>>
..:: సర్వభూజనులారా , యోహోవాను బట్టి ఉత్సహించుడి , ఆర్భాటముతో సంతోషగానము చేయుడి కీర్తనలు పాడుడి - కీర్తన 98:4 ::..
పరిస్థితులను మార్చే శక్తి...." ప్రార్ధన "....✍

" నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలముగలదైయుండును."
( James (యాకోబు) 5:16 )



ఈ ప్రార్ధన గురించి చెప్పమంటే సండేస్కూల్ పిల్లలు కూడా ఇలా చెబుతారు
" వాక్యం చదవటం అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్ధం.
ప్రార్ధన చేయటం అంటే మనం దేవుడితో మాట్లాడుతున్నాం అని అర్ధం."
ఈ విషయం ప్రతి క్రేస్తవుడికి తెలుసు. . . .
ప్రార్ధన అనేది మనలోని ఆత్మకి ఆహారంలాంటిది, ఉపిరిలాంటిది ఎప్పుడైతే క్రేస్తవులకి ప్రార్ధన తగ్గుతుందో అప్పుడే వారిలోని పరిశుద్ధాత్మ శక్తీ తగ్గిపోతుంది.
అవును....ఈ మూడు అక్షరాల ప్రార్ధనకి మనం ఉహించలేని బలం ఉంది.
పర్వతాలను సహితం కదిలించగల శక్తీ మన దేవునికి ఉంటే; ఆ దేవాధి దేవుడిని కదిలించగల శక్తీ ఈ ప్రార్ధనకి ఉంది.

Bro. Billy Graham అనే దైవజనుడిని "మీరు ఇంత గొప్ప పరిచర్య చేయటానికి గల మూడు కారణాలు చెప్పండి" అని అడిగితే Bro. Billy Graham గారు ఏమాత్రం తడుముకోకుండా "నేను ఈ పరిచర్య చేయటానికి నాకు సహాయం చేసిన ఆ మూడు కారణాలలో 1. ప్రార్ధన, 2. ప్రార్ధన, 3. ప్రార్ధన" అని చెప్పారంట....

ఆదిమ కాలంలో "ఎనోష"తో ప్రారంభం అయిన ఈ ప్రార్ధన నేడు అనేక సంఘాలు నిలబడటానికి సహాయ పడుతూనే ఉంది.
హేబెలు ప్రార్ధనశక్తీ; తన రక్తం కూడా సాక్షం చెప్పెలాచేసింది.
అబ్రహాము ప్రార్ధన; అనేక జనంగాలకే అశీర్వధంగా మారింది.
యాకోబు ప్రార్ధన; అతనిని మగసిరి గల వాడిగా మార్చింది.
యోసేపు ప్రార్ధన; అతనిని ఫలించేది కొమ్మగా నాటింది.
మోషె ప్రార్ధన; తన జనంగాన్ని 40సం!!రాలు క్షేమంగా నడిపింది.
యెహోషువా ప్రార్ధన; సూర్యచంద్ర గతులను మార్చింది.
హన్నా ప్రార్ధన; నూతన నిబంధనకు తెరతీసింది.
దావీదు ప్రార్ధన; తన సింహాసనాన్ని నిలిపెలా చేసింది.
సోలోమోను ప్రార్ధన; దేవుని కనుదృష్టి దేవాలయంపై నిలిపింది.
ఎలియా ప్రార్ధన; ఆకాశం నుండి అగ్నిని దింపింది.
ఇంకా.... హిజ్కియా, యెహోషాపాతు, నెహేమ్యా, ఎస్తేరు, దానియేలు అతని ముగ్గురు స్నేహితులైన హనన్యా,  మిషాయేలు, అజర్యా మరియు ఇతర  చిన్న, పేద్ద ప్రవక్తలందరు మరియు  యోబు ఇలా వరుసగా చెప్పుకుంటూ వెళ్ళితే సమయం చాలదు. . . .

విరు అందరూ ప్రార్ధనావీరులే, ఇంకా అనేకమంది మన Bibleలో ఉన్నారు. . . .
కానీ నాకు ఎప్పటికి గుర్తుండిపోయే ప్రార్ధన "సైఫను చేసిన ప్రార్ధన".
అప్పుడు యెరుషలేములో క్రేస్తవులకు హింస ప్రారంభం అయింది, క్రేస్తవులు కనిపిస్తే చాలు వారిని హింసించటం ప్రారంభం అయింది. ఆ కాలంలోనే ఈ యవనస్తుడు మతనాయకుల ముందుకు తిసుకురాబడ్డాడు. . . .
సైఫనుతో వాధించటం ఈ మతనాయకులకు బహుకష్టంగా మారింది.
సైఫనులో ఉన్న పరిశుద్ధాత్మతో వారు వాధించలేకపోయారు, ఇంకలాభంలేదు సైఫనుని చంపాలి అనే నిర్ణయానికి వచ్చారు. ఆ సందర్భంలో సైఫను చేసిన అద్భుతమైన ప్రసంగం  ఆ పేద్దలకు, నాయకులకు మరింతగా కష్టం కలిగించింది.
అతని మీద పడి అరిచారు, నగరం బయటకి నేట్టివేసారు, చేతికి అందిన రాళ్ళతో కొట్టటం మొదలుపెట్టారు. . . .

సైఫనుపైకి రాళ్ల వర్షం కురిపించారు, సైఫనుకి ఒంటినిండా గాయాలు; రక్తం అతని దేహమంతా కారుతుంది,
అప్పుడు సైఫను నెమ్మదిగా తన బలం అంతా ఉపయోగించి లేచాడు. . . .ఎందుకు,
తనని రాళ్ళతో కొడుతున్నవారిని తిరిగి కొట్టటానికి కాదు,
పిరికివాడిగా అక్కడి నుండి పారిపోటానికి కూడా కాదు,
ప్రార్ధించటానికి లేచాడు. . . .
ఒంటినిండా గాయాలు, రక్తం కారుతున్న ఆ బలహీనమైన క్షణంలో కూడా ప్రార్ధించటానికి లేచాడు. నిలువు మోకాళ్ళపై నిలబడి తన చివరి ప్రార్ధన చేసాడు. . . .

 తన చివరి సమయాన్ని సైఫను తన ప్రార్ధనా సమయంగా మార్చుకున్నాడు.
 హల్లెలూయ. . . .
👉మోకాళ్ళపై ప్రార్ధన చేసాడు.
తన గురించి మాత్రమైకాదు; తనని హింసిస్తున్న వారి గురించి అక్కడ ప్రార్ధించాడు.

" యేసు ప్రభువా.... వారి మీద ఈ పాపము మోపకుము" అని సైఫను చేసిన ప్రార్ధన సౌలుకు కూడా క్షమాపణను ఇచ్చింది.
👉 పౌలుగా మారేందుకు, ప్రపంచాన్నే ప్రభావితం చేయగల క్రేస్తవుడిగా ఎదిగేందుకు పునాది వేసింది.

"మోకాళ్ళ ప్రార్ధనా వీరులుమాత్రమై  మరింత శక్తీవంతమైన సువార్త సేవకులను తయారు చేస్తారు"

హల్లెలూయ. . . .

మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువులవారి నామంలో చేయబడిన ఈ ప్రకటన ప్రకారముగాను మిమ్మును వాక్యంలో స్థిరపరచుటకు మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.
ఆమేన్‌. ఆమేన్. ఆమేన్.



* అనేకులకు అశీర్వాధకరముగా ఉండులాగున ఇతరులతో పంచుకోండి.

0 comments

Post a Comment

Total Pageviews

Email Subscriptions

Enter your email address:

Delivered by FeedBurner

Chrstian Lybrary APK Downlad

Chrstian Lybrary APK Downlad
Mobile APK Downlad Telugu E-Books Telugu Bible study Telugu Christian Songs Lyrics Telugu Christian Messages Telugu Christian Songs Mp3 TELUGU CHRISTIAN VIDEO SONG Bible pdf Bible Quotes, Bible study Bible Verses Christmas Wallpaper English Bible .Pdf English Bible mobile jar files Free Jesus Christ wallpapers Jesus Christ pictures