Saturday, March 24, 2018

దైవజనులు బిల్లీ గ్రహం గారు ఆయన ఒకరోజు ఈ విధముగా పలికారు.

 ప్రపంచములోనే గొప్ప సువార్తికుడు గా  పేరు సంపాదించిన దైవజనులు బిల్లీ గ్రహం గారు

      ఆయన ఒకరోజు ఈ విధముగా పలికారు.

      మా ఇంటిలో నేను పెంచుకుంటున్న కుక్క 🐕ఒకటి ఉంది..దానికి పరిశుభ్రమైన భోజనం తయారు చేసి గిన్నెలో పెట్టి కుక్క🐕 ముందు పెడితే తినేది కాదు

     గిన్నెలో ఉన్న పరిశుభ్రమైన భోజనమును నేల పై వేస్తేనే తినేది అన్నారు 

       ఈ మాటలు గమనించారా యజమానుడు తను పెంచుకునే కుక్కకు శ్రేష్టమైనది ఇస్తే ఆ కుక్క ఆ శ్రేష్టమైన దానిని అపరిశుభ్రం చేసి దానికి నచ్చినట్టుగా తింటుంది.

        ఈ మాటలు చదువుతున్న నీతో ఒక్క మాట చెప్పాలని ఆశిస్తున్నాను

     పరలోకమందున్న మన తండ్రి మన గురించి కూడా ఇంతకంటే ఎక్కువగా ఆలోచిస్తారు.

     మనకు కావలసింది ఏమిటో ఆయనకు బాగుగా తెలుసు...! 

     ఆయన మనకు ఏది ఇచ్చిన అది అత్యంత శ్రేష్టమైన ది ఇవ్వాలనేది మన తండ్రియైన దేవుని ఉద్దేశ్యం.

     అయితే ఇక్కడ మన ముందు ఉన్న అస్సలు ప్రశ్న ఏమిటి అంటే..?

    దేవుడు మనకు ఇచ్చిన ఆ శ్రేష్టమైన వాటిని ఏ విధంగా కాపాడుకుంటున్నాము..?

      అత్యంత విలువైన రక్షణ కు నిన్ను నన్ను  పాత్రునిగా చేయాలని ఆశపడి తండ్రి తన అద్వితీయ కుమారుని సిలువ మరణముకు అప్పగించారు కదా..?

    మరి ఆ విలువైన రక్షణ ను కాపాడుకొంటున్నావా..?

నీవు నేను పరిశుద్దులుగా జీవించాలని యేసుక్రీస్తు తన పరిశుద్ద రక్తమును చిందించారు కదా...

    మరి ఆ పరిశుద్దతను కాపాడుకుంటున్నావా..?

     లేక ఆ కుక్క శ్రేష్టమైన దానిని నేలపాలు చేసినట్టు నీవు కూడా నీవు పొందుకున్న విలువైన వాటిని ప్రక్కన పెట్టావా..?

    ఆలోచించు దేవుని రాకడ సమీపించుచున్నది..!
   ఆలస్యం చేయక మేలుకో..రాకడకు సంబంధించిన సూచనలు అన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి జాగ్రత్త..!

    సమయం చాలా విలువైనది...ఒక్కసారి పోతే మళ్లీ రాదు...జాగ్రత్త పడు మిత్రమా..!

    దేవుడు మనకు ఇచ్చిన ప్రతి శ్రేష్టమైన దానికి ఓ రోజు లెక్క అడుగుతారు.

   ఆరోజు  సోమరివైన చెడ్డ దాసుఢా.. అని ఆ పిలుపు వినకుండా ఉండాలి అంటే ఈ భూమి పై ఉన్నప్పుడే నీకు ఇవ్వబడిన వాటి గూర్చి ఆలోచన చెయ్.

        లేకపోతే రెండొవ మరణం తథ్యం..!

సమయం చాలా సంకుచితం...నేడో రేపో తెలియదు నా ప్రియుడైన క్రీస్తు రాకడ..!

    ఆయన దొంగ వలె వచ్చును..సిద్దపాటు కలిగి ఉన్నవారు మాత్రమే ఆ క్షణం ఆయనతో కూడా ఎత్తబడతారు..!

   మరి ఆ సిద్దపాటు లో మనము ఉన్నామా..?

No comments:

Post a Comment