>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

స్థంభముగా మారిన బండ

Posted by D Veeranna Wednesday, March 21, 2018
స్థంభముగా మారిన బండ


(ఆది 28:18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి...)

ఆది కాండం 28: 18వ వచనంలో యాకోబు ఉదయం లేచి తన తలగడగా పెట్టుకొన్న ఆ రాయి ద్వారా తాను పాపమునుండి శాపమునుండి విమోచింపబడిన దానికి గుర్తుగా దానిని జ్ఞాపకార్థ స్తంభంగా నిలిపినట్లుగా మనం చూడగలం.

స్తంభానికి కట్టి కొట్టబడిన బండ ఇప్పుడు అత్యద్భుతమైన స్తంభముగా మారినది. యాకోబు నిలిపిన ఈ జ్ఞాపకార్ధ స్తంభమైన క్రీస్తును గూర్చి కొన్ని విషయాలు పరిశీలన చేద్దాం.

1. నిలబెట్టబడిన రాయి స్తంభముగా మారినది: . (ఆది 28:18 తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి...). ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా నూనెతో ఒక స్తంభము అభిషేకించబడినది. ఎందుకు? కారణం యాకోబు జీవితంలో జరబోవుచున్న సత్యమును ఆ స్తంభం తెలిపినది గనుక ఈ స్తంభం సత్యమునకు గుర్తు. అంతేకాకుండా క్రీస్తు చెప్పినట్లే సత్య ప్రకారం పునరుత్తానుడైనాడు. అందునుబట్టి క్రీస్తుఅను ఈ స్తంభం సత్యమునకు ఆధారమైనది.

2. స్తంభం ఆధారముగా ఉండునది: ఏ కట్టడానికైన ఆధారం స్తంభమే! సత్యమునకు ఆధారం సంఘము అను స్తంభమే. ఈ వచనంలో తెలుగు బైబిల్ లో స్తంభం అను మాట లేదుగాని ఇంగ్లిషు బైబిల్లో పిల్లర్ అను మాట వాడబడినది. పిల్లర్ అనగా స్తంభం.  (1 తిమోతి 3:15 ఆ సంఘము సత్యమునకు ఆధారం. The church of the living God, the pillar and ground of the truth.) ఆధారం అను మాటకు ఇగ్లిషులో పిల్లర్ అను మాట వాడబడినది. అనగా పునరుత్తానుడైన క్రీస్తు సంఘముగా మారినాడు. జీవముగల దేవుని సంఘం సత్యానికి స్తంభంగా ఉన్నది. సంఘం సత్యానికి స్తంభంఅని చెప్పుచున్న పౌలు ఇక్కడ ఏ స్థానిక సంఘాన్ని గురించీ మాట్లాడడం లేదు. కారణం ఇక్కడ పౌలు ఉద్దేశంలో సంఘం అంటే బండ అనగా క్రీస్తు శరీరం, దేవుని ఆలయం. దానికి క్రీస్తే శిరస్సు, పునాది, మూలరాయి.

క్రీస్తును అన్నిటికీ శిరస్సుగా సంఘానికి అనుగ్రహించాడు.  ఈ సంఘం ఆయన శరీరం, సమస్తాన్ని పూర్తిగా నింపుతూ ఉన్న ఆయన సంపూర్ణత.  (ఎఫెసు 1:22-23మరియు సమస్త మును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపు చున్న వాని సంపూర్ణతయై యున్నది)

3. నిలబెట్టబడిన స్తంభమే సంఘానికి మూల రాయిగా ఉన్నది: ఇళ్ళు కట్టేవారు మూలరాయిని ముందు చెక్కేవారు. ఇది ఆ కట్టడమంతటికీ అతి ప్రాముఖ్యమైన రాయి. అది ఏమాత్రం వంకర లేకుండా అన్ని రీతులుగా ఖచ్చితమైన కొలతలు కలిగి ఉండునది. అందునుబట్టి మూలరాయి నుంచి కట్టబడే గోడలు నిటారుగా చక్కగా ఉండగలవు. ఈ విధంగా మూల రాయి ద్వారా కట్టడం అంతటికీ స్థిరత్వం, సౌందర్యం రాగలదు.

యేసు క్రీస్తు కచ్చితమైనవాడు ఆయన యందు ఏ పాపములేదు. ఆయన సంపూర్ణమైన వాడు. కనుక  యేసు క్రీస్తే సంఘానికి ముఖ్యమైన మూలరాయి. ఈ మూలరాయిని ఆధారం చేసుకొని అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిమీద మనందరం సంఘముగా కట్టబడు చున్నాము. (ఎఫేస్సి 2:20-22 క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్తలమై యుండుటకు కట్టబడుచున్నారు.)

4. ఎవరూ కూడా కూల్చలేని స్తంభం: ఈ ఆనాడు క్రైస్తవ సంఘాన్ని కూల్చివేయాలని దుష్ట శక్తులు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా, ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని కూల్చుటకు ఎవరి తరం కూడా కావడంలేదు. కారణం ఈ స్తంభం దేవుని జ్ఞానం మీద ఆధారపడినది. (సామెతలు 9:1 ''జ్ఞానము నివాసమును కట్టుకొని  దానికి ఏడు స్తంభములు చెక్కు కొనినది.)

యేసు క్రీస్తు అను పరిపూర్ణ స్తంభంద్వారా  క్రొత్త నిబంధన సంఘము అను దేవాలయం ఏర్పడినది. దీనిని కూల్చుట ఎవరి వల్లా కాదు. క్రీస్తు అను బండ (స్థంభం) మీద కట్టబడిన సంఘం ఎదుట పాతాళ ద్వారాలు ఎదిరించి నిలవలేవు. (మత్త 16:18  మరియు నీవు పేతురువు? ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని యెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను.)

దయ్యపు శక్తులు దుష్ట శక్తులు, ముఖ్యంగా మరణశక్తి ఉన్న సైతాను, వాడు చేసిన తంత్రాలన్నీ మరియు సాతాను అనుచరులు, క్రీస్తుతో, ఆయన సంఘంతో జరిగిస్తున్న యుద్ధంలో జయించలేరు. కారణం క్రీస్తు అనబడిన అభిషేకించబడిన స్తంభం ఎంతో ధృడమైనది.

.5. మాటలాడిన స్తంభం: ఆనాడు ప్రభువు మేఘ స్తంభంలో నుండి దైవ జనులతోను, ఇశ్రాయేలీయులతోను మాట్లాడినట్లు ఈనాడు కూడా మార్పులేకుండా స్తంభంగా స్థిరంగా ఉన్న ప్రభువు అనేకులతో తన సువార్త ద్వారా మాటలాడుచున్నాడు. (కీర్తన 99:7  మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాటలాడెను వారు ఆయన శాసనముల ననుసరించిరి ఆయన తమకిచ్చిన కట్టడను వారనుసరించిరి)

6. తీర్పు తీర్చు అగ్నిస్తంభం: (ప్రకటన 10:1  ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.) ప్రభువు యొక్క పాదాలు కొలిమిలో కాలుతున్న కంచులాగా మండుతున్న స్తంభాల మాదిరిగా ఉండి దేవుని ఎరుగని వారికి భయంకరమైన తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవి.

క్రీస్తు విదోధిని త్రొక్కి తుత్తునియలుగా చేయును. అదే తీర్పు దేవుని ఎరుగని వారికి కూడా సంభవింప బోవుచున్నది. (ప్రకటన 19:15  జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.)

7. జయించు స్తంభం: యేసు క్రీస్తు జయించిన స్థంభముగా ఉన్నాడు. ఆయనను బట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా జయించువారముగా ఉన్నాము. జయించేవానిని దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానని దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానం మనం ఎన్నడూ మరువ కూడదు. (ప్రకటన 3:12  జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను)

కాబట్టి దేవుడు ఇప్పుడు నిర్మిస్తున్న ఆధ్యాత్మిక సార్వత్రిక క్రైస్తవ సంఘములో ప్రతి నిజ విశ్వాసీ ఒక స్తంభంగా ఉన్నాడు. అందుకే పౌలు మనము దేవుని ఇంటివారమని మనమే దేవుని ఆలయమని చెప్పుచున్నాడు.  (ఎఫెసు 2:19కాబట్టి మీరిక మీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు. 1 కొరింతు 3:16 మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?)

జయించువారు సంఘంలో ఒక స్తంభంగా ఉండడం క్రీస్తులో మనకున్న స్థిరమైన, నిత్యమైన, ముఖ్యమైన స్థానాన్ని సూచిస్తుంది.

యాకోబు ద్వార స్తంభంగా మార్చబడిన క్రీస్తును పోలి, కదల్చబడని స్థిరమైన బలమైన స్తంభాలుగా మారి ప్రభు సేవలో ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక!   ఆమెన్!

దైవాశ్శీసులు!!!

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures