Sunday, June 19, 2016

Enduko Nanninthaga Neevu ఎందికో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా






ఎందికో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా

1.నా పాపము బాప నరరూపి వైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే
2.నీ రూపము నాలో నిర్మించియున్నావు
నీ పోలికలోనే నివశించమన్నావు
నీవు నన్ను ఎన్నుకొంటివి నీకొరకై నీ కృపలో

3.నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంధములో నుండే
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం నేనేమి చెల్లింతున్

Enduko Nanninthaga Neevu

No comments:

Post a Comment