Tuesday, May 4, 2021

స్తెఫను చేసిన విజ్ఞాపన ప్రార్ధన..

 


✳️ *......ప్రార్థన ......* ✳️

 1⃣. *స్తెఫను చేసిన విజ్ఞాపన ప్రార్ధన...✍️*

♻️  *స్తెఫను:* ♻️

1. *క్రీస్తు కొరకు చనిపోయిన మొట్టమొదటి హతసాక్షి.*
అపో. కా 7:60

2. ఏడుగురు పరిచారకులలో ఒకడు.
అపో. కా 6:5

3. స్తెఫను విశ్వాసముతోను, పరిశుద్ధాత్మ తోనూ నిండుకొనినవాడు.
అపో. కా 6:5

4. కృప తోనూ, బలముతోను నిండుకొనిన వాడు.

స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను.
అపో. కా 6:8

5. భూమి మీద నుండే, దేవుని మహిమను, పరలోకంలోనున్న యేసు ప్రభువును చూచినవాడు.

*అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచిఆకాశము తెరవబడుటయు,మనుష్యకుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.*
అపో. కా 7:55,56

6. యేసు క్రీస్తుకు సాక్షి.
అపో. కా 20:20

7. శత్రువులను సహితం క్షమించ గలిగినవాడు.
అపో. కా 7:60

👉మనమయితే, క్రైస్తవ పేర్లు పెట్టుకొంటున్నాం,
👉చర్చ్ కెళుతున్నాం.
👉ఆ ఫార్మాలిటీస్ అన్నీ బానే పాటిస్తూనే,
👉కరైస్తవులులా చలామణి అయిపోతున్నాం.
*క్రీస్తుని మాత్రం అనుసరించ లేకపోతున్నాం.*
 క్రైస్తవ్యం లోపించింది.

🔹 సనీ యాక్టర్ ని,
🔹పప్ సింగర్ ని,
🔹 కరికెట్ ప్లేయర్ ని ...
👉ఇట్లా కొంతమందిని రోల్ మోడల్స్ గా పెట్టుకుంటున్నాం. వారిలాగే జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం.

*స్తెఫను మాత్రం క్రీస్తునే రోల్ మోడల్ గా పెట్టుకున్నాడు. మరణంలో సహితం ఆయననే అనుసరించ గలిగాడు.*

👉సత్యం కోసం నిలబడినప్పుడు స్తెఫనును రాళ్ళతో కొడుతున్నప్పుడు, *యేసు ప్రభువు వారు సిలువలో తనకుతాను తన ఆత్మను తండ్రికి అప్పగించుకోగా, స్తెఫను యేసుప్రభువా! నా ఆత్మను చేర్చుకో అని ప్రార్దిస్తున్నాడు.*

👉పరభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి.
అపో. కా 7:59

👉యసు ప్రభువు వారు తనను హింసిస్తున్న వారి కొరకు ఎట్లా విజ్ఞాపన చెయ్యగలిగారో,
👉సతెఫను కూడా అదే మాదిరిని అనుసరిస్తూ విజ్ఞాపన చెయ్యగలిగాడు.

*అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను*
అపో. కా 7:60

*క్రీస్తుని కలిగియుండి, క్రీస్తుని అనుసరించ గలిగిన వాడే క్రైస్తవుడు.*

👉 సతెఫనులా విశ్వాసముతోను, పరిశుద్ధాత్మతోను, ఆయన కృపతోను, బలముతోను నిండుకొని,విజ్ఞాపన చేసే అనుభవాన్ని కలిగియుందాం!

2⃣. *యేసు ప్రభువు వారు సిలువలో చేసిన విజ్ఞాపన ప్రార్ధన.*

👉మన వ్యక్తిగత అవసరాలు కాకుండా, ఇతరుల క్షేమాన్నికోరి చేసే ప్రార్దనే *'విజ్ఞాపన'.*

*ప్రార్ధన సామాన్యమైనది.*

 *విజ్ఞాపన బలమైనది.*

*"యేసు తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను."*
లూకా 23:34

👉ఆయన జన్మలో పరిశుద్ధత వుంది.
👉ఆయన జీవితంలో పరిశుద్ధ వుంది.
కాని,
👉సర్వమానవాళి పాపం నిమిత్తము ఆయన పాపముగా మార్చబడడానికి, ఆయన రక్తాన్ని విమోచనా క్రయధనముగా చెల్లించి, మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించడానికి కొనిపోబడుతున్నాడు.

*సిలువతో సాగిన ఆయాత్ర యెరూషలేము వీధుల గుండా సాగుతూ,గోల్గొతలో ముగియనుంది.*

🔹39 కొరడా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలో ఊహకు అందని ఎన్నో భయంకరమైన అనుభవాలు.

🔹 వపు మీద భారమైన సిలువ, భరించరాని అవమానం
👉 ముఖమంతా ఉమ్ములు, పిడిగుద్దులు
👉గళి చేయబడుతూ,హేళన చేయబడుతూ,ఆయన క్రింద పడుతూ, ఆయన మీద ఆ భారమైన సిలువ పడుతూ గొల్గొతాకు చేరింది ఆయాత్ర.

👉కళ్ళు, చేతులలో సీల మేకులు, తలపైన ముండ్ల కిరీటం.
👉 ఆరు అంగుళాలు కలిగిన మూడు మేకులతో ఆ పరిశుద్ధ గొర్రెపిల్ల కల్వరిగిరిలో భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడుతుంది.
👉 ఆయన దేహమంతా రక్తసిక్తమై ఏరులై పారుతుంది.

*అటువంటి భయానకమైన పరిస్థితులలో కూడా, ప్రియ రక్షకుడైన యేసు ప్రభువు వారు వారిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు.*

*"తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు".*

👉ఆ దినమే కాదు. నేటికిని ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి, అనుదినమూ మనము చేసే తప్పులు క్షమించమని విజ్ఞాపన చేస్తూనే వున్నాడు.

🔺 (అయితే, మనం ఎట్లా జీవించినా పరవాలేదు అనే నిర్ణయానికి వచ్చెయ్యొద్దు. వారు తెలియక చేస్తున్నారు కాబట్టి క్షమించమని ప్రార్దిస్తున్నాడు. తెలిసిచేస్తే క్షమించబడరు. పశ్చాత్తాపపడి, ఆయన చెంతకువస్తే తప్ప.)

*మనము ఆయన పిల్లలముగా, మనకు హాని తలపెట్టిన వారిని సహితం క్షమించి, వారి క్షేమం కోరి ప్రార్ధించడానికి యేసు ప్రభువు వారు చూపిన గొప్ప మాదిరి ఇది.*

👉 నశించి పోతున్న ఆత్మలపట్ల భారం కలిగి, విజ్ఞాపన చేసే అనుభవం మనకుండాలి.
*కర్కషంగా మారిన చాంధసవాదులు క్రీస్తు బిడ్డలను చిత్రహింసలు పెడుతూ, మారణహోమం సృష్టిస్తున్నారు. వారిని గూర్చి విజ్ఞాపన చెయ్యాల్సిన భాద్యత మన మీద వుంది.*

👉ఆ భారం నీకుందా?

👉న భాద్యత గుర్తుందా? అయితే,
 
విజ్ఞాపన చేద్దాం!
ఒక్కరినైనా ఆయన వైపుకు త్రిప్పుదాం!
నిత్య మరణం నుండి తప్పిద్దాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!

3⃣  

*గెత్సేమనే వనములో యేసు ప్రభువు చేసిన ప్రార్ధన.....✍️*

*"కొంత దూరము వెళ్లి, సాగిలపడి నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్దనుండి తొలగి పోనిమ్ము, అయినను నా యిష్టప్రకారము కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించెను."*
మత్తయి 26:39

👉యరూషలేము ప్రాకారము బయట కొద్ది దూరములో ఒలీవల కొండ వుంది. దానికి దిగువన గెత్సేమనే తోట వుంది.

👉ఆ తోటలో యేసు ప్రభువువారు మనో వేధనతో చేస్తున్న భారభరితమైన ప్రార్ధన ఇది.

*ఆ గెత్సేమనే తోటలో ఆయన ఏకాంతముగా, సాగిలపడి ప్రార్దిస్తున్నప్పుడు, ఆయన చెమట రక్తపు బిందువులవలే మారింది.*

👉సగిలపడుట
*'గొప్ప మనో వేదనను'* సూచిస్తుంది.

👉ఎందుకంత వేదన?

🔺 కద్దిసేపట్లో దేవుని ఉగ్రతపాత్ర ఆయన చేతిలోనికి రాబోతుంది.
🔺 శరమల పాత్రను అనుభవించవలసి వుంది.

🔺 పపము ఎరుగని ఆయన శాపముగా మార్చబడే సమయం ఇక ఎంతో  దూరంలోలేదు.
🔺 పరపంచ మానవాళికి ధర్మ శాస్త్రం విధించే శిక్షను, ఆయన భుజాల మీద వేసుకొని మోసే సమయం దగ్గరవుతుంది.
🔺 కృపా సత్యములు కలసి ముద్దు పెట్టుకొనే సమయం కనుచూపు మేరల్లోనే వుంది.
🔺 అన్నింటికీ మించి తండ్రితో సహవాసం కోల్పోయే సమయం ఆసన్నం కాబోతుంది.
*ఆ దృశ్యమంతా ఆయన తలంపులలోనికి వచ్చినప్పుడు వేదన రెట్టింపు అయ్యింది.*

👉ఆయన దేవుని కుమారుడైనప్పటికీ మనిషివలే శరీరాన్ని ధరించి యున్నాడు కాబట్టి, ఇవన్నీ సహజమే.
👉 అందుకే ఇట్లా తండ్రిని అడుగుతున్నాడు. ఈ సిలువ అమరణం కాకుండా, ఈ లోకాన్ని రక్షించడానికి వేరేమార్గం వుంటే చూడండి అన్నట్లుగా. అయిననూ,
*ఇదే నీకిష్టమైతే నీ చిత్తమే జరిగించు అని ప్రార్దిస్తున్నాడు.*

*తండ్రి సంకల్పమే ఆయనలో నెరవేరాలని కోరుకొంటూ యేసు ప్రభువు వారు చేస్తున్న ఈ ప్రార్ధన మన ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మాదిరి.*

ఒక్క విషయం!

👉దవుని మార్గమే, ఆయన సంకల్పమే అత్యంత శ్రేష్టమైనది. దానిని అంగీకరించడం వలన కొన్ని సందర్భాలలో కొంత బాధ, అనష్టంవాటిల్లినట్లు అనిపించినా, విధేయతతో వాటిని అంగీకరించినవారే ధన్యతలోనికి ప్రవేశిస్తారు.

అట్టి ధన్యతలోనికి మనమునూ ప్రవేశిద్దాం!

ఆ రీతిగా మన జీవితాలను సిద్ధ పరచుకొందాం!
 
*హల్లెలూయ...*

*మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.*

*ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!*
➖➖➖➖➖➖➖➖➖➖
 

No comments:

Post a Comment