Monday, May 31, 2021

యెరూషలేము - దేవాలయ చరిత్ర 2

 

 


 

 

 *-నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన* *విన్నపములను నేను అంగీకరించితిని, నా నామమును అక్కడ* *సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన యీ మందిరమును* *పరిశుద్ధపరచియున్నాను; నా దృష్టియు నా మనస్సును ఎల్లప్పుడు అక్కడ ఉండును.*
(1రాజులు 9: 3)

*నిన్నటి సందేశము తరువాత--*

మత్తయి 24 :1,2 ,లో శిష్యులు యేసుకు దేవాలయం యొక్క కట్టడం చూపుతూ దానిని గూర్చి ఆయనతో చెప్పుచుండగా ఆయన వారితో ఇట్లనెను-- *మీరు కట్టడాన్ని చూచు చున్నారే...*
 ఇది  *రాతిమీద రాయి  యొకటియైననూ  నిలిచి యుండకుండా పడద్రోయబడు దినములు వచ్చునని వారితో చెప్పెను.*

*ఆయన చెప్పిన*
*40 సంవత్సరాల తర్వాత-ఎ.డి. 70 సంవత్సరంలో  ఖచ్చితంగా అక్షరాల ఇది జరిగినది.*

రోమా చక్రవర్తి టైటస్ గొప్ప సైన్యముతో  యెరూషలేము మీదికి వచ్చి దానిచుట్టూ ముట్టడివేసినపుడు...
  యెరూషలేములో వున్న క్రైస్తవులు  పట్టణము విడిచి చెదరిపోయిరి.
ఇశ్రాయేలీయులు మాత్రం బయటికి రాక  చక్రవర్తిని ఎదురించిరి.
అప్పుడు చక్రవర్తి కోపించి
 చిక్కిన వారిని చిక్కినట్లు దాదాపు 10 లక్షల మందిని చంపిరి. *వారి రక్తము యెరూషలేము  పట్టణములో ఒక కాలువలె ప్రవహించెను.* కారణం- అంతకు ముందు వారు పిలాతు ఎదుట నిలబడి యేసుక్రీస్తును చంపవలెనని గట్టిగా కేకలు వేసి *ఈ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును గాక!  అని వారికి వారే  శపించుకొనిరి.*
ఆ-శాపం ఇప్పుడు వారి మీదికి వచ్చినది.
*యేసును చంపినందుకు వారి రక్తము  యెరూషలేములో ఒక కాలువలా ప్రవహించినది.*
(మత్తయి 27:24,25)

రోమా చక్రవర్తి యెరూషలేము పట్టణమును నాశనం చేసి యెరుషలేము దేవాలయము రాయి మీద రాయి ఒకటి కూడా నిలబడకుండా పడద్రోసి ఆ రాళ్ళను రోమా పట్టణమునకు తీసుకొని పోయెను.
 నేటివరకు ఆ రాళ్ళు అక్కడనే ఉన్నవి.
 *యేసుక్రీస్తువారు  చెప్పిన మాట తు.చ తప్పకుండా జరిగినవి.*
అవి యేవనగా  రాయి మీద రాయి ఒక్కటైన  నిలబడక పడద్రోయబడినవి.

ఇట్లు *మూడవసారి  హేరోదు కట్టింపబడిన  దేవాలయం పడద్రోయబడినది.*

 *ప్రస్తుతము యెరుషలేములో దేవాలయం లేదు.*
*అక్కడ "డుమ్ రాక్ మసీదు" ఉన్నది.*

ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చిన తరువాత ఇప్పుడు దేవాలయం కట్టుటకు ప్రయత్నాలు జరుగుతున్నవి.
త్వరలో దేవాలయము కట్టబోవుచున్నారు.

*యెరూషలేములో ఈ దేవాలయము కట్టబడిన వెంటనే  సంఘము ఎత్తబడును.*

👉🏽 *అయితే ఆ దినమును గూర్చియు,ఆ గడియను* *గూర్చియు తండ్రి మాత్రమే* *యెరుగును గాని,*
*యే మనుష్యుడైనను* *పరలోకమందలి దూతలైనను*
*కుమారుడైనను ఎరుగరు.*
(మత్తయి 24:26)

యెరూషలేములో దేవాలయం కట్టుటకు ప్రస్తుతం ఇశ్రాయేలీయులకు *మూడు ఆటంకములు ఉన్నవి.,*

1️⃣  దవాలయం కట్టవలసిన స్థలములో మసీదు ఉన్నది.
ఈ మసీదును పడగొట్టిన యెడల యుద్దము జరగవచ్చును.
అందువలన  ఆ ప్రక్కనే స్థలమునందు దేవాలయం కట్టుటకు ప్రయత్నాలు జరుగు చున్నవి.
2️⃣
 యూదులు దేవాలయంలోకి వెళ్లాలంటే *పాపపరిహార జలము కావాలి.*
*ఆ జలమును తమమీద జల్లుకొని వారు దేవాలయం లోనికి ప్రవేశిస్తాడు.*
 ఆ పాప పరిహారార్ధ జలమునకు సంబంధించిన *హోలీ బస్మం* ( *పవిత్రమైన ఎర్ర ఆవు యొక్క బూడిద* )
పూర్వకాలంలో మట్టిపాత్రలో వుంచి భూగర్భములో దాచివుంచిరి.ఆ..బూడిదలో నీళ్ళు కలిపి వారిపై జల్లుకొని వారు దేవాలయములోనికి ప్రవేశిస్తారు.
*ఆ హోలీ భస్మం గల మట్టి పాత్రల కొరకు ఇపుడు త్రవ్వకాలు కూడ జరిగాయి.*

3️⃣
 *ఇశ్రాయేలీయులకు ఎర్రని ఆవు కావాలి.* *ఇశ్రాయేలీయులు దేవాలయంలో ప్రవేశించాలంటే పూర్తి ఎర్రని ఆవు కావాలి.*
*ఒక్క తెల్లని వెంట్రుక*
 *ఉండుటకు వీలులేదు.*

 *ప్రస్తుతం ఇలాంటి ఆవు పుట్టలేదు.*

*త్వరలో ఈ ఆవును దేవుడు ఇశ్రాయేలీయుల దేశములో పుట్టిస్తాడు.*

👉🏽 *ఇటీవల ఒక ఎర్రని ఆవును కనుగొన్నారు.*

అయితే....
దానికి *అక్కడక్కడా తెల్ల వెంట్రుకలు ఉండుటవలన ఇది పనికిరాదని పరిశోధకులు నిర్ధారించారు.*

ఇపుడు *ఎర్రని ఆవు కొరకు ఇశ్రాయేలీయ  దేశములో పరిశోధనలు జరుగుచున్నవి.*
.
 నిర్దోషమైన ఎర్రని ఆవు  దొరికి నప్పుడు దానిని చంపి దహించి దాని  బూడిదను,మట్టి పాత్రలలో  వున్న బూడిదను కలిపి పాపపరిహారార్థ జలముగా యూదులు తమ మీద జల్లుకొంటారు.
 అప్పుడు వారు పరిశుద్ధపరచబడి  దేవాలయములో  ప్రవేశిస్తారు.
👉🏽 *పై చెప్పబడిన సంగతులు,సంఘటనలు,*
*శ్రమల కాలము సమీపించెనని* *చూపును.అయితే ఆ సంఘటనలు జరుగుట చూచిన తరము గతించదు*
 👉🏽 ఆదికాండము 15:16 ప్రకారము... *నీ నాలుగవ తరమువారు ఇక్కడికి మరల వచ్చెదరని యెహోవా అబ్రాహాముతో చెప్పెను.*

దీనిని బట్టి తరము 40సంవత్సరములు తీసుకొన్నచో..సమయము గతించిపొయినది.కనుక తరము100 సంవత్సరములు
కావలసియున్నది.
ఈ స్థితిలో తప్పక 2000సంవత్సరములు దాటెను కనుక  *ఏదో ఒక సమయమున ఈ కార్యములు జరుగును.*
యెరూషలేములో  దేవాలయం కట్టబడి యూదులు తమను తాము పరిశుద్దపరచుకొని  ఆ..ఆలయములోనికి ప్రవేశిస్తుండగా సంఘము ఎత్తబడును.ఇది తథ్యము..
అనగా-
 ఇశ్రాయేలీయులు యెహోవా దేవుని ఆరాధించుటకు దేవాలయంలో ప్రవేశించుదురు, 

*దీనిని బట్టి మనమెవ్వెరమూ సమయమును నిర్ణయించరాదు.*
గత దినాలలో అనేకులు సమయాన్ని నిర్ణయించారు.
కానీ ఇంకా ఆ సమయాన్ని *"ప్రసవించు స్త్రీ సమయముతో*
*పోల్చబడినది"* అయితే ప్రసవ ఘడియ ఆమె ఎరుగదు.

               *దైవాశ్శీస్సులు*

సేకరణ:  *శ్రీమతి జె.విమలకుమారి*

No comments:

Post a Comment