>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..

* సువార్త ఎవరి కోసం ....?

Posted by Jhon Peter Friday, March 9, 2018

 

రోమా పత్రిక 30వ భాగమునకు స్వాగతం....


ఎంతో కష్టతరమైన రోమా పత్రికను ధ్యానిస్తూ ముందుకు వెళ్తున్నాము....
నాకు తెలుసు, ఇది నా స్థాయికి మించిన పని; కనుక దేవుడు తప్పక సహాయం చేస్తారు.

ఇప్పటి వరకు 17వచనాలు ధ్యానించాము... అందులో ప్రధమ భాగము రోమా పత్రిక గురించిన ఉపోద్ఘాతమే... రెండవది, సువార్త నిర్వచనము.
ఈ 17 వచనాలలో పౌలు గారు పత్రిక ప్రారంభ ఉపోద్ఘాతమును వ్రాశారు... ఆతరువాత సువార్త అంటే ఏమిటి ? దాని నిర్వచనము ఏమిటి ? అనే విషయాలు వ్రాశారు.

గమనించండి... రోమా 1వ అధ్యాయము 1 నుండి 17 వచనం వరకు సువార్త అంటే ఏమిటో వివరించిన పౌలు ఇక 18వ వచనం నుండి అస్సలు ఈ సువార్త ఎవరి కోసము అనే విషయాలు వివరిస్తున్నారు.



మన ముందు చాలా మంది ఉన్నారు, వారు ఈ సువార్త అనేది క్రేస్తవులకు సంబంధించిన వ్యవహారం అనుకుంటారు, ఇది ఎదో ఇతర మతానికి సంబంధించినది అనుకుంటారు, "మాకు సువర్తతో పని ఏంటి..?" అని అంటూ ఉంటారు.

నాకు బాగా గుర్తుంది... మేము వీధి సువర్తకు వెళ్ళినప్పుడు కరపత్రికలు పంచె వాళ్ళం. అప్పుడు సగానికన్నా ఎక్కువ మంది మేము ఇస్తున్న కరపత్రికలు తీసుకోరు, కొందరు తీసుకున్న కొంచం ముందుకు వెళ్లి పక్కన పడేసేవాళ్ళు... మరి కొందరు అయితే కరపత్రికను తమ చేతులలోకి కూడా తీసుకోరు. వారి ఉద్దేశం ఏమిటి అంటే....? "మీరు ప్రకటించే సువర్తకు మాకు సంబంధం ఏమిటి ?" అని.

నా ప్రియ స్నేహితులారా గమనించండి....
మా దేవుళ్ళు మాకు ఉన్నారు ఇక మీ సువార్త మాకు ఎందుకు....
మా విశ్వాసం, మా మతం మాకు ఉంది ఇక మీ సువార్త మాకు ఎందుకు....
మా సాంప్రదాయాలు, మా ఆచారాలు, మా సనాతన ధర్మాలు మాకు ఉన్నాయి ఇక మీ సువార్త మాకు ఎందుకు....
నేను దేవుడినే నమ్మను ఇంక మీ సువార్త మాకు ఎందుకు....
నేను నీతిమంతుడను ఏ పాపం చెయ్యను ఇక మీ సువార్త మాకు ఎందుకు....

ఇలా మాట్లాడే వాళ్ళు తాయ్యారు అవుతారని పౌలు గారు ముందే గ్రహించి ఉంటారు అందుకే "సువార్త ఎవరి కోసం ? అనే ప్రశ్నకు ఒక సుదీర్ఘమైన వివరణ ఈ రోమా పత్రికలో ఇచ్చారు.

1వ అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఈ వివరణ సాగుతుంది.

* అన్యజనులకు ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 1:18 నుండి 32వ వచనం వరకు వివరించారు.

* నైతికపరులు, స్వనితిపరులకు ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 2:1 నుండి 16వ వచనం వరకు వివరించారు.

* యూదులు మరియు ఇతర మతనిష్ట గలవారికి ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 2:17 నుండి 3:8వ వచనం వరకు వివరించారు.

* చివరిగా... అస్సలు సర్వమానవాళికి ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 3:9 నుండి 20వ వచనం వరకు వివరించారు.

చూడండి... "మాకు సువార్త అవసరం లేదు" అనే ప్రతివానికి జవాబులు ఇక్కడే మనకి కనిపిస్తాయి.

గమనించండి... పౌలుగారు చాలా సులువుగా ప్రజలను నాలుగు గుంపులుగా చేసి "ప్రతి వానికి సువార్త అవసరమే" అని చెప్పేసారు. అన్యజనులకు సువార్త అవసరమే, స్వనీతిపరిలకు సువార్త అవసరమే, మతనిష్ట గలవారికి సువార్త అవసరమే అస్సలు సర్వమానవాలికి సువార్త అవసరమే అని తేల్చేసారు.


* అన్యులకు కూడా. . . .

ప్రియ స్నేహితులకు.... రోమా పత్రిక 31వ భాగమునకు స్వాగతం....


గమనించండి... రోమా 1వ అధ్యాయము 1 నుండి 17 వచనం వరకు సువార్త అంటే ఏమిటో వివరించిన పౌలుగారు ఇక ఈ 18వ వచనం నుండి అస్సలు ఈ సువార్త ఎవరి కోసము ? అనే విషయాలు వివరిస్తున్నారు.

నా ప్రియ స్నేహితులారా గమనించండి....
మన ముందు చాలా మంది ఉన్నారు, వారు ఈ సువార్త అనేది క్రేస్తవులకు సంబంధించిన వ్యవహారం అనుకుంటారు, ఇది ఎదో ఇతర మతానికి సంబంధించినది అనుకుంటారు, "మాకు సువర్తతో పని ఏంటి..?" అని అంటూ ఉంటారు.
మా దేవుళ్ళు మాకు ఉన్నారు ఇక మీ సువార్త మాకు ఎందుకు....
మా విశ్వాసం, మా మతం మాకు ఉంది ఇక మీ సువార్త మాకు ఎందుకు....
మా సాంప్రదాయాలు, మా ఆచారాలు, మా సనాతన ధర్మాలు మాకు ఉన్నాయి ఇక మీ సువార్త మాకు ఎందుకు....
నేను దేవుడినే నమ్మను ఇంక మీ సువార్త మాకు ఎందుకు....
నేను నీతిమంతుడను ఏ పాపం చెయ్యను ఇక మీ సువార్త మాకు ఎందుకు....

ఇలా మాట్లాడే వాళ్ళు తాయ్యారు అవుతారని పౌలు గారు ముందే గ్రహించి ఉంటారు అందుకే "సువార్త ఎవరి కోసం ? అనే ప్రశ్నకు ఒక సుదీర్ఘమైన వివరణ ఈ రోమా పత్రికలో ఇచ్చారు.
* 1వ అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఈ వివరణ సాగుతుంది.



* అన్యజనులకు ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 1:18 నుండి 32వ వచనం వరకు వివరించారు.
గమనించండి.... అన్యజనులు అంటే సులువుగా దేవునిని ఎరుగని వారు, దేవుని మార్గములోనికి రానివారు, దేవునికి వ్యేతిరేకమైన విశ్వాసాలు కలిగియున్న వారు అని చెప్పుకోవచ్చు... ఈ అన్యజనులు ఆదిమకాలం నుండి మనకు కనిపిస్తూ ఉంటారు.
ఆదాము కాలములో కయ్యిను కుటుంబము, నోవాహు కాలములో కనాను కుటుంబము, అబ్రహాము కాలములో ఏశావు, ఇష్మాయేలు కుటుంబములు, మోషే కాలములో ఇస్రాయేలీయులతో కలిసిన మిశ్రితజనము, దావీదు కాలములో ప్రలోబాలకు లోనైనా 10+2 గోత్రాలలో నుండి కొందరు రాజులు; ప్రజలు దేవునిని ఎరుగని వారిగాను, దేవునికి వ్యేతిరేకమైన విశ్వాసాలు కలిగియున్న వారిగాను మనకి  కనిప్పిస్తారు.

వీరు తమకు కలిగిన తప్పుడు విశ్వాసములచేత అంటే నీతికానీ నీతి దుర్నీతి చేత తమ ముందుకు వస్తున్న అసలు సత్యాన్ని అడ్డగిస్తూ ఉన్నారు. చూడండి, నేను పట్టిన కుందేలుకు మూడే కళ్ళు అని నమ్మిన వానికి, కదయ్యా... సాధారణంగా కుందేలుకు నాలుగు కళ్ళు ఉంటాయి అని చెప్పి వప్పించటం చాలా కష్టం.
ఇలా తమకున్న తప్పుడు విశ్వాసం చేత సత్యాన్ని అడ్డగించేవారి మీద ఎప్పుడు దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది.

గమనించండి... పరలోకం నుండి రెండు వస్తాయి.... ఒకటి ప్రేమతో కూడిన రక్షించే అస్తం, నీతితో కూడిన ఉగ్రత అస్తం. ఒకవైపు దేవుని ప్రేమ, మరోవైపు నీతితో కూడిన దేవుని ఉగ్రత, ప్రతి మనిషి కూడా ఈ రెండిటిలో ఎదో ఒకటి అందుకోవాలి, తప్పదు. దేవుని ప్రేమనైనా తీసుకోవాలి లేదా దేవుని ఉగ్రతనైనా తీసుకోవాలి.

దేవునిని ఎరుగని అన్యజనుల మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఎందుకు అని అడిగితే....?
వారు నిజదేవునిని ఎరుగని కారణమున, ఆయనని నమ్మని కారణమున వారు పాపమువేపు నేట్టబడుతూ ఉంటారు.
అలాగే... దేవునిని నమ్మని వానికి ఇంతకుముందే శిక్ష విధించబడింది" అని యోహాను 3:18లో వ్రాయబడియుండుట మనం చూడవచ్చు.

దేవునిని ఎరుగని అన్యజనుల మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఎందుకు అని అడిగితే....?
ప్రతి మనిషి తెలుసుకోవాలని దేవుడు సువార్తకు ముందుగానే తననుతను  బయలుపరచుకున్నారు. అది ఈ "సృష్టి" ద్వారా... మన ముందున్న ఈ సృష్టి క్రమాన్ని చూసినప్పుడు ఆ దేవుని మహిమను, ఆయనకున్న సర్వాధికారమును ఆయనకున్న సృజనాత్మక శక్తిని మనం గ్రహించగలము.
గమనించండి... కిర్తనాకారుడు అంటున్నాడు...
"ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి,
అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.
వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నది లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవి"... అని ( Psalms - కీర్తనలు 19 ).
ఈ సర్వ సృష్టి అంతయు ఆ దేవుని గురించి సాక్షం ఇస్తూ ఉంది... కానీ.
ఈ అన్యజనగాం దానిని గ్రహించినా గ్రహించనట్లు నిలిచియున్నది.
సృష్టి అంతయు దేవునివైపు చూపిస్తుంటే, ఈ మానవాళి సృస్తినే దేవునిగా మర్చి చూస్తూఉంది.
అన్నితెలిసి దేవునిని మహిమపరచలేకున్నది, ఆయన వద్దకు చేరకున్నది, పైగా దేవునికి వేరుగా విశ్వాసములు కలిగియున్నది.
అందుకై దేవుని ఉగ్రత వారి పై నిలిచియున్నది.

దేవునిని ఎరుగని అన్యజనుల మీద దేవుని ఉగ్రత ఉంటుంది. ఎందుకు అని అడిగితే....?
వారు దేవుని విశిష్టమహిమను, అయన ఘన కీర్తిని తెలుసుకుని కూడా దేవునిని జీవంలేని విగ్రహాల రూపంలోనికి మర్చివేశారు.
చెట్టు మొద్దును చూచి నీవే మా దేవుడవు అని చెబుతున్నారు.
రాయిని చూసి నీవే మా రక్షకుడవు అనుచున్నారు.
నిర్జీవమైన వాటిని చూసి నీవే మా జీవధిపతివి అనుచున్నారు.
సృష్టింపబడిన దానిని పట్టుకుని నీవే మా సృష్టికర్తవు అనుచున్నారు.

చూడండి... మన చేతిలోని ఈ ముబైల్ వచ్చి "ఓ... మనిషి నిన్ను చేసింది నేనే" అని పలికింది అనుకోండి మనం పెద్దగా నవ్వుకుంటాం... నిజానికి ఈ ముబైల్ ను మనిషి చేసాడు. మనిషిచేత చేయబడినది మనిషిని చేసింది అంటే అది నిజమేనా ? అలాగే... సృష్టింపబడిన దానిని పట్టుకుని సృష్టికర్త అంటే ? అది నిజమేనా ?. ముమ్మాటికి కాదు.
ఎన్నటికి సృష్టింపబడినది సృష్టికర్త కానేరదు.

ఏమండి... ఎవరినైనా ఒక మనిషిని పట్టుకుని ఏదేనా జంతువు పేరుతో పిలవండి, ఎంత కోపమో... కానీ, సర్వశక్తీగల దేవుడిని జంతువుల రుపాలోనికి మార్చివేసం.
ఏమండి... ఎవరినైనా ఒక మనిషిని పట్టుకుని నువ్వు రాయిలాంటి వాడివి అనండి, ఎంత ఉక్రోషమో... కానీ, సర్వజనులకు జీవప్రదాతయైన దేవునిని రాయిగా చుసుకున్తున్నాం.

దేవుడైన యెహోవా అంటున్నారు... "నేను సర్వశక్తిగల దేవుడను, నేను రోషము గల దేవుడను, నా మహిమను వేరేవారికి నేను ఇచ్చువాడను కాను, నా పేరును కూడా వేరేవారికి నేను ఇచ్చువాడను కాను " అని... ( నిర్గమా 20:5 - యెషయా 42:8, 48:11 ).

చూడండి... దేవుడు తన పేరునే మరొకరికి ఇవ్వటానికి ఇష్టం చూపించకపోతే. ఇంకా ఆయన ఘనమైన మహిమను మరొకరికి ఎలా ఇస్తారు.
ఈ మనిషి చేసాడు... చెట్టును నరికిన ఈ మనిషి దానితో దేవునికి ప్రతిగా మరో దేవునిని చేసాడు, రాయిని చెక్కిన ఈ మనిషి దానితో దేవునికి ప్రతిగా మరో దేవుడిని చేసాడు, జంతువు పుట్టటం అది చనిపోవటం చూసిన ఈ మనిషి దానినికూడా దైవంగా చేశాడు, మనిషిలో మంచి లక్షణాలను చూసిన ఈ మనిషి వారిని కూడా దైవంగా చేశాడు.
ఈ మనిషి చేసాడు.

అందుకే... వారిపై దేవుని ఉగ్రత నిలిచియున్నది. వారిపై పాపము ఏలుబడి చేస్తూ ఉంది, వారిని శాపం పట్టి ఉంది.

అందుకని, పౌలుగారు మందు అన్యజనులు చేస్తున పాపములను  గుర్తుచేసి,  సువార్త అవసరత వారికీ ఎక్కువ ఉంది అని చెబుతున్నారు.
ఈ సువార్త నిజదేవుడు ఎవరో వారికీ వివరిస్తుంది.
ఈ సువార్త వారి చీకటి హృదయాలలో వెలుగును నింపుతుంది.
ఈ సువార్త ఉగ్రత నుండి వారిని రక్షించే యేసుక్రీస్తు అనే రక్షకుడిని  మరింత వివరంగా వారికీ పరిచయం చేస్తుంది.
ఈ సువార్త వారి పాపమును కడిగే యేసు రక్తాన్ని వారిపై జల్లుతుంది.
ఈ సువార్త వారి శాపాన్ని తుడిచి ప్రసత్తవస్త్రాలను వారికీ ధరింపజేస్తుంది.

ఎందుకు అని అడిగితే... ఈ సువార్త "నమ్ము ప్రతివానికి కూడ రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తియై యున్నది."
( రోమా 1:16 ).

ఇంకా దేవుడు అన్యజనంగం వైపు తన చేతులను చాచి ఉంచారు. వారి మధ్య సువార్త పరిచార్యకు సేవకులను పంపుతున్నారు, తనని ఎరుగకున్న, ఎరిగియుండి కూడా నిర్లక్షం చేస్తున్నా, సృష్టిని ఆనందిస్తూ సృష్టికర్తను విడిచిపెట్టినా, తన విశిష్ట గునలక్షణాలను అక్షయమైన తన రూపమును క్షయమైన వాటి రూపమునకు మార్చినా ఇంకా వారికీ మరో అవకాశము ఇస్తున్నారు. సువార్తను వారికీ వినిపిస్తూఉన్నారు.

 అందుకే... పౌలు గారు కూడా సువార్త ఎవరి కోసము ? అంటే అన్యజనులకు కూడా. ఎందుకంటే వారు దేవునిని విడచి పాపములో ఉన్నారు. ఆ పాపము నుండి వారు విడిపించబడలి అంటే వారికీ సువార్త అవసరత ఉంది" అని.

 

గత భాగములో అన్యజనులు దేవునికి విరోధంగా చేస్తున్న పాపము ఏమిటి అనే విషయాల గురించి మరియు సువార్త అవసరత వారికీ ఎంతవరకు ఉందొ గమనించాము.
ఈ భాగములో దేవునికి విరోధంగా ఉన్న వారిపై దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో గమనిద్దాము.

"వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషులయుక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు ప్రతిమా స్వరూపముగా మర్చిరి" - రోమా 1:23

అన్యలోకంలో విగ్రహారాధన అను ఆత్మకలదు. విచక్షణ లేకపోవుట వల్లనే ఈ విగ్రహారాధన ప్రవేశిస్తుంది.
( యెషయా 44:15-20 ) లో ఒక చెట్టును నరికి అందులో సగం విగ్రహంగా, మరో సగం పోయ్యిలోనికి ఉపయోగించే బుద్దిహినమైన మానవునికి కలుగు ప్రతిదండన మనం చూడగలము....

ఇది ఏంతవరకు న్యాయము అండి....
చెట్టులో ఒక బాగానికి సాగిలపడి "నీవే మా సృష్టికర్తవు" అని పూజిస్తారు....
మరో బాగాన్ని పొయ్యిలో కాల్చి బూడిదగా చేసి కాళ్ళతో తొక్కేస్తారు....
నేటికి మన దేశంతో పాటు అనేక దేశాలు ఇలాంటి వ్యేర్ధమైన ఆరాధనలు చేస్తున్నాయి.

కళ్ళు వుండి చూడలేని, చేవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, శారీర ఆకారంవుండి కదలలేని ఈ విగ్రహాలు దేవుళ్ళు ఎలా అవుతారు...?

( 1 కోరింధి 10:20) లో ఈ విగ్రహములకు ఆరాధన జరిగించువారు నిజముగా దేయ్యములనే ఆరాధిస్తున్నారు అని బైబిల్ లో వ్రాయబడివుంది.

" ఈ హేతువుచేత వారు హృదయముల దురాశను అనుసరించి, తమ శారీరములను పరస్పరము అవమానపరచుకోనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను" - రోమా 1:24

ఇలాంటి విగ్రహ అరాధకులను మొదటగా దేవుడు "అపవిత్రతకు అప్పగిస్తాడు"

"నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును" అని దేవుని వాక్యం చెబుతుంది అలాగే అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యుక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు విగ్రహ రూపముగా మర్చి ఆ దేవాధి దేవుని ఘనతను, మహిమను కిందకి దిగజార్చిన ఈ మనుషులను ఆ దేవుడు కూడా కిందకి దిగజరుస్తాడు.
దేవునిని వెక్కిరించిన ఈ మనుషులను దేవుడు "అపవిత్రతకు అప్పగిస్తాడు"
అయినను మారని "అట్టివారు దేవును సత్యమును అస్యతమునకు మర్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించిరి. . . .అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. - ( రోమా 1:25-27)

అపవిత్రతకు అప్పగింపబడిననూ మారని వారిని రెండవమారు దేవుడు "తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను"
దీని వల్ల తుచ్చమైన అభిలాష కలిగి స్రీలతో స్రీలు. . . . పురుషులతో పురుషులు సంయోగము చేయుచు నీచస్థితికి దిగుదురు. . . .
(యూదా 1:7) లో స్రీలతో స్రీలు; పురుషులతో పురుషులు సంయోగము చేయుచువున్న ఆ మహా పట్టణాలు దేవుని ఉగ్రతకు కాలిపోవటం, మనకి హెచ్చరికల ఉండటం మనం చూడగలం. . . .
అవును....స్వలింగ సంపర్కం దేవుని దృష్టికి పాపం. . . . అది దేవుని నిత్యమైన కోపానికి కారణం అవుతుంది.
ఇలాంటి వారి అంతము అగ్నిగుండము.
అయినను" వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యక పోయిరి. గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్టమనస్సుకు అప్పగించెను" - రోమా 1:28

అపవిత్రతకు అప్పగింపబడిననూ తుచ్చమైన అభిలాషకు అప్పగింపబడిననూ తమ మనస్సును దేవుని వైపుకు తిప్పని వారిని దేవుడు మూడవ మారు "భ్రష్టమనస్సుకు అప్పగించెను"
దేవుని హెచ్చరికలను నిర్లక్షము చేయుచున్న వారిని దేవుడు ఈ భ్రష్టమనస్సుకు అప్పగిస్తాడు. . .  .
భ్రష్టమనస్సు అనగా స్వస్థబుద్ది లేకపోవుట.
మంచి చెడుల విచక్షణను కోల్పోవటం.
దేవునిని నిరంతరం తృనీకరించిన వారిని దేవుడు ఈ భ్రష్టమనస్సుకు అప్పగిస్తాడు.
వీరి జీవితము ఈ క్రింది వాటితో నింపబడి ఉంటుంది. . . .
" అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి."

దేవుని ఉగ్రత ప్రజలను ఈరీతిగా అప్పగింపజేస్తుంది.
మొదటిగా...."అపవిత్రతకు దేవుడు వారిని అప్పగిస్తాడు"
రెండవ మారు...."తుచ్చమైన అభిలాషకు దేవుడు వారిని అప్పగిస్తాడు"
మూడవ మారు...."భ్రష్టమనస్సుకు దేవుడు వారిని అప్పగిస్తాడు"

అందుకే దేవుని కృపకు దగ్గరగా; దేవుని ఉగ్రతహకు దూరంగా మన జీవితాలను మనం కట్టుకోవాలి....
అప్పుడే సమాధానకర్తయగు దేవుడు ఆ సాతానును మన కాళ్ళక్రింద శీఘ్రముగా చితుక త్రోక్కించును.
దేవుని ఉగ్రత మనుష్యులను చీకటికి అప్పగిస్తే... యేసుక్రీస్తు సువార్త ఆ చీకటికి, మరణానికి అప్పగించబడిన వారిని కూడా జయించి విడిపిస్తుంది. ఆమెన్.
 

 

* ప్రియ స్నేహితులకు.... రోమా పత్రిక 33వ భాగమునకు స్వాగతం....

గమనించండి... రోమా 1వ అధ్యాయము 1 నుండి 17 వచనం వరకు సువార్త అంటే ఏమిటో వివరించిన పౌలుగారు ఇక ఈ 18వ వచనం నుండి అస్సలు ఈ సువార్త ఎవరి కోసము ? అనే విషయాలు వివరిస్తున్నారు.
నా ప్రియ స్నేహితులారా గమనించండి....
మన ముందు చాలా మంది ఉన్నారు, వారు ఈ సువార్త అనేది క్రేస్తవులకు సంబంధించిన వ్యవహారం అనుకుంటారు, ఇది ఎదో ఇతర మతానికి సంబంధించినది అనుకుంటారు, "మాకు సువర్తతో పని ఏంటి..?" అని అంటూ ఉంటారు.
మా దేవుళ్ళు మాకు ఉన్నారు ఇక మీ సువార్త మాకు ఎందుకు....
మా విశ్వాసం, మా మతం మాకు ఉంది ఇక మీ సువార్త మాకు ఎందుకు....
మా సాంప్రదాయాలు, మా ఆచారాలు, మా సనాతన ధర్మాలు మాకు ఉన్నాయి ఇక మీ సువార్త మాకు ఎందుకు....
నేను దేవుడినే నమ్మను ఇంక మీ సువార్త మాకు ఎందుకు....
నేను నీతిమంతుడను ఏ పాపం చెయ్యను ఇక మీ సువార్త మాకు ఎందుకు....
ఇలా మాట్లాడే వాళ్ళు తాయ్యారు అవుతారని పౌలు గారు ముందే గ్రహించి ఉంటారు అందుకే "సువార్త ఎవరి కోసం ? అనే ప్రశ్నకు ఒక సుదీర్ఘమైన వివరణ ఈ రోమా పత్రికలో ఇచ్చారు.
* 1వ అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఈ వివరణ సాగుతుంది.
* అన్యజనులకు ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 1:18 నుండి 32వ వచనం వరకు వివరించిన పౌలు గారు...  నైతికపరులు, స్వనితిపరులకు ఈ సువార్త అవసరత ఎందుకు ఉందొ అనే విషయాలు 2:1 నుండి 16వ వచనం వరకు వివరించారు.
గమనించండి...
ప్రతి దానిలో దేవునిని చూస్తూ... ప్రతిది దేవుని స్వరూపమే అనుకునే గుంపు ఒకటి ఉంటే... అస్సలు దేవుడే లేరు అనే నాస్తిక, మరియు తమ నీతిని నమ్ముకునే నైతికపరుల గుంపు మరొకటి ఉంది అండి...
వీరు దేవునిని విశ్వసించరు, ఆయన మహిమను ఆశ్రయించరు, ఆయన క్రియలను గుర్తించరు.
వీరికి విరే దేవుళ్ళు... ఎందుకు అంటే, వీరు మనిషిని నమ్మినంతగా దేవునిని నమ్మరు.
యెహోవాయందలి భయము జ్ఞానమునకు మూలమని... 111 కీర్తనలోను...
యెహోవాయందలి భయము తెలివికి మూలమని... సామెతలు 1 అధ్యాయములోను వ్రాయబడియుంటే...
తెలివి జ్ఞానము మనిషి ప్రజ్ఞలు అని వీరు నమ్ముతారు.
ఒకనికి అన్నపానములు, ఒకనికి అతని కష్టార్జితము అంతయు దేవుని వలనే కలుగునని... ప్రసంగి 2 లో వ్రాయబడియుంటే...
ఇది అంతయు మనిషి కృషి ఫలితము అని వీరు నమ్ముతారు.
సాధారణంగానే మనిషిని దేవునికన్న ఎత్తుగా ఎత్తిపట్టి దేవునిని త్రునికరిస్తూ ఉంటారు.
ఇంకా నేను ఏ పాపం చెయ్యనుకదా... ఇంకా నాకు ఎందుకు ఈ దేవుడు అనేది వీరిలో ఉండే మరో ఆలోచన.
నిజమే... అన్యాయము చేయనివాని మీద, అక్రమము చెయ్యనివాని మీద, చెడ్డ క్రియలు చేయని వాని మీద పాపము మోపబడదు. ఆ వెక్తి మహిళ కానీ, పురుషుడు కానీ వాళ్ళు కర్మపాపమునకు అతిథులు అని చెప్పాలి.
* కర్మ పాపము అంటే...? "చేసిన క్రియల మూలముగా కలిగెడి పాపము" అని...
చెడ్డ క్రియలు చేయనివానిపై ఈ కర్మపాపము ఉండదు. నిజమే....
మరి "జన్మపాపము" సంగతి ఏమిటి....?
మన పుట్టుకలోనే పాపం ఉండగా నాలో ఏ పాపము లేదు అని ఎలా చెప్పగలము.
మళ్ళి ఈ జన్మపాపము ఏమిటి అనుకుంటున్నారా...?
"పుట్టుకద్వారా కలిగే పాపమును జన్మపాపము అంటారు"
నిజానికి పాపములలో ఇన్ని రకాలు ఉంటాయా...?
అవును... వాక్యములో వ్రాయబడియున్నది... "మరణకరమైన పాపముకలదు, మరణకరము కానీ పాపము కలదు" అని... పాపమునకు దాని తీవ్రత స్థాయిని బట్టి ఎంతో మార్పు ఉంటుంది.
జన్మ పాపము  "పుట్టుక ద్వారా మోసుకొచ్చేది"
కర్మపాపము "పుట్టిన తరువాత చేసెడి క్రియములముగా మనిషి మీద మోపబడేది"
నాస్తికులు నైతికపరులు అంటారు  "నేను ఈ తప్పు చెయ్యలేదు" అని....
అవును నీలో కర్మపాపము లేదు సరే... జన్మపాపము సంగతి ఏమిటి...?
గమనించండి.... చాలా మంది క్రిస్తవులే... ఈ జన్మపాపము గురించి ఆలోచించరు.
అప్పుడే పుట్టిన వానిపై పాపము ఎలా మోపబడుతుంది అనిది ఒక ఆలోచన.
చూడండి, జన్మపాపము యొక్క ఉనికిని మనకి వివరంగా చెప్పే చరిత్రలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుందాము.
అది అందమైన రాజమందిరము, అందులో దావీదు నేలమీద పడి కన్నీటితో విలపిస్తూ ప్రార్ధిస్తూన్నారు.
అప్పటికి ఏడూ రోజులు అవుతుంది, ఆహారము లేదు, కనీసము ఒక్క చుక్క నీళ్ళు కూడా తాగలేదు. ఒకటే ప్రార్ధన... నా బిడ్డను బ్రతికించు దేవా... అని.
ఆ ఏడవ రోజున ఆ బిడ్డ చనిపోయాడు.
అప్పుడే పుట్టిన బిడ్డ ఎలా చనిపోయాడు అని అడిగితే....?
దేవుడే ఆ బిడ్డకు జబ్బుకలుగజేసెను అని వాక్యములో వ్రాయబడియున్నది. ( 2 సమూయేలు 12:16 ).
మరిన్ని వివరాలలోనికి వెళ్ళితే... దావీదు చేసిన పాపము ఆ బిడ్డకు జబ్బును కలుగజేసింది అని మనం చూస్తాము.
నిజానికి... ఆ బిడ్డ పుట్టి ఏ పాపము చేయ్యనులేదు కానీ పాపముతో ఆ బిడ్డ పుట్టింది. దీనినే జన్మపాపము అంటారు.
ఇప్పుడు అనవచ్చు "మా తల్లితండ్రి కూడా ఏ పాపము చెయ్యలేదు" అని...
నిజమే... తల్లితండ్రి కూడా ఏ పాపం చెయ్యలేదు... కానీ మన ఆదిమ పితరులు పాపం చేశారు.
అందుకే, అపోస్తలిడైన పౌలు గారు (రోమా 5:14) లో ఇలా అంటున్నారు... " ఆదాము చేసిన పాపము వలన ఆ తరువాత తరంవారు ఏలాంటి తప్పులు చెయ్యకున్నా వారి మీద ఆ పాపము ఎలేను" అని...
అలాగే (1 కోరింది 15:22) లో ఇలా వ్రాయబడి ఉన్నది... "ఆదాము పాపము వల్ల ఇప్పుడు అందరూ ఆదాము నందు మృతిపొందుచున్నారు" అని...
ఆదియందు ఆదాము చేసిన పాపము ఆ తరువాతి తరాలకు శాపంగా నిలిచింది,  ప్రతివారికి మరణాన్ని తీసుకొచ్చింది, అందరి మీద పాపనేరాన్ని మోపింది... ప్రతి మనిషి కూడా ఈ పాపనేరంతోననే జన్మిస్తారు.
ఈ నైతికపరులు, ఈ నాస్తికులు వారి క్రియలలో పాపాన్ని కలిగి లేకున్నా వారు కూడా ఆదాము హవ్వ సంతానమే కనుక పుట్టుకలో పాపాన్ని కలిగియుంటారు.  నేను ఏ పాపము చెయ్యలేదు అనటానికి విలులేదు ఏక్కడ.
మన ఆదిమ పితరుల అతిక్రమము వల్ల ప్రతి వాళ్ళు కూడా వారికున్న పరిధిలో పాపములోనే ఉన్నారు. ఆ పాపముతోనే జన్మిస్తున్నారు.
పాపములో ఉన్న ప్రతివానికి ఈ యేసుక్రీస్తు సువార్త అవసరత ముమ్మాటికి ఉంది.
నిజానికి పాపులకే ఈ సువార్త.
చివరిగా... ఈ నైతికపరులు, ఈ నాస్తికులు ఆలోచించే రెండవ విషయం ఏమిటంటే... తమకే మంచి చెడుల గురించి అంత తెలుసు అని... దీనివల్లే, వారు ఇతరులకు తీర్పుతీరుస్తారు.
అడగండి... దేవునిని నమ్మే వాళ్ళు అందరు వెర్రివాళ్ళు, అమాయకులు, బుద్దిలేని వాళ్ళు అని వీరి భావన.
ఇతరులకు ఈ కొలతతో వీరు తీర్పులు ఇస్తారు అదే కొలతలోనికి వీరు వస్తారు కదా అండి...
దేవునిని నమ్మే వాళ్ళు అందరూ వెర్రివాళ్ళు, అమాయకులు, బుద్దిలేని వాళ్ళు అని మాట్లాడే వీరినే వాక్య బుద్దిలేనివారు అని పిలుస్తోంది.
"దేవుడు లేదని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు" అని... ( కీర్తనలు 14:1 మరియు 53:1 ).
మనుష్యుల తీర్పులో ఇంతే లోపాలు ఉండవచ్చు కానీ దేవుని తీర్పులో ఎలాంటి లోపాలు ఉండవు.
రోమా 2:2 నుండి... పౌలు గారు దేవుని తీర్పు గురించి వ్రాస్తున్నారు... ఇక్కడ మొత్తం 7 విషయాలు పౌలుగారు చెబుతారు....
1... దేవుని తీర్పు వాస్తవంపై ఆధారపడి ఉంటుంది, మనుష్యులు ఏమి అనుకుంటున్నారో అనేది దేవునికి అవసరంలేదు, వాస్తవం ఏమిటి అనేదే దేవునికి ముక్యం. ( 2:2 ).
2... దేవుని తీర్పు న్యాయం ఆధారముగా ఉంటుంది, దేవుని న్యాయ నియమాలను అనుసరించి అది ఉంటుంది. ( 2:5 )
3... మన్యుషులు చేసిన క్రియలను బట్టి దేవుని తీర్పు ఆధారపడి ఉంటుంది. ( 2:6 ).
4... దేవుని తీర్పులో పక్షపాతము ఉండదు, ఏ రంగు, ఏ జాతి, ఏ భాష, ఏ దేశం ఆ వెక్తి పేదవాడా ? ధనవంతుడా ? అనేవి ఇక్కడ పరిగాణలోనికి రావు. ( 2:11 ).
5... దేవుని తీర్పు వాక్యం ఆధారము ఉంటుంది, అపోస్తలుల సువార్త ఆధారముగా ఉంటుంది. ( 2:16 ).
6... దేవుని తీర్పు మన్యుషులు రహస్యముగా చేసిన పాపాలను బట్టి ఉంటుంది, రహస్యమందు చేసిన ప్రతి పాపము తిర్పులోనికి వచ్చును. ( 2:16 ).
7... సర్వ లోక రక్షకుడు, అందరికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ తీర్పు జరుగును. ( 2:16 ).
మరలా జ్ఞాపకము చేసుకుందాము...
దేవుని మహిమను త్రునికరించి సృష్టిని ఆరాధించే అన్యులు పాపములోనే ఉన్నారు... నేను ఈ పాపము చెయ్యలేదు అని చెప్పే నాస్తికులు నైతికపరుల కూడా వారి జన్మమూలలలో పాపములో ఉన్నారు. దేవుని తీర్పు క్రిందనే ఉన్నారు.
గమనించండి...
యేసయ్య ఇలా అంటున్నారు... "రోగులకే గాని ఆరోగ్యముగల వారికీ వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలువ వచ్చితినిగాని నీతిమంతులను కాదు." అని...
ఆరోగ్యము లేని వానికి వైద్యుడు కావాలి... పాపికే ఆ పాపము నుండి రక్షించే నిజరక్షకుడు కావాలి.
అన్యులు కానీ, నాస్తికులు నైతికపరుల కానీ అది ఎవరైనా... ప్రతి వాళ్ళు వారికున్న పరిధిలో పాపములోనే ఉన్నారు.
పాపములో ఉన్న ప్రతివానికి ఈ యేసుక్రీస్తు సువార్త అవసరత ముమ్మాటికి ఉంది.
నిజానికి పాపులకే ఈ సువార్త. ప్రతిఒక్కరు పాపులే అనేది అస్సలు నిజం.

నా ప్రియ స్నేహితులారా... గమనించండి.
పౌలు గారు సర్వ మానవాళిని నాలుగు విధములుగా వేరుచేసి... ప్రతివారి గురించి వారు ఎందుకు పాపులో వివరిస్తూ, వారిమీదకి వచ్చే తీర్పు గురించి చెబుతూ, వారికీ సువార్త అవసరత ఎంత ఉందొ చెబుతూ ముందు వెళ్లారు.
రోమాపత్రిక ... 1వ అధ్యాయము 18వ వచనం నుండి 3వ అధ్యాయము 20వ వచనం వరకు ఈ వివరణ సాగుతుంది.
కచ్చితముగా ఈ విధానము లోనే మనం కూడా చదువుతూ వెళ్తున్నాము... ప్రతి గుంపు గురించి మాట్లాడుకుంటూ... వారు ఎందుకు పాపులో తెలుసుకుంటూ... వారి మీదకి వచ్చే తీర్పులు ఏమిటో గ్రహిస్తూ... వారికీ ఈ సువార్త అవసరత ఎంత ఉందొ చూస్తూ... ముందుకు వెళ్తున్నాము.
ప్రతి భాగమునకు కూడా దాని ముందు భాగాముతోను,  దాని తరువాత భాగాముతోను సంబంధం ఉంటుంది కనుక ప్రతి భాగమును ఒక వరుసగా, క్రమముగా చదవాలని కోరుతున్నాము.


* Jesus Bless U.


* ఇప్పటి వరకు అన్యుల గురించి, నాస్తికులు నైతికపరుల గురించి తెలుసుకున్నాము... పౌలుగారి లిస్టు లోని మూడవ గుంపు అయిన "మతనిష్ట గలవారి గురించి, అంటే మతనిష్ట కలిగిన స్వనితిపరుల గురించి" తరువాత భాగములో చూస్తాము.


0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures