తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును ||2||
ముదిమి వచ్చువరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||
తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నా అరచేతులలో
నిన్ను చెక్కియున్నాను ||2||
నీ పాదము తొట్రిల్లనీయను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
పర్వతాలు తొలగవచ్చు తత్తరిల్లు మెట్టలన్నీ
వీడిపోదు నా కృప నీకు
నా నిబంధనా తొలగదు ||2||
దిగులుపడకు భయపడకు నిన్ను విమోచించెద
నీదు భారమంతా మోసి నాడు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్య ||తల్లిలా||
0 comments