పాపము జరిగించుటకు ఆహ్వానించగా దానిని నిరాకరించువాడు ఎంత ఉత్తముడో అలానే తినుటకు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములున్న వాటిని ముట్టని వాడు అంతటి వాడే..
13 దేవుడు తన కుమారులను తనంతటి వారిగా చూడాలని తలంచి ఎదేనులో ఈ పరిక్షను పెట్టియున్నాడు. రాబోయే మహాలోకమైన పరలోకంలో తంత్రములేరిగిన వారు తన పిల్లలు కాకూడదనే ఆలోచనతోదేవుడు తన పిల్లలలో ఉత్తములైన వారిని తన యొద్దకు చేర్చుకొనుటకు లోకమందు చెట్టును, అపవాదిని ఉండనిచ్చాడు. దేవుడు చెట్టు వేయటం తప్పు కాదు కానీ ఆ పండు తినడం అదము- హవ్వల తప్పు. దేవుడు పరిక్ష పెట్టడం తప్పు కాదు కానీ ఆ పరీక్షలో పాస్ అవ్వకపోవడం అదము- హవ్వల తప్పు. మంచి వాడిగా నిరూపించబడి పరలోకం వెళ్ళాలని చెట్టు వేసాడు.
14 యోబు 2:3 నుంచి గల సందర్భములో సాతాను యోబును శోదించాలని & దేవుడు పరీక్షించాలనుకున్నాడు.చివరికి ఆపరిక్షలో యోబు విజయం పొందాడు. యోబు 42:12- యెహోవా యోబును మొదట ఆశిర్వదించినంతకంటే మరి అధికముగా ఆశిర్వదించెను. ... చివరిగా పరీక్షకు నిలబడి సాదించినవాడు లోకమందు ఎలాగు గొప్పవాడు కాగలడో అలానే ఏదేను నందు చెట్టు ఉన్న ,ఆది తినకూడదని నిబంధన వానిపైన రుద్దబడిన,పట్టుదలతో సాదించినవాడే యోగ్యుడైన దేవుని కుమారుడిగా లోకమందు కనబడెను. కనుక ఏదేను వనము నందు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఉండుట న్యాయమే...........
0 comments